బ‌ంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్ప‌డింది. దీని ప్ర‌భావం కార‌ణంగా స‌ముంద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంటుంది. స‌ముంద్రంలో అల‌లు ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డుతుంటాయి. రాష్ట్రంలో జాల‌ర్లు ఎవ్వ‌రూ కూడా ఈ నెల 27వ తేదీ నుంచి స‌ముంద్రంలో చేప‌ల వేట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్‌కు చెందిన అవేర్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెథ‌ర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంట‌ర్‌) సూచిస్తోంది. ఇప్ప‌టికే జాల‌ర్లు ఎవ‌రైనా స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లి ఉంటే వారంతా వెంట‌నే 28వ తేదీలోపు తీరానికి తిరిగి వ‌చ్చేయాల‌ని సూచించ‌డమైన‌ది. ప్ర‌జ‌లు కూడా ఎవ‌రూ తీర ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. స‌ముద్ర స్నానాలు చేయ‌డం, తీర ప్రాంతానికి వెళ్లి స‌ముద్ర‌పు అల‌ల‌తో ఆడుకోవ‌డం లాంటివి చేయ‌రాదని తెలియ‌జేయ‌డ‌మైంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం ప‌య‌నిస్తున్న దిశ‌ను రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ నిశితంగా గ‌మ‌నిస్తోంది.

rtgs 26042019

హిందూ మహాసముద్రం-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ఉదయం వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ట్రింకోమలి(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయదిశగా 1,140 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకు ఆగ్నేయంగా 1,490 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయదిశగా 1,760 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కదులుతోంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా మారే అవకాశముంది.

rtgs 26042019

తుపాను ఈనెల 30న శ్రీలంక తీరాన్ని తాకి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో 29న తమిళనాడు తీరం, పుదుచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈనెల 29, 30 తేదీల్లో కేరళ, దక్షిణాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయి. ఈ తుపానుకు బంగ్లాదేశ్‌ నామకరణం చేసిన ‘ఫణి’ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

రైతు రుణ ఉపశమన పథకానికి ఎదురు దెబ్బ తగిలింది. రుణమాఫీ నాలుగో విడత కింద రూ.3,900 కోట్ల నిధులు అవసరం కాగా ఆర్థికశాఖ రూ.500 కోట్లే విడుదల చేసింది. మిగిలిన రూ.3,400 కోట్లను ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో బ్యాంకుల్లో నమోదు చేయించుకున్న 17 లక్షల మంది రైతులకు సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ నాలుగు, ఐదో విడతల నిధులు కలిపి రూ.7,800 కోట్లను ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో ఉత్తర్వులిచ్చింది. ఆర్థికశాఖ ఈ నెల 8న రూ.500 కోట్లు విడుదల చేయడంతో రైతు సాధికార సంస్థ నాలుగో విడతకు సంబంధించి సొమ్ము బదలాయింపు చర్యలు చేపట్టింది. రైతులు తమ వద్దనున్న ఉపశమన పత్రాలను బ్యాంకులో ఇచ్చి ఎన్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేయించుకుంటే 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము వేస్తామని స్పష్టం చేసింది.

cs 26042019

ఇది పూర్తయిన వెంటనే ఈ నెలాఖరులోగా ఐదోవిడత జమ చేస్తామంది. ఇంకా రూ.7,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగో విడత రుణమాఫీలో మొత్తం 36 లక్షల మంది రైతులకు సొమ్ము అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతోనే అధిక సంఖ్యలో రైతులు అదే రోజు బ్యాంకుల వద్దకు వచ్చారు. రుణ ఉపశమన పత్రాలిచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేయించుకున్న వారిలో 7 లక్షల మంది ఖాతాల్లోకి రూ.500 కోట్ల సొమ్మును రైతు సాధికార సంస్థ బదిలీ చేసింది. నాలుగో విడతలో ఇవ్వాల్సిన మిగిలిన రూ.3,400 కోట్ల విడుదల కోసం ఆర్థికశాఖ వైపు చూస్తోంది. ఎన్నికలకు ముందే రుణ ఉపశమన పత్రాలతో రైతులు బ్యాంకు శాఖలకు వెళ్లారు. ఎన్నికల విధులు, పనిఒత్తిడిలో ఉన్నామంటూ వాటిని తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి నమోదు ప్రారంభించారు.

cs 26042019

వివిధ బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం సుమారు 17 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో పత్రాలిచ్చి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయించారు. వీరికి రూ.2,200 కోట్లు పైగా విడుదల చేయాల్సి ఉంది. బ్యాంకులకు వెళ్లి ఉపశమన పత్రాలు అప్‌లోడ్‌ చేయించుకోవాల్సిన వారు ఇంకా 12 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి రూ.1,200 కోట్లు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వ పాలన అంతా చీఫ్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగటం, చంద్రబాబుని నిబంధనల పేరుతొ పక్కన పెట్టటంతో, రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. 5 ఏళ్ళలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పధకాలకు చంద్రబాబు ఏ లోటు రానివ్వలేదు, కాని ఒక్క నెల నిబంధనల పేరుతొ ఆయన్ను పక్కన పెట్టి, రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆయన్ను జగన్ తో సమానం చెయ్యాలి, అవినీతి మారక అంటించాలి అనే అతి పెద్ద కుట్ర ఢిల్లీ లెవెల్ లో జరగటం, దానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాత్రదారులు మనం రోజు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం పోటీ పడటం, చంద్రబాబు అవినీతి పరుడుగ ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యటం, చివరకు విపి అవ్వటం, ఇదే తంతు... ఇన్ని ఆరోపణలు, ఇంత హంగామా చేసి చివరకు ఒక్క రూపాయి అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ చెయ్యలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లడటం, ప్రజల్లో ఏవో అపోహలు కలిగించటం, చెప్పిందే చెప్తే ప్రజలు నిజం అని నమ్ముతారేమో అని ఆశ...

ramarao 26042019

ఈ కోవలోకి చెందిన ఒక న్యాయవాది కొన్ని రోజుల క్రిందట, రేవంత్ పై, చంద్రబాబు పై, లోకేష్ పై కేసులు పెట్టి, రేవంత్ పై ఐటి దాడులు చేపించాడు. చంద్రబాబు, లోకేష్ పై కోర్ట్ లో కేసులు వేసి హడావిడి చేసాడు. ఈయన వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆయన పేరే ఇమ్మనేని రామారావు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోవటంతో, ఈయనను పట్టించుకునే నాధుడు లేడు. అయ్యగారి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తన పై లైగింక వేధింపులకు పాల్పడుతున్నాడని అడ్వకేట్ రామరావు పై ఫిర్యాదు చేసిన జూనియర్ మహిళ అడ్వకేట్ షాదన్. ఫిర్యాదు మేరకు రామారావును అరెస్టు చేయడానికి వేళ్ళిన చిలకలగూడ పోలీసులు.

ramarao 26042019

పోలీసులను చూసి బాత్ రూంలో హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించిన అడ్వకేట్ రామారావు. చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలింపు. పద్మారావు నగర్ కు చెందిన అడ్వకేట్ రామరావు తన పై లైగింక వేధింపులకు పాల్పడుతున్నాడని జూనియర్ అడ్వకేట్ షాదన్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రామారావును అరెస్టు చేయడానికి చిలకలగూడ పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన రామారావు.. బాత్ రూంలోకి హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి క్రిమినల్స్ అందరూ చంద్రబాబు పై విషం చిమ్మటంలో పావులు అవ్వటం, వీరికి మన మీడియా అతి ప్రాముఖ్యట ఇవ్వటం, మన ఖర్మ...

నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. నేను ఏదైనా తప్పు చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నా ఇంట్లోనూ దాడులు చేస్తుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లు తప్పులు చేస్తున్నారేమో.. అందుకే భయపడి ఇలా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాఫెల్ పై ఎందుకు విచారణ చేయ్యనివ్వటం లేదో, మోడీకే తెలియాలి.

modi 26042019

అలాగే ఈవీఎంల పై కూడా మాట్లాడారు. జరుగుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించకుండ, అర్ధరాత్రి దాక ప్రజలు ఓటింగ్ లో పాల్గున్న విషయం చెప్పకుండా, రాజకీయం చేసారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యంపై ప్రతిపక్షాలు చేస్తున్నది యాగీ అంటూ మోదీ తప్పుపట్టారు. మోదీని తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్న విపక్షాలు నిన్నటి నుంచి ఈవీఎంలను తప్పుపడుతున్నాయని ఎన్నికల ర్యాలీలో ప్రధాని అన్నారు. దీనిని బట్టి చూస్తే వారు తమ ఓటమిని ఈవీఎంలపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఇది.. పరీక్షలు బాగా రాయని విద్యార్థి ఇంటికి తిరిగివచ్చి తనకు మంచి పెన్ను లేదని, పేపర్ నాణ్యత అస్సలు బాగోలేదని వంకలు పెట్టినట్టు ఉందన్నారు. 'మూడు విడతల పోలింగ్ పూర్తవడంతో విపక్షాలు ఓటమిని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది' అని అన్నారు.

modi 26042019

దేశంలో ఉగ్రవాదం బెడదను కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయిందని ప్రధాని విమర్శించారు. శ్రీలంకంలో ఈస్టర్ పండుగనాడు ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా దాడులు చేయడం అందరికీ తెలుసునని, 2014 ముందు ఇండియాలోనూ అలాంటి పరిస్థితే ఉండేదని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ భయపడిపోయేదని అన్నారు. 'దేశానికి సేవ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్ సొంత కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆ కుటుంబానికే కట్టుబడి ఉంటుంది. మిగతా వాళ్లను ఆ పార్టీకి ఓటు బ్యాంకుగానే చూస్తారు' అని విమర్శించారు. బాలాకోట్ దాడులను ప్రస్తావిస్తూ, తాము ఏదైనా చేస్తే మోదీ నరకం చూపిస్తారనే విషయం టెర్రరిస్టులకు బాగా తెలుసునని అన్నారు. అయితే సైన్యం విషయం ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దు అని ఈసీ చెప్పినా, మోడీ మాత్రం అదే ప్రచారం చేసుకుంటున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read