తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్ష నేతగా ఈసారి చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్‌ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరదించుతూ... శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై చర్చించారు.

trs 29052019

జగన్ పట్ల ఉన్న సానుభూతితోనే ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నిత్యం ప్రజల మధ్యే ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు పార్టీ నేతల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయామని చింతించాల్సిన అవసరం లేదన్నారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ఉటంకిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. నేడు రెండోసారి కూడా అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుదామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ ప్రజల కోపం వల్ల మనం ఓటమి చెందలేదు. జగన్‌ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేశాం. కాలంతో పరిగెత్తాం, అనేక పనులు చేశాం. సమర్ధ నీటినిర్వహణతో నీటి కొరతను అధిగమించాం. రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా చాలా చేశాం. కానీ, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. అయినా 39.2శాతం ఓట్లు రాబట్టాం."

cbn 29052019

ఏదేమైనా కొంతకాలం వేచి చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏంచేస్తుందో చూద్దాం. అన్నింటినీ నిశితంగా గమనిద్దాం, ఆతర్వాతే స్పందిద్దాం. ఎన్నికైన టిడిపి శాసన సభ్యుల్లో ముగ్గురు(మద్దాలి గిరి, ఆదిరెడ్డి భవాని, రామరాజు) మినహా అందరూ గతంలో పనిచేసినవారే. పాత,కొత్త కలబోతతో తెలుగుదేశం వాణి బలంగా వినిపించాలి. ఆయా నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలి. సకాలంలో పరిష్కారం అయ్యేలా శ్రద్ధ వహించాలి. వివిధ రంగాలపై పట్టు సాధించాలి, అధ్యయనం చేయాలి,ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. ప్రధాన వక్తలుగా పేరు తెచ్చుకునే అవకాశం ఇదే. నాయకత్వ సామర్ధ్యం పెంచుకోవాలి. ప్రభుత్వం కన్నా ప్రతిపక్షం వాణికే ప్రజల్లో ప్రాధాన్యం. "

cbn 29052019

"ప్రజా సమస్యల పరిష్కారానికి శాసన సభ గొప్ప వేదిక. సభకు హాజరు కాకుండా గత ప్రతిపక్షం వ్యవహరించినట్లు చేయరాదు. ప్రతి ప్రాంతంలో ప్రజలతో నాయకులంతా మమేకం కావాలి. ఎక్కడా పార్టీపైన, ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత లేదు. గత 6రోజులుగా నన్ను కలిసివారందరిలో ఆవేదన,ఆందోళన ఉంది. ఇదెలా జరిగింది అనే ఆవేదన అందరిలో ఉంది. ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులపైనే ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉంది. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందాం. అన్నివర్గాల ప్రజల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేద్దాం.’’ అని చంద్రబాబు సూచించారు. టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ... ఉప నేతలు, విప్‌ పదవులు ఎవరికివ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించామన్నారు. తక్కువ మంది సభ్యులున్నా..తాము ప్రజల తరఫున పోరాడతామన్నారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని చినరాజప్ప తెలిపారు.

ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తే, టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఇక మూడో ప్రధాన పార్టీ జనసేన పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అయితే టీడీపీ ఇలా ఓటమిపాలవ్వడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మితిమీరిన విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని కొన్ని విమర్శలు, మరీ శ్రుతిమించే విధంగా కూడా ఉన్నాయి. అయినా చంద్రబాబు అన్నీ భరిస్తూ, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

game 27032019

అయితే, ఈ విషయం పై జనసేన పార్టీ నాయకుడు నాగబాబు స్పందించారు. పదవిని కోల్పోయిన చంద్రబాబు, ఇప్పుడు నిరాయుధుడని, ఆయన్ను వదిలేయాలే తప్ప విమర్శిస్తే అది శాడిజం అనిపించుకుంటుందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయనో ట్వీట్ పెట్టారు. "చంద్రబాబు మన మాజీ సీఎం. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఆయనను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం" అని ఆయన అన్నారు. అయితే మొన్నటి దాక, చంద్రబాబు పై, తెలుగుదేశం పై దారుణంగా ట్రోల్ చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో చేసిన హంగామా గుర్తు తెచ్చుకుంటూ, ఇలా ప్లేట్ మార్చేసారు ఏంటి అంటున్నారు ఆయన ఫాన్స్...

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా జగన్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. అయితే.. టీడీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ అంశంపై చర్చించిన చంద్రబాబు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పార్టీ తరపున ప్రతినిధులను పంపాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం జగన్‌ నివాసానికి ఇద్దరు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. జగన్‌కు ఈ బృందం శుభాకాంక్ష లేఖని ఇవ్వనుంది. చంద్రబాబును ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

jagan 29052019

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి జగన్ ఆహ్వానించడంపై టీడీపీ నేతలు పెదవి విరిచారు. చంద్రబాబు వెళ్లకపోవడమే మేలనే అభిప్రాయాన్ని టీడీఎల్పీ భేటీలో పాల్గొన్న మెజార్టీ నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2014లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా ఆహ్వానించినప్పటికీ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే.. జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హాజరవుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read