ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయన్నమాటే గానీ... రాజకీయ పార్టీలకు ప్రశాంతత కరువైంది. ఎన్నికల ముందు ఎలా టెన్షన్ పడ్డాయో... ఇప్పుడూ అలాగే పడుతున్నాయి. ఇప్పుడెందుకంటే... 43 రోజులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలు భద్రంగా ఉంటాయో లేదో అన్న టెన్షన్. ఎప్పుడైనా ఎవరైనా దాడి చేసి... వాటిని ఎత్తుకుపోతారేమోనని స్వయంగా రాజకీయ పార్టీలే తమ ప్రతినిధులను కాపలాగా పెట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో... ఓ సంఘటన తీవ్ర కలకలం రేపింది. గుంటూరులో స్ట్రాంగ్‌ రూమ్‌లలో నిబంధనల ఉల్లంఘన పై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. నాగార్జున వర్శిటీలో స్ట్రాంగ్‌రూమ్‌లలోకి వైసీపీ నేతలతో ఉద్యోగులు వెళ్లారని ఫిర్యాదులో నేతలు పేర్కొన్నారు.

strongroom 22042019

నాగార్జున వర్శిటీలో ఈవీఎంల పరిశీలనకు వైసీపీ నేతలతో పాటు ఉద్యోగులు వెళ్లడంపై అభ్యంతరం తెలిపారు. వైసీపీ అభ్యర్ధులతో వర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ డీన్ శ్రీనివాసరెడ్డి, మరో ఉద్యోగి వెళ్లారని ఫిర్యాదు చేశారు. వర్శిటీ డీన్‌ శ్రీనివాసరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లాంతో కలిసి పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తున్న వర్శిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అసలే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి ఏకంగా వైసీపీ నేతలే లోపలకి వెళ్ళటం వివాదాస్పదంగా మారింది.

strongroom 22042019

కొన్ని రోజుల క్రితం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచారు. అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. కలెక్టర్‌, పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ సీలు తీసి, తలుపులు తెరిచి మూడు టాటా ఏస్‌ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను సంప్రదించగా... ‘‘అవి నూజివీడు నియోజకవర్గానికి చెందిన రిజర్వు ఈవీఎంలు. ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ స్వపిన్‌ దినకర్‌ ఆధ్వర్యంలో వాటిని తరలించాం’’ అని తెలిపారు. 103 రిజర్వు ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించుందుకు వీలుగా అక్కడి నుంచి తరలించామని, ఇందులో వివాదమేదీ లేదని సబ్‌ కలెక్టర్‌ కూడా తెలిపారు. అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరూ రాలేదని చెప్పారు. ఇప్పుడు గుంటూరు నాగార్జున యూనివర్సిటీ సంఘటన కలకలం రేపుతుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు దొంగ’ అని సుప్రీంకోర్టు చెప్పినట్లు తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. రఫేల్‌ తీర్పుపై తప్పుగా వ్యాఖ్యానించినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార జోరులో చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యర్థి పార్టీలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎప్పుడూ పేర్కొనలేదని అఫిడవిట్‌లో అంగీకరించారు. కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

supreme 22042019

రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు పేర్కొంది. దీనిపై ఏప్రిల్‌ 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే.

supreme 22042019

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం పత్రాలు కొన్ని లీక్ అయినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. లీక్ అయిన 3 పత్రాలను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు ఈ నెల 10న ప్రకటించింది. వీటిని విచారణకు అనుమతించరాదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రఫేల్‌ అవినీతిపై పోరాటంలో తమకు నైతిక విజయం లభించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దొంగతనం చేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మొన్నటి మొన్న, నేను బీసీని, నన్ను తోక్కేస్తున్నారు అంటూ సాక్షాత్తు ఒక దేశ ప్రధాని కులం గురించి మాట్లాడటం చూసాం... అవి విన్న ప్రజలు, ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏకంగా దేశ బధ్రత, సైనికుల త్యాగాలు కూడా మోడీ ప్రచారంలో వాడుకుని, మరింత దిగజారి పోతున్నారు. 70 ఏళ్ళలో ఈ దేశాన్ని ఎంతో మంది పాలించారు. వాళ్ళందరి నాయకత్వంలో మన సైన్యం ధీటుగా నిలబడింది. అయితే వాళ్ళు ఎప్పుడూ మేమే ఈ దేశాన్ని కాపాడుతున్నాం, మాకే ఓటు వెయ్యండి అని మోడీ లాగా ఎన్నికల ప్రచారంలో అడగలేదు. నిన్న మోడి మరింత దిగజారి, పాకిస్తాన్, బాంబులు అంటూ, దేశ బధ్రత గురించి కూడా, ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. అయితే అందరి పై ఒంటి కాలు మీద వెళ్ళే ఎన్నికల కమిషన్, మోడీ మాటల పై మాత్రం, నిద్ర మత్తులో ఉంది.

modi 22042019

నిన్న మోడీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడే స్థితిలో భారత్‌ లేదని ప్రధాని మోదీ అన్నారు. ‘అణ్వాయుధాల బటన్‌ నొక్కుతాం.. అణ్వాయుధాల బటన్‌ నొక్కుతాం’ అంటూ హెచ్చరికలు చేయడాన్ని ఆ దేశం ఆపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత్‌ అమ్ములపొదిలోని అణ్వాయుధాలు దీపావళి వేడుకల కోసం దాచినవి కాదనే విషయాన్ని పాక్‌ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. ఆదివారం గుజరాత్‌లోని పటన్‌, రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌ నగరాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను సురక్షితంగా అప్పగించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను గట్టిగా హెచ్చరించినందు వల్లే పాక్‌ తోకముడిచిందని ప్రధాని వెల్లడించారు.

modi 22042019

తాను హెచ్చరించిన మరుసటిరోజే(ఫిబ్రవరి 27).. ‘పరిస్థితి చేయిదాటితే ప్రయోగించడానికి భారత్‌ 12 క్షిపణులను మోహరించింది’ అని అమెరికా సీనియర్‌ అధికారులు పాకిస్థాన్‌కు తెలియజేశా రన్నారు. అదే రోజు సాయంత్రంకల్లా భారత పైలట్‌ను తిరిగి అప్పగించేస్తామంటూ పాక్‌ ప్రకటన చేసిందని చెప్పారు. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే ఆ రోజు రాత్రి.. పాకిస్థాన్‌ పాలిట ‘కాళ రాత్రి’(ఖతల్‌ కీ రాత్‌) అయి ఉండేదన్నారు. మోదీ అనే భారత ప్రధాని హయాంలో పూడ్చుకోలేనంత నష్టం జరిగిందంటూ పాకిస్థానీయులు భావితరాలకు చెప్పుకునే పరిస్థితి తలెత్తేదని వివరించారు. అయితే ఒక దేశ ప్రధాని, ఇలా దేశ బధ్రత పై కూడా, దిగజారి ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటం, ఇంతకు ముందు ఎప్పుడూ లేవని, ఈ 5 ఏళ్ళలో ప్రజలకు ఏమి చేసాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం అని చెప్పకుండా, ఇలా ప్రజలని ఎమోషనల్ బ్లాకు మెయిల్ చెయ్యటం, ఇదే మొదటి సారి అని విశ్లేషకులు చెప్తున్నారు.

ఎన్నికల్లో తెదేపాదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే తెదేపాను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఈ మేరకు అమరావతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని జేసీ అన్నారు.

diwakar 22042019

మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాయని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల మొత్తం ఖర్చు రూ.50 కోట్లు దాటిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించాలనేది తన తపన అని వివరించారు. ఇందుకోసం ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జయప్రకాశ్‌ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక ముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు. అందుకోసం కృషి చేస్తానని వివరించారు.

diwakar 22042019

ఇటీవల టీడీపీ గెలుపుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అదృష్టవంతుడు. ఎందుకని ఆయన నన్ను అడిగారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారు. అనంతపురం లోక్‌సభలో అందరినీ మార్చమని నేనే చెప్పా. మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే. అనంతపురం టౌన్‌, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read