గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడి హత్యకు కుట్ర యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిందితులు శ్రీనివాసరావు, శివకృష్ణ, పూర్ణచంద్రరావుల నుంచి రివాల్వర్‌, రెండు తపంచాలు, ఎనిమిది తూటాలు, ఆరు పిల్లెట్స్‌తోపాటు కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గుంటూరు పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు విద్యానగర్‌లో ఉంటున్న నల్లబోతుల శ్రీనివాసరావు గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే యరపతినేనికి అనుచరుడిగా వ్యవహరించి, కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. ఇందుకు కారణం ప్రస్తుత ప్రధాన అనుచరుడు వెంకటేశ్వరరావే అని భావించి కక్ష పెంచుకున్నాడు.

bjp 25032019

దీంతోపాటు ఓ భూవివాదంలో వెంకటేశ్వరరావుకు, శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. మరో నిందితుడు శివకృష్ణకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వారి మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఇందులో వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని, తనను హత్యచేసేందుకు కూడా కుట్ర చేశాడని శివకృష్ణ భావించాడు. ఈ నేపథ్యంలో నలబోతు శ్రీనివాసరావు, శివకృష్ణలు వెంకటేశ్వరరావు హత్యకు పథకం రూపొందించారు. శివకృష్ణ బావమరిది పూర్ణచంద్రరావు కూడా ఇందుకు సహకరించాడు. ఈ నెల 22న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం ఖరారుచేసుకోవటంతో అదే సమయంలో వెంకటేశ్వరరావును హత్య చేయాలని పఽథకం రూపొందించి ఆయుధాలను సమకూర్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కుట్రను భగ్నం చేశారు. పిస్టల్స్‌ను ఆగ్రాలో విఘ్నేష్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో రాజకీయ కారణాలు, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావాల్సి ఉందన్నారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు.

 

bjp 25032019

హత్యకు కుట్ర భగ్నం కేసులో పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. నామినేషన్‌ దాఖలు సమయంలో వెంకటేశ్వరరావుతో పాటు తేడా వస్తే ఎమ్మెల్యేను కూడా చంపాలని వారు పథకం రూపొందించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా నిందితులు కడపకు చెందిన వారితో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడకు వెళ్ళి వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కొద్ది నెలల నుంచే పల్నాడు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా పెట్టారు. పెద్ద ఎత్తున బైండోవర్లు, ముందస్తు అరెస్టులు, విస్తృత తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నిఘా వర్గాలు ఈ కుట్రను ముందస్తుగా గుర్తించాయి. దీంతో ఎన్నికల వేళ పెను ప్రమాదం తప్పింది. ఈ విషయమై ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందిస్తూ ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని తెలిపారు.

‘ఒకప్పడు కేవలం రూ.200 పింఛను మాత్రమే వచ్చేది. అది కూడా నెలా నెలా వచ్చేది కాదు.. దీంతో బువ్వ కోసం సానా కట్టాలు పడ్డాల్సి వచ్చేదయ్యా.. మా బంగారం చంద్రబాబు వచ్చాక కట్టాలు తీరిపోయాయి. చంద్రబాబు చల్లగా ఉండాలి. ఆ బాబుకి నా బోటి వారందరి ఆశీస్సులూ ఉంటాయి. ఆయన చల్లగా ఉండాల’ని ఒక వృద్ధురాలు దీవెనలు అందించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు శనివారం కాజులూరు మండలం అయితపూడిలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఎదురైన ఓ వృద్ధురాలు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. పింఛను సొమ్మును వెయ్యి రూపాయలు చేసి వృద్ధుల కష్టాలను చాలా వరకు తీర్చేశారని, ఇప్పుడు రెండు వేలు చేయడంతో మరింత సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

bjp 25032019

‘సానా సంతోసంగా ఉందయ్యా.. నా ఓటు చంద్రబాబుకే. అదే పార్టీలో ఉన్న నీవు కూడా తప్పకుండా గెలుస్తావు’ అంటూ తోట త్రిమూర్తులు చేతులు ముద్దాడింది. ఆ వృద్ధారాలు ఆపి చెప్పిన మాటలకు, భావోద్వేగానికి గురయ్యారు తోట త్రిమూర్తులు. ఎన్టీఆర్‌ భరోసా పింఛను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రూ.75లను పేదలకు పింఛనుగా అందించారు. ఈయన స్ఫూర్తితో చంద్రబాబు ప్రభుత్వ ఏర్పడిన ఈనాలుగున్నరేళ్ల నుంచి వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.1000లు పింఛను, దివ్యాంగులకు నెలకు రూ.1,500లు ఇస్తూ వచ్చారు. ఇటీవల ఒంటరి మహిళలను గుర్తించి వారి కి నెలకు రూ.1000 అందిస్తున్నారు. ఎన్నికల్లో నెలకు వెయ్యి పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చుస్తూ వచ్చారు.

bjp 25032019

సంక్రాంతి పండుగ ముందు సీఎం చంద్రబాబు పింఛను రెట్టింపు చేసి నిజమైన సంక్రాంతి చేసుకునేలా చేశారని ఆయనకు మాదీవెనలు ఎల్లప్పడూ ఉంటాయని లబ్ధిదారులు ప్రదర్శనలు చేస్తూ మళ్లీ ఆయన రావాలని కోరుకుంటున్నారు. ‘ఎంత భారమైనా ఫర్వాలేదు. నాకు కావాల్సింది పేదలు. అందుకే ఆలోచించా. ప్రతి నెలా ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతున్నా. గత ఎన్నికల సమయంలో ఇంటికి పెద్ద కొడుకు మాదిరి ఉంటానని హామీ ఇచ్చా. అందుకే పింఛను మొత్తాన్ని పెంచా. ఇంకా ఎంతో చేయాలనుకున్నా. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మళ్లీ మీకు పంచుతా...’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.

రాష్ట్రంలో రాజకీయం చెయ్యలేక, బీహార్ నుంచి అరువు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ముఖ్యంగా కుల గొడవలు పెట్టటం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చెయ్యటం, అనుమానాలు వచ్చేలా చెయ్యటంతో, ఈ బీహారీ బాబు దిట్ట.. బీహార్ లో ఏ విధంగా అయితే ఇది వరకు కుల గొడవలు పెట్టి, రాజకీయ లబ్ది పొందే వారో, అదే స్ట్రాటజీ ఇక్కడ మన రాష్ట్రంలో ప్రయోగించాలని, ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. మొన్నటికి మొన్న, చింతమనేని పై ఫేక్ వీడియో తిప్పారు. అలాగే గుంటూరులో రైతు చనిపోతే, పోలీసులు కొట్టి చంపారు అంటూ, హడావిడి చేసారు. పసుపు కుంకుమ అప్పు అంటూ, పుకార్లు పుట్టించారు. ఇలా అనేక విధాలుగా ప్రశాంత్ కిషోర్ టీం, మన రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేస్తుంది.

bihar 24032019

ఈ నేపధ్యంలో, ప్రశాంత్ కిషోర్ పై, జగన్ పై, చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చుని, వీళ్ళ రాజకీయం కోసం, ఏపిలో ఎలాంటి పనులు చేస్తున్నారో విమర్శిస్తూ వస్తున్నారు ప్రతి మీటింగ్ లో, ప్రశాంత్ కిషోర్ నిర్వాకాలు చెప్తూ వస్తున్నారు. అయితే, పాపం ప్రశాంత్ కిషోర్ ఈ మాటల పై హార్ట్ అయ్యారో, లేక తన గుట్టు అంతా చంద్రబాబు విప్పుతున్నారు, ఎప్పటికప్పడు, తనని దోషిగా ప్రజల ముందు నిలబెడుతున్నారు అనే అసహనంతో, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పై ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్ చేసారు. రాజకీయ కాంట్రాక్టు చేసుకునే ఒక బీహార్ వ్యక్తి, జగన్ అండ చూసుకుని, చంద్రబాబుని విమర్శించే స్థాయికి వచ్చాడు అంటే, బ్యూటీ అఫ్ డెమోక్రసీ అనుకోవటమే.

bihar 24032019

అయితే ఇది మర్చిపోక ముందే, ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. జేడీఎస్‌ ఉపాధ్యక్షుడు, వైసీపీకి రాజకీయ సలహాదారుడుగా ఉన్న ప్రశాంత్‌కిషోర్‌ను ‘బిహారీ బందిపోటు’ అని చంద్రబాబు అభివర్ణించడాన్ని తప్పుబడుతూ స్థానిక న్యాయవాది ఒకరు ఈ పిటిషన్‌ వేశారు. ఇటీవల ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీకి నేరపూరిత సలహాలిస్తూ రాష్ట్రంలో లక్షలాది ఓట్లు తొలగించేలా బిహారీ డెకాయిట్‌ (ప్రశాంత్‌కిషోర్‌) వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఓ న్యాయవాది... బిహారీలను అవమానించేలా ఏపీ సీఎం వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు... కేసును మార్చి 28కి వాయిదా వేసింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది. కేడర్‌ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఆ సమయంలో సహజంగానే టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి! అదంతా ఎన్నికలకే పరిమితం అని అంతా అనుకున్నారు. కానీ, కేసీఆర్‌ ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ప్రకటన చేశారు. బరాబర్‌ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామన్నారు. వైసీపీకి బహిరంగ మద్దతు ఇవ్వడంద్వారా చంద్రబాబును దెబ్బతీయడమే ఈ ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ అని అంతా భావించారు. కానీ... సీమాంధ్ర నేతలు, పారిశామ్రిక వేత్తలు, సినీ ప్రముఖుల ఆస్తులను అస్త్రంగా చేసుకుని తెరవెనుక తతంగం నడిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘‘చంద్రబాబు ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ రోజైనా మళ్లీ తెలంగాణలో రాజకీయం చేయగలరు! ఆ అవకాశాలు తగ్గించాలి.

bjp 25032019

జగన్‌ ఆస్తులూ, కేసులూ అన్నీ హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. ఆయన టీఆర్‌ఎస్‌ చేతి నుంచి జారిపోలేరు. ఏపీలో మనం చెప్పినట్లు వినే ప్రభుత్వం ఉంటే... తెలంగాణలోనూ రాజకీయంగా వెలిగిపోవచ్చు. ఇదే టీఆర్‌ఎస్‌ వ్యూహం. అందుకే... వైసీపీకి అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఈ వ్యూహంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే... సీమాంధ్ర భవిష్యత్తుకే ముప్పు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు మరింత అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. స్వరాష్ట్రంలో బలమైన ప్రభుత్వముంటేనే సీమాంధ్రులు ఎక్కడున్నప్పటికీ ఆత్మగౌరవం నిలుస్తుంది’ అని టీడీపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు తమ రాజకీయ ఆసక్తుల మేరకు పార్టీలకు విరాళాలిస్తుంటారు. ఎందుకైనా మంచిదని రెండు ప్రధాన పార్టీలకూ నిధి సమకూర్చే వారూ ఉంటారు. అయితే... ఈసారి హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ పెద్దలు కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టారు. ‘టీడీపీకి ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల విరాళాలు ఇవ్వొద్దు. ఆర్థికంగా వైసీపీకి మాత్రమే సహకరించండి’ అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ పరిశ్రమలు, ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉండటంతో కిమ్మనకుండా ‘తల ఊపి’ వచ్చేశారు.

 

bjp 25032019

సినిమా వాళ్లకూ, తెలుగుదేశానికీ మధ్య బలమైన బంధం ఉంది. ఎన్టీఆర్‌ ప్రారంభించిన పార్టీ కావడం, మొదటి నుంచీ సినిమా వాళ్లకూ అవకాశాలు ఇవ్వడం దీనికి కారణం. సినీ పరిశ్రమ ఎన్టీఆర్‌ హయాంలోనే హైదరాబాద్‌కు వచ్చింది. సినీ ప్రముఖుల్లో అత్యధికులు సీమాంధ్రులే! ఇప్పుడు వారిపైనా రాజకీయ పడగ కదలాడుతోంది. ‘సినీ పరిశ్రమకు చెందిన వారు వైసీపీ వెంట ఉన్నారు’ అనే సంకేతాలు పంపేందు కు రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. తనమానాన తాను సినిమాలు, సంబంధిత వ్యవహారాలు చూసుకుంటున్న ఒక సినీ ప్రముఖుడిని... ‘ఒకసారి లోట్‌సపాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసి రండి’ అని తెలంగాణ నాయకుడొకరు ఆదేశించారు. ఎన్నడూ లేని విధంగా సినీ రంగానికి చెందిన చిన్నా పెద్దా నటులు, ప్రముఖులు వరుసగా వైసీపీలో చేరుతుండటం గమనార్హం!

Advertisements

Latest Articles

Most Read