ఆకలికి రాజకీయం ఉంటుందా ? తెలుగుదేశం వాడికి అదే ఆకలి, వైసీపీ వాడికి అదే ఆకలి ఉంటుంది. కాని చంద్రబాబు మొదలు పెట్టిన అన్న క్యాంటీన్ లకు మాత్రం, రాజకీయం అనే జబ్బు డామినేట్ చెయ్యటంతో, పేదల నోటి కాడ కూడా , లాగేసినంత పని అయ్యింది. పెడ వాడు పస్తులు ఉండకూడదు అని, కడుపు నిండా మూడు పూటల అన్నం తినాలని, చంద్రబాబు హయంలో, అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యానం భోజనం, రాత్రికి భోజనం పెట్టే వారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73 పట్టణాలు, నగరాల్లో ఒకేసారి 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రోజుకి దాదాపు 3లక్షల మందికి ఈ క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసేవారు.
ప్రభుత్వం మారి జగన్ వచ్చారు. తాత్కాలిక కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లు మూసేసారు. తరువాత రంగులు మార్చారు, పేర్లు మార్చారు. సరే ఏది చేస్తే ఏమిలే, ఎవరి పేరు పెడితే ఏమిలే, ప్రజలకు కడుపు నిండా అన్నం ముద్ద పెడితే చాలు అనుకున్నారు. కాని, అందరూ అనుకున్నట్టే, ఈ రోజు నుంచి అన్ని అన్న క్యాంటీన్లు మూసేసారు. అసెంబ్లీ వేదికగా, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు. కాని, ఆయన ప్రకటనకు భిన్నంగా, ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లు మూత పడ్డాయి. అది తెలియని పేదలు, ఎప్పటి లాగే, ఈ రోజు 5 రూపాయలు పట్టుకుని అన్న క్యాంటీన్లకు, కడుపు నింపుకోటానికి వచ్చారు. అయితే, ఈ రోజు నుంచి క్యాంటీన్ మూసేసారు అని తెలియటంతో, కడుపు మాడ్చుకుని వెనుతిరిగారు.
మరో పక్క అన్న క్యాంటీన్లలోని సామానుని కూడా తరలించి వేసారు. అక్కడ ఉండే సామాను, వాటర్ క్యాన్లు, అన్నీ తరలించారు. అయితే, మళ్ళీ ఇవి తెరుస్తారా లేదా అనేది మాత్రం, అర్ధం కావటం లేదు. అయితే మీడియాలో వస్తున్న వార్తలు, బయట ప్రజలు ఆందోళన చూసిన బొత్సా మళ్ళీ ఈ రోజు మాట్లాడారు. అన్న క్యాంటీన్లు మూసేసే ఆలోచన లేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం వీటిని సరిగ్గా చెయ్యలేదని, అందుకే వీటి విషయంలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే అన్న క్యాంటీన్ల విషయంలో మార్పు చేర్పులు చేసి, రాయితీ పై క్యాంటీన్లను ప్రారంభిస్తామని బొత్సా తెలిపారు. అయితే, అప్పటి వరకు పేదలు ఆకలితో ఉండాల్సిందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ? అప్పటి వరకు, ఏదైనా తాత్కాలిక ఏర్పాట్లు చేసైనా, కొనసాగుతున్న వాటిలో అన్నం పెట్టచ్చు కదా ? చంద్రబాబుని సాధించటానికి, పేదలకు అన్నం పెట్టటం ఆపేస్తారా ?