నిన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ జిల్లా పెందుర్తి సబ్బవరం జంక్షన్ లో జరిగిన రోడ్ షోలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రధానంగా విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు అందరూ పేపర్లు చదవాలని, జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో బయటికొస్తాయని తెలిపారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో తనపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి ఒక్కటీ వెల్లడించాల్సిందేనని అన్నారు. అయితే, ఈ రోజు పేపర్లు చూసిన వారికి, నిజంగా కొన్ని ఆసక్తి విషయాలు తెలిసాయి. జగన్ చెప్పేవి అన్నీ అబద్ధాలు అని, సాక్షి రోజు కొట్టే డబ్బా అంతా పచ్చి అబద్ధమని తేలింది. ఎందుకంటే, ఇవి ఎన్నికల కమిషన్ కు ఇచ్చే వివరాలు. ఇక్కడ ఏది దాయటానికి ఉండదు.

paper 23032019

ముందుగా జగన్ గురించి చూస్తే, తన మీద ఉన్న సిబిఐ, ఈడీ కేసులు అన్నీ ఎత్తేసారు అంటూ హడావిడి చేసారు. తన పేపర్ లో, సోషల్ మీడియాలో హడావిడి చేసారు. అయితే నిన్న జగన్ ఇచ్చిన అఫిడవిట్ లో బండారం బయట పడింది. డప జిల్లా పులివెందులలో శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

paper 23032019

ఇక చంద్రబాబు విషయానికి వస్తే, చంద్రబాబు పై 18 కేసులు ఉన్నాయాని, అవన్నీ స్టేలు తెచ్చుకున్నారని, ఇలా సంవత్సరాలుగా దొంగ ప్రచారం చేసారు. నిజానికి ఆయన మీద ఉన్న రాజకీయ కేసులు, ఎప్పుడో కొట్టేసారు. కొన్ని అయితే అసలు కోర్ట్ పరిగణలోకి కూడా తీసుకోలేదు. కేవలం చంద్రబాబు పై బురద చల్లటానికే అని కోర్ట్ లు కొట్టేసాయి కూడా. అయినా, ప్రతి సారి, చంద్రబాబు పై 18 స్టేలు ఉన్నాయని, మా జగన్ ధైర్యంగా విచారణ ఎదుర్కుంటున్నారు అంటూ డబ్బా కొట్టే వారు. కాని జగన్ ఎన్ని సార్లు, స్టే కావాలని కోర్ట్ ని అడిగింది, ఇది స్టే ఇచ్చే కేసు కాదు, విచారణ జరగాలి అని, కింద కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ దాక చెప్పింది మాత్రం చెప్పరు. ఇది ఇలా ఉంటే, నిన్న చంద్రబాబు ఇచ్చిన అఫిడవిట్ లో, ఆయన మీద ఉన్న పెండింగ్ కేసు ఒకటే ఒకటి అని తేలింది. అది కూడా బాబ్లీ కేసు, ఒక ప్రాంత ప్రయోజనాలు కోసం అక్కడి ప్రజల కోసం చేసిన దర్నా మీద కేసు. ఇది ఇద్దరి నాయకులకు తేడా. అందుకే చంద్రబాబు, ఈ రోజు అందరినీ పత్రికలు చూడమంది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై పులివెందుల సీఐ శంకరయ్యను సస్పెండ్‌ చేసినట్లు కర్నూలు రేంజ్‌ డీఐజీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. ‘మాజీ మంత్రి వివేకా హత్యకు గురైన వెంటనే ఆ సమాచారం అందడంతో సీఐ శంకరయ్య సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసినా ఆయన అడ్డుకోలేదు. హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని బాత్రూమ్‌ నుంచి తరలించారు. తలకున్న గాయాలకు కుట్లు వేసి, బ్యాండేజీ వేశారు. ఈ విషయంలో నిందితులకు సహకరించారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సీఐని సస్పెండ్‌ చేశాం. తదుపరి విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాం’ అని డీఐజీ చెప్పారు.

pulivendula 22032019

ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై స్పందించి, సమీక్ష నిర్వహించే అధికారం సీఎం చంద్రబాబుకి ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తనను కలిసి, సిట్‌ దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సిట్‌ విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని అన్నారని తెలిపారు. సీఎం చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు సిట్‌ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని సునీత చెప్పారన్నారు.

pulivendula 22032019

అయితే వివేకా హత్యపై టీడీపీ, వైసీపీ ఇరువైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు. సునీతా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం అడగాలా? కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలా? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని, ఎన్నికల సంఘానికి ఆ అధికారం లేదని ద్వివేది చెప్పారు. కాగా, వివేకా కుమార్తె సునీత గురువారం అమరావతిలో సీఈవో ద్వివేదిని కలిశారు. బుధవారం విలేకరులకు ఏం చెప్పానో అవే అంశాలను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు రూపంలో ఇచ్చామని ఆమె అన్నారు.

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లా సాలూరు రోడ్‌షో లోపాల్గొన్న చంద్రబాబునాయుడు జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బాబాయ్‌ని ఇంత దారుణంగా చంపేసి, ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారు. ‘ముందు నాటకం, తర్వాత నేనే (చంద్రబాబు) చంపానని బూటకం. ఆ తర్వాత డ్రైవర్‌ను రమ్మంటే చంపేశాడని లెటర్ రాశారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చీఫ్ క్రిమినల్ అంట. ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క కేసైనా ఉందా? వారి జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికి ఒక రౌడీ తయారవుతాడు.’ అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

pulivendula 22032019

వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. తనను చూస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ మోహన్ రెడ్డిని చూస్తే పరిశ్రమలు పారిపోతాయన్నారు. ఆయన గతంలో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లను జైలుకు తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీలో యువత కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతుంటే వైసీపీలో యువతకు సారా పోయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయ్. జగన్‌ను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి. జగన్ జైలుకు తీసుకుపోతారని అందరకీ భయం. నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఉండవని, వాటాలు అడగబోమని అందరూ నా దగ్గరికి వస్తారు. జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు... జైలుకు తీసుకెళ్తారు. ఇంతకు ముందు చాలా మందిని జైలుకు తీసుకెళ్లారు. వైసీపీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తారు. జాగ్రత్త. అది పనికిమాలిన పార్టీ. నేరాల చిట్టా.’ అని చంద్రబాబునాయుడు అన్నారు.

pulivendula 22032019

కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి పంపించారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న లీడర్లను కేసీఆర్ భయపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఐటీ దాడులతో మోదీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారని అన్నారు. ఒక్కసారి వైసీపీకి అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటారని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం శాశ్వతంగా అంథకారం అయిపోతుందన్నారు.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఉన్న అత్యున్నతమైన ఆస్తి యువతేనని అన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు నిరుద్యోగ భృతి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన రోడ్‌షోలో నిరుద్యోగ భృతిపై మాట్లాడుతూ... ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తున్న రూ.2వేలకు మించి ఎక్కువ భృతిని చెల్లిస్తామని ప్రకటించారు. యువతకు తానే ఓ సంరక్షుడిగా ఉంటానని..అన్నారు. అంతేకాకుండా అభివృద్ధిని అడ్డుకొనేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, అంతేకాకుండా టీడీపీ నాయకుల ఆస్తులపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి వీధిలో ఒక రౌడీ తయారవుతారని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని.. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లే తనకు శత్రువులని పేర్కోన్నారు.

pulivendula 22032019

‘‘ఉత్తరాంధ్రను అగ్రగామిగా నిలిపేందుకు తగిన ప్రణాళికను రూపొందించాం. గోదావరి-పెన్నా-నాగావళి-వంశధార-బాహుదా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జులై నాటికి గ్రావిటీ ద్వారా విశాఖపట్నంకు నీళ్లిస్తాం. ఇప్పుడున్న ప్రజల తలసరి ఆదాయం రూ.1.65 లక్షల నుంచి రూ.3.50 లక్షలకు పెంచి, పెరిగిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తాం. అభివృద్ధిని 13 జిల్లాల్లోనూ వికేంద్రీకరిస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున పోటీచేస్తున్న లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సాలూరు సభలో అరకు పార్లమెంటు అభ్యర్థి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌, సాలూరు అసెంబ్లీ అభ్యర్థి ఆర్‌.పి.భంజ్‌దేవ్‌, మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు; చీపురుపల్లి సమావేశంలో విజయనగరం తెదేపా ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

pulivendula 22032019

‘‘నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి. జగన్‌ని చూస్తే పరిశ్రమలు పారిపోతాయి. నేను అధికారంలో ఉంటే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులుండవని అందరూ నా దగ్గరకు వస్తారు. అదే జగన్‌ అయితే వారి నుంచి వాటాలు తీసుకోవడమే కాకుండా వారిని జైలుకి తీసుకుపోతారు. ఐఏఎస్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు అలాగే జైలుకి వెళ్లారు. యువతకి నేను చెప్పేది ఒకటే. వైకాపాకు సహకరిస్తే మీకు తెలియకుండానే నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తారు. ఆ పార్టీయే ఓ నేరాల చిట్టా. ఆంధ్రప్రదేశ్‌లో మేం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావట్లేదు. గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయేవరకూ ప్రతి దశలోను సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. రాబోయే రెండేళ్లలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీరిస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read