కేసీఆర్ వ్యవహార శైలి తెలిసినవాళ్ళు, అతను ఎలా మాట మారుస్తాడో, ఒకసారి దెయ్యం అని, ఒకసారి దేవత అని ఎలా పోగుడుతారో బాగా తెలుసు. ముఖ్యంగా సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ లేడీనే తన వైఖరితో తిప్పలు పెట్టారు కేసీఆర్. తెలంగాణా ఇచ్చిన వెంటనే, మా పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేస్తాం అని చెప్పి, తరువాత సోనియాని ఒక ఆట ఆడారు కేసీఆర్... ఇప్పుడు కూడా బీజేపీతో అదే ఆట మొదలు పెట్టారు. ఎన్నికల్లో మోడీ సపోర్ట్ తీసుకుని, గట్టెక్కిన కేసీఆర్, మోడీ శత్రువు అయిన చంద్రబాబు పై కూడా కుట్రలు చేసారు. అయితే, పైన ఉన్నది, సోనియా కాదు, మోడీ.. గుజరాతీ తెలివితేటలు మాములుగా ఉండవు.. అందుకే ఇప్పటి నుంచె కేసీఆర్ ను కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు. ఫలితాలు తేడా కొడితే, కేసీఆర్ ఎలా ఆట ఆడతారో తెలుసు, అందుకే ఇప్పటి నుంచే కేసీఆర్ ను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు, మోడీ, షా..
ఇందులో భాగంగా, తెలంగాణలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఆదాయ పన్ను శాఖ కన్నేసింది. ఎన్నికల కమిషన్కు, ఆదాయ పన్ను శాఖకు వారే స్వయంగా సమర్పించిన పత్రాల్లోని భారీ వ్యత్యాసాలపై దృష్టి సారించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు, అప్పుల్లోని భారీ వ్యత్యాసాల నిగ్గు తేల్చేందుకు నోటీసులు జారీ చేసింది. 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లతోపాటు ఐటీ రిటర్నులను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆయా పత్రాల్లో ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించి భారీ తేడాలు ఉంటే.. అందుకు కారణాలను ఆధారాలతో సహా వివరించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేనా, 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీఆర్ఎస్ తరఫున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్, అంతకు ముందు సంవత్సరాల్లో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
నిజానికి, గత ఏడాది డిసెంబరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కానీ, ఆయా రాష్ట్రాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులూ వచ్చిన సమాచారం లేదు. దాంతో, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు, అప్పుల లెక్కలను మరోసారి సరి చూసుకునే పనిలో పడ్డారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలోని సమాచారం, ఐటీ రిటర్న్స్ వివరాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటున్నారు. ఈ నోటీసులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కేవలం ముఖ్యమంత్రికే కాదు.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఈ నోటీసులు జారీ చేసింది.