ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ఆందోళన, పోలవరం, అమరావతి పై జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని. ఇప్పటి వరకు పోలవరం పై జగన్ ప్రభుత్వం అన్నీ ఆందోళన కలిగించే నిర్ణయాలే తీసుకుంటుంది. ఒక పక్క నవయుగ కోర్ట్ కి వెళ్ళటంతో, అది ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు. ఒకసారి కోర్ట్ కు వెళ్తే, ఆ విషయం తేలటానికి ఎన్ని ఏళ్లు పడుతుందో అందిరికీ తెలుసు. ఇక మరో పక్క, కేంద్రం కూడా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం పై ఇష్టం వచ్చినట్టు చెయ్యవద్దు అని, మేము చెప్పినట్టే వినాలని రాష్ట్రానికి వార్నింగ్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకుని, ఆ విషయం పై త్వరలో ఒక నిర్ణయం ప్రకటించ నుంది. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పై, అందరూ స్పందిస్తున్నారు.

jp 05092019 2

ఈ కోవలోనే, లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోవటం పై విశాఖలో స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మాణం చెయ్యకుండా, నిలిపివేయటం, రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ఒకసారి ప్రాజెక్ట్ ఆపితే, మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాలంటే, ఎంతో శ్రమ పడాలని, ప్రభుత్వం పోలవరం ఆపటం రాష్ట్రానికి మంచిదికాదని జేపీ అన్నారు. విశాఖపట్నంలో, ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మారకోపన్యాసం’లో జేపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ తో, ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పారు.

jp 05092019 3

పోలవరం ఎడమకాలువ ద్వారా నీటిని విజయనగరం జిల్లాకు తెచ్చి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో నిలిచిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఉత్తరాంధ్ర నీటితో సస్యశ్యామలం అవుతుందని జేపీ అన్నారు. గోదావరి జలాలను వాడుకునే విషయంలో, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఆలోచన మంచిదే కాని, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న విధానం మాత్రం సరైంది కాదని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్నిక పై సంస్కరణలు రావాలని, ముఖ్యమంత్రులను నేరుగా ఎన్నుకోవడం ద్వారా ఎమ్మెల్యేలపై ప్రభుత్వాలు ఆధారపడే సమస్య లేకుండా వ్యవస్థ ఉండాలని అన్నారు. ఈ విధానం అప్పట్లో వైఎస్ఆర్ కి చెప్తే, దీన్ని బలపరిచి, కొంత మేర ఈ దిశాగా ఆలోచనలు జరిపారని, జేపీ గుర్తు చేసారు.

అమరావతి గురించి ఇంకా మర్చిపోవచ్చు అనుకుంటున్న ఆంధ్రులకు, మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే అమరావతి పై ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రం దాకా అందరూ తప్పుకోగా, తాజాగా సింగపూర్ ప్రభుత్వం కూడా, అమరావతికి గుడ్ బాయ్ చెప్పేసింది. అమరావతి ప్రాంతంలో, ప్రధాన ప్రాజెక్ట్ అయిన, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని సింగపూర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి సింగపూర్ ప్రభుత్వం డైరెక్ట్ గా చేసే ప్రాజెక్ట్ కాబట్టి, ఈ ప్రాజెక్ట్ పై అందరికీ ఆశలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఈ ప్రాజెక్ట్ పూర్తీ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమరావతి పై ఉన్న అనాసక్తి గమనించిన సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. స్టార్టప్‌ ఏరియా నుంచి తప్పుకుంటున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సింగపూర్ ప్రభుత్వం కబురు పంపించింది.

singapore 05092019 2

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ తాయారు చెయ్యటం దగ్గర నుండి, అమరావతి అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సింగపూర్‌ దేశ ప్రభుత్వాలు, సంస్థల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ చెయ్యటంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంలో, సింగపూర్ పార్లిమెంట్ లో, అమరావతి గురించి చెప్తూ, సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో చేపట్టబోయే స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్‌ గురించి మంగళవారం సింగపూర్ పార్లమెంటులో ప్రకటన చేశారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో అమరావతిలో పెట్టుబడి పెట్టటం పై ఆలోచిస్తున్నాం అని తెలిపారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, అమరావతి పై చూపిస్తున్న అనాసక్తి గురించి కూడా వివరణ ఇచ్చారు.

singapore 05092019 3

అదే సమయంలో అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకోవటం, అలాగే ఏఐఐబీ సైతం రూ.1500కోట్ల రుణ ప్రణాళికను పక్కనపెట్టడం వంటి పవిషయలు ఈశ్వరన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఈశ్వరన్ ఇచ్చిన వివరణ చూస్తే, స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రణాళిక నుంచి సింగపూర్‌ కన్సార్షియం తప్పుకోనున్నట్లు ఆయన చెప్పినట్టే అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, సింగపూర్ ప్రతినిధులు వచ్చి ఆయన్ను కలిసి, అమరావతి పై తమ ప్రణాళికను వివరించారు కూడా. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి అమరావతి పై ఆసక్తి చూపించకపోవటంతో, సింగపూర్ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. మొత్తానికి, ఇక అమరావతి పరిస్థితి ఏంటో, ఆ దేవుడే చెప్పాలి.

గతంలో చంద్రబాబు ఇబ్బంది పెట్టటానికి ఉండవల్లి అరుణ కుమార్, ఐవైఆర్ లాంటి వాళ్ళు వేసిన పిటీషన్లు, ఈ రోజు జగన మోహన్ రెడ్డినే ఇబ్బంది పెట్టె పరిస్థితి వచ్చింది. దీన్నే విధి రాత అంటారేమో. మొన్నటి దాకా బొత్సా లాంటి నాయకుల చేత, అమరావతి పై కన్ఫ్యుజింగ్ స్టేట్మెంట్ లు ఇప్పిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తూ, రాజకీయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఆన్ రికార్డు, అదీ కోర్ట్ లో, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు జగన్ గారు, హైకోర్ట్ సాక్షిగా అమరావతి పై ఎలాంటి ప్రకటన చేస్తారు, కోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, అమరావతి పై వైఖరి ఏమి చెప్తారు అనేది చూడాలి. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబులింగ్‌ చట్ట నిబంధనలను అనుసరించి, స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ద్వారా అమరావతిలో ప్రాజెక్ట్‌ పనులు చేపట్టే విషయం పై మీ వైఖరి చెప్పండి అంటూ హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

court 04092019 2

అమరావతి స్విస్‌ ఛాలెంజ్‌ విధానం పై వైఖరి చెప్పటానికి, ప్రభుత్వానికి ఈ నెల 16 వరకు టైం ఇస్తూ, విచారణ వాయిదా వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానం పై క్లారిటీ ఇస్తే, అమరావతి పై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం నిన్న, విచారణ సందర్భంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానం పై, ఏపీఐడీఈ చట్టం-2001కి సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శి తెచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ ‘ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ’ సభ్యులు వై.సూర్యనారాయణ మూర్తి ఏడాది క్రితం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు కూడా 2018లో హైకోర్టును ఆశ్రయించారు.

court 04092019 3

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా అమరావతిలో, చట్ట నిబంధనలకు విరుద్ధంగా రాజధాని నిర్మాణ పనుల ఒప్పందాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్ట్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో కేసు వేసారు. ఈ వ్యవహారం పై సీబీఐతో విచారణ జరిపించాలని కోర్ట్ ని కోరారు. ఈ అన్ని పిటీషన్ల పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగందని, కొత్త ప్రభువానికి అమరావతి పై పునఃసమీక్ష చేసే ఆలోచన ఉందని, కొన్ని పనులు రద్దు చేశారని పత్రికల్లో వార్తలు వచ్చాయని, అందుకే గత ప్రభుత్వంలో ఉన్న స్విస్‌ఛాలెంజ్‌ విధానం పై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకోవాలన్నారు. దీంతో హైకోర్ట్, ఏపి ప్రభుత్వాన్ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వమంటూ, కేసును 16వ తేదికి వాయిదా వేసింది.

నవయుగ కంపెనీ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందా అన్న రీతిలో, ప్రస్తుతం వ్యవహారాలు నడుస్తున్నయి. పోలవరం ప్రాజెక్ట్ లో, 73 శాతం పనులు కావటనికి ఎంతో కృషి చేసిన నవయుగ కంపెనీని పోలవరం ప్రాజెక్ట్ పనులు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో నిర్మించే పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి కూడా నవయుగని తప్పించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో, ట్రాన్స్ ట్రాయ్ నుంచి సబ్ కాంట్రాక్టు కావటంతో, నవయుగ కంపెనీ, కేవలం పోలవరం హైడల్ ప్రాజెక్ట్ మీదే కోర్ట్ కు వెళ్ళింది. అయితే వెంటనే హైకోర్ట్, ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం మాత్రం తీవ్రంగా స్పందించింది. 73 శాతం పనులతో పరుగులు పెట్టించిన నవయుగ కంపెనీని తప్పించమని ఎవరు చెప్పారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది.

navauga 05092019 1

ఇది ఇలా నడుస్తూ ఉండగానే, నిన్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో, నవయుగ కంపెనీకి బందర్ పోర్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవో 66ను ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌’ కంపెనీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన వెంటనే, కోర్ట్ లో కేసు వేసింది. మమ్మల్ని కనీసం వివరణ అడగకుండా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్ట్ కు చెప్పింది. నిన్న క్యాబినెట్ నిర్ణయం పైనే కాకుండా, ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆగస్టు 8న ఏపి ప్రభుత్వం జారీచేసిన జీవో 66ను సస్పెండ్ చెయ్యాలని కోరింది.

navauga 05092019 1

ఏపి ప్రభుత్వం బందర్ పోర్ట్ విషయంలో, తరువాత చర్యలు ఏమి తీసుకోకుండా, బందర్ పోర్ట్ పనులు మరే కంపెనీకు ఇవ్వకుండా చూడాలని, నవయుగ సంస్థ తరఫున డైరెక్టర్‌ వై.రమేశ్‌ బుధవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. "మచిలీపట్నం పోర్టు పనుల కోసం భూములను ఎలాంటి అడ్డంకుల్లేకుండా అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొంత భూమి ఆక్రమణలో ఉంది. సౌకర్యాలు కల్పించినా నిర్మాణం పూర్తి చేసే ఉద్దేశం మాకు లేదని పేర్కొనడంలో వాస్తవం లేదు.5324 ఎకరాల్లో మాకు అప్పగించిన 412 ఎకరాలు పోగా.. 4912 ఎకరాల్ని త్వరితగతిన అప్పగించాలని కోరాం. ఈ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా, అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేశారు. వివిధ పనుల కోసం రూ.436 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఈ అంశాల్ని పరిగణించి, జీవో 66ను రద్దు చేయండి" అంటూ పిటీషన్ లో కోరింది నవయుగ.

Advertisements

Latest Articles

Most Read