ప్రధాని మోదీ మంత్రివర్గంలో అనూహ్యంగా విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి పద్మశ్రీ సుబ్రమణ్యం జయశంకర్‌కు చోటు దక్కింది! 2015-18 మధ్య విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ప్రధాని ఏరికోరి మంత్రిని చేశారని చెబుతున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దేనికీ ప్రాతినిధ్యం వహించనప్పటికీ... ఆయన రాయబార ప్రతిభను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది. డోక్లాంలో భారత్‌-చైనా సేనల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడలో కీలకంగా వ్యవహరించడం జయశంకర్‌కు మంచి పేరు తెచ్చింది. పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేయడం ఆయనకు బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకూ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్‌ మరోసారి పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయనందున... ఆ శాఖను జయశంకర్‌కు అప్పగిస్తారని భావిస్తున్నారు.

జనవరి 9, 1955న జన్మించిన సుబ్రమణ్యం జయశంకర్‌... రాజనీతిశాస్త్రంలో ఎంఏ చేశారు. అనంతరం దిల్లీలోని జేఎన్‌యూ నుంచి ‘అంతర్జాతీయ సంబంధాలు’పై ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1977 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన... ‘ఇండియన్‌ మిషన్‌ టు సోవియట్‌ యూనియన్‌’లో 1979-1981 మధ్య కార్యదర్శిగా పనిచేశారు. చెక్‌ రిపబ్లిక్‌ (2001-04), చైనా (2009-13), అమెరికా (2014-15)ల్లో భారత రాయబారిగా పనిచేశారు. 2007-09 మధ్య సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గానూ సేవలు అందించారు. 2007లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్‌-అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం విషయంలో కీలకపాత్ర పోషించారు కూడా! కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా... తనకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తారని జయశంకర్‌కు పేరుంది. రాయబారిగా నియమించే సమయంలో సీనియర్లను కాదని ఆయనకు బాధ్యతలను అప్పగించిన సందర్భాలు కూడా లేకపోలేదు. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా నిరుడు పదవీ విరమణ పొందిన తర్వాత టాటా గ్రూపు అంతర్జాతీయ కార్పొరేట్‌ వ్యవహారాల అధ్యక్షునిగా జయశంకర్‌ బాధ్యతలు చేపట్టారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించడం విశేషం.

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ తరఫున మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్,, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ లను పంపించాలని, అది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి కాకుండా, ఇంటికి వెళ్లి అభినందించి రావాలని సూచించారు. చంద్రబాబు సూచనలతో వీరు ముగ్గురూ జగన్ అపాయింట్ మెంట్ కోరగా, అది లభించలేదు. ఈ ఉదయం నుంచి జగన్ చాలా బిజీగా ఉన్నారని, సమయాభావం వల్ల ఎవరినీ కలవలేదని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు సైతం నేరుగా స్టేడియం వద్దకే వెళ్లారని జగన్ కార్యాలయ వర్గాలు వారికి స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరు కూడా స్టేడియం వద్దకు వెళ్లి జగన్ ను కలవవచ్చని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.

jagan 30052019 1

దీంతో చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ రాసిన లేఖను మీడియా ద్వారా టిడిపి విడుదల చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తామని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు తెగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ తన పాలనపై పట్టు పెంచుకునేందుకు సీఎంవో అధికారులపై బదిలీ వేటు వేశారు. చంద్రబాబు టీమ్‌ను టార్గెట్ చేస్తూ.. సీఎంవో కార్యాలయంలో చాలా కాలంగా పని చేస్తున్న ఉన్నతాధికారులందరిపై బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. ఇందులో ప్రధానంగా సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్ చంద్రతోపాటు ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శి గిరిజా శంకర్‌తోపాటు అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు వేశారు. వారిని సాధారణ పరిపాలనకు రిపోర్టు చేయాల్సిందిగా సీఎస్ ఆదేసించారు.

go 30052019 1

మరో పక్క, అదనపు కార్యదర్శిగా కే.ధనుంజయ రెడ్డిని నియామించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి నియామకం ధనుంజయరెడ్డిదే కావడం విశేషం. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో సేవలు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌లో ఎండీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖలోనూ పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ ధనుంజయరెడ్డి తన సేవలను జగన్‌ క్యాంపు కార్యాలయంలోనే అందిస్తున్నారు.

go 30052019 1

ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మెమో జరీ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు దిగజారుతున్నాయని, చెల్లింపులకు ఆర్థిక వనరులు లేనందున రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సదరు ఇంజినీరింగ్ పనులను నిలిపేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై, ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దుచేయాల్సిందేనని అన్ని శాఖలకు ఈ సందర్భంగా సూచనలు చేశారు. కనీసంలో కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో వాటి విలువలను తాజాగా నిర్ధరించి, తదుపరి చెల్లింపులు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారం ధృవీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని, పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సీఎస్ స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన రద్దయింది. దిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతిలేని కారణంగా వీరిద్దరి పర్యటన రద్దయినట్లు సమాచారం. షెడ్యూల్‌లో లేని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అనుమతులు రద్దు చేసింది. దీంతో ఇద్దరు సీఎంలు తమ హస్తిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం... విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం తర్వాత ఆయనతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరాల్సి ఉంది.

dgca 30052019 1

రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు రాత్రి 7గంటలకు జరిగే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోవడంతో వీరి హస్తిన పర్యటన రద్దయింది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల షడ్యుల్ ప్రోగ్రాం ఉంటే, ఇలా రద్దు చెయ్యటం ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకు ఇలా జరిగిందా అని, ఇరు పార్టీల నేతలు ఢిల్లీలో ఆరా తీసుకున్నారు. కేసీఆర్, జగన్ కలిసి ఢిల్లీ వెళ్తారని, మూడు రోజుల నుంచి వార్తలు వచ్చాయి. అంటే ఇది షడ్యుల్ ప్రోగ్రాం కిందే లెక్క వస్తుంది. మరి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులకు పర్మిషన్ లేదు అని చెప్పటం ఏంటో ఎవరికీ అంతు పట్టటం లేదు. మోడీ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా అనే చర్చ నడుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read