నందివాడ మండలంలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రాజకీయంగా పలుమార్పులు చోటు చేసుకున్నాయి. ముదినేపల్లిలో భాగంగా ఉన్న కాలంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని కోటేశ్వరరావు ప్రభావంతో కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించింది. మండలంలో మొత్తం 28748 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్లు అధికం. గుడివాడ నియోజకవర్గంలో చేరిన తొలిసారి 2009లో మండల ఓటర్లు 872 ఓట్ల మెజార్టీతో టీడీపీకే పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 2823 ఓట్ల మెజార్టీ లభించింది. దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం పెనవేసుకున్న కొంతమంది టీడీపీ నాయకులు కొడాలి నానితో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీకి మైనస్‌ అయింది. పదేళ్లపాటు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నాని పార్టీ ఫిరాయింపుతో కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది.

game 27032019

కొంత మంది బలమైన నేతలను తనవైపుకు తిప్పుకోవడంతో 2014 ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంత మంది నేతలు టీడీపీలో ఉంటూనే లోపాయికారీగా నాని ప్రలోభాలకు లొంగి వైసీపీకి పనిచేశారు. ఈ కారణాలతో టీడీపీ బలంగా ఉన్న నందివాడలో వైసీపీ పాగా వేసింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ రంగంలోకి దిగడంతో సీన్‌ రివర్స్‌ అవడం ఖాయమని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మండలంలో త్వరలో నిర్వహించనున్న అవినాష్‌ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పర్యటన ప్రారంభించక ముందే మండల టీడీపీ నాయకులు ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిబద్ధతతో ఉన్నారు. నాయకులు విబేధాలు వీడి పనిచేస్తుండటంతో ఆధిక్యం సాధిస్తుందనేది శ్రేణుల మాట.

గత ఎన్నికలకు ముందు మండల టీడీపీకి ఇరుసుగా వ్యవహరించిన బీసీ నాయకుడు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటకృష్ణ హఠాన్మరణం టీడీపీ వైఫల్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గత ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు మండలంలో కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరావు తన వర్గంతో టీడీపీలో చేరడంతో గ్రామ స్థాయిలో టీడీపీ నాయకుల మధ్య విభాదాలు తెలెత్తాయి. పిన్నమనేని చేరిక టీడీపీకి ప్లస్‌ కావాల్సింది పోయి మైనస్‌గా మారింది. నందివాడ మండల కేంద్రంలో టీడీపీ నేత వేములపల్లి వెంకటేశ్వరరావు(బాబు) అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియశీలంగా లేకపోవడం గత ఎన్నికల్లో ఆ గ్రామంలో టీడీపీకి మైనస్‌ వచ్చింది. తమిరిశ టీడీపీ నాయకుడు, గుడివాడకు చెందిన వైద్యుడు మాగంటి శ్రీనివాస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ గ్రామంలోనూ మైనస్‌ వచ్చింది. వీటికి తోడు మండల టీడీపీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో క్యాడర్‌ సరిగా పనిచేయకపోవడం కూడా పరాజయానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక, అంగబలాల్లో సమర్థుడైన దేవినేని అవినాష్‌ రంగంలోకి దిగడంతో మండల టీడీపీలో ఉత్సాహం నెలకొంది. టీడీపీని దెబ్బతీయడానికి కొడాలి నాని ఎత్తుగడలు ఈసారి పారే అవకాశాలు ఎంతమాత్రం లేవని పార్టీ కార్యకర్తలంటున్నారు. టీడీపీ పాత నాయకులు, పిన్నమనేని వెంకటేశ్వరావు వర్గం నాయకుల నడుమ అక్కడక్కడా ఉన్న విభేదాలను సర్దుబాటు చేసుకుని సమన్వయంతో పనిచేస్తే మండలంలో టీడీపీ ఆధిక్యం సాధించే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు సైతం గత ఐదేళ్లుగా మండలంపై దృష్టి పెట్టి సిమెంట్‌ రోడ్లు వేయించడం, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో చేసిన కృషి గ్రామాల్లో టీడీపీకి సానుకూల పవనాలకు కారణ మవుతోంది.

గతంలో వైసీపీకి వచ్చిన మెజార్టీని అధిగమించి టీడీపీకి మెజార్టీ సాధించే దిశగా నాయకులు పక్కా వ్యూహరచనతో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఒక పక్క సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకు లాభిస్తాయని పార్టీ శ్రేణులంటున్నాయి. మండల టీడీపీ అధ్యక్షుడు అరికెపూడి రామశాస్త్రులు, గుడివాడ అర్బన్‌ బ్యాంకు అధ్యక్షుడు పిన్నమనేని బాబ్జీ మండలంలో అవినాష్‌ ప్రచార బాధ్యతలుభుజాన వేసుకుని ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో ప్రతి నాయకుడు మండలంలో టీడీపీకి పూర్వవైభవం సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌మీదే అప్రకటిత యుద్ధం చేస్తున్న వైఎస్‌ జగన్‌.. అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఇటీవలే రాజీనామా చేసిన ఓ సీఐకి వైసీపీ టికెట్‌ కేటాయించారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి గోరంట్ల మాధవ్‌ వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. మరి.. ఆ డిపార్ట్‌మెంట్‌ మీదే సందర్భం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్న జగన్‌.. ఒక మాజీ సీఐకి ఏకంగా పార్టీ ఎంపీ టికెట్‌ కేటాయించడంపైనా చర్చ జరుగుతోంది. అయితే.. గోరంట్ల మాధవ్‌ ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రజల పట్ల అత్యంత దురుసుగా వ్యవహరించేవాడని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. సామాన్య ప్రజానీకాన్ని లెక్క చేసేవాడు కూడా కాదని, సమస్యలు, బాధలుచెప్పుకోవడానికి వస్తే గొడ్డును బాదినట్లు బాదేవాడని అంటున్నారు. అంతేకాదు.. ఆయన ఓ సందర్భంలో విధుల్లో ఉన్న కిందిస్థాయి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఆడియో కూడా వైరల్‌ అవుతోంది. 'పబ్లిక్‌ ఇలా చెబితే వినరురా... ఉతకండి' అన్న ఆ మాటలు.. మాధవ్‌ ప్రవర్తనకు అద్దం పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అలా ప్రజల మీద ప్రతాపం చూపించేవాళ్లను, జనం మీద జులుం చూపించే వాళ్లనే చేరదీస్తాడన్న ఆరోపణలు ఇప్పుడు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అందుకే మాజీ సీఐకి టికెట్‌ కేటాయించాడన్న చర్చ జరుగుతోంది. ఇది చాలా క్రియాశీలకం.. చాలా కీలకమైన సమయం. రాజకీయాలను మలుపుతిప్పేది ఇదే అంశంగా ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. అంటే.. ఇది ఎన్నికల ప్రచారాస్త్రం కాదు. ఏపీ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్న విషయమని అంటున్నారు విశ్లేషకులు. మరి.. జగన్‌ వైఖరిపై రియాక్షన్‌ ఎలా ఉండబోతోంది ? ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఏ చిన్న అంశం దొరికినా.. వైఎస్‌ జగన్‌ వదిలిపెట్టడం లేదు. దాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు కొట్టి చంపారంటూ కొద్దిరోజుల పాటు.. జనంలో ఉద్రిక్తతలు రగిలించే ప్రయత్నం చేశారు. పైగా.. రైతు కావడంతో.. అన్నదాతల్లో చర్చను లేవనెత్తే ప్రయత్నం చేశారు. కానీ.. విధుల్లో ఉన్న పోలీసులు అతన్ని గమనించి రైతును భుజాలమీద ఎత్తుకొని ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి వీడియో రికార్డు చేయడంతో వాస్తవమేంటో అందరికీ తెలిసింది. ఒకవేళ.. ఆ వీడియో గనక రికార్డ్‌ చేసి ఉండకపోతే.. జగన్‌.. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను మరింత బద్‌నాం చేసేవాడని పోలీసు అధికారులే ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక.. డీఎస్పీల ప్రమోషన్ల వ్యవహారంలోనూ ఢిల్లీలో బొక్కబోర్లా పడ్డారు జగన్‌. దేశ రాజధానిలో మీడియా సమావేశం నిర్వహించి.. ఏపీ పోలీసుల మీద బురద చల్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే.. ఓ ప్రధాన వ్యవస్థ అని తెలిసినా.. జాతీయ స్థాయిలో వివాదం రగిల్చే ప్రయత్నం చేశారు. ముప్పై ఏడు మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇస్తే.. వారిలో ముప్పై ఐదు మంది సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మవాళ్లు ఉన్నారని జగన్‌ ఆరోపించారు. అయితే.. వారిలో ఏడుగురు జగన్‌ సామాజిక వర్గం వాళ్లని, కమ్మ సామాజిక వర్గం వాళ్లు ఇద్దరే ఉన్నారని, మిగతావాళ్లంతా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్లని అధికారులు లెక్కలతో సహా చెప్పడంతో జగన్‌ సైలెంట్ అయిపోయారు. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పైనా.. మరికొందరు పోలీసు అధికారులపైనా జగన్‌ అండ్‌ కో ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేసింది. అయితే.. ఇది కూడా బెడిసికొట్టింది. ఈ వ్యవహారంపై ఎస్పీ కోయ ప్రవీణ్‌ ధీటుగా బదులిచ్చారు. 'పోలీసులు చట్ట పరిధిలో వ్యవహ రిస్తారు. వారికి ఒక పార్టీనో, ఒక నేతనో ముఖ్యంకాదు. శాంతి భద్రత ల పరిరక్షణే కర్తవ్యం. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న వారిపై కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. నాయకులు వంద అంటారు. యూనిఫాం తీసేస్తే మేమూ మాట్లాడతాం' అని అన్నారు. పోలీసులతో పెట్టుకొని జగన్‌ దిద్దుకోలేని తప్పు చేశాడా ? ఎన్నికల్లో ఈ వైఖరికి తగిన రియాక్షన్‌ ఉండబోతోందా ? చివరికి తన వ్యవహారమే తనను నిండా ముంచబోతోందా ? నిజమే అంటున్నారు పరిశీలకులు. వ్యవస్థలను టార్గెట్‌ చేస్తే ఓటర్ల నుంచి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

 

వైసీపీ నేతల తీరుపై రాష్ట్ర పోలీసులు భగ్గుమంటున్నారు. ఆ పార్టీ నే తలు సీఈసీకి చేసిన ఫిర్యాదుపై మండిపడుతున్నారు. ‘‘వైసీపీ నేత ఫిర్యాదులో నాన్‌కేడర్‌ అధికారులు ఎస్పీ లుగా ఉండడానికి వీల్లేదని, వెంటనే మార్చాలని కోరా రు. ఇది చాలా దారుణం. ఎవరైనా తప్పు చేస్తే మార్చా లని కోరతారు. లేదా పక్షపాత వైఖరి ఉంటే ఫిర్యాదు చేస్తారు. నాన్‌కేడర్‌ అన్న ఒకే ఒక్క కారణంతో శ్రీ కాకుళం, విజయనగరం ఎస్పీల బదిలీ కోరడం అవమానకరం. నాన్‌కేడర్‌ అంటే లోకువా? అధికారుల్లో కేడర్‌ విభజన తీసుకురావడం అంటే యూనిఫామ్‌ సర్వీసును తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడమే. ఇలాంటి చర్యలను ఎ వరూ అనుమతించకూడదు. కానీ, ఈ ఫిర్యాదు ఆధా రంగా శ్రీకాకుళం ఎస్పీని బదిలీ చేయమని ఆదేశించడం అధికారుల్లో అసమానతలున్నాయని తేల్చిచెప్పడమే అవుతుంది.

game 27032019

దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని ఓ సీనియర్‌ అధికారి అన్నారు. తమను అవమానపరిచే లా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు మొ త్తం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి, ప్రతిష్ఠను దిగజార్చడానికి చేసినట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తుతు న్నారు. తప్పుచేసిన పోలీసులపై చర్య తీసుకుంటే అ భ్యంతరం లేదని.. పదుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదులపై అ త్యున్నత సంస్థలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని వాపోతున్నారు. వ్యవస్థలేవీ బతికే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని కోరే పార్టీలను చూశాం కానీ.. పోలీసులకు ఇచ్చిన పదోన్నతులు, పోస్టింగ్‌లకు రాజకీయ కోణం అద్ది తమను రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చే యడం గర్హనీయమని అంటున్నారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్న పోలీసుల మధ్య కేడర్‌-నాన్‌కేడర్‌ విభజన తీసుకొచ్చి తమను రాజకీయాలకు బలిచేయాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. పోలీసు వ్యవస్థలో డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అన్ని స్థాయిల ఉద్యోగుల సర్వీసు అంశాలు, పోస్టింగ్‌లను రాజకీయం చేయడం దురదృష్టకరమని అంటున్నారు. సాయిరెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

game 27032019

పోలీసు శాఖలో పదోన్నతులు అనేది ఓ బ్రహ్మ పదా ర్థం. కానిస్టేబుల్‌గా నియమితులైన వారు హెడ్‌కానిస్టేబుల్‌ అవ్వడమనేది ఒక కలగానే మిగిలిపోయేది. యూ నిఫామ్‌ సర్వీసులో టైమ్‌బౌండ్‌ పదోన్నతులు లేని కారణంగా ఎంతోమంది నియమితులైన పోస్టులోనే రిటైర్‌ అయ్యేవారు. ఇటీవలే ప్రభుత్వం ఈ విధానాకి స్వస్తిపలికి ఎంతో మందికి పదోన్నతులు కల్పించింది. ప్ర భుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్ల వేలాది మంది పోలీసుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పదోన్నతు లు ఇచ్చారని, పోలీసు శాఖ రాజకీయమైందని ఫిర్యాదు చేయడం గర్హనీయమని పోలీసులు అంటున్నారు. సర్వీసులో మచ్చలేనివారు, నీతి, నిజాయతీకి ప్రతిరూపమైన అధికారులకు కులం, మతాన్ని ఆపాదించి అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అంటూ పోలీసులు, ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి పారదర్శకంగా పనిచేయకుండా అడ్డుకునేందుకే విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్య క్తం చేశారు.

 

ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్‌ దూసుకుపోతోంది. 'మళ్లీ మీరే రావాలి' అంటూ పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు.. అక్కాచెల్లెళ్లే తన బలమని చెప్పుకుంటున్నారు. తనను గెలిపించే బాధ్యత వాళ్లే తీసుకున్నారని ధీమాగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ప్రచారం హోరెత్తుతోంది. ఊరూరా జనాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. అయితే.. జనం మాత్రం ఎటువైపు మొగ్గుచూపాలో స్పష్టంగా డిసైడయ్యారు. ఎవరు మాటలకే పరిమితమవుతారు ? ఎవరు చేతల్లో చూపిస్తున్నారు ? అన్న విషయంలో ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్లముందు కనిపిస్తున్న ప్రగతి, సంక్షేమం ముందు.. బయటినుంచి వచ్చి ఎవరు ఏం చెప్పినా వృథా ప్రయాసే అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

game 27032019

ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్‌ దూసుకుపోతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతోంది మహిళాలోకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే ప్రతి సభకూ మహిళలు వెల్లువలా వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు ముగ్ధులవుతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తాము పొందిన లబ్దిని గుర్తు చేసుకుంటున్నారు. తమకు తాము నెమరు వేసుకోవడమే కాదు.. బాహాటంగా సభలో చెబుతున్నారు. మహిళలు, ప్రధానంగా వృద్ధులు చంద్రబాబు సభావేదికపైకి ఎక్కి 'మళ్లీ మీరే రావాలి' అంటూ ఆశీర్వదిస్తున్నారు. తమ ప్రత్యక్ష అనుభవాలను జనం ముందుకు తీసుకువస్తున్నారు. ఇది.. స్వయంగా ఓ వృద్ధురాలు చెప్పిన పరిస్థితి. చంద్రబాబు ఇస్తున్న పెన్షన్‌తోనే బతుకుతున్నానని, బాబు వస్తున్నారని తెలిసి.. మళ్లీ ఆయనే రావాలంటూ పార్టీ నేతలతో కలిసి కొబ్బరికాయ కూడా కొట్టానని చెప్పుకొచ్చింది.

 

game 27032019

ఇది ఏ ఒక్కరో చెబుతున్న విషయం కాదు.. ఏ జిల్లాకు వెళ్లినా.. ఏ ఊళ్లో సభ నిర్వహించినా.. ఇలాంటి కథలు వినిపిస్తున్నాయి. ఇంటికి పెద్ద కొడుకులాగా చూసుకుంటానంటూ తమలాంటి పెద్దవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భరోసా మాటలకే పరిమితం కాదని, కళ్లముందు సాక్షాత్కరిస్తోందని ఆనందంగా చెబుతున్నారు. వాస్తవానికి మహిళా సెంటిమెంట్‌ను మించినది ఏదీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా సెంటిమెంట్‌ అడుగడుగునా హారతులు పడుతోంది. మహిళలు ఉవ్వెత్తున భావోద్వేగానికి గురవుతున్నారు. డ్వాక్రా, పసుపు కకుంకుమ, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు ఇలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల జడిలో తడిసిముద్దవుతున్నారు. చంద్రబాబుకు జై కొడుతున్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా హిట్‌ అవుతుంది. సాధారణంగా మహిళలకు రీచ్ అయితే, వాళ్ల ఆదరణ చూరగొంటే ఏదైనా సూపర్‌ హిట్‌ అవుతుంది. మొత్తానికి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలకు మహిళలు పోటెత్తుతున్నారు. చంద్రబాబు ప్రచార స్ట్రాటజీ కూడా మహిళల చుట్టూరా తిరుగుతోంది. ఆడపడుచుల అండతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. మహిళా సెంటిమెంట్‌ ప్రభంజనం వెల్లువలా పోటెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేడీస్‌ ఓటు బ్యాంక్‌ టీడీపీదే అన్న అంశం ఖాయమైపోయిందంటున్నారు విశ్లేషకులు. ఓవైపు సంక్షేమ పథకాల ఫలాలు, మరోవైపు లబ్దిదారుల స్పందన దీనికి నిదర్శనమంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read