ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఉదయం అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలకు వెళ్ళటం చంద్రబాబుకి ఆనవాయతీ. ఈ సారి కూడా నాలుగు రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని, ఈ రోజు ఉదయమే చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయం అమరావతి వస్తారాని సమాచారం. అయితే అమెరికా నుంచి రాగానే జెట్ ల్యాగ్ కూడా లేకుండా, చంద్రబాబు పార్టీ సమీక్షలు చేసారు. కొద్ది సేపటి క్రితం, చంద్రబాబు, మాజీ కేంద్రం మంత్రి జైపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళే రోజే, జైపాల్ రెడ్డి మరణించారు. అయితే అప్పటికే షడ్యుల్ ఉండటంతో, చంద్రబాబు పరామర్శకు వెళ్ళలేక పోయారు.

revanth 03082019 2

ఈ నేపధ్యంలో అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన రోజే, ఆయాన జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించటానికి, ఆయన ఇంటికీ వచ్చారు. జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు. కుటుంబ సభ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నట్టు ఉండి ఇలా ఎందుకు జరిగింది అనే విషయాలు తెలుసుకున్నారు. జైపాల్ రెడ్డితో తనకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారు. ఈ సందర్భంలో, అక్కడ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కి బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోసం, అప్పటికే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు రాగానే, ఆయనను దగ్గర ఉండి జైపాల్ రెడ్డి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యలను, చంద్రబాబుకు పరిచయం చేసారు రేవంత్ రెడ్డి.

revanth 03082019 3

రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న టైంలో, ఓటుకు నోటు కేసు రావటం, అందరూ చేసే పనే అయినా, రేవంత్ ను టార్గెట్ చేసి, ఉచ్చులోకి దింపి, జైలుకు పంపటం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు రేవంత్ కూతురు నిశ్చితార్దానికి కూడా రేవంత్ బెయిల్ పై రావాల్సిన పరిస్థితి రావటంతో, చంద్రబాబు దంపతులు ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చేసిన సంగతి తెలిసిందే. తరువాత క్రమంలో, తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండటంతో, రేవంత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రేవంత్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తరువాత, చంద్రబాబుని మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారు. ఇది సందర్భం కాకపోయినా, చంద్రబాబు, రేవంత్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి, టిడిపి శ్రేణులు హర్షిస్తున్నారు.

ఒక పక్క జగన్ మొహన్ రెడ్డి, మా ప్రభుత్వం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తుంది అని బిల్ తీసుకువచ్చి, ప్రచారం చేస్తుంటే, వారి పార్టీ నాయకులు మాత్రం, స్థానికులకు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. అనంతపురం జిల్లా, మండలంలోని తలారిచెరువు వద్ద ఒక పెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది. దాదపుగా 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, ఇప్పటికే ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్లాంట్ వద్ద, శుక్రవారం ఉన్నట్టు ఉండి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఆ ఉద్యోగాలు తీయంచి, తమకు ఇష్టమైన వారికి వాలంటూ, వైసీపీ నేతలు బెదిరించటంతో, గత్యంతరం లేక, స్థానికులను తొలగించి, వైసీపీ నేతలు చెప్పిన వారికి ఇచ్చారు.

jc 03082019 2

అయితే, ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తీసేసిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లో చేర్చుకోవాలి అంటూ, వినతి పత్రం ఇవ్వటానికి, సోలార్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తున్నారని, ముందే తెలుసుకున్న వైసీపీ నేతలు, అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నాయకుడు రామేశ్వరరెడ్డితో పాటు దాదాపు 200 మంది వరకు జనాలు కంపెనీ దగ్గరకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకున్నారు. ఆయన గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, జేసిని అడ్డుకున్నారు. లోపలకి వెళ్ళటానికి వీలు లేదని ఆయన్ని చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అవతల 200 మంది ఉన్నా, జేసీ మాత్రం, నేను లోపలకి వెళ్లి తీరుతా అంటూ అక్కడే కూర్చున్నారు.

jc 03082019 3

దాదపుగా అరగంటకు పైగా ప్లాంట్ బయటే కూర్చుని నిరసన తెలిపారు. పరిస్థితి చేయి దాటి పోతూ ఉండటంతో, ఆయన ఇక్కడ పరిస్థితి ఇది అంటూ, ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి, అన్నీ వివరించారు. రూరల్‌ సీఐ సురేష్ కుమార్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో పాటు వచ్చి, అక్కడ ఉన్న వారిని చెదరగొట్టి, జేసిని ప్లాంట్ లోపలకి పంపించారు. ప్లాంట్‌లో ట్రాక్స్‌కో షిప్టు ఏడీ శ్రీదేవికి వినతిపత్రం ఇచ్చి, ట్రాన్స్‌కో సీఈ శ్రీరాంకుమార్‌ కు ఫోన్ చేసి, ఉద్యోగులని ఇష్టం వచ్చినట్టు తొలగించారని, అది చట్ట ప్రకారం కూడా నేరం అని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, ఉద్యోగుల తరపున ఎంతవరకైనా పోరాడటానికి వెనుకాడనని తెలియజేశారు.

వాన్పిక్ కేసులో A3గా ఉన్న పారిశ్రామకవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఇదే కేసుకు సంబధించి మరో కేసు కూడా యూఏఈలో ఫైల్ అయ్యింది. అయితే నిమ్మగడ్డ మూడు రోజుల క్రిందట విహార యాత్రకు సెర్బియా వెళ్ళటం, అక్కడ సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. అయితే, నిమ్మగడ్డను భారత దేశం తీసుకురావటానికి వైసీపీ ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయినా కేంద్రం మాత్రం, ఈ విషయంలో మేము చేసేది ఏమి లేదు అని తేల్చి చెప్పింది. ఈ నేపధ్యంలోనే ఇక నిమ్మగడ్డ భవిష్యత్తు ఏంటి అనే సందేహాల మధ్య, నిమ్మగడ్డకు అదిరిపోయే జర్క్ ఇచ్చింది సెర్బియ కోర్ట్. నిన్న సెర్బియా కోర్ట్, నిమ్మగడ్డను విడుదల చెయ్యమని అక్కడ పోలీసులుకు చెప్పింది. అయితే తరువాత, ఆయన అదిరిపోయే షరతులు పెట్టింది.

serbia 03082019 2

దాని ప్రకారం, నిమ్మగడ్డ సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌ ను విడిచి వెళ్ళకూడదు, ఆ షరతుల మీదే ఆయన్ని విడుదల చేస్తున్నట్టు సెర్బియా కోర్ట్ చెప్పింది. అయితే నిమ్మగడ్డ విడుదల అయ్యింది బెయిలు మీద ? లేకపోతే, భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ చొరవ తీసుకుని వదిలి పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. నిమ్మగడ్డ నిర్బంధన పై కోర్ట్ స్పష్టంగా చెప్పింది. ఈ నిర్బంధన జూలై 27 ఉదయం 8.20 నుంచి అమల్లో ఉన్నట్టు చెప్పింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి, మొత్తం వ్యవహారం సమీక్షించి, నిర్బంధన ఉత్తర్వులు పొడిగించే అవకాసం ఉంటుందని తెలుస్తుంది. ఈ నిర్బంధం, ఏడాది వరకు కొనసాగే వీలు ఉంటుంది. అంటే సెర్బియా పోలీసులు తలుచుకుంటే, నిమ్మగడ్డ ఏడాది పాటు బయటకు వచ్చే అవకాశమే లేదు.

serbia 03082019 3

ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసు, తమకు అప్పగించాలని రస్‌ ఆల్‌ ఖైమా దేశం కోరిందని, ఆ అభ్యర్థన మా వద్ద ఉందని కోర్ట్ తెలిపింది. సెర్బియాలో నిందితునికి నివాసం లేదని కూడా కోర్ట్ అభిప్రాయపడింది. రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చు అని సెర్బియ కోర్ట్ చెప్పింది. నిందితుడి వాదనలు వినే అవసరం లేకుండా, తక్షణమే అదుపులోకి తీసుకునే చట్టాలు ఉన్నాయని, కోర్ట్ ఉత్తర్వుల్లో చెప్పింది. నిమ్మగడ్డ విడుదల అయినా, అక్కడ ఉన్న చట్ట ప్రక్రియ కారణంగా, ఆయన బెల్‌గ్రేడ్‌ నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు. మరి ఇప్పుడు, వైసీపీ తరువాత అడుగు ఎలా ఉంటుందో చూడాలి.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో, ఎన్నికలు అయిన దగ్గర నుంచి, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ, అంతర్గత గొడవలు బయట పెట్టి, పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం తెలిసిందే. మొదటిగా దేవినేని ఉమాని టార్గెట్ చేసుకుని ఒక వర్గం పావులు కదిపింది. కొన్ని రోజులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. తరువాత విజయవాడ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న మధ్య జరిగిన ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిందే. పర్సనల్ గా ఒకరి పై ఒకరు ట్వీట్లు పెట్టుకుని మరీ, దాదపుగా వారం రోజులు టార్గెట్ చేసుకున్నారు. చివరకు ఈ విషయం పై చంద్రబాబును కూడా లాగటంతో, తెలుగుదేశం శ్రేణులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఒకరి పై ఒకరు ఆధిపత్యం చూపిస్తూ, చంద్రబాబుని లాగటం పై, కార్యకర్తలు కూడా వారి పై ఆగ్రహం చెందారు.

buddha 03082019 2

తరువాత, కేశినేని నానిని చంద్రబాబు కలవటం, అలాగే బుద్దా వెంకన్నను కూడా పిలిచి మాట్లాడటంతో, వివాదం అయిపోయినట్టే కనిపించింది. అప్పటి నుంచి, రెండు వైపులా ట్వీట్స్ వెయ్యటం ఆపేశారు. కేవలం రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేస్తూ, ఇద్దరూ ట్వీట్స్ కొనసాగిస్తున్నారు. ఈ వివాదాల మూలం ఏంటో, ఇప్పటికీ స్పష్టంగా బయటకు తెలియదు. అయితే ఈ వివాదం తరువాత, బుద్దా వెంకన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కాలేదు. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో, కేశినేని నాని, ఈ సమావేశానికి రాలేదు.

buddha 03082019 3

అయితే ఈ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న మాతరం కీలక నిర్ణయాన్ని ఆ సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బుద్దా వెంకన్న కొనసాగుతున్నారు. అయితే, వచ్చే టర్మ్ నుంచి ఈ పదవిలో తాను ఉండటం లేదని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు. అలాగే చంద్రబాబు భవిష్యత్‌లో ఎవరికి ఈ పదవి ఇచ్చినా, తాను అన్ని విధాలా సహకరిస్తానని బుద్దా వెంకన్న సమావేశంలో చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అయితే అసందర్భంగా ఈ ప్రకటన ఎందుకు చేసారు అనే విషయం పై చర్చ జరుగుతుంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బాధ్యత తీసుకోకుండా, బుద్దా తప్పించుకున్నారా అనే వాదన కూడా నడుస్తుంది. బుద్దా ఈ ప్రకటన చెయ్యటం వెనుక వ్యూహం ఏంటి ? రాజకీయ కోణం ఏంటి అనే దాని పై, తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read