గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేశ్ శుక్రవారం నాడు మంగళగిరి మండలం చినకాకినిలో ప్రచారం చేశారు. అయితే ప్రచారానికి వెళ్తున్న ఓ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు వెనుక భాగంలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. కాగా.. ఈ వాహనం టీడీపీ నేతల పోలవరపు హరిబాబుది అని గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఈ దాడిపై హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

lokesh 05042019

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల రెండు రోజుల ముందు రాష్ట్రంలో విధ్వంసం చేస్తారు అంటూ మాకు సమాచారం ఉందని, ఇప్పటికే తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టే వైసీపీ చర్యలు ఉంటున్నాయి. ఒకపక్క మోడీ సహకారంతో, ఐటి దాడులతో తెలుగుదేశం నేతల పై విరుచుకు పడుతున్నారు. మరో పక్క, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు కూడా అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీ చేష్టల పై అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికలు అయ్యే లోపు ఎంత గోల చేస్తారో, ఏ కుట్ర చేస్తారో, ఎంత విధ్వంసం చేస్తారో అని ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రశంసల జల్లు కురిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పట్టిసీమ నిర్మాణాన్ని కేసీఆర్‌ పరోక్షంగా ప్రశంసించారు. పట్టిసీమ నిర్మాణం చేపట్టి చంద్రబాబు డెల్టాకు ప్రాణం పోశారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఏపీ పట్టిసీమతో డెల్టాను కాపాడుకుందని ఆయన చెప్పారు. పట్టిసీమ తరహాలో సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామని కేసీఆర్‌ ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ మంటలు మండుతున్న సమయంలోనూ పట్టిసీమపై కేసీఆర్‌ ప్రశంసలు జల్లు కురిపించడంతో తెలుగు రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలోని సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన సందర్భంలో ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టుపై పరోక్షంగా ప్రశంసలు చేశారు.

kcr 05042019

ఏపీలోని డెల్టా ప్రాంతాన్ని పట్టిసీమ ప్రాజెక్టు కాపాడిందని, అదే తరహాలో తెలంగాణలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి రైతులకు అండగా ఉంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పట్టిసీమ ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్ తరచుగా విమర్శలు చేస్తుంటారు. జగన్ కు మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్ అదే ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. జగన్‌తో కలిసి పనిచేస్తామని చెబుతున్న కేసీఆర్ చంద్రబాబును ప్రశంసించడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వాస్తవాన్ని ఎవరైనా కాదనలేరని టీడీపీ శ్రేణులు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. పట్టిసీమ విషయంలో చంద్రబాబు కృషిని కేసీఆర్ ప్రశంసిస్తుంటే.. జగన్ మాత్రం పట్టిసీమపై అసత్య ప్రచారం చేయడమేంటని టీడీపీ నేతలు మండిపడతున్నారు..

ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ సందర్భంగా.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ను ఓ కానిస్టేబుల్‌ తోసేశారు. వైసీపీ నాయకులు ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో దెందులూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఫెసిలిటేషన్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను వైసీపీ నాయకులు ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు.

chintamaneni 05042019 2

దీంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి చింతమనేని రంగంలోకి దిగారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఒక కానిస్టేబుల్ చింతమనేనిని తోసివేయడంతో ఆయన కింద పడబోయారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు చేసారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి, వారిని అక్కడ నుంచి పంపేసారు. ఈ పరిణామాలతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి వచ్చిన ఉద్యోగులు ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా అయోధ్య మైదానంలో స్టేజ్‌‌పై ప్రసంగిస్తుండగా పవన్ అభిమాని కాళ్లు పట్టుకోవడంతో ఆయన కిందపడిపోయారు. కాసేపు విరామం అనంతరం తిరిగి పవన్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి అభ్యర్థులను గెలిపించాలని పవన్ అభ్యర్థిస్తున్న విషయం విదితమే. విజయనగరం నుంచి విజయవాడ వచ్చిన పవన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమవరం సభ తర్వాత జనసేనాని అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో పవన్ ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది.

pk 0042019

విజయనగరం పర్యటన ముగించుకొని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో ఆయన రోడ్‌షో, బహిరంగ సభలకు నేతలు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న నేపథ్యంలో శ్రేణులను నిరుత్సాహానికి గురిచేయకుండా సభావేదికకు బయల్దేరేందుకు సిద్ధమైన పవన్‌ను వైద్యులు వద్దని వారించినట్టు సమాచారం. దీంతో ఆ రెండు సభలను రద్దుచేసినట్టు పార్టీ నేతలు తెలిపారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనున్న నేపథ్యంలో పవన్‌ అస్వస్థతకు గురికావడం జనసేన పార్టీ శ్రేణుల్ని కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

Advertisements

Latest Articles

Most Read