కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నవైసిపీ ప్రభుత్వానికి మొన్నటిదాక మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించాయి. ఏకంగా ప్రధాన మంత్రి, హలో విజయ్ గారు అని పలకరించేంత సాన్నిహిత్యం ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఏమి అడిగినా సరే కేంద్రం ఒకే అంటుంది అనే ప్రచారం రాష్ట్రంలో సాగించింది వైసీపీ. దానికి తగ్గట్టే విజయసాయి రెడ్డి కూడా, మేము ఏ పని చేసినా, మాకు మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి అంటూ, మీడియా ముందు చెప్పారు. అయితే కేంద్రం మాత్రం, పెద్దగా సహకరించింది లేదు. విద్యుత్ ఒప్పందాల సమీక్ష కాని, పోలవరం రీ టెండరింగ్ కాని, నిధులు విషయంలో కాని, ఇలా ఏ విషయంలోనూ కేంద్రం, రాష్ట్రానికి సహకారం లేదు. ఇదే కోవలో, తమకు నచ్చిన అధికారాలును, రాష్ట్రానికి తెచ్చుకునే విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ప్రచారం బెడిసి కొట్టింది.

stephen 04092019 2

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, తెలంగాణాలో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించుకునే ప్రయత్నం చేసారు. తెలంగాణా ప్రభుత్వాన్ని, ఈ విషయం పై అడగగానే, కేసిఆర్ కూడా ఒప్పుకున్నారు. స్టీఫెన్ రవీంద్రను డెప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపించేందుకు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు. దేంతో స్టీఫెన్ రవీంద్ర కూడా తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా దాదపుగా ఖరారు అయిపోయాను అనుకుని, ఆయన తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి, అనధికారికంగా పని చెయ్యటం మొదలు పెట్టారు. ముఖ్యమైన ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయనే ప్రచారం కూడా ఉంది. అయితే, స్టీఫెన్ రవీంద్రను అధికారికంగా, తమకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రాన్ని కోరింది.

stephen 04092019 3

దాదపుగా మూడు నెలల పాటు పెండింగ్ లో పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అదిగో ఇదిగో అంటూ హడావడి చేసింది. అయితే చివరకు, స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించటం కుదరదు అంటూ ప్రభుత్వానికి చెప్పింది. స్టీఫెన్ రవీంద్రను ఏపికి పంపించటం కుదరదు అని, తెలంగాణాకు వెళ్ళిపోవాలని కోరటంతో, ఆయన తెలంగాణాకు వెళ్ళిపోయి విధుల్లో చేరారు. దీంతో, జగన్, విజయసాయి రెడ్డిలకు షాక్ తగిలినట్టు అయ్యింది. విజయసాయి రెడ్డి, ప్రత్యేకంగా అమిత్ షా వద్దకు వెళ్లి మరీ స్టీఫెన్ రవీంద్ర కోసం అడిగారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అడిగారు. అయినా అటు ప్రధాని మోడీ కాని, హోం మంత్రి అమిత్ షా కాని, కనికరించలేదు. కేంద్ర వర్గాలు సమాచారం ప్రకారం, స్టీఫెన్ రవీంద్రను, ఏపి పంపటానికి సరైన కారణం చెప్పలేదని, అందుకే కేంద్రం ఒప్పుకోలేదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసారు. ఆర్థిక మంత్రిగా మీ చర్యలు అభినందనీయమంటూనే చంద్రబాబు ఆమె నిర్ణయాలను తప్పు బట్టారు, ఆంధ్రప్రదేశ్ పేరుతొ ఉన్న ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆంధ్రాబ్యాంకు పేరు కనుమరుగవటం, తెలుగు ప్రజలకు బాధ కలిగించే విషయం అని, సెంటిమెంట్ తో కూడుకున్న విషయం అని చంద్రబాబు అన్నారు. ఆంధ్రాబ్యాంక్ కూడా తెలుగువారికి ఎన్నో సేవలు చేసిందని గుర్తు చేసారు. ఇన్నేళ్ళ పాటు ఎంతో నమ్మకంతో పని చేసిన ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చకూడదు అని, తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించాలని చంద్రబాబు కోరారు. అయితే విలీనం అనివార్యమైతే మాత్రం, ఆంధ్రాబ్యాంక్‌ పేరునే కొనసాగించాలని చంద్రబాబు కోరారు.

nirmala 03092019 2

మచిలీపట్నం వేదికగా ఏర్పాటైన ఆంధ్రాబ్యాంక్ ని కనుమరుగు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బ్యాంక్‌ల విలీనంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్ ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక ఆంధ్రాబ్యాంక్ మనుగడ ఏమిటో అర్ధం కావటం లేదు. ఆంధ్రాబ్యాంక్ శతాబ్ది ఉత్సవాలకు రెడీ అవుతున్న వేళ, ఈ వార్తా విన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ అయ్యారు. 1923వ సంవత్సరంలో డా. భోగరాజు పట్ట్భా సీతారామయ్య లక్ష రూపాయల మూల నిధితో, ఆంధ్రాబ్యాంక్‌ను ప్రారంభించారు. 1980 సంవత్సరంలో ఆంధ్రాబ్యాంక్‌ను జాతీయం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది.

nirmala 03092019 3

అయితే ఇప్పుడు ప్రభుత్వ బ్యాంక్ ల విలీనంలో భగంగా, ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా విలీనం చేసుకోండి, ఆంధ్రా బ్యాంక్ పేరు మాత్రం, మార్చకండి అంటూ ప్రజలు కోరుతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా, ఈ విషయం పై కేంద్రానికి లేఖ రాసి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా, నిర్ణయం తీసుకోవలాని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా ఈ విషయం పై నిరసన తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు కూడా లేఖ రాయటంతో, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొంత మంది చేసిన ప్రచారం పై జనసేన పార్టీ సీరియస్ అయ్యింది. దీని పై కేసు పెట్టటానికి సిద్ధమైనట్టు ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, పవన్ కళ్యాణ్ ఫాన్స్, హంగామా మాములుగా చెయ్యలేదు. సోషల్ మీడియాలో అయితే, రచ్చ రచ్చ చేసి వదిలి పెట్టారు. అయితే, పవన్ ఫాన్స్ హడావిడి చూసి, కొంత మంది పవన్ పై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. జనసేన లెటర్ హెడ్ పై, పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఆపెస్తున్నారని, ఇక నుంచి ఫుల్ టైం సినిమాల్లో నటిస్తున్నారు అంటూ, జనసేన పార్టీ లెటర్ హెడ్ పై, రాసినట్టు పెట్టి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూసారు. అయితే అది నిజం అనుకుని కొంత మంది పవన్ ఫాన్స్ తో పాటు, సామాన్య ప్రజలు కూడా దాన్ని వైరల్ చేసారు.

pk 03092019 2

అయితే ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ, ఈ విషయం పై తీవ్రంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చ్సుఇ ఓర్వలేక, కొంత మంది పవన్ కళ్యాణ్ పేరిట ఒక తప్పుడు లేఖను సృష్టించి, వైరల్ చేసారని, ఆ లేఖ పచ్చి మోసాపూరితమైనదని, జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని కోరింది. ఆ లేఖ తయారు చేసింది ఎవరో కనుక్కోమని పోలీసులకు చెప్పమని, లేఖను సర్క్యులేట్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేసి, లీగల్ గా ప్రొసీడ్ అవుతమాని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి, పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే పని ప్రారంభించిందని చెప్పింది. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే అని, కాని ప్రజా సేవ ఎప్పుడూ ఉంటుదని, పవన్ కళ్యాణ్ దాన్నే నమ్ముకున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.

pk 03092019 3

అయితే గత నెల రోజులుగా వైసిపీ పార్టీ, పవన్ టార్గెట్ గా నడుస్తుంది. ఇప్పటికే వైసిపీ సోషల్ మీడియా ఆఫిషియాల్ హేండిల్ ఒకటి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పై తప్పుడు ప్రచారం చెయ్యటంతో, జనసేన పోలీస్ కేసు పెట్టటంతో, ఆ పెట్టిన పోస్టింగ్ ను వైసీపీ డెలీట్ చేసింది. మరో పక్క నిన్న పవన్ పుట్టిన రోజున కూడా, కొంత మంది "పావలా కళ్యాణ్" అంటూ ట్వీట్ లు చేసి, దాన్ని ట్రెండ్ అయ్యేలా చూసారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫాన్స్ అతి ప్రవర్తన, మరో పక్క ప్రత్యర్ధుల ట్రాప్ లో, జనసేన ఇట్టే పడిపోతుంది. తెలివిగా ఎదుర్కోవాల్సింది పోయి, అత్యుత్సాహంతో, పవన్ కి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. ఏది ఏమైనా, ఒక మనిషి పై తప్పుడు ప్రచారాలు చెయ్యటం మాత్రం, హేయమైన చర్య.

వైఎస్ విజయమ్మ బయటకు వచ్చారు అంటే, అక్కడ జగన్ ఎదో ఇబ్బంది పడుతున్నారు అనే లెక్క. చరిత్ర చెప్తుంది కూడా అదే. జగన్ జైలుకి వెళ్ళిన సమయంలో కనిపించిన విజయమ్మ, 2014 ఎన్నికల సమయంలో కనిపించారు, మళ్ళీ 2019 ఎన్నికల్లో కనిపించారు. వైసీపీ గౌరవ అధ్యక్షరాలుగా విజయమ్మ ఉన్నా, డైలీ రాజకీయల్లో మాత్రం ఎక్కడా కనిపించరు. ఎన్నికల సమయంలో, జగన్ కు అవసరం అనుకుంటేనే కనిపిస్తారు. అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా, కొడుకు అధికారంలో ఉన్న మూడు నెలలకే, మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతున్నారు. ఇలా విజయమ్మ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ? ప్రజలను ఇప్పుడు ఎందుకు డైవర్ట్ చెయ్యాలనుకుంటున్నారు ? అని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అయితే విజయమ్మ మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తూ, వైసిపీ అజెండా ఏంటో అర్ధమై పోతుంది.

vijayamma 03092019 2

విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ, జగన్ వంద రోజుల్లో ఎన్నో సాధించారని, వాళ్ళ నాన్న కంటే మంచి పేరు తెచ్చుకోవాలని తపన జగన్ కు ఉందని, అది సాదిస్తాడు అనే నమ్మకం ఉందని, ఆయన చెప్పిన పధకాలు అన్నీ అమలు చేస్తారనే విశ్వాసం ఉంది అంటూ, చెప్పుకొచ్చారు. అయితే ఒక్క విషయంలో మాత్రం, జగన్ ఆ హామీ నిలబెట్టుకోలేరేమో అంటూ ఒక మాట వేసి, అందరినీ తన మాటలు వినేలా చేసారు. జగన్ మోహన్ రెడ్డి పెట్టిన మద్యపాన నిషేధం అమలు చెయ్యటం ఎంతో కష్టమైన పని అని, జగన్ మోహన్ రెడ్డి అది సాదించలేరేమో అని తనకు అనిపిస్తుంది అంటూ విజయమ్మ చెప్పుకొచ్చారు. ఈ హామీ నిలబెట్టుకోవటం అన్ని రకాలుగా కష్టమని, ఈ విషయంలో తనకు అది సాధ్యపడదు అనే అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు.

vijayamma 03092019 3

అయితే ఇక్కడ విజయమ్మ చెప్పిన మాటలు మీడియాలో వచ్చాయి అంటే, అది జగన్ కు తెలియకుండా వచ్చే అవకాశమే లేదు. ఉద్దేశపూర్వకంగా, ప్రజలను నెమ్మదిగా ట్యూన్ చెయ్యటానికి, ఇలా చెప్పిస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం డౌన్ ట్రెండ్ లో ఉంది. 11 శాతం ఉన్న వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. ఆదాయం పెరిగే అవకాశమే కనిపించటం లేదు. ఈ నేపధ్యంలో, ఒకే ఒక్క ఆదాయం వనరు అయిన మద్యం కూడా నిషేదిస్తే, పరిస్థితులు చేయి దాటి పోతాయానే అనుమానం రావటంతోనే, విజయమ్మ చేత మద్యపాన నిషేధం కష్టం అని చెప్పించి, ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. విజయమ్మ కూడా మద్యం ఆదాయం గురించి ప్రస్తావించారు అంటే, ఎదో ఉందనే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానం ఏంటో తెలిసిపోతుంది.

Advertisements

Latest Articles

Most Read