అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఇప్పుడు పంచాయతీల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్‌లకు సంబంధించిన పదవీ కాలం ముగిసి దాదాపు ఆరునెలలు కావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పై దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పా ట్లు చేస్తున్నది.. వా రం రోజుల క్రితమే ప్రభుత్వం ఈమేరకు ప్రక్రియను ప్రారంభించింది..ఈ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలు వేర్వేరుగా ఉంటాయి.

ap ec 21042019

సార్వత్రిక ఎన్నికలకు ఒక జాబితా.. స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి కొంత మేర పరిధి తగ్గి.. ఆ గ్రామ ఓటర్లు జాబితాలో ఉంటారు.. ఈ విధంగా ప్రత్యేకంగా ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. దాని ప్రకారం రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల వారీగా మే-10లోగా ఓటర్ల జాబితా సిద్ధం కానుంది.. మే తొలివారంలో ఓటరు జాబితా సిద్ధం చేసి.. అభ్యంతరాలను స్వీకరిస్తారు.. అనంతరం పదో తేదిన తుది జాబితాను సిద్ధం చేస్తారు. తరువాత గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.. అనంతరం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చే స్తారు.. ఓటర్ల తుది జాబితా, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే మండల పరిషత్‌ అధికారులు, ఈఓపీఆర్‌డీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ap ec 21042019

ఈ సమావేశం అనంతరం మండలస్థాయిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం కానున్నాయి.. పంచాయితీ ఎన్నికలు జూన్‌లో నిర్వహించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలనుంచి సమాచారం. మే నెల 10న తుది జాబితా ఖరారు చేసిన అనంతరం.. రిజర్వేషన్లు ఖరారుకు వారం రోజుల సమయం పడుతుంది.. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ప్రభుత్వానికి , ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.. వీటి పరిశీలన తర్వాత మే నెలఖరుకు గాని జూన్‌ నెల తొలి వారంలోనైనా ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ విడుదలైన 15 నుంచి 18 రోజుల్లో నామినేషన్లు దాఖలు, పరిశీలన, ఉపసంహరణ అనంతరం తుది జాబితా ప్రకటించి, ఎన్నికలు నిర్వహిస్తారు..

ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో ఈసీ చేసిన తప్పులమీద తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సమస్యాత్మక జిల్లాలు, ప్రాంతాల్లో భద్రతకు చాలినన్ని బలగాలను ఇవ్వకుండా దెబ్బకొట్టిన ఈసీ అనుబంధ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటులోనూ అన్యాయంగా వ్యవహరించింది. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదైనప్పటికీ పోలింగ్‌ కేంద్రాలను పెంచకుండా ఎన్నికల ప్రక్రియను తేలికగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈసీ అనుబంధ కేంద్రాలకు అనుమతి ఇచ్చి ఉంటే రాష్ట్రంలో పోలింగ్‌ తీరు మరోలా ఉండేదని సీఈవో కార్యాలయం అభిప్రాయపడింది. రాష్ట్రంలో అనుబంధ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం మోకాలడ్డింది. మార్చి 25న ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది.

ec 2104019

జనవరి 11నాటి జాబితాలో కంటే 25 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారు. దీంతో కొన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. మంగళగిరి నియోజకవర్గంలోని ఒక కేంద్రంలో ఓటర్ల సంఖ్య 2000కు చేరుకుంది. సాధారణంగా ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్ఠంగా 1400 మంది ఓటేసేలా చర్యలు తీసుకున్నారు. తుది జాబితా తర్వాత వందల పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 1400 దాటేసింది. కాబట్టి 478 అదనపు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు సీఈవో ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపారు. కానీ ఈసీ 38 అనుబంధ కేంద్రాలకే అనుమతిచ్చింది. ఈవీఎంల కొరత తీవ్రంగా ఉన్నందున మిగిలిన 440 అనుబంధ పోలింగ్‌ కేంద్రాలకు అనుమతివ్వలేమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో అరకొర ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారు.

ec 2104019

గరిష్ఠంగా 1400 ఓటర్లు మాత్రమే ఓటేయాల్సిన 440 కేంద్రాల్లో అంతకుమించి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగడానికి ఇదీ కారణమే. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఐదుగురు సిబ్బందితో పాటు, ఒక అదనపు ఉద్యోగినీ అందుబాటులో ఉంచారు. పని ఒత్తిడి పెరిగినప్పుడు ఈ అదనపు ఉద్యోగి పని పంచుకుంటాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 45,959 కేంద్రాల్లో ఒక అదనపు ఉద్యోగి అందుబాటులో ఉన్నాడు. అదనంగా ఉన్న ఉద్యోగులను అవసరమైన చోటకు తరలించే ప్రయత్నం చేయలేదు. దీంతో వారు ఖాళీగా కూర్చున్నారు. అర్ధరాత్రి వరకు, ఆ తర్వాత పోలింగ్‌ జరిగిన కేంద్రాల్లో వీరి సేవలు వినియోగించుకుని ఉంటే ఇటు ఓటర్లు అటు పోలింగ్‌ సిబ్బంది ఎదుర్కొన్న ఇబ్బందులు తగ్గేవని సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు.

ఎన్నికల అఫిడవిట్‌లో తన విద్యార్హతలకు సంబంధించిన వివరాల ద్వారా అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. సీరియల్స్‌లో నటిగా నేపథ్యం ఉన్న స్మృతిని ‘సీరియల్‌ లయర్‌’గా అభివర్ణించింది. ఆమె తన విద్యార్హతలపై తప్పుడు పత్రాలను సృష్టించారని, ఈ విషయంలో ఆమె ఎన్నోసార్లు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూవచ్చారని ఆరోపణలు చేసింది. తన చదువు విషయంలో ఈసీకి ఆమె పరస్పర విరుద్ధమైన అఫిడవిట్లను సమర్పించారని.. ఈ కారణంగా ఎన్నికల్లో పోటీకి ఆమెపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది డిమాండ్‌ చేశారు.

smriti 21042019

సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2014లో ఓ కార్యక్రమం సందర్భంగా తాను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసినట్లు స్మృతి చెప్పారని, అలాంటిది ఆమే.. తాజాగా అమేఠీ ఎన్నికల అఫిడవిట్‌లో ఇంటర్‌ మాత్రమే చదివినట్లు వివరాలను పొందుపర్చారన్నారు. ఆమె డిగ్రీ పూర్తిచేయలేదని తాము ఇన్నాళ్లు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన స్మృతి.. తాజా అఫిడవిట్‌ ద్వారా తాను డిగ్రీ పూర్తిచేయలేదన్న విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లయిందని అన్నారు. స్మృతి టీవీ నటిగా వచ్చిన ‘క్యూంకీ సాస్‌ భీ కభీ బహూ థీ’ సీరియల్‌ను గుర్తుచేస్తూ... ‘‘ఇప్పుడు స్మృతి సరికొత్త సీరియల్‌ వస్తోంది. అది.. క్యూంకీ మంత్రి భీ కభీ గ్యాడ్యుయేట్‌ థీ అని’’ ఎద్దేవా చేశారు.

smriti 21042019

తన విద్యార్హతలకు సంబంధించి తప్పుడు వివరాలు పేర్కొంటున్నారంటూ స్మృతీ ఇరానీపై చాన్నాళ్లుగా ఆరోపణలున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తిచేసినట్లు స్మృతి పేర్కొన్నారు. 2011లో రాజ్యసభ ఎన్నికకు సమర్పించిన అఫిడవిట్‌లో 1994 ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్‌ ద్వారా బీకాం కోర్సులో ప్రవేశం పొందినట్లు, దాన్ని పూర్తిచేయలేకపోయినట్లు వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఓపెన్‌ లెర్నింగ్‌ ద్వారా బీకాంలో ప్రవేశం పొందినట్లు, దాన్ని పూర్తిచేయలేకపోయినట్లు పేర్కొన్నారు. తాజాగా అమేఠీలో సమర్పించిన అఫిడవిట్‌లో 1991లో సెకండరీ స్కూల్‌, 1993లో సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పూర్తిచేసినట్లు వెల్లడించారు. 1994లో ఓపెన్‌స్కూల్‌ విధానంలో బీకాంలో ప్రవేశిం పొందానని, దాన్ని పూర్తిచేయలేకపోయానని వెల్లడించారు. ఈ విషయాలన్నీ విలేకర్ల సమావేశంలో చతుర్వేది ప్రస్తావిస్తూ స్మృతిపై ఘాటు విమర్శలు చేశారు. తన చదువు విషయంలో తప్పుడు అఫిడవిట్ల ద్వారా ప్రజలను స్మృతి తప్పుదోవ పట్టించారని, ఇందుకు మంత్రిగా ఆమె రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

 

టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒకరిని మించి మరొకరు తీవ్రంగా పోటీపడిన గుడివాడ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలు తెరవడానికి ఇంకా 30 రోజుల పైగా సమయం ఉండటంతో ప్రధాన పక్షాల నాయకులు అంకెల లెక్కల్లో మునిగిపోయారు. గెలుపోటములను పోలింగ్‌ సరళి ఏవిధంగా ప్రభావితం చేస్తుందో అనే అంశంపై ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. గుడివాడ పట్టణం, రూరల్‌, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని వివిధ గ్రామాల పోలింగ్‌ శాతాలను సేకరిస్తున్నారు. నియోజకవర్గంలోని 63 గ్రామాల్లో భారీగా పోలింగ్‌ జరగడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ 85 శాతం జరిగింది. కొన్ని గ్రామాల్లో 90 శాతానికి మించడం గమనార్హం.

gudivada 21042019

ప్రధానంగా మహిళా ఓటర్లు వెల్లువెత్తడంతో వారి తీర్పు ఎలా ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పసుపు-కుంకుమ ఎఫెక్ట్‌ పనిచేసిందని టీడీపీ వర్గీయులు అంటున్నారు. పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందే బ్యాంకుల్లో చెక్కులు మారడం వారిని ప్రభావితం చేసి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని, పోలవరం నిర్మాణం మధ్యలో ఆగకుండా ఉండాలంటే మళ్లీ చంద్ర బాబు రావాలనే అభిప్రాయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారని ఆ పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఓటు వేయడానికి రాత్రి ఎంతసేపైనా వేచి ఉంటామని పట్టుదల ప్రదర్శించడం సానుకూల సంకేతమని విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ఓటింగ్‌ శాతం పెరిగిందని ఆ పార్టీ వర్గీయులు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత సైలెంట్‌ ఓటింగ్‌కు దారితీసిందని వారి అంచనా.

gudivada 21042019

సామాజికవర్గాల వారీగా ఓటింగ్‌ వివరాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉండటంతో రెండు పార్టీ నేతలు వాటి కోసం వేచిచూస్తున్నారు. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే అన్ని సామాజికవర్గాల ఓటర్లు ఒకేరీతిగా స్పందించారని తెలుస్తోంది. ప్రలోభాల పర్వంలో వైసీపీ, టీడీపీ రెండూ పోటీపడటంతో క్రాస్‌ ఓటింగ్‌ భయం ఆ పార్టీల అభ్యర్థులను వెంటాడుతోంది. జనసేన బరిలో లేకపోవడంతో ఆ పార్టీ అభిమానులు ఎంపీ ఓటు తమ అభ్యర్థి బండ్రెడ్డి రామ్మోహన్‌కు వేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఓటు టీడీపీ, వైసీపీ, నోటా ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వేశారని సమాచారం. జనసేనకు సంబంధించిన ఓట్లు టీడీపీ, వైసీపీకి సమానంగా పోల్‌ అయ్యాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉండే ఎస్సీ వాడల్లో సైతం టీడీపీకి ఆదరణ లభించడంతో గెలుపు తమదేనని ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో తేలియాడుతున్నాయి. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ప్రజలను తన కలుపుగోలుతనంతో ఆకట్టుకున్నారనేది ఆ పార్టీ వర్గీయుల వాదన. దీనితో పాటు పదిహేనేళ్లుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో పాటు వైసీపీ అభ్యర్థిపై ఉన్న తీవ్ర ప్రజావ్యతిరేకత అవినాష్‌ గెలుపునకు బాటలు వేస్తాయని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. నందివాడ, గుడివాడ టౌన్‌, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్‌ అన్నింటిలోనూ ఆధిక్యత తమదేనని ఇరుపక్షాలు ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.

 

Advertisements

Latest Articles

Most Read