ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన సలహాదారుడుగా ఉన్న అజేయ కల్లాం రెడ్డి పై, ఈ రోజు చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రధాని మోడీ కార్యాలాయానికి తప్పుడు సమాచారం పంపించి, ఏదో జరిగిపోయింది అనే భ్రమ కలిపిస్తున్నారని, ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే, ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అధికారం ఉంది కదా, ఏమి చేసినా చెల్లిపోతుంది అని విర్రవీగితే, జగన్ కేసుల్లో కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ, చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డైరెక్ట్ గా అజయ్ కల్లం రెడ్డి పేరు ఎత్తక పోయినా, ఆయన ప్రధానికి లేఖ రాసిన విషయం చదివి వినిపిస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారం ప్రధాని కార్యాలయానికి పంపిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై, గుంటూరు పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు పాల్గున్నారు.
విద్యత్ ఒప్పందాల విషయంలో, ప్రధాని కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చి, ప్రధానినే తప్పుదోవ పట్టించే పని చేసారని, ఇలాంటి అధికారుల పై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. జగన్ ఒత్తిడి తెస్తున్నారు కదా అని, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, శిక్ష అనుభవించక తప్పదని, అధికారులను హెచ్చరించారు. పీఏలపై ప్రధానికి జగన్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ రంగంలోని నిపుణులు, కేంద్రం, కోర్ట్ లు చెప్తున్నా, వీరు వినటం లేదని, మీడియా సమావేశాలు పెట్టి అధికారులే, రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే చంద్రబాబు టార్గెట్ చేసినై అజయ్ కల్లం రెడ్డిని అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో ఎదో జరిగిపోయిందని, ఈయనే జగన్ కు చెప్తూ వస్తున్నారు.
అజయ్ కల్లం రెడ్డి, రెండు నెలలు పాటు చంద్రబాబు హయంలో, చీఫ్ సెక్రటరీగా చేసారు. తరువాత జగన్ దగ్గర చేరి, రాజకీయలు మొదలు పెట్టారు. జగన్ అధికారంలోకి రాగనే, సలహాదారు అయిపోయారు. విద్యుత్ పీపీఏ ల విషయం, మొత్తం కర్మ, క్రియ అంతా ఆయనే. ఈ విషయం పై జగన్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షకు వేసిన కమిటీని కూడా ఆయనే లీడ్ చేస్తున్నారు. కేంద్రానికి ఇచ్చే సమాచారం అంతా అజయ్ కల్లం రెడ్డే తయారు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖల సమాచారం అంతా తప్పు అని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని, మొత్తం వివరంగా చెప్పారు. ఇప్పడు ఈ విషయం పై కేంద్రం ఎలా స్పందిస్తుంది. తప్పుడు సమాచారం పంపించిన అధికారుల పై చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.