ప్రమాణస్వీకారం స్పీచ్ లో నే జగన్ తన కక్ష సాధింపు ధోరణి బయట పెట్టారు. సహజంగా ఇలాంటి వేదికల పై, ప్రత్యర్ధులకు వార్నింగ్ లు ఇచ్చే సంస్కృతీ ఉండదు. అదీ కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ప్రతిపక్ష నేత, జాతీయ మీడియా సమక్షంలోనే జగన్ వార్నింగ్ లు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు మా పై నెగటివ్ వార్తలు రాస్తే చూస్తూ కూర్చోను అంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. ‘మన కర్మ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్న మీడియా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవ్వరూ వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలినవాళ్లను ఎప్పుడెప్పుడు దింపాలి అంటూ వాళ్ల రాతలుంటాయి. వాళ్లందరికీ ఇదే చెబుతున్నా.. మా ప్రభుత్వం దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తాం. హైకోర్టు జడ్జ్ దగ్గరకు వెళ్లి వీళ్లను శిక్షించండి అని గట్టిగా అడుగుతాం’ అని వైఎస్ జగన్ తన ప్రతికూల మీడియాను హెచ్చరించారు.

jagan 30052019

ఏపీలో అవినీతిని రూపుమాపేందుకు రేపు లేదా ఎల్లుండి తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తానని సీఎం జగన్ తెలిపారు. ఓ హైకోర్టు జడ్జీని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కేటాయించాల్సిందిగా కోరతామని వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘ఏ కాంట్రాక్టు అయినా టెండర్లకు పోకముందే కమిషన్ ముందుకు పంపిస్తాం. జడ్జిగారు చేసే సూచనలు, మార్పులను తు.చ తప్పకుండా పాటిస్తాం. ఆ తర్వాతే కాంట్రాక్టులను పిలుస్తాం. అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని చెప్పారు. మానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలన్నింటినీ తూచాతప్పకుండా అన్నింటినీ అమలు చేస్తామని జగన్ మరోసారి ప్రజలకు హామీ ఇచ్చారు.

తెదేపా అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం విజయవాడ ఎంజీ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తనకు కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన ‘డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు’ని అక్కడ అప్పగించారు. తనకు సంబంధించిన సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు. ఆయన తన వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందితో కలసి వచ్చారు. దాదాపు 20 నిమిషాలపాటు అక్కడ ఉన్నారు. ఆయన వచ్చిన పని 8-10 నిమిషాల్లోనే పూర్తయింది. మిగతా సమయంలో ఆయనతో అక్కడికి పాస్‌పోర్టు పనుల నిమిత్తం వచ్చిన వారు, కొందరు సిబ్బంది ఫొటోలు దిగారు.

cbn 30052019

ఇది ఇలా ఉంటే, కృష్ణా, గుంటూరు, విశాఖజిల్లాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వారంతా చంద్రబాబును చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ల ఆవేదన వారి మాటల్లోనే.. ‘నీ వెంటే మేమన్నా.. నీ కోసమే వందల కిలోమీటర్ల నుంచి వచ్చామన్నా.. ఇంత కష్టపడినా ఓడిపోయామనేదే మా అందరి బాధన్నా.. మాలాంటి లేనివాళ్లు ఎందరికో ఇళ్లు ఇచ్చావన్నా.. నెలవారీ పింఛన్లు ఇచ్చావయ్యా.. నువ్వు చేయని ఏమీ లేదయ్యా..? అయినా ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాం..పేదలకు ఇన్ని చేసిన నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా..? ఎక్కడో.. ఏదో జరిగిందయ్యా.. ఇదంతా ఏదో మాయగా ఉందయ్యా.. ఇది మేమిచ్చిన తీర్పు కాదయ్యా.. మిషన్లు ఇచ్చిన తీర్పు అయ్యా.. ఎప్పుడూ పని పని అని పరితపించావయ్యా.. పనిచేసే వాడిని ఓడించడం ఎక్కడైనా ఉందా? ఏదో మాయ జరిగిందయ్యా..’ అంటూ వాపోయారు. వాళ్లనుచూసి చంద్రబాబు చలించిపోయారు. ‘మళ్లీ మంచి రోజులు వస్తాయి. అందరూ ధైర్యంగా ఉండండి. నిబ్బరంగా ఉండండి’ అని ధైర్యం చెప్పి వారందరినీ ఊరడించారు.

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి ముందు ఒక ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ వ‌ద్ద‌కు రానున్నారు. టీడీపీ శాస‌న‌స‌భా ప‌క్షం..పార్టీ అధినేత కొత్త‌గా ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌డుతున్న జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ రాసిన లేఖ‌ను అందించ‌నున్నారు. వారు మ‌ధ్నాహ్నం జ‌రిగే ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కానున్నారు. జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. తాను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నాన‌ని.. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని జ‌గ‌న్ నేరుగా చంద్ర‌బాబు కు ఫోన్ చేసారు. దీంతో..జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాలా వ‌ద్దా అనే అంశం మీద టీడీఎల్పీ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది.

cbn 290520119

చంద్ర‌బాబు తాను జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లానుకుంటున్నాన‌ని చెప్ప‌గా..మిగిలిన నేత‌లు గ‌తంలో ఎప్పుడూ ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌లు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తే వెళ్లిన సంద‌ర్బాలు లేవ‌ని చెబుతూ..వారించారు. దీంతో.. వైసీపీ అధినేత జగన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావును పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందే అభినందనలు తెలిపేందుకు.. జగన్‌ నివాసానికి టీడీపీ బృందం వెళ్లనుంది.

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల పరిధి రామిరెడ్డిపాలెంలో సభాపతి డాక్టర్‌ కోడెల పేరు మీద నిర్మించిన ముఖద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తెదేపా హయాంలో మాజీ సర్పంచి కుమ్మెత కోటిరెడ్డి ఈ ముఖద్వారాన్ని నిర్మించారు. కొందరు వ్యక్తులు పొక్లెయిన్‌తో దాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తీసుకున్న జిల్లా రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు రొంపిచర్ల ఎస్సైని వీఆర్‌కు పంపారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ హరికృష్ణను సస్పెండ్‌ చేశారు. విషయాన్ని అడిషనల్‌ ఎస్పీ వరదరాజులు విలేకరులకు వివరించారు. ఘటన స్థలాన్ని అడిషనల్‌ ఎస్పీ, నరసరావుపేట డీఎస్పీ పరిశీలించారు.

guntur 29052019 1

రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులకు తెచ్చిన పొక్లెయిన్‌తో ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. కొందరు బలవంతంగా పొక్లెయిన్‌ తీసుకెళ్లినట్లు డ్రైవర్‌ పోలీసులకు తెలపగా దాన్ని ఫిర్యాదుగా స్వీకరించారు. సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్సీకాలనీ, మరొక వీధిలోని శిలాఫలకం దిమ్మె, బోర్డులనూ గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. ‘కోడెల రహదారి’ అనే బోర్డులను, రహదారి పనుల వివరాలను తెలిపే దిమ్మెలను పగులగొట్టి పక్కనే గుంతలో పడేశారు. సోమవారం రాత్రి వీటిని పగులగొట్టగా మంగళవారం ఉదయం ఆపార్టీ నాయకులు గుర్తించి వెంటనే జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నాయకులు పోలీసులను కోరారు.

guntur 29052019 1

గ్రామంలో వైసీపీ నాయకులు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారంటూ ముందస్తుగా నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ అరవింద బాబు రొంపిచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గ్రామం లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవటంతో మరలా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో గ్రామంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ హరికృష్ణను సస్పెండ్‌ చేయటంతో పాటు ఈనెల 11న విధుల్లో చేరిన ఎస్‌ఐ పఠాన్‌ రబ్బానీ ఖాన్‌ను వీఆర్‌కు పంపడంతో మం డలంలో కలకలం రేపింది. రూరల్‌ ఎస్పీ రాజ శేఖర్‌ బాబు ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ వరదరాజులు, డీఎస్పీ రామవర్మ, రూరల్‌ సీఐ చినమల్లయ్య రామి రెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించారు. శిలాఫలకం, ఆర్చి, జెండా దిమ్మెలను పరిశీలించారు. ఈ సందర్బంగా అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read