ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్తా హల్ చల్ చేసింది. జగన్ నివాసంలో, ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందంతో భేటీ అయ్యారు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక వైసీపీ మైనస్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో హడావిడి చేసాయి. 13 మంది పారిశ్రామకవేత్తల బృందం, జగన్ మోహన్ రెడ్డిని కలిసింది, ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు అంటూ ఓ ఊదరగొట్టారు. ఈ ప్రచారం చూసి, సామాన్య ప్రజలు కూడా, ఇంకేముంది, జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు అంత స్పీడ్ గా, పెట్టుబడులు తీసుకువస్తున్నారు, ఏమో అనుకున్నాం, జగన్ కూడా పెట్టుబడులు తేవటంలో దూసుకుపోతున్నారు అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నారని, ఒక పక్క ఆర్ధిక మాంద్యం ఉన్నా, జగన్ సాధించారని అందరూ అనుకున్నారు.
దీనికి సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇక్కడే అసలు గుట్టు అంతా బయట పడింది. తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఈ విషయం పై పూర్తీ ఆధారాలతో బయట పెట్టారు. ఆ ఆధారాలు చూసి అందరూ అవాక్కయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అనుకుంటే, జగన్ తన వ్యాపారాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ సెటైర్లు పేలాయి. ఇంతకూ విషయం ఏమిటి అంటే, లోకేష్ బయట పెట్టిన మొదటి ఆధారం, "Sophie Sidos" అనే ఆవిడ జగన్ ని కలిసిన ట్వీట్. జగన ఇంట్లో కలిసి దిగిన ఫోటో ట్వీట్ చేసారు. ఆవిడ ఎవరు అంటే, Vicat అనే ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీకి అధిపతి. ఈ Vicat అనే కంపెనీ, జగన్ మోహన్ రెడ్డి భార్య కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ లో ప్రధాన వాటాదారు.
ఇలా వారి వ్యాపార భాగస్వామిని తీసుకోవచ్చి, రాష్ట్రంలో పెట్టుబడులు అంటూ డబ్బా కొడుతున్నారని, ఇది ఏ రకమైన క్విడ్ ప్రోకోనో అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇది నారా లోకేష్ చేసిన ట్వీట్. "YS Jagan Mohan Reddy గారి విజన్ నచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ నుంచి పెట్టుబడుల బృందం ఒకటి వచ్చిందని సొంత మీడియాలో సొంత డబ్బా కొడుతుంటే తుగ్లక్ పాలనలో విజన్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాం. తీరా ఆరాతీస్తే ఆ వచ్చిన వాళ్ళు fondationlouisvicat అనే సంస్థ ప్రతినిధులు. ఆ సంస్థ గురించి తెలుసుకుంటే అసలు సంగతి బయటపడింది. ఆ సంస్థలో మన జగన్ గారి భారతి సిమెంట్ ఒక భాగస్వామి. అంటే వచ్చింది జగన్ గారి చుట్టాలే. మరో క్విడ్ ప్రో కో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అబ్బో ఏం విజన్!" అంటూ ట్వీట్ చేసారు.