ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఘోరంగా ఉల్లంఘిస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి దుయ్యబట్టారు. సింఘ్వి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ లోకసభ ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోవటం లేదు, కేంద్ర మంత్రులు సిగ్గు వదిలి బి.జె.పి ఎన్నికల ప్రణాలిక రచయితలుగా మారినా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆయా మంత్రిత్వ శాఖలు తమ శాఖల పథకాల అమలుసమీక్షా పత్రాలను బి.జె.పి అందజేశాయి, వీటి ఆదారంగా బి.జె.పి ఎన్నికల ప్రణాలిక తయారైంది, ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దమని సింఘ్వి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీకి ప్రభుత్వాధికారులు తోడ్పడటం, పని చేయటం నిషిద్దం, అదే విధంగా పార్టీ ఎన్నికల ప్రణాలిక రూపకల్పనకు మంత్రులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం కూడా నిషిద్దమని ఆయన తెలిపారు.

modiec 11052019

కేంద్ర వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఆస్తా గ్రోవర్ తదితర సీనియర్ అధికారులు తమ శాఖల పరిధిలోని పథకాలకు సంబందించిన అంశాలను బి.జె.పికి అందజేశారని ఆయన తెలిపారు. బి.జె.పి ఎన్నికల ప్రణాలిక, విజన్ డాక్యుమెంట్ కోసం ఆమె తమ శాఖకు సంబంధించిన స్టార్ట్ అప్ ఇండియా పథకం వివరాలు పంపించారని సింఘ్వి తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన అధికారుల బృందం లోకసభ ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే అలాంటిదేదీ లేదంటూ అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తన పరువు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపాడుకునేందుకు ఇప్పటికైనా తాము ప్రస్తావించిన అంశాలపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బి.జె.పి ప్రభుత్వ యంత్రాంగాన్ని లోకసభ ఎన్నికల కోసం దుర్వినియోగం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సింఘ్వి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

modiec 11052019

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ శాఖలు బి.జె.పి కోసం పని చేయటం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షాలు ఈ.వి.ఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు ఈ.వి.ఎంల విశ్వసనీయతను ప్రశ్నించటం లేదు, ఈ.వి.ఎంల విశ్వసనీయతను మరింత పెంచేందుకు 25 శాతం లేదా 33 శాతం వి.వి.ప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్నదే తమ ప్రస్తుత డిమాండ్ అని ఆయన వివరించారు. ప్రతిపక్షం ఇప్పుడు కూడా ఈ.వి.ఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తోందనటం పూర్తిగా తప్పు, ప్రజలకు మరింత విశ్వాసం కల్పించేందుకు వి.వి.ప్యాట్ స్లిప్‌లను సరిపోల్చాలని డిమాండ్ చేస్తున్నామని సింఘ్వి చెప్పారు. కాంగ్రెస్ 1984 సిక్కుల ఊచకోత, 202 గుజరాతి అల్లర్లను ఎంత మాత్రం సమర్థించటం లేదని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం అమరావతిలో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజుతో పాటు విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు అతిది గజపతి, పతివాడ నారాయణస్వామినాయుడు, డాక్టర్‌ కేఏ నాయుడు, కిమిడి నాగార్జున, కోండ్రు మురళీమోహన్‌, కిమిడి కళా వెంకటరావు హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందుతామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. బూత్‌ల వారీగా మెజార్టీ, గెలుపునకు ఉన్న అవకాశాలు, వైసీపీ మైండ్‌గేమ్‌ను అభ్యర్థులు ప్రస్తావించారు. ఐదు వేల పైబడి మెజార్టీతో విజయం సాధిస్తామని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

vijayanagaeram 11052019

నియోజకవర్గాల వారీగా మూడు దశల్లో సమీక్షలు నిర్వహించారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆధ్వర్యంలో నేతలతో సమీక్షించారు. తరువాత దశలో మహిళా నేత పంచుమర్తి అనురాధ అభ్యర్థులు, నేతలతో మాట్లాడి వివరాలు సేకరించారు. చివరిగా ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టారు. దాదాపు ఇలా సమీక్షలన్నీ అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. పార్టీ అభ్యర్థుల గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది ఎవరు? పార్టీలోనే ఉంటూ దొంగదెబ్బ తీసింది ఎవరు? అన్నదానిపై చంద్రబాబు ఆరాతీశారు. దీనిపై సమగ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈవీఎంల మొరాయింపుతో ఎదురైన ఇబ్బందులను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి కిమిడి నాగార్జున మాట్లాడుతూ తాను గెలుపొందుతానని సీఎం చంద్రబాబుతో చెప్పారు. తన వద్ద ఉన్న సర్వేలో కూడా నాగార్జున గెలుపొందుతారని తేలిందని చంద్రబాబు బదులిచ్చినట్టు సమాచారం.

vijayanagaeram 11052019

గజపతినగరం నియోజకవర్గంలో ఏరియా కో ఆర్డినేటర్లు ఇచ్చిన ఓటింగ్‌ సరళిపై చర్చ సాగింది. 8 వేల ఓట్లు పైబడి మెజార్టీతో గెలుపొందుతానని ఎమ్మెల్యే కేఏ నాయుడు నమ్మకంగా చెప్పారు. దీని పై ముఖ్యమంత్రి స్పందిస్తూ 2014 ఎన్నికల్లో 18,500 ఓట్లు మెజార్టీతో గెలుపొంది... ఇప్పుడు తగ్గడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల దృష్ట్యా పెరగాలి కదా అని వ్యా ఖ్యానించినట్టు తెలుస్తోంది. దీంతో అభ్యర్ధి కంగుతిన్నారు. నెల్లిమర్ల నియోజవర్గంపై సమీక్ష జరుగగా...తప్పకుండా గెలుపొందుతానని ఎమ్మెల్యే పతివాడ నారాయ ణస్వామినాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్య మంత్రి ఈసందర్భంగా వెల్లడించారు. 110 నుంచి 120 సీట్లు మనకు రాబోతున్నాయన్నారు.. బొబ్బిలి నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల కోడ్‌ నీడలో రాజ్యమేలుతున్న అధికారుల్లో కొందరు రాబోయేది వైకాపా ప్రభుత్వమేనని భావించి, కొన్ని కీలక ఫైళ్ళను ఇప్పటికే ఆ పార్టీ నేతలకు చేరవేశారన్న ఆరోపణలు ఒకవైపు దుమారం రేపుతుండగా, మరోవైపు సొంత పార్టీ నేతలు కోవర్టులుగా మారి పార్టీకి ద్రోహం తలపెట్టారన్న వార్తలు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కలవరుపాటుకు గురిచేస్తున్నాయి. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షల్లో… కోవర్టుల ఏరివేతకు సిద్ధమైనట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారాల డేటా చోరీని కూడా ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న తరుణంలో అనేక కీలక పరిణామాలు రోజురోజుకు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ పేరుతో సాధారణ పరిపాలన కార్యక్రమాలకు దాదాపుగా బ్రేకులు పడ్డాయి. మరోవైపు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలు వాటి అంచనాలపైనే ఉంది.

cbn 11052019

ఇదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ప్రతిపక్షానికి అందిస్తున్నారంటూ మరోకొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కొందరు అధికారులు అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని విపక్షాలకు అందిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ ఇంకా అమలులో ఉండడంతో ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు సైతం సచివాలయానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పూర్తిగా అధికారుల పాలనే రాష్ట్రంలో సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు ఎన్నికల ఫలితాలు రాకమునుపే సర్వే నివేదికల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాకు తమ వంతు సహకారం అందిస్తున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వైకాపా అధినేత జగన్‌కు దగ్గరయ్యేందుకు ఇలాంటి నీతిమాలిన పనులను కొందరు అధికారులు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని విపక్షాలకు అందజేస్తున్నారన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

cbn 11052019

ఏయే శాఖలకు సంబంధించిన సమాచారాన్ని విపక్షాలకు చేరవేశారన్న విషయాన్ని తెలుసుకునే పనిలో ఆయన ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు అందజేయాలని నిఘా వర్గాలను ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా సమాచారం. గడిచిన ఐదేళ్ళుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఏ విధంగా ప్రత్యర్థులకు చేరవేశారో అన్న అంశానికి సంబంధించిన సమగ్ర నివేదికను తెప్పించుకుంటున్నారు. ఒకవేళ సమాచారాన్ని విపక్షాలకు అందించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ముఖ్య నేతలతో ఇప్పటికే చంద్రబాబు చర్చించినట్లుగా చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న పరిణామాలపై వారితో సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పార్టీలోనే ఉంటూ కోవర్టులుగా మారిన నేతలపై కూడా అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు కోవర్టులుగా వ్యవహరించారో వారందరి వివరాలను ఇప్పటికే తెప్పించుకున్నారు.

వైసీపీ అధినేత జగన్ ఎక్కడున్నారు? పార్టీ నేతలకు జగన్ ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు? వైసీపీ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ శ్రేణులు అధికారం తమదేనని చెప్పుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు జగన్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. తమదే అధికారమని.. ప్రమాణ స్వీకార తేదీని ఆ దేవుడే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు. ఆ తరువాత జగన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అప్పటి నుంచి రిలాక్సింగ్ మూడ్‌లోనే ఉన్నారు. ఓ రోజు బొత్స కుటుంబ సభ్యుల వివాహానికి జగన్ విశాఖ వెళ్లారు. ఆ తరువాత హైదరాబాద్‌లో అవెంజర్స్ సినిమా చూశారు. అయితే పార్టీ అగ్ర నేతలకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. ప్రస్తుతం వేసవి విడిది కోసం జగన్ ఇతర ప్రాంతాలకు వెళ్లారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

jagan 11052019

ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు. పార్టీ కార్యక్రమాలను విజయసాయిరెడ్డి, ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఇప్పటివరకు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఓ వైపు లోక్ సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహిస్తున్నా... జగన్ మాత్రం ఇలాంటి సమావేశాలు నిర్వహించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. కొద్దిరోజులు ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వైసీపీ అధినేత... ఆ తరువాత హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పార్టీ ముఖ్యనేతలు, సన్నిహితులు మినహాయిస్తే... పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు పెద్దగా ఆయనను కలవడం లేదు.

jagan 11052019

అయితే ఉన్నట్టుండి ఫలితాలు వెలువడటానికి రెండు రోజులు ముందు అంటే మే 21న పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే 21న సమావేశానికి హాజరుకావాలంటే ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సమాచారం అందింది. దీంతో ఆ రోజు జరగబోయే సమావేశం జగన్ ఏయే అంశాలపై మాట్లాడతారనే అంశంపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మే 19న తుది విడత ఎన్నికలు పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రానున్నాయి. లోక్ సభ స్థానాలతో పాటు ఏపీలో ఎవరు గెలుస్తారనే అంశంపై పలు మీడియా ఛానల్స్, సర్వే సంస్థలు 19న తమ అంచనాలను వెల్లడించనున్నాయి.

Advertisements

Latest Articles

Most Read