గుంటూరు జిల్లా ఓటర్లు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టారు. జిల్లాలో ఉన్న 17 శాసనసభ స్థానాల్లో టీడీపీ 12 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. అంతేకాదు, జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలకు మూడింటినీ కూడా కైవసం చేసుకుని సత్తా చాటింది. జిల్లాలో వైసీపీకి ఒక్క పార్లమెంట్ స్థానం దక్కకపోగా, కేవలం 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఐదింటిలో కూడా ఒక్క నరసరావుపేట శాసనసభ స్థానంలో మాత్రమే 15వేల మెజార్టీ సాధించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఒకటైన మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్యాలెట్ ఓట్ల సాయంతో గట్టెక్కిన పరిస్థితి 2014లో నెలకొంది. అయితే.. ఈసారి జిల్లా వైసీపీ శ్రేణులు 2009 సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

guntur 09052019

2004లో వైఎస్ పాదయాత్ర చేసిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో అప్పటికి ఉన్న 19 స్థానాల్లో కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థి పోటీ చేసిన స్థానంతో కలిపి మొత్తం 17 స్థానాలు దక్కాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. 2009 నాటికి టీడీపీ పుంజుకుంది. అప్పటికి జిల్లాలో ఉన్న 17 స్థానాల్లో 6 స్థానాల్లో గెలుపొందింది. 2014 నాటికి సీన్ పూర్తిగా మారింది. టీడీపీ 12 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. దీంతో ఈ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతుంటే, త్రిముఖ పోటీలో తమకే మెజార్టీ సీట్లు వస్తాయని వైసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే.. జిల్లాలో టీడీపీ గెలుపు కొన్ని స్థానాల్లో దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వినుకొండ, చిలకలూరిపేట, తెనాలి, పొన్నూరు, గురజాల, రేపల్లె, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి స్థానాలు తమవేనని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే.. వినుకొండ, చిలకలూరిపేట, గురజాల, పొన్నూరు, పెదకూరపాడు, తాడికొండ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నారా లోకేష్ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. జిల్లాలో గెలుపుపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్న ఏకైక నియోజకవర్గం నరసరావుపేట.

guntur 09052019

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 15వేలకు పైగా మెజార్టీ సాధించడం, వైసీపీకి కొమ్ముకాసే ప్రధాన సామాజిక వర్గం వైసీపీ అభ్యర్థికి అండగా ఉండటంతో ఈసారి కూడా మెజార్టీ తగ్గినప్పటికీ గెలుపు ఖాయమనే అంచనాకు వైసీపీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బీసీ అభ్యర్థిని బరిలోకి దింపిన అధిష్టానం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారని.. ఈసారి టీడీపీకే అవకాశం ఇస్తారని ఆ పార్టీ స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రత్తిపాడు, వేమూరు, బాపట్ల, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, మాచర్ల స్థానాల్లో ఉత్కంఠ పోరు తప్పదని ఇరు పార్టీలూ భావిస్తున్నాయి. మొత్తం మీద గుంటూరు జిల్లా ఫలితాలు ఈసారి కూడా టీడీపీకే అనుకూలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్‌ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. వివిధ కారణాలతో అలా జరగనందున శ్రవణ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను సమర్పించడానికి ముందుఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌తో చర్చించారు. అనంతరం సచివాలయానికి వెళ్లిన శ్రవణ్‌‌.. సీఎం కార్యాలయ అధికారులకు రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత సదరు రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది.

kidari 09052019 1

రాజ్యాంగ నియమాల ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేతలు.. ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. అలా జరగని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గతేడాది నవంబర్‌ 11న సీఎం చంద్రబాబు కేబినెట్‌ను విస్తరించారు. అప్పటికే శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు కిడారి శ్రవణ్‌కు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఈనెల 10వ తేదీతో ఆరునెలల గడువు ముగియడం.. ఇప్పటి వరకూ ఏ సభలోనూ శ్రవణ్‌ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు స్థానం నుంచి ఆయన పోటీ చేశారు.

ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన నివాసంతో పాటు కార్యాలయంలోనూ కూడా తనిఖీలు చేస్తున్నారు. తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశాడని అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిధుల్ని కూడా ఆయన దారి మళ్లించారని అలంద మీడియా సంస్థ ఆరోపిస్తోంది.అలంద మీడియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుతగులుతున్నారని కౌశిక్‌రావు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ 9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే టీవీ 9 కార్యాలయంలోని కొన్ని కంప్యూటర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం.

tv9 09052019 1

ఇది ఇలా ఉంటే, టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించినట్లు తెలిసింది. టీవీ9 సంస్థ నిర్వహణలో వైఫల్యం, సంస్థ కీలక ఉద్యోగి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ ఆరోపణలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీవీ9లో 8శాతానికి పైగా వాటా ఉన్న రవిప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాశ్ కాలరాస్తున్నారని కూడా కొత్త యాజమాన్యం ప్రధానంగా ఆరోపిస్తోంది. కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే.. రవిప్రకాష్‌పై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడం మీడియా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

tv9 09052019 1

రవి ప్రకాష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా తెలంగాణ పోలీసుల గాలిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాష్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. అందువల్లే టీవీ9 కార్యాలయంలోనూ, తన నివాసంలోనూ సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేసిన సందర్భంలో రవిప్రకాష్ అందుబాటులో లేనట్లు తెలిసింది. కొత్త యాజమాన్యం కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అంతర్గత విచారణ జరిపినట్టు తెలిసింది. భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాష్‌ కోట్లు దారి మళ్ళించినట్లుగా నిర్ధారణకు వచ్చిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రోజు రోజుకీ మోడీ ప్రచారం ఎలా దిగాజారుతుందో చూస్తున్నాం. ఆ కోవలోనే, రాహుల్‌ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందంటూ కొత్త హడావిడి మొదలు పెట్టారు. అయితే ఇన్నాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, ఈ విషయంలో ఏమి చెయ్యలేని మోడీ, ఇప్పుడు మాత్రం హడావిడి మొదలు పెట్టారు. దీంతో ఇది కోర్ట్ కు చేరింది. రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ విచారణకు అర్హం కాదని తోసిపుచ్చింది.

supreme 09052019

యూకేకు చెందిన ఓ కంపెనీ తమ వార్షిక డేటాలో రాహుల్‌ గాంధీని బ్రిటీష్‌ పౌరుడిగా పేర్కొందని, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హిందూ మహాసభ కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఏదో ఒక కంపెనీ ఏదో ఒక పత్రాల్లో ఆయన(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) బ్రిటిష్‌ వ్యక్తి అని పేర్కొంటే ఆయన బ్రిటిష్‌ పౌరుడు అయిపోతారా..? ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదు. దీన్ని మేం కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం వెల్లడించింది.

supreme 09052019

రాహుల్‌ పౌరసత్వంపై గతంలోనూ దుమారం రేగిన విషయం తెలిసిందే. రాహుల్‌ పౌరసత్వ స్థితిని ప్రశ్నిస్తూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాహుల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అంతకుముందు ఇదే విషయమై 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాహుల్‌ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Advertisements

Latest Articles

Most Read