ప్రభుత్వం మారి మూడు నెలలు దాటింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తాను సియం పదవి కోసం ఎంతో కష్టపడ్డాను అని, ఇక భారత దేశం మొత్తం, మన వైపు చూసేలా చేస్తానని జగన్ చెప్తూ, 30 ఏళ్ళు నేనే సియంగా ఉంటానని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్సు చూసి, ఈయన ఎంత బాగా పని చేస్తాడో, ఎంత అద్భుతంగా పరిపాలన ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కాని రాష్ట్రంలో జరుగుతున్న రివర్స్ పనులు లాగే, ఈ సీన్ కూడా రివర్స్ అయ్యింది. జగన్ మార్క్ పాలన సంగతి తరువాత, ఉన్న పనులు కూడా ఆపేసారని, జనాలు గోల పెడుతున్నారు. ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే, ముందుగా అయినా మంచి పనులు చేస్తారని, అందులో యువకుడు లాంటి జగన్ నుంచి ఎంతో ఆశించామని, కాని ఇక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పసిగట్టిన వైసీపీ నాయకులు, ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రాను రాను పరిస్థితి ఏంటో అని తలుచుకుని వణికిపోతున్నారు.
ఇదే అభిప్రాయన్ని, పార్టీలోని నెంబర్ 2 అయిన విజయసాయి దగ్గర కుండ బద్దులు కొట్టేసారు. ఏకంగా విజయసాయి రెడ్డికే, ఇలా చెప్పారు అంటే, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. నిన్న విజయసాయి రెడ్డి వైజాగ్ లో పర్యటించారు. విశాఖ కల్లెక్టరేట్ లో వైసిపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులతో విజయసాయి రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో నేతలు తమ ఆవేదనను, విజయసాయి రెడ్డి దగ్గర వెళ్లగక్కారు. గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పటంతో, విజయసాయి రెడ్డి కూడా షాక్ అయ్యారు. అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని, ఇవి కనుక చక్కదిద్దక పొతే, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని, స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నాయని, వెంటనే అన్నీ చక్కదిద్దాలని, నేతలు విజయసాయి రెడ్డికి తమ అభిప్రాయలు చెప్పారు.
ఇసుక సరఫరా లేదు, ఇది ఒక పెద్ద తుఫాన్ లా మారే అవకాసం ఉంది, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగటం లేదు , అన్ని అంశాల్లో వెనకబడుతున్నాం. రహదారులు దెబ్బతింటే, అవి పునరుద్ధరించే పరిస్థితి లేదు. రెవిన్యూ కార్యాలయాల్లో పనులు కావడం లేదు. పోలీసు శాఖ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లోనూ మందుల కొరత ఉంది. మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి’ అని వారు ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తెచ్చారు. చంద్రబాబు హయంలో లారీ ఇసుక 20 వేలు ఉంటే, ఇప్పుడు 80 వేలు దాకా ఉందని, ప్రజలు తిడుతున్నారని చెప్పారు. అయితే ఇవన్నీ విన్న విజయసాయి రెడ్డి, తొందరలోనే మార్పులు చూస్తారని, అన్నీ సెట్ అయిపోతాయని చెప్పినట్టు తెలుస్తుంది.