మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. ఆయన ప్రతిసారి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. అయినా సారే గంటా పార్టీ మారుతున్నారు అంటే వార్తలు వస్తూనే ఉంటున్నాయి. నిన్న, ఈ రోజు కూడా ఈ వార్తలు మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి తీవ్ర స్థాయిలో ఈ ప్రచారం ఉంది. గంటా శ్రీనివాస్, విజయసాయి రెడ్డితో చర్చలు జరుపుతున్నారని, ఆయాన చేరిక దాదపుగా ఖరారు అయిన సమయంలో, మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డు పడటంతో, గంటా చేరిక ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ ఆపకపోయి ఉంటే, గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసిపీలో చేరే వారని, అయితే విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ తో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ganta 01092019 1

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నేతలు కూడా, గంటా పార్టీ మారిపోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన బీజేపీలోకి వేల్లిపోతున్నారని ప్రచారం చేసారు. అయితే గంటా ఈ ప్రచారం పై, ఈ రోజు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నేను వైసిపీలోకి వెళ్ళాలి అనుకుంటే, నాకు ఎవరి దయ అవసరం లేదు, ఈ నిమషాన వెళ్ళిపోతా, నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్ని సార్లు పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చినా ఎదో ఒక ప్రచారం చేస్తున్నారని, వైసీపీలో చేరాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరంటూ, అటు వైసీపీ నేతల ప్రచారానికి, ఇటు సొంత పార్టీలో కొంత మంది నేతలకు గట్టిగా తగిలేలా గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ganta 01092019 1

ఈ రోజు విజయనగరం జిల్లా లో పర్యటించిన గంటా ఈ వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి చేసినవిగా అర్దమవుతున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస్, ఈ ప్రచారం చేస్తున్నారని, తాను అడ్డుకోబట్టే గంటాకు వైసిపీలోకి ఎంట్రీ లేదు అనే ప్రచారం చేస్తున్నారని, గంటా భావించి, ఇలా మాట్లాడారని తెలుస్తుంది. గంటాకి, అవంతి శ్రీనివాస్ కి, పీఆర్పీలో ఉన్న దగ్గర నుంచి వైరం ఉంది. అవంతి శ్రీనివాస్ మంత్రి అయిన తరువాత, గంటా టార్గెట్ గా ఆయన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే గంటా పార్టీ మార్పు వ్యాఖ్యలు, అవంతి ప్రచారం చేపిస్తున్నారని, నమ్ముతున్న గంటా, ఈ రోజు గట్టి సమాధానం ఇచ్చారు. అలాగే అమరావతి మార్పు పై, బొత్సా చేస్తున్న వ్యాఖ్యల పై కూడా గంటా ఘాటుగా స్పందించారు.

రాజకీయాల్లో ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం. అందులో అలాంటి ఒక వింత, భర్త ఒక పార్టీలో ఉంటే, భార్య మరో పార్టీలో ఉండటం. ఇలాంటివి మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అది కూడా దగ్గుబాటి లాంటి బలమైన ఫ్యామిలీలో. ఎన్నికల సమయంలో, ముందు జాగ్రత్తగా, భర్త కొడకు వైసీపీలో చేరితే, పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో, పర్చూరు నియోజవర్గం నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన కొడుకు హితేష్‌ కు ముందు టికెట్ ఇద్దాం అనుకున్నా, సాంకేతిక కారణాలతో, ఆయనకు టికెట్ ఇవ్వటం కుదరకపోవటంతో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. అయితే, ఎన్నికల రణరంగంలో ఓడిపోయారు. ఆయన ఓడిపోయినా కూడా, ఆ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను వైసీపీ తరుపున చూస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావటంతో, ఓడిపోయినా సరే, అధికారులను కంట్రోల్ పెట్టుకుని పనులు చేపిస్తున్నారు.

daggubati 01092019 2

మొన్న జరిగిన బదిలీల్లో కూడా, తన మాట నెగ్గేలా దగ్గుబాటి పావులు కదిపారు. ఎస్సై బదిలీ విషయంలో ఒక వివాదం కాగా, దగ్గుబాటి చేసిన సిఫార్సు మేరకు మంత్రి బాలినేని ఆదేసలాతో, ఎస్పీ అక్కడకు బదిలీ చేసిన ఎస్సైను వెంటనే బదిలీ చేసారు. ఇటీవల కాలంలో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కొడుకుతో కలిసి, మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తూ, అలాగే అధికారులతో కూడా సమీక్ష్ చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారం, మరీ దూకుడుగా ఉండటం, అదే సమయంలో ఆయన భార్య పురందేశ్వరి, బీజేపీ నేతగా ఉంటూ, జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ, పోరాటాలు చెయ్యటంతో, జగన్ ఈ విషయం పై దృష్తి సారించారు. పర్చూరు నియోజవర్గం పై నిరంతర నిఘా పెట్టారు. ఇంటలిజెన్స్ ని రంగంలోకి దించి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పై రోజు వారీ రిపోర్ట్ లు తెప్పిస్తున్నారు.

daggubati 01092019 3

జగన మొహన్ రెడ్డి స్వయంగా, ఇవి చూస్తున్నారు. జగన ఆదేశాల మేరకు, ఇంటెల్సిజెన్స్‌ శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్చుర్ నియోజకవర్గ సమాచారాన్ని ఎప్పటికప్పుడు, ప్రభుత్వానికి ఇస్తున్నారు. అయితే ఏకంగా సొంత పార్టీ నేత పైనే నిఘా పెట్టటం, అటు కొంతమేర అధికారుల్లోను ఇటు వైసీపీ నాయకుల్లోను చర్చకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకునిం, హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో కూడా, జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరా మరీ లైన్ దాటకుండా చూడాలని, ఇది అందరికీ మంచిందని, ఆయాన దూకుడుగా వెళ్తే తనకు వెంటనే చెప్పాలని, జగన్ ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తానికి, సొంత పార్టీ నేత, అందులోనూ సీనియర్ నేత పై నిఘా పెట్టటం, ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉంటూ, ఇటీవలే కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ అయిన నరసింహన్ ఎట్టకేలకు తెలంగాణా నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో, తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు నియమించింది. ఆమె మొన్నటి దాక తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగారు. బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నందుకు, మోడీ ఆమెకు గవర్నర్ గా ప్రొమోషన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఇక మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్రం కొత్త గవర్నర్లను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా బదిలీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను నియమించింది. కేరళ గవర్నర్‌గా ఆసిఫ్ మొహ్మద్ ఖాన్‌ నియమించింది.

narasimhan 01092019 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ళ పాటు నరసింహన్ గవర్నర్ గా పని చేసారు. తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిసి కట్టుగా గవర్నర్ గా పని చేసారు. ఇటీవాలే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగించి, కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ గా ఉంచారు. ఇప్పుడు బదిలీ సెహ్సారు. దీంతో పాటు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా కూడా నరసింహన్ గుర్తింపు పొందారు. దాదాపుగా పదేళ్లుకు పైగా ఆయన తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా ఉండగా ఇటీవలే ఏపీకి బిశ్వభూషన్ హరిచందన్‌ను కొత్త గవర్నర్‌గా నియమించారు. రెండు రోజుల క్రితమే నరసింహన్ ఆయన బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు ఇచ్చారు.

narasimhan 01092019 3

రాజ్‌భవన్‌లో జరిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తాను గవర్నర్‌గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్‌ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన నిజంగానే బదిలీ అయ్యారు. నరింహన్ అటు సోనియా గాంధీకి, ఇటు మోడీకి కూడా సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్ళ పాటు గవర్నర్ గా కొనసాగారు. అటు విభజన సమయంలో, ఇటు ప్రత్యెక హోదా ఉద్యమం అప్పుడు కూడా, తెలంగాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ అధిష్టానానికి, చంద్రబాబుకు గ్యాప్ రావటానికి నరసింహన్ కారణం అని తెలుగుదేశం పార్టీ అనేకసార్లు బహిరంగంగా కూడా ఆరోపించింది.

ప్రత్యర్ధ రాజకీయ నాయకులను రెచ్చగొట్టటం కూడా ఒక ఆర్ట్. ఇది వైసిపీ నేతలకు బాగా వచ్చు. గతంలో విజయవాడలోని పాత బస్ స్టాండ్ సమీపంలో, ఫ్లై ఓవర్ కూడలి వద్ద, రోడ్డుకి అడ్డంగా, దాదపుగా సగం రోడ్డు ఆక్రమించుకుని, వైఎస్ఆర్ విగ్రహం ఉండేది. అయితే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అధికారుల సూచనలతో, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆక్కడ నుంచి ఆ విగ్రహం తొలగించింది. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటంతోనే, అక్కడే మళ్ళీ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే, రోడ్డుకి అడ్డంగా, క్రితం సారి పెట్టినట్టు పెడితే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి, దాని పక్కనే పిల్లలు ఆడుకునే అవతార్ పార్క్ లో, అక్కడ ఉన్న బొమ్మలు పీకేసి, అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్క్ లో బొమ్మలు తీసి మరీ, పెట్టటం పై విమర్శలు వచ్చాయి.

ysr 01092019 2

అయినా ప్రభుత్వం తలుచుకుంటే, ఏదైనా జరుగుతుంది కాబట్టి, ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. పనులు చకచకా జరిగిపోయాయి. అక్కడ వైఎస్ఆర్ బొమ్మ పెట్టేసారు. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల అయ్యింది. అక్కడ పార్క్ పేరు కూడా మార్చేసి, వైఎస్ఆర్ పార్క్ అని నామకరణం చేసారు. జీవోలో ఇంకో విషయం ఏమిటంటే, విఎంసి కమీషనర్, అక్కడ వైఎయస్ఆర్ విగ్రహం పెట్టమని ఉత్తరం రాసారు అంట, అందుకే యా ఉత్తరం పరిశీలించి, అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెడుతున్నారు అంట. విఎంసి కమీషనర్ వైఎస్ఆర్ విగ్రహం పెట్టమని ఎందుకు ఉత్తరం రాస్తారో, వారికే తెలియాలి. అయితే, రేపు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఈ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికతో పాటు, శిలాఫలకం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ysr 01092019 3

దాని మీద, ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్టు ఉంది. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ నేత సుజనా చౌదరి పేర్లను ముద్రించారు. అయితే ఇది ప్రోటోకాల్ ప్రకారం జరిగిందని చెప్తున్నా, కావాలని ప్రత్యర్ధులను రెచ్చగొట్టే విధంగా, ఇలా చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఆహ్వానం పలకకుండా, పెన్షన్లు ఇచ్చే చోటుకు, మీ ఎమ్మెల్యేలు వెళ్తే దాడి చేస్తూ, ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు, మమ్మల్ని పిలిచాం అంటూ, పైశాచిక ఆనందం పొందుతున్నారని, టిడిపి నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో పనులు పెండింగ్ లో పెట్టు, ఉన్న పళంగా, అక్కడ బొమ్ములు కొట్టేసి, వైఎస్ఆర్ విగ్రహం పెట్టేంత ఖంగారు ఏముంది టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలకు వస్తాం కాని, ఇలాంటి పనికిమాలిన పనులకు మీము ఎందుకు వెళ్తాం అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read