పోలవరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పై కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని రిపోర్ట్ ఇవ్వమని కోరింది. పోలవరం కాంట్రాక్టులను రద్దు చేయడం, రీటెండర్లను ఆహ్వానించడం పై, పోలవరం ప్రాజెక్ట్ కు తలీత్తే ఇబ్బందుల పై, పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18 పేజీల రిపోర్ట్ ని, కేంద్రానికి ఇచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ లో లేవనెత్తిన అంశాల పై, మీ వివరణ ఇవ్వండి అంటూ కేంద్రం, జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌ కుమార్‌ శ్రీవాస్తవ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన 18 పేజీల నివేదికతో పాటుగా, రాష్ట్రం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను కూడా దీంతో కలిపి పంపించారు.

ppa 31082019 2

అయితే పోలవరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వ విధానాన్ని, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ వివరణ ఇచ్చారు. గత సోమవారం ఢిల్లీలో స్వయంగా జగన్ వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసి వివరించినా సరే, ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు పెరగకుండా చూస్తామని, అలాగే ఆలస్యం అవ్వకుండా చూస్తామని, కొత్త టెండర్లకు అనుమతి ఇవ్వాలని జగన్‌ ఇచ్చిన వివరణ పై కేంద్రం సంతృప్తి చెందలేదని ఈ లేఖలు చూస్తే తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ పై రాష్ట్రప్రభుత్వం రిటెన్ గా జవాబు ఇవ్వాలని అధికార వర్గాలు చెప్తున్నాయి. వచ్చే రెండు రోజులు, వినాయక చవితి సెలవులు ఉన్నాయి కాబట్టి, సెప్టెంబరు 3, 4 తేదీల్లో జవాబు పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ చెబుతోంది.

ppa 31082019 3

మరో వైపు, ఈ నెల 23న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ 18 పేజీల రిపోర్ట్ పంపినా, మరింత సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ తాజాగా ఆదేశించింది. ఇక మరో పక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అటు కోర్ట్ ని కాని, ఇటు కేంద్రం మాట కాని లెక్క చెయ్యకుండా,రీటెండరింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే హైకోర్ట్ రీటెండరింగ్ కు వెళ్ళద్దు అని చెప్పింది. దీని పై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళింది. ఈ నేపధ్యంలో అప్పీల్ కు వెళ్ళాం కాబట్టి, రీటెండరింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేసామని, కోర్ట్ ఆదేశాలను బట్టి చూస్తాం అని ప్రభుత్వం అంటుంది. మరో పక్క, కోర్ట్ వద్దు అని చెప్తున్నా, ఇలా ముందుకు వెళ్ళటం తప్పు అని కొంత మంది న్యాయవాదాలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు నెలల నుంచి, అటు జీతాలు కానీ, ఇటు పెన్షన్లు కానీ లేట్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి వైఎస్ఆర్ పుట్టిన రోజు అని చెప్పి, 8వ తేదీ దాకా పెన్షన్లు ఇవ్వలేదు. అయితే కేవలం పెన్షన్లు మీద బ్రతికే ముసలి వారు మాత్రం, ఫస్ట్ తారీఖు పెన్షన్లు వస్తాయని ఆశతో, ఎన్నో ఖర్చులు ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ఇక మొన్నటి నెల కూడా దాదపుగా 10 వ తేదీ దాటిన తరువాత కూడా పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఇక పోయిన నెలలో, ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖున పడలేదు. రెండు రోజులు ఆలస్యంగా పడ్డాయి. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, అందుకే పడలేదని ప్రచారం జరగగా, వెంటనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సాఫ్ట్ వేర్ లో సమస్య ఉందని, అందుకే ఇలా అయ్యిందని, అంతే తప్ప ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదని క్లారిటీ ఇచ్చింది.

jagan 31082019 2

పోయిన నెల జీతాలు రెండు రోజులు ఆలస్యంగా పడ్డాయి. అయితే ఈ నెల జీతాలు కూడా మూడో తారిఖు తరువాతే పడననున్నాయి. జీతాలు మాత్రమే కాదు, పెన్షన్లు కూడా మూడో తారీఖు తరువాతే పడనున్నాయి. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఓక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ఒకటో తేదీనే రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. అయితే, ఈ సారి ఒకటో తేదీ ఆదివారం కావటంతో , రెండో తేదీ అయిన సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో, మూడో తారీఖున జీతాలు, పెన్షన్లు వెయ్యనున్నారు. దీంతో మూడో తేదీన జీతాలు బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గతంలో చంద్రబాబు ఉండగా, ఇలా సెలవులు ఉంటే, ముందే జీతం వేసేవారు.

jagan 31082019 3

ముఖ్యంగా పండుగ ఉన్న టైంలో, ఉదోగ్యులు దగ్గర, పెన్షన్ తీసుకునే వారి దగ్గర డబ్బులు ఉంటే, పండుగ బాగా జరుపుకుంటారని, ముందుగానే జీతాలు వేసే వారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వినాయక చవితి పండుగకు, డబ్బులు లేకుండా ఉద్యోగులు, అటు పెన్షన్ లు తీసుకునే వారు ఉన్నారు. ఉసూరు మంటూ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందా అని చూస్తున్నారు. చంద్రబాబు ఉన్న సమయంలో 2017 నాటి సంఘటనను ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. 2017లో నెలాఖరులో దసరా పండగ రావడం, 28 నుంచి అక్టోబర్ 2 తేది వరకూ బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో అప్పటి ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పై గందరగోళ ప్రకటనల నేపధ్యంలో, అక్కడ రైతులు , వారం రోజుల క్రిందట వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసారు. వారి అభ్యర్ధన మేరకు, ఈ రోజు పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించి, రైతుల నుంచి, వారి ఇబ్బందులు, ప్రభుత్వ ప్రకటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అమరావతి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమాని ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించగానే, ఓ అభిమాని వచ్చి పవన్ కు ఒక జత చెప్పులు బహూకరించారు. మొదటిసారి తమ గ్రామానికి వచ్చారని, ఈ చిన్న కానుక స్వీకరించాలని కోరారు. అమరావతి రాజధాని నేల పై ఈ చెప్పులతో నడవాలని కోరారు. తన అభిమాని ఇచ్చిన కానుకను స్వీకరించిన పవన్ కళ్యాణ్, అమరావతి పర్యటనలో ఆ చెప్పులు ధరించి పర్యటించి, ఆ అభిమాని కోరిక తీర్చారు.

pk 30082019 2

మరో పక్క ప్రభుత్వం అమరావతి పై చేస్తున్న గందరగోళ పరిస్థితి పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అనిశ్చితి తొలగించి, జగన మోహన్ రెడ్డి స్వచ్చమైన ప్రకటన చెయ్యాలని కోరారు. బొత్సా సత్యన్నారాయణ తన పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎప్పుడూ అమరావతి వద్దు అని చెప్పలేదని, రైతుల నుంచి భూమి వారి ఇష్టం లేకుండా తీసుకోవద్దు అని మాత్రమే, అప్పట్లో ఆందోళన చేసానని చెప్పారు. ప్రస్తుతం, రాజధాని పై రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలే కారణం అని అన్నారు. బొత్సా ఏమి తెలియకుండా, అన్నీ తెలిసినట్టు చెప్తూ, ప్రజలను తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. మంత్రి పదవిలో ఉంటూ, అన్నీ తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.

pk 30082019 3

ముఖ్యమంత్రులు మారిస్తే రాజధానులు మారుస్తారా అని పవన్ ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఖర్చు జగన్‌ తన జేబులో నుంచి ఏమి తీసి ఇవ్వడం లేదని పవన్‌ అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని అందరూ అనుకోవాలని అన్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, నిడమర్రు, కూరగల్లులో పర్యటించారు. రేపు కూడా పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన కొనసాగనంది. అయితే పవన్ పర్యటన పై వైసీపీ నేతలు రాజకీయ దాడి చేసారు. పవన్ ప్యాకేజీ తీసుకుని, బయటకు వస్తారని, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నరు. పెరుగు అన్నం స్క్రిప్ట్ మర్చిపోయావా అంటూ పవన్ ను ఎద్దేవా చేసారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేసారు. మొన్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, విజయవాడలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూల మాల కూడా వెయ్యకుండా, ఉన్న ఫోటో ప్రధాన పత్రికల్లో వచ్చింది. ఆ వార్తా కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో, తెలుగు భాషా దినోత్సవం కోసం, ప్రభుత్వం విడుదల చేసిన 18 లక్షల జీవో కాపీని కూడా జోడించారు. 18 లక్షలు తెలుగు భాషా దినోత్సవం కోసం అని విడుదల చేసి, రాజధానిలో ముఖ్య ప్రాంతం అయిన విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూల మాల కూడా వెయ్యకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఈ డబ్బులు ఏమి అయ్యాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

cbn 31082019 2

అంతే కాదు, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అనే పాట ఏ అధికారిక కార్యక్రమంలో కూడా వినిపించటం లేదని చంద్రబాబు అన్నారు.. ఇది చంద్రబాబు ట్వీట్.. "తెలుగు భాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 లక్షలతో ఏం చేసినట్టు? "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్ర గీతం... ఈ మూడు నెలల్లో ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా? ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం?" అంటూ ట్వీట్ చేసారు.

cbn 31082019 3

ఇక నిన్న జరిగిన ఇసుక ధర్నాల పై కూడా చంద్రబాబు ట్వీట్ చేసారు. "తెదేపా హయాంలో ఉచిత ఇసుక యూనిట్ ధర రూ.1200లుగా ఉంటే, వైకాపా రివర్స్ టెండరింగ్ మాయాజాలంతో యూనిట్ ధరను రూ.10,000లు చేసి, వైకాపా నాయకులు ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని నిరూపించుకున్నారు. వాళ్ళ ధన దాహంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసారు. సిమెంట్ బస్తాకు 10 రూపాయిలు J-ట్యాక్స్ కట్టే వరకూ ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలి. తుగ్లక్ పాలనతో రోడ్డున పడిన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ. 60 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉద్యమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను అభినందిస్తున్నాను. కార్మికులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ వారి తరపున పోరాడుతుంది." అని ట్వీట్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read