ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం మండలం నర్సాయపాలెం గ్రామ శివార్లలో గత రెండురోజుల నుంచి ఆకాశంలో చక్కర్లు కొడుతున్నది విమానమా లేక చాపరా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం నర్సాయపాలెం గ్రామంలోని కొండప్రాంతంలో , గంగాపాలెం, యర్రగొండపాలెం పట్టణం, పుల్లలచెరువు మండలంలో విమానం లాంటిది చాలా కిందిస్థాయిలో పలుసార్లు చక్కర్లు కొట్టడం అనుమానాలను రేకెత్తిస్తోంది. గత రెండురోజుల నుంచి నర్సాయపాలెం ఎస్సీపాలెం సమీపంలోని కొండప్రాంతంలో సుమారు 300 అడుగుల ఎత్తులో గుండ్రంగా ఒక పెద్దపాటి ప్లేటులాగా ఆకాశంలో తిరగడం గ్రామీణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పశ్చిమప్రాంతంలోని మారుమూల గ్రామంలో మొదటిగా విమానం కిందిస్థాయిలో తిరిగిందని, ఆ తరువాత చాపర్ లాంటి వస్తువు సుమారు గంటపాటు కొండలపై చక్కర్లు కొట్టిందని గ్రామప్రజలు అంటున్నారు.

prakasam 26042019

నర్సాయపాలెం, గంగాపాలెం గ్రామాల్లోని కొండ ప్రాంతాల్లో కాపర్ ఖనిజం ఉందని కొందరు, గ్రానైట్ కొండలు ఉన్నాయని మరికొందరు చెబుతుండగా ఈప్రాంతంలో విలువైన వజ్ర వైడుర్యాలు కలిగిన గుప్తనిధులు ఉన్నాయని, అందుకే విమానం ద్వారా అధునాతన మిషన్ల ద్వారా ఆరా తీస్తున్నారని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూమినుంచి సుమారు 300 అడుగుల ఎత్తులో ఎగిరిన వస్తువులు ఏమిటి, అసలు ఈప్రాంతంలో ఏమి జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల కిందట ఇదేవిధంగా యర్రగొండపాలెంలోని కొప్పుకొండమీదుగా సుమారు 100 అడుగుల ఎత్తులో నిచ్చెనలాంటి తాడును వదిలి పలుసార్లు విమానం చక్కర్లు కొట్టింది.

మరల నర్సాయపాలెంలో గత రెండురోజుల నుంచి ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో చాపర్ లాంటి వస్తువులు ఆకాశంలో తిరగాడుతూ కనిపించడంతో గ్రామీణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొందరిని ఆరా తీయగా డ్రోన్ కెమెరా లాంటి వస్తువు కొండలపై గత రెండురోజుల నుంచి తిరగాడుతుందని, దానికి సంబంధించిన వ్యక్తులు సుమారు 100మీటర్ల దూరంలో రిమోట్ కంట్రోల్ ద్వారా దానిని పరిశీలిస్తూ ఉంటారని, ఈవిషయమై పోలీసులు ఆరా తీయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులను వివరాలపై వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని శుక్రవారం దాని విషయపై పరిశీలన చేసి చెపుతామని సమాధానం దాటవేశారు.

ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి సంఘటనకి, హైదరాబాద్ నుంచి ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ముఖ్యంగా సినిమా, మీడియా, మేధావుల ముసుగు వేసుకున్న వారు, ముందుంటారు. ఏపిలో చీమ చిటుక్కుమన్నా చంద్రబాబు పుట్టుక దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వస్తారు. వీళ్ళలో ఉన్న వివేకానందుకు బయటకు వస్తాడు. కాని అదే వీళ్ళు ఉండే తెలంగాణాలో ఎంత పెద్ద సంఘటన జరిగినా, ఎంత మంది శాల్తీలు గల్లంతు అయినా, అసలు నోరు మెదపరు. కారణం ఎంతో అందరికీ తెలిసిందే. కేసీఆర్ బహిరంగంగానే చెప్పాడు, ఇక్కడ బ్రతకాలి అంటే సెల్యూట్ కొట్టి ఉండాలె, లేకపోతె 10 కిమీ లోతులో పాతి పెడతాం అని. అందుకే పాపం సెల్యూట్ కొట్టి ఉంటారు. ఈ సందర్భంలో, మనం మంచు మోహన్ బాబు గారు అనే విద్యావేత్త గురించి మాట్లాడుకోవాలి.

mohababu 26042019

ఏపిలో మరో 10 రొజుల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా, చంద్రబాబు మీద పది ఏడవటానికి ఒక పధకం ప్రకారం తిరుపతి వచ్చి హడావిడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ ఒక్క కాలేజీకి లేని సమస్య, నాకే వచ్చింది అంటూ హడావిడి చేసి, అభాసుపాలు అయ్యి, తరువాత రోజు వెళ్లి జగన్ చేత మెడలో కండువా కప్పించుకున్నాడు. ఇంత హడావిడి చేసిన మోహన్ బాబు, తెలంగాణాలో 23 మంది పిల్లలు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అలసత్వం వల్ల ప్రాణాలు కోల్పోతే, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తీరిగ్గా వారం తరువాత, ఈ రోజు ట్విట్టర్ లో స్పందించారు. ఈ స్పందనలో కూడా తన సొంత డబ్బా కొట్టుకుంటూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ చేసారు.

mohababu 26042019

తెలంగాణలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేసింది అంటూ, ప్రభుత్వం ఈ విషయం పై స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది అంటూ, కేసీఆర్ భక్తిని చాటుకున్నారు. ఇక మోహన్ బాబు కొడుకు, జగన్ కి బంధువు కూడా అయినా, మంచు విష్ణు స్పందిస్తూ, మాకు కేసీఆర్ అంటూ భయం ఉంది అనుకుంటున్నారా అని వీర లెవెల్ లో ట్వీట్ చేసి, "కేటీఆర్.. ఓ ప్రో యాక్టివ్, ప్రో స్టూడెంట్ పొలిటీషియన్. కేసీఆర్ ఫ్రైర్ బ్రాండ్ అనే విషయం నేను కాదనడం లేదు. కానీ అందుకు కారణం ఉంది. కానీ ఆయన డిక్టేటర్ (నియంత) మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే.. అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. " అంటూ తండ్రికి కోరస్ కలిపి, కేసీఆర్, కేటీఆర్ భజనతో ముగించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకలా, తెలంగాణాలో ఒకలా స్పందించిన వీరు తీరు చూసి, ప్రజలే వీరి పై సరైన రీతిలో స్పందిస్తారు.

ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే, పార్టీ అధికారంలోకి రాకముందే అధికారులపై వైసీపీ నాయకులు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘మేం చెప్పినట్లు పనులు చేయాలి. లేదంటే వాటిని ఆపేయాలి’ అంటూ మంగళవారం ఏకంగా అనంతపురం, కనగానపల్లిఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేశారు. వివరాల్లోకి వెళితే.. కనగానపల్లి ఫీల్డ్‌ అసిస్టెంటుగా దాసరి నాగేశ్‌ విధులు నిర్వర్తించేవాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి చేరడంతో పాటు ఆ పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశాడు. ఫీల్డ్‌ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తూ.. ఒక పార్టీకి ప్రచారం చేయడాన్ని జిల్లా యంత్రాంగం సీరియ్‌సగా తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించింది. ఎన్నికల అనంతరం ఉపాధి కూలీలకు పనులు కల్పించే కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నిమగ్నమయ్యారు.

ycp 26042019

అందులో భాగంగా కనగానపల్లిలో కూడా అక్కడి కూలీలకు పనులు కల్పించారు. ఇందుకోసం రాంపురం ఫీల్డ్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న నాగభూషణాన్ని కనగానపల్లిఇన్‌చార్జి ఫీల్డ్‌ అసిస్టెంటుగా అధికారులు నియమించారు. అంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్న అధికారులకు వైసీపీ నాయకులు అడ్డు తగిలారు. తమ పార్టీకి ప్రచారం చేసినంత మాత్రాన ఫీల్డ్‌ అసిస్టెంటు దాసరి నాగేశ్‌ను తొలగిస్తారా? ఎలా తొలగిస్తారంటూ వైసీపీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. ఫీల్డ్‌ అసిస్టెంటుగా తిరిగి అతడినే నియమించి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అధికారులను హెచ్చరించారు. పనులు చేపడితే దాసరి నాగేశ్‌ ద్వారానే చేపట్టండి. లేదంటే కార్యాలయానికి తాళాలు వేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. అన్నంత పనీ చేసేశారు. అధికారులందరినీ బయటికి పంపి తాళాలు వేశారు.

ycp 26042019

దీంతో చేసేదేమీ లేక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇన్‌చార్జి ఎంపీడీఓ నాగేంద్రకుమార్‌, ఏపీఓ జయమ్మ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ కలుగజేసుకుని ఎన్నికల కోడ్‌ సమయంలో కార్యాలయానికి తాళాలు ఎలా వేస్తారంటూ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టానికి లోబడి నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమిస్తే ఏపార్టీ అయినా చట్టపరిధిలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు తీయకపోతే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చివరికి వైసీపీ నాయకులు తాళాలు తీసి వేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. అధికారం రాకముందే అధికారులపైనే వైసీపీ నాయకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే ఇక అధికారం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అధికారుల్లో మొదలైంది. వైసీపీ నిర్వాకంపై అటు కూలీలు, ఇటు స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లెస్ సీఎం అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయని పేర్కొన్న చంద్రబాబు.. తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. అధికారాలు లేని సీఎంగా ఉండాలంటూ వక్రీకరించడం తగదని పరోక్షంగా సీఎస్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.

lv cbn 26042019

అలాగే జరగాలని అనుకుంటే దేశంలోని ప్రభుత్వాల అధికారమంతా తీసేసి ఎన్నికల సంఘానికే సర్వాధికారాలు కట్టబెట్టాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాము వెయ్యి శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బాబు.. ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలూ ఉంటాయన్నారు. ఇందుకోసం పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాస్తామన్న చంద్రబాబు.. యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండ్‌తో అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు చెప్పారు.

lv cbn 26042019

ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెబుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో తాము వెయ్యి శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బాబు ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అందరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈవీఎంలపై, వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాస్తామని చెప్పారు. యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండ్‌తో అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా తమతో కలిసి ముందుకొస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెబుతున్నాయని అన్నారు. మొత్తానికి సీఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించి సీఎస్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read