మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రెండేళ్ళకు ఒకసారి, అమెరికా వెళ్లి, చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడు కూడా అమెరికా వెళ్లారు. మిన్నెసోట రాష్ట్రంలో మేయో క్లినిక్‌లో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేవలం రెండు రోజుల పర్యటన కోసమే చంద్రబాబు అమెరికా వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత, చంద్రబాబును అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలు కలిశారు. వారితో కొంచెం సేపు చిట్ చాట్ చేసి, ఎన్‌ఆర్‌ఐలతో కలిసి చంద్రబాబు మిన్నెసోట వీధుల్లో సందడి చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అది మా చంద్రబాబేనా అంటూ టిడిపి శ్రేణులు కూడా అవాక్కయ్యయి.

cbn 0208219 2

పాప్ కార్న్ తింటూ వీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు చంద్రబాబు. అక్కడ వివిధ షాపులు తిరుగుతూ సందడి చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సందర్భంలో అక్కడ చోటు చేసుకున్న ఓ పరిణామం ఆసక్తి రేకెత్తించింది. చంద్రబాబు మితాహారి. చాలా లిమిట్ గా, డైట్ చార్ట్ ప్రకారం తింటారు. ఆయన బాధ్యతలు అన్నీ ఆయన భార్య భువనేశ్వరి చూసుకుంటారు. ఆమె డైట్ చార్ట్ ఫాలో అయ్యే దాంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని, చంద్రబాబు అందుకే ఎప్పుడూ డైట్ విషయంలో కంట్రోల్ తప్పరని తెలుగుదేశం వర్గాలు చెప్తూ ఉంటాయి. అదే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ గా చెప్తారు. పొరపాటున, డైట్ లో ఏదైనా తేడా వచ్చినా, వెంటనే ఆ సమాచారం, హైదరాబాద్ లో ఉన్న మ్యాడం గారికి వెళ్ళిపోతుందని, టిడిపి శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి.

cbn 0208219 3

అయితే మిన్నెసోట వీధుల్లో నడుస్తూ, అక్కడి అంగళ్లలోని చిరుతిళ్లు కొనుక్కుని తినటం ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో ఆయన వెంట నడుస్తున్న ఓ ఎన్ఆర్ఐ, "సార్, ఐస్ క్రీమ్ తింటారా?" అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్పారో వినపడలేదుగానీ, "మేడమ్ లేనప్పుడే మనం ఏదైనా తింటే..." అని అనడం వినిపించింది. దీనికి చంద్రబాబు "వద్దురా..." అని సమాధానం ఇవ్వటం ఆ వీడియోలో కనిపించింది. దీంతో చంద్రబాబు, భువనేశ్వరి మాట జవదాటారు అనే మరోసారి రుజువైందని టిడిపి శ్రేణులు సరదాగా అనుకుంటున్నాయి. మొత్తానికి, ఇన్ని రోజుల తరువాత చంద్రబాబుకు కుటుంబంతో గడిపే అవకాశం దొరికిందంటూ టీడీపీ కార్యకర్తలు సంబరపడిపోయారు. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే తమ అధినేతను ఇలా చూడటం ఆనందంగా ఉందన్నారు.

2019 ఎన్నికలు ముగుసిన దగ్గర నుంచి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు బొండా ఉమా వ్యవహార శైలి, పార్టీకి దూరం అవుతునట్టే ఉంది. చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైంలో, కాపు మీటింగ్లు పెట్టటం, చంద్రబాబు తిరిగి వచ్చిన తరువాత సమీక్షలకు రాకుండా అలగటం, చంద్రబాబు ఫోన్ చేసిన తరువాత, ఆయన దగ్గరకు వెళ్లి కలవటం, మళ్ళీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వెళ్ళిపోవటం చూస్తుంటే, బొండా ఉమా పార్టీ మార్పు తధ్యంగానే కనిపిస్తుంది. నెల రోజుల క్రిందట చంద్రబాబుతో మాట్లాడిన బొండా ఉమా, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి ఆక్టివ్ గా లేరు. ఆయన విదేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయారు. అయితే ఆయన విహార యాత్రలకు వెళ్ళినా, రాజకీయంగా మాత్రం హాట్ టాపిక్ గానే ఉంటున్నారు.

bondauma 020812019 2

వారం రోజుల నుంచి బొండా ఉమా, వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంటుంది. ఆయన ఇప్పటికే వైసీపీతో చర్చలు జరిపారని, విజయవాడ తూర్పు ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తారనే సమాచారం వస్తుంది. తూర్పులో ప్రస్తుతం వైసీపీకి సరైన కాండిడేట్ లేరు. గద్దె రామ్మోహన్ ను ఎదుర్కునే వారి కోసం వైసీపీ చూస్తుంది. ఇంతక ముందు రాధా ఉన్నా,ఆయన తెలుగుదేశంలో చేరిపోయారు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన బొప్పన భవ కుమార్ అంత ఆక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండరు. ఇక యలమంచలి రవి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో, కాపు సామాజికవర్గ నేత అయిన బొండా ఉమా వైసీపీలోకి వచ్చి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే, కృష్ణలంక వోటింగ్ మొత్తం బొండా ఉమాకు పడుతుంది అనేది వైసీపీ ఆలోచన. బొండా ఉమా కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు.

bondauma 020812019 3

అక్కడ నుంచి రాగానే, దీని పై క్లారిటీ ఇస్తారని తెలుస్తుంది. అయితే, ఈ లోపే బొండా ఉమా పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ మాత్రం, ఆయన పార్టీ మార్పు ఖాయం అనే మాట వినిపిస్తుంది. బొండా ఉమా బంగీ జంప్‌ చేసిన వీడియో పోస్ట్ చేస్తూ, ‘హలో బెజవాడ..! నా తర్వాత రాజకీయ అడుగుపై చర్చ జరుగుతున్న తరుణంలో వేయబోతున్న సాహస, ధైర్యవంతమైన అడుగు ఇలా ఉండబోతోంది..!’ అంటూ ట్వీట్ చేసారు. అంటే, ఆయన తరువాత అడుగు కచ్చితంగా ఎదో ఉంటుంది అనే విధంగానే ఆ పోస్ట్ ఉంది. అయితే దీని పై నెటిజెన్ లు కూడా అలాగే స్పందిస్తున్నారు. మీరు రివర్స్ లో దూకుతున్నారు, మీ అడుగు కూడా ఇలాగే రివర్స్ లో, రివెర్స్ పార్టీలోకే అన్నట్టు ఉంది అంటూ ఒకరు, అలాగే ఇది చాల డేంజర్ స్టంట్, అంటే మీరు కూడా డేంజర్ జోన్ లోకి అడుగు పెడుతున్నారా అంటూ మరో కామెంట్ పెడుతున్నారు. బొండా ఉమా నోరు తెరిస్తే కాని, అసలు విషయం ఏంటో తెలియదు.

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారు మోగుతుంది. మొన్నటి దాక ఆ రికార్డు, ఈ రికార్డు, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది అంటూ జాతీయ ఛానెల్స్ లో మన రాష్ట్రం గురించి వార్తలు వచ్చేవి. అయితే, ఇప్పుడు మాత్రం, నెగటివ్ న్యూస్, నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నటి దాక, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయిన విద్యుత్ ఒప్పందాల రద్దు, 75 శాతం పరిశ్రమల్లో రిజర్వేషన్ వంటి అంశాలు ప్రధానంగా వస్తే, ఈ రోజు మాత్రం, రెండు పూర్తీ నెగటివ్ వార్తలు, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జెరుసలేం టూర్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ముందుగా ఇది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న మొదటి విదేశీ పర్యటన.

indiatoday 01082019 2

అయితే ఇది ఏ పెట్టుబడులు కోసమో కాదు, ఆయన వ్యక్తిగత పర్యటన, కుటుంబంతో కలిసి వెళ్తున్నారు. అయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన జీఓలో, ఈ పర్యటన ఖర్చు అంతా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. అయితే నిన్న వచ్చిన ఒక జీఓలో మాత్రం, సెక్యూరిటీ కోసమని 22.50 లక్షలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అయితే అంత పెద్ద మొత్తం, సెక్యూరిటీ కోసం ఎందుకో అర్ధం కాలేదు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 22.50 లక్షలు, Triple “S“-RT&T టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ట్రావెలింగ్ కంపెనీకి ఇవ్వమని ఆ జీఓ లో ఉంది. నిజానికి ఇది సెక్యూరిటీ కంపెనీ కాదు. Triple “S“-RT&T అనేది టూర్స్ ప్లాన్ చేసే ఒక ఏజెన్సీ. మరి ఈ కంపెనీకి, 22 లక్షలు సెక్యూరిటీ కింద ఇవ్వమనటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

indiatoday 01082019 3

ప్రభుత్వం దీని పై వివరణ ఇస్తే కాని ఒక క్లారిటీ వచ్చే పని లేదు. నిజానికి జెరుసలేం వెళ్ళటానికి, మన దేశం నుంచి అయ్యే ఎయిర్ టికెట్ ఖర్చు, 50 వేలు మాత్రమే ఉంది. ఇవన్నీ చూసుకుంటే, 22 లక్షలు ఎక్కవ అనే చెప్పాలి. ఇదే విషయం ఇండియా టుడే జాతీయ ఛానెల్ నిలదీసింది. సొంత టూర్స్ కి, ప్రజా ధనం వాడతారా అంటూ నిలదీసింది. మరో పక్క, నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను బ్యార్య, తెలంగాణాలో ఒక ట్రాఫిక్ పోలీస్ ని బెదిరిస్తూ, నిన్న కేసిఆర్ తో చెప్పి, సస్పెండ్ చేపిస్తా అనే వీడియో కూడా ప్రముఖంగా ఇండియా టుడేలో వచ్చింది. ఒక ఎమ్మెల్యే కొడుకు పోలీసులని కొడితే, ఎమ్మెల్యే భార్య వచ్చి పోలీసులనే సస్పెండ్ చేపిస్తా అని బెదిరిస్తున్నారని, ఇండియా టుడే ఏకి పారేసింది. ఎందుకో కాని, మన తెలుగు మీడియా, ఈ వార్తలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ వీడియోలు ఇక్కడ చూడచ్చు. https://www.facebook.com/IndiaToday/videos/908853212811675/ , https://www.facebook.com/IndiaToday/videos/453858868532056/

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తారీఖున జీతాలు పడటం, ఆనవాయతీగా వస్తుంది. విభజన జరిగి, మొదటి సారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా, ఎప్పుడూ జీతాలు ఆపలేదు. చంద్రబాబు ఎక్కడ నుంచి డబ్బు తెస్తున్నారో కాని, మాకు మాత్రం టైంకి జీతాలు ఇచ్చేస్తున్నారు, ఆయన తిప్పలు ఆయన పడి, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టలేదు అని ఉద్యోగస్తులు అనే వారు. తరువాత వీరికి ఐఆర్ కూడా పెంచారు చంద్రబాబు. అయినా ఎందుకో మరి, ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబుని దూరం పెట్టారు. రాష్ట్రం గాడిలో పడిపోయింది, ఇక చంద్రబాబు లాంటి సమర్ధుడితో పని లేదు అనుకున్నారో, లేక చంద్రబాబు ఎక్కువ జీతం ఇచ్చి, కరెక్ట్ గా పని చేయ్యమనటం పాపమో కాని, ఉద్యోగులు మాత్రం మొన్న ఎన్నికల్లో చంద్రబాబుని దూరం పెట్టారు అనేది వాస్తవం.

salary 02082019 2

అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన మొదటి సారి సచివాలయంలో అడుగు పెట్టిన రోజు, పార్టీ కార్యకర్తలు లాగా, జై జగన్ జై జగన్ అంటూ, ఉద్యోగులు నినాదాలు చేసారు. అయితే ఏ ప్రభుత్వాధినేత అయినా, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. 27 శాతం ఐఆర్ పెంచుతున్నాం అని చెప్పి, చంద్రబాబు పెంచిన 20 శాతం ఐఆర్ మాత్రం మూడు నెలలు ఇవ్వమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులకు మోదటి షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఇక తాజాగా ఇచ్చిన షాక్ అయితే, మామూలుగా లేదు. ప్రతి నేలా ఒకటో తారీఖు జీతాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గురువారం మాత్రం జీతాలు అందలేదు. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ముందుగా కొద్దిమందికి, పొరపాటున జీతాలు రాలేదేమోనని అనుకున్నారురు.

salary 02082019 3

అయితే సమయం గడుస్తున్న కొద్దీ, సాయంత్రం అయినా, రాత్రి అయినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులెవరికి జీతాలు అందలేదనే విషయం తెలుసుకుని ఉద్యోగులు అవాక్కయ్యారు. అయితే ఈ విషయం పై అరా తియ్యగా ఉన్నతాధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ఆర్థికస్థితి బాగోలేదని, అందుకే జీతాలు ఆలస్యం అయ్యింది ఏమో అనుకున్నారు. చివరకు రాత్రి మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియాలో వార్తలు రావటంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి పొరపాటు లేదని, ఖజానాలో డబ్బులు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-కుబేరలో సాంకేతిక సమస్యలతో, జీతాలు ఇవ్వటం కుదరలేదని, ఈ రోజు, లేదా రేపు జీతాలు పడతాయని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-కుబేరలో సాంకేతిక సమస్య వస్తే, దేశం అంతటా, ఇదే ఇబ్బంది ఉండాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సమస్య త్వరగా తీరిపోయి, మన ఉద్యోగులకు జీతాలు తొందరగా వస్తాయని ఆశిద్దాం.

Advertisements

Latest Articles

Most Read