రాజధాని ప్రాంతంలో సైబర్‌వాడ కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ నిర్మాణ పనులు జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ఒక మహాయజ్ఞంలా రాత్రింబవళ్లూ పనులు జరుగుతున్నాయి. వేసవిని సైతం లెక్క చేయకుండా కార్మికులు అహోరాత్రులు కష్ట పడుతున్నారు. ఎట్టి పరిస్థితులలో ఏడాదికల్లా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా హెచ్‌సీఎల్‌ యాజమాన్యం ఒక పద్ధతి ప్రకారం పనులు చేయిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పడి హెచ్‌సీఎల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జీ ప్లస్‌ 1 నిర్మాణ స్థాయి వరకు రావటం విశేషం! ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన మూడు టవర్లలో రెండు టవర్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జీ ప్లస్‌ 5 విధానంలో నిర్మించాల్సి ఉండగా రెండు టవర్ల నిర్మాణ పనులు జీ ప్లస్‌ 1 స్థాయి వరకు రావటం విశేషం!

kirshnadist 09052019

మూడవ టవర్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభించారు. కీలకమైన బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు పూర్తి కావటం వల్ల మిగిలిన ఫ్లోర్ల నిర్మాణం త్వరగా చేపట్టడానికి అవకాశం ఉంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పార్క్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణ పనులు ఇంత శరవేగంగా జరగటానికి కాంట్రాక్టు సంస్థ తీసుకున్న చర్యలేనని చెప్పవచ్చు. కాంట్రాక్టు సంస్థ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వనరులను ముందస్తుగా సిద్ధంచేసు కోవటం వల్లే ఇంతవేగంగా పనులు ప్రారంభం కావటంతో పాటు పురోగతిలో ఉంది. నిర్మాణ పనులకు అవసరమైన నీటి కోసం సమీప గ్రామాల నుంచి సేకరించటానికి వీలుగా పైపులైన్‌ నిర్మాణం చేపట్టి నేరుగా నిర్మాణస్థలికే నీటిని తీసుకువస్తోంది. పెద్ద ఎత్తున మెటీరియల్‌ను సిద్ధంచేసింది. హాట్‌మిక్స్‌ ప్లాంట్‌ను సైట్‌లోనే ఏర్పాటు చేసింది. లేబర్‌ కోసం ఏకంగా కృత్రిమ కాలనీనే సృష్టించింది.

kirshnadist 09052019

బ్లాకులవారీగా పనులు చేపట్టే కార్మికుల కోసం అదే బ్లాకుల వారీగా వర్గీకరించి వారికి కృత్రిమ కాలనీలో బస ఏర్పాటుచేసింది. దీంతో అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో పనులు జరుగు తున్నాయి. బేస్‌మెంట్‌ పనులు వేయటానికే చాలా కాలం పడుతుంది. నెలల వ్యవధిలోనే జీ ప్లస్‌ 1 స్థాయికి భవన నిర్మాణ పనులు రావటం అసాధారణ విషయం. హెచ్‌సీఎల్‌ సంస్థ ముందస్తుగా డిజైన్‌లో నిర్దేశించుకున్న విధంగానే చెట్లను తొలగించింది. ఏపీఐఐసీ అధికారులు అప్పగించిన సైట్‌లో చెట్లన్నింటినీ చూసిన హెచ్‌సీఎల్‌ యాజమాన్యం క్యాంపస్‌ గ్రీన్‌గా కని పించటానికి ఇక్కడ ఉన్న చెట్లను సంరక్షించాలని నిర్ణయించింది. భవనాల స్థానంలో ఉన్న చెట్లను మాత్రమే తొలగించి మిగిలిన చోట్ల చెట్లను అలానే ఉంచేసింది. రేపు ఈ భవనాలు పూర్తయిన తర్వాత ఒక తోటలో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ ఉన్నట్టుగా ఉంటుంది. Source:Andhrajyothy

ఏపీలో రాజకీయాల గురించి ప్రస్తావన వస్తే తప్పక చర్చకొచ్చే జిల్లా కృష్ణా. తొలి నుంచి రాజకీయాలకు పెట్టని కోటగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ మళ్లీ హవా కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 10 స్థానాలను దక్కించుకుని సత్తా చాటింది. అప్పటికి టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పొత్తులో భాగంగా కైకలూరు స్థానం గెలుచుకుంది. వైసీపీ 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. వైసీపీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్ టీడీపీలో చేరడంతో ఈ జిల్లాలో వైసీపీ బలం మూడుకు పడిపోయింది. ఈ పరిణామాలతో డీలా పడ్డ వైసీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపింది.

kirshnadist 09052019

ఇక గుడివాడ నియోజకవర్గంలో అయితే వైసీపీ తరపున ఓటుకు 5వేలు పంచారనే ప్రచారం కూడా జరిగింది. గత ఎన్నికల్లో అంతంత మాత్రంగా గెలవడంతో ఈసారి టీడీపీతో సమంగానైనా గెలిచి పరువు నిలుపుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని వైసీపీ ఎత్తులు వేసింది. ఆర్థికంగా బలంగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌ను బరిలోకి దింపింది. ఇలా కృష్ణా జిల్లాలో వీలైనంత వరకూ ధన ప్రభావంతో గెలుపును సొంతం చేసుకోవాలని వైసీపీ చివరి నిమిషం వరకూ ప్రయత్నించింది. అయితే టీడీపీ మాత్రం జిల్లాలో మెజార్టీ స్థానాలు తమవేనని ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ మాజీ నేతలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, వంగవీటి రాధా చేరికలతో బలం పెరిగిందని టీడీపీ భావిస్తోంది. జిల్లాలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నియోజకవర్గం గుడివాడ. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిని ఓడించి తీరాలని టీడీపీ వ్యూహ రచన చేసింది.

 

kirshnadist 09052019

అందుకు దేవినేని నెహ్రు కుమారుడు, యువనాయకుడైన దేవినేని అవినాష్ అయితేనే కరెక్ట్ అని ఆ పార్టీ భావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటరావుకు నచ్చజెప్పి దేవినేని అవినాష్‌తో కలిసి పనిచేసేలా చేయడంలో టీడీపీ సఫలమైంది. అవినాష్ ఎంట్రీతో కొడాలి నానికి ఈసారి కష్టమేనని, గుడివాడలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడటం ఖాయమని టీడీపీ భావిస్తున్న స్థానాల్లో గన్నవరం, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, మైలవరం, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట, నందిగామ స్థానాలు ముందు వరుసలో ఉన్నాయి. తిరువూరు, నూజివీడు, గుడివాడ, పామర్రు, విజయవాడ వెస్ట్ స్థానాల్లో హోరాహోరీ పోరు తప్పదని టీడీపీ, వైసీపీ భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్ స్థానాల్లో వైసీపీ 5వేల లోపు మెజార్టీతోనే నెగ్గడంతో ఈ మూడు స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోనే పడతాయని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా మే 23న వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలు ఈసారి కృష్ణా జిల్లా రాజకీయాలకు ఎలాంటి మార్పులకు కారణం కానున్నాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో విచారణ, విపక్షపార్టీలన్నింటితో కలిసి ఈసీని కలిసే పనిలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బుధవారం హఠాత్తుగా రాహుల్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అరగంటపాటు జరిగిన ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్, ఇక ముందు రెండు విడుతల్లో జరుగనున్న పోలింగ్ సరిళిని పూర్తిగా విశ్లేషించిన చంద్రబాబు... ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఓ అంచనాకు వచ్చి, ఆ రిపోర్టును రాహుల్‌కు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.

cbn 09052019

అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం. ప్రధాని మోదీ, బీజేపీ అధినేత అమిత్‌షా రాజకీయాలకు చెక్ పెట్టే వ్యూహాలపై రాహుల్‌కు చంద్రబాబు సలహాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి మెజార్టీతో గెలుస్తామని బీజేపీ నేతలు బయటకు ధీమాగా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. 2014లో మోదీకి ఉన్నంత సానుకూలత ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఐదేళ్లలో పేద, మధ్య తరగతి వర్గాలను నేరుగా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం తీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.

cbn 09052019

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దాదాపు 125 స్థానాలు గెలుచుకుంటుందని, మరో 70 సీట్ల వరకు కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలుచుకుంటాయని ప్రస్తుత రాజకీయ వర్గాల అంచనా వేస్తున్నాయి. 190-200 స్థానాలను యూపీఏ గెలుచుకున్నట్లయితే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 75-80 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మొదలైన పార్టీలు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే యూపీఏలో చేరడం లేదా యూపీఏకు మద్దతుపై స్పష్టమైన ప్రకటన చేస్తే ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్రపతి ఈ కూటమికి ప్రాధాన్యం ఇవ్వక తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని, తదుపరి వ్యూహచరణకు పావులు కదిపారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలో విపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఈవీఎంల విశ్వసనీయతపై విపక్షాలు ఒకవైపు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. వాటికి సంబంధించి విస్తుగొలిపే సంచలనాత్మక కథనాన్ని ‘ఫ్రంట్‌లైన్‌’ మేగజైన్‌ ప్రచురించింది! 1989-90 నుంచి 2014-15 మధ్య దాదాపు 19 లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు బాంబే హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం గురించి ముఖచిత్ర కథనంలో సవివరంగా వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. ముంబైకి చెందిన మనోరంజన్‌రాయ్‌ అనే సమాచార హక్కు కార్యకర్త 2018, మార్చి 27న.. ఈవీఎంల గోల్‌మాల్‌పై బాంబే హైకోర్టులో ఒక ప్రజాహితవ్యాజ్యం దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఆయన సేకరించిన సమాచారం ప్రకారం ఈవీఎంల సేకరణ, నిల్వ, నియోగంలో స్పష్టమైన తేడాలున్నాయి. రూ.116.55 కోట్ల మేర ఆర్థిక అవకతవకలూ ఉన్నాయి.

evm 09052019

2017, జూన్‌ 21న భారత ఎన్నికల కమిషన్‌ తెలిపినదాని ప్రకారం 1989-90 నుంచి 2014-15 నడుమ బీఈఎల్‌ సంస్థ నుంచి ఈసీ అందుకున్న ఈవీఎంల సంఖ్య 10,05,662. అయితే, ఆ సమయంలో తాము ఈసీకి సరఫరా చేసినవి 19,69,932 ఈవీఎంలని బీఈఎల్‌ 2018, జనవరి 2న ఒక సమాధానంలో తెలిపింది. 1989-90 నుంచి 2016-17 నడుమ ఈసీఐఎల్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ అందుకున్నట్టు చెబుతున్న ఈవీఎంలు 10,14,644 కాగా.. ఆ సమయంలో తాము సరఫరా చేసిన ఈవీఎంలు 19,44,593 అని 2017, సెప్టెంబరు 16న ఈసీఐఎల్‌ సంస్థ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. అంటే, రెండు సంస్థలూ కలిపి తాము సరఫరా చేసిన ఈవీఎంల సంఖ్య 39,14,525 అని చెబుతుండగా.. ఈసీఐ మాత్రం తమకు అందినవి 20,20,306 ఈవీఎంలేనంటోంది. తేడా 18,94,219 ఈవీఎంలు. 2014-15లో బీఈఎల్‌ 62,183 ఈవీఎంలు సరఫరా చేసినట్టు పేర్కొనగా.. ఈసీ రికార్డుల్లో అసలు ఒక్కటీ అందుకోలేదని ఉంది. ఈ ఆర్డర్‌-సరఫరా జాబితాను రాయ్‌ కోర్టుకు సమర్పించారు. ఈవీఎంల సరఫరాలోనే కాదు.. డబ్బుల చెల్లింపుల్లోనూ అవకతవకలు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.

evm 09052019

2006-07 నుంచి 2016-17 నడుమ ఈవీఎంల కోసం రూ.536,01,75,485 చెల్లించినట్టు ఈసీ రికార్డుల్లో ఉండగా.. ఈసీ నుంచి రూ.652,56,44,000 అందుకున్నట్టు బీఈఎల్‌ పేర్కొంది. ఆ సంస్థ అధికంగా అందుకున్న సొమ్ము దాదాపు రూ.116.55 కోట్లు. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు జవాబుల ద్వారా బయటపడిన ఈ అవకతవకలపై మనోరంజన్‌రాయ్‌ గత ఏడాది మార్చిలో బాంబే హైకోర్టులో పిల్‌ వేశారు. మనోరంజన్‌ రాయ్‌ దాఖలు చేసిన పిల్‌ 2018 సెప్టెంబరు 19న తొలిసారి విచారణకు వచ్చింది. అటుపై, నాలుగు విచారణల అనంతరం.. 2019 మార్చి 8న ఈసీఐ సమాధానమిచ్చింది. అయితే, పిల్‌లో పేర్కొన్న స్పష్టమైన తేడాలకు సంబంధించి నిర్ణీత వివరాలు ఇవ్వకుండా.. ‘ప్రతి ఈవీఎం, వీవీప్యాట్‌కు యునిక్‌ సీరియల్‌ నంబర్‌ ఉంటుంది’’ అంటూ సాధారణ సమాధానాలే ఇచ్చింది. తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలివ్వాలని ఏప్రిల్‌ 5న కోర్టు ఈసీఐని ఆదేశించింది. ఏప్రిల్‌ 23న తదుపరి విచారణ జరగ్గా ఈసీఐ స్పం దించలేదు. కోర్టు తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది. దీంతో.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మనోరంజన్‌రాయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisements

Latest Articles

Most Read