భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మోదీతో పాటు బీజేపీ-సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారులో మొత్తం 57 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు. వీరిలో 36 మంది గతంలో చేసినవారే కాగా 21 మంది కొత్తవారు. మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. 9 మందికి స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేశారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం రోజున మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయింపు జరిగింది. తెలంగాణ నుంచి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ కిషన్‌రెడ్డిని హోం శాఖ సహాయ మంత్రిగా కేంద్రం కేటాయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి జరిగిన ఒకే ఒక నియామకం ఇది. కేంద్ర హోంశాఖ అమిత్ షాకు కేంద్రం కట్టబెట్టింది.

cabient 31052019 1

కాగా.. తెలంగాణ నుంచి మోదీ తన కేబినెట్‌లోకి కిషన్ రెడ్డిని తీసుకుంటారా..? లేదా..? అనే దానిపై చివరి క్షణం వరకూ ఢిల్లీలో సస్పెన్స్‌ కొనసాగింది. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి పిలుపు వస్తుందని పార్టీ ముఖ్య నేతలు భావించినా బుధవారం రాత్రి వరకు రాలేదు. గురువారం ఉదయానికి నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఉదయం 11 గంటలకు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి తీపి కబురు వినిపించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారీ తెలంగాణకు (ఉమ్మడి ఏపీలో కూడా) తొలుత సహాయ మంత్రి పదవే దక్కుతోంది. ఇది ఆనవాయితీగా మారిందని కమలం రాష్ట్ర పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో ఇద్దరు సీనియర్‌ నాయకులకు కూడా సహాయ మంత్రిగానే అవకాశం దక్కగా.. ఇప్పుడు కిషన్‌ రెడ్డికి కూడా సహాయ మంత్రి హోదానే ఇచ్చిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖ‌లు మారుతున్నాయి. వాటిని రాజ‌న్న క్యాంటీన్లుగా నామ‌క‌ర‌ణం చేయ‌నుంది కొత్త ప్ర‌భుత్వం. అలాగే- అన్న క్యాంటీన్ల‌కు వేసిన ప‌సుపురంగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌తాకంలో ఉన్న రంగుల‌ను వేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ప‌నులు ఇప్ప‌టిక మొద‌ల‌య్యాయి కూడా. తెలుగుదేశం పార్టీ అమ‌లు చేసిన అన్నక్యాంటీన్ల వంటి ప‌థ‌కాల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును పెట్ట‌బోతున్నారు. అన్న క్యాంటీన్‌కు రాజ‌న్న క్యాంటీన్ అని పేరు పెట్టి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిలువెత్తు చిత్ర‌ప‌టాన్ని త‌గిలించిన ఈ ఫొటో ఎక్క‌డిదో తెలియట్లేదు గానీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఏపీ సచివాలయాలనికి వాస్తు దోషాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నిర్మించారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా సచివాలయంలో అనేక మార్పులు-చేర్పులు చేశారు. ఏపీ సచివాలయంలో వాస్తు దోషాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాస్తు పండితుల సూచనలతో స్వల్ప మార్పులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగ్నేయం నుంచి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌లో మార్పులు-చేర్పులు చేస్తున్నారు. పాత ఛాంబర్ పక్కన కొత్త ఛాంబర్ అధికారులు నిర్మిస్తున్నారు. సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

jagan 31052019

సచివాలయం మొదటి బ్లాకులోని సీఎస్‌ కార్యాలయంలో మార్పులు-చేర్పులు చేస్తున్నారు. ప్రొటోకాల్‌ రూం, సందర్శకులు వేచి ఉండే గదుల గోడలు తొలగించారు. మొదటి బ్లాకులో ఉన్న చంద్రబాబు ఫొటోలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచే సచివాలయంలో కొత్త సీఎంగా జగన్ అడుగుపెడుతారని ప్రచారం జరిగింది. జగన్ రాక సందర్భంగా సచివాలయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ఛాంబర్‌, కేబినెట్‌ హాల్‌, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్‌లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్‌ నేమ్‌ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించారు. అయితే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించాలనుకున్న జగన్ చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. తన నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

jagan 31052019

మంచి ముహూర్తంలో సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు దోషం కారణంగానే జగన్ సచివాలయాలనికి వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీ సచివాలయం వాస్తు బాగుందని కపిలేశ్వరానందగిరిస్వామి చెప్పిన విషయం తెలిసిందే. సచివాలయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎస్‌ను, సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డిని ఆశీర్వదించడానికి అగర్తల నుంచి వచ్చానన్నారు.

ఐఏయ‌స్ అధికారి శ్రీల‌క్ష్మి. కొన్నేళ్లుగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మైన పేరు. అత్యున్న‌త ప్ర‌తిభ‌తో అన‌తి కాలంలో పాల‌నా ప‌రంగా మంచి పేరు తెచ్చుకున్నారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో చాలా కాలం జైలు శిక్ష అనుభ‌వించారు. ఆరోగ్య ప‌రంగానూ ఇబ్బందులు ప‌డ్డారు. అయితే, శ్రీల‌క్ష్మీ ఇప్పుడు ఏపీలో ప‌ని చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. జగన్‌ను ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి కలిశారు. తెలంగాణ కేడర్‌లో ఉన్న శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే జగన్‌తో మాట్లాడారని, ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించారని... కీలకమైన శాఖను అప్పగిస్తానని హామీ కూడా ఇచ్చారని తెలిసింది.

srilakshami 31052019

శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక ఐఏఎ్‌సగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్‌ సర్వెంట్‌ అయ్యారు. ఆమె కెరీర్‌ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. ఓబుళాపురం గనుల అవినీతి కేసులు మెడకు చుట్టుకోవడంతో వృత్తిపరంగా అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వంలో ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ విభాగాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

srilakshami 31052019

జ‌గ‌న్ కేసుల్లో అనేక మంది అధికారులు జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. శ్రీల‌క్ష్మి తో స‌హా ఆధిత్య నాధ్ దాస్‌, శామ్యూల్, మ‌న్మోహ‌న్ సింగ్‌, ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం, శ్యాంబాబు వంటి వారు ఉన్నారు. దీంతో..వీరిలో ఇప్ప‌టికే శామ్యూల్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి జ‌గ‌న్ ప్రభుత్వంలో స‌ల‌హాదారుడిగా ఉండ‌నున్నారు. ఇక‌, ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. ఇప్పుడు శ్రీల‌క్ష్మీ కూడా జగన్ తో కలిసి పని చెయ్యనున్నారు. జగన్ టీం కోసం అటు అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇందు కోసం ఐఏయ‌స్‌ల ఎంపిక ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..అజ‌య్ క‌ళ్లాం ప‌రిశీలిస్తుంటే..ఐపీఎస్‌ల వ్య‌వ‌హారం స‌వాంగ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read