వైఎస్ జగన్‌కు ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి షాకిచ్చారు. ఎన్నికల ప్రచారం నుంచి అకస్మాత్తుగా ఆయన కనిపించకుండాపోవడం ఒంగోలు వైసీపీని షాక్‌కు గురిచేసింది. గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి మళ్లీ టికెట్ తనదేనని భావించారు. అయితే.. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పార్టీలో చేర్చుకున్న జగన్.. ఆయనకు ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని ఖరారు చేశారు. ఈ పరిణామంతో కంగుతిన్న వైవీ సుబ్బారెడ్డి జగన్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్ తనకు టికెట్ కేటాయించకపోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమై ఉండొచ్చని వైవీ అనుమానంతో ఉన్నట్లు సమాచారం

court 23032019

ఇక మరో పక్క ఒంగోలు పార్లమెంట్ లో రసవత్తర పోరు జగుతుంది. ఒంగోలు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా తొలుత మాగుంట పేరే ఖరారైంది. కానీ ఐటీ, సీబీఐ దాడుల భయంతో ఆయన ఆకస్మికంగా వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీకి ఈ సీటే పొందడం గమనార్హం. ఆయన్ను సమర్థంగా ఎదుర్కోవడానికి సీఎం చంద్రబాబు వ్యూహరచన చేశారు. దర్శి టీడీపీ అభ్యర్థి, మంత్రి శిద్దాను ఒంగోలు పార్లమెంట్ బరిలోకి దించారు. జనసేన తన అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబాను పోటీకి నిలిపినా.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ నడుమే ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

court 23032019

గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఇక్కడ పోటీచేసి.. మాగుంటపైనే గెలిచిన జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి.. ఈ సారి తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వర్గం ఏ దశలోనూ మాగుంటకు సహకరించడం లేదు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీసీలు, దళిత ఓటర్లు అత్యధికం. అగ్రవర్ణాల్లో రెడ్డి సామాజిక ఓటర్లు అధికం. ఆ తర్వాత కమ్మ, కాపు ఓటర్లు ఇంచుమించు సమానం. ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు అటు ఇటుగా సమాన స్థాయిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం సామాజిక సమతూకం పాటించిందని విశ్లేషకులు అంటున్నారు.

కడప జిల్లాలో తెదేపా వైరివర్గాలు ఒక్కటవుతున్నాయి. ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ నాయకులంతా మిత్రులుగా మారుతున్నారు. తాజాగా కమలాపురం నియోజకవర్గంలో విరోధులుగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి, వీర శివారెడ్డి ఒక్కటయ్యారు. పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని ముందుకొచ్చారు. జమ్మలమడుగు తరహాలో వీరిని కూడా కలిపేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి. కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మూడు దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఒకరు కడప ఎంపీ స్థానానికి, మరొకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానానికి తెదేపా అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

court 23032019

ఇదే తరహాలో కమలాపురంలో కూడా పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఒక్కటయ్యారు. వీరిమధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కమలాపురం స్థానాన్ని పుత్తా నరసింహారెడ్డికి తెదేపా కేటాయించింది. దీంతో వీరశివారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో శుక్రవారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వీర శివారెడ్డికి ఫోన్‌ చేశారు. కడప ఎంపీ, కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన మంకుపట్టు వీడారు. ఈ మేరకు శనివారం ఉదయం కమలాపురం వెళ్లి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు తెలపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అనంతరం పుత్తానరసింహారెడ్డితో భేటీ అయ్యారు.

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో ఓ పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి కావడానికి రాష్ట్ర బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప బీజేపీ కేంద్ర నాయకులకు దాదాపు రూ.1800 కోట్లు ముడుపులుగా చెల్లించారని ‘కారవాన్‌’ పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఒక్క బీజేపీ సెంట్రల్‌ కమిటీ సభ్యులకే దాదాపు 1000 కోట్లు ఇచ్చారనీ, వీటికి తోడు ప్రస్తుత మంత్రులు అరుణ్‌ జైట్లీ, నితిన్‌ గడ్కరీలకు రూ.150 కోట్లు, రాజ్‌నాథ్‌సింగ్‌కు రూ. 100 కోట్ల చొప్పున చెల్లింపులు జరిగాయనీ, ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలకు చెరి 50 కోట్ల చెప్పున చెల్లించారనీ. వీరే కాక పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులకు రూ.150 కోట్లు ముడుపులు చెల్లించారనీ ఆ పత్రిక పేర్కొంది. ‘దాదాపు రూ.250 కోట్లను జడ్జీలకు, లాయర్లకు ఇచ్చారు’’ అని కారవాన్‌ రాసింది గానీ వారి పేర్లు వెల్లడించలేదు. నితిన్‌ గడ్కరీ కుమారుడి పెళ్లికి రూ.10 కోట్లు ఇచ్చినట్లు కూడా వెల్లడించింది.

court 23032019

ఈ ముడుపులకు సాక్ష్యంగా- ఎవరికెంత ఇచ్చినదీ ఓ డైరీలో రాశారని అంటూ పేజీలను ప్రచురించింది. అక్రమ మైనింగ్‌ ద్వారా వందల కోట్లు ఆర్జించిన బళ్లారి బ్రదర్స్‌- గాలి జనార్దనరెడ్డి అండ్‌ కో ఈ డబ్బు సమకూర్చారనీ ‘కారవాన్‌’ ఆ కథనంలో వెల్లడించింది. ‘సీఎంను అయ్యేందుకు యడ్యూరప్ప అనే నేను నేతలకు డబ్బులిచ్చాను’ అని ఉందని కారవాన్‌ కథనం. విశేషమేమంటే ఈ డైరీని కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత మంత్రి డీకే శివకుమార్‌ ఇంటి నుంచి 2017లో జరిపిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి అది ఐటీ, సీబీడీటీ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఐటీ, సీబీడీటీలు రెండూ శుక్రవారం విడివిడిగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. యడ్యూరప్ప ఇంటినుంచి చోరీ అయిన ఆ డైరీ అటుతిరిగి-ఇటు తిరిగి కాంగ్రెస్‌ నేతల చేతికి, అది కూడా డీకే చేతికి చేరిందన్నది కారవాన్‌ కథనం. ఆయన ఒరిజినల్‌ ఎక్కడో దాచిపెట్టి- బీజేపీ అగ్రనేతలకు చెల్లింపులు జరిపిన వివరాలున్న జిరాక్స్‌ కాపీలను తన అల్మారాలో పెట్టారనీ, అవే ఐటీ దాడుల్లో దొరికాయన్నది మరో కథనం.

court 23032019

ఈ డైరీ వివరాలు బయటకు పొక్కడంతో కాంగ్రెస్‌ వెంటనే దాడి ప్రారంభించింది. బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని రాహుల్‌గాంధీ ట్విటర్‌లో తీవ్రంగా విమర్శించారు. ‘నోమో (మోదీ), షా, రాజ్‌నాథ్‌... బీజేపీ చౌకీదారులంతా చోరులే’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమార్కులతో కలిసి రాష్ట్రాన్ని లూటీ చేసి బీజేపీ అధిష్ఠానం పెద్దలకు వందల కోట్లు ముడుపులు చెల్లించారని సీఎం కుమారస్వామి ఆరోపించారు. దీనిపై లోక్‌పాల్‌తో విచారణ జరపాలని ఆయన కూడా డిమాండ్‌ చేశారు. డైరీలోని మరో పేజీలో... ‘నన్ను సీఎంను చేయడంలో గాలి జనార్దన్‌రెడ్డి కీలక వ్యక్తి’ అని రాసుకుని యెడ్డీ సంతకం చేసినట్లు కనిపిస్తోంది. ఆ కింద ఎవరెవరికి ఎంత ఇచ్చారో ప్రస్తావించారు. నరేంద్ర స్వామికి రూ.20కోట్లు, జి.శేఖర్‌కు రూ.10కోట్లు, జే బాలచంద్రా, డి.సుధాకర్‌, శివనగౌడ, వేంకటరమణప్ప, నారాయణ స్వామి, ఆనంద్‌కు రూ.20 కోట్ల చొప్పున ఇచ్చినట్లు ఉంది. డైరీలోని మరో పేజీలో విరాళాల రూపంలో రూ.2,690 కోట్లు యడ్యూరప్ప తీసుకున్నట్లు ఉంది.

 

లక్షల్లో జీతం... భద్రతతో కూడిన జీవితం... ఆక్షేపణలకు దూరంగా అందలాలకు దగ్గరగా అమెరికాలో జీవిస్తోన్న ఆమె అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసింది. తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని మెప్పించిన ఆమె వాక్చాతుర్యం ఎమ్మెల్యే అభ్యరిగా ఆయనలో నమ్మకం కలిగించింది. తండ్రి స్థానంలో తనకే అవకాశమన్న సీఎం ప్రతిపాదనకు ఆశ్చర్యపోయింది. నిన్నటిదాకా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమార్తెగా పరిచయస్తురాలైన షబానా ఖాతూన్‌ తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆమె మాట్లాడుతూ, "పుట్టి, పెరిగింది, చదువు అంతా విజయవాడలోనే. 22 ఏళ్ల వరకు విజయవాడలోనే ఉన్నాను. వివాహానంతరం అమెరికా వెళ్లాను. ఏరోజూ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించలేదు. నా కుటుంబం, నేను అంతే.. చాలనుకునేదాన్ని. ఇక్కడ ఒక ఐటీ సంస్థ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని 2019 జనవరిలో కలిశాం."

court 23032019

"ఆ సమావేశంలోనే నాన్న స్థానంలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమిచ్చారు. అమ్మనాన్నతో మాట్లాడి చెబుతానన్నా. ఆయన భుజం తట్టి పంపారు. తర్వాత అమ్మతో మాట్లాడితే కొంత వెనకడుగేసింది. కానీ నాన్న, నా భర్త వెన్నంటి ప్రోత్సహించారు. రాజకీయం భయపడేది కాదు... సేవ చేసేదంటూ నాన్న వెన్ను తట్టారు. బీఏ లిటరేచర్‌ పూర్తయ్యాక కాలిఫోర్నియాలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేశాను. అప్పట్లో కుటుంబమే నా ప్రపంచం. నా భర్త ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ప్రధానోద్యోగిగా ఉన్నారు. ఆయన ఆలోచనతోనే అమరావతిలో ఐటీ కంపెనీ నెలకొల్పాలని విజయవాడకు వచ్చాను. ఎన్నోసార్లు ఇక్కడకు వచ్చినా ఈసారి రాక మాత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి’ అన్న సీఎం ప్రతిపాదనతో ఆశ్చర్యపోయాను."

court 23032019

అయితే మొదట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ప్రచారంలోకి వెళ్లాక టీడీపీపై, నాన్నపై స్థానికులు చూపిస్తున్న అభిమానంతో పాటు పలు సమస్యలు నాలో పోటీతత్వాన్ని ప్రేరేపించాయి. ఇపుడు నా లక్ష్యం గెలుపు మాత్రమే కాదు.. టీడీపీ నమ్మకాన్ని నిలబెట్టడం కూడా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 70ు కొండ ప్రాంతమే. కొండ ప్రాంత నివాసితులు ఇక్కడ 40వేలకు పైగా ఉన్నారు. స్థానిక మురికివాడల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లను కలుసుకున్నాను. వాళ్లకు సరైన సమయంలో వైద్యం అందకే దివ్యాంగులుగా మారుతున్నారు. అమెరికాలో దివ్యాంగులకు ఇతరులతో సమానంగా ఉపాధి, వైద్య అవకాశాలు పుష్టిగా ఉన్నాయి. నా తొలి లక్ష్యం కూడా అదే. ముఖ్యమంత్రితో సంప్రదించి నియోజకవర్గ దివ్యాంగులకు అందరికి సమానమైన ఉపాధితో పాటు వారికి వైద్యం అందుబాటులోకి తెచ్చేలా చేస్తాను. ముస్లిం మహిళలపై వివక్ష అనేది నా చిన్నప్పటి మాట. ఇపుడు మగాళ్లతో పోటీగా మహిళలు కూడా పోటీపడుతున్నారు. సౌదీలాంటి దేశాల్లో కూడా మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేస్తున్నారు. చైతన్యవంతమైన రంగాల్లో ముందుంటున్నారు. ఇస్లామిక్‌ దేశాల్లోనూ వివక్ష క్రమేణా సమసిపోతున్న తరుణంలో స్వేచ్ఛాయుత భారతదేశంలో ముస్లిం మహిళగా రాజకీయాల్లోకి రావడం ఇప్పటికే ఆలస్యమైంది. నాలాంటి మహిళలు మరికొందరికి స్ఫూర్తిగా నిలబడాల్సిన అవసరం ఉంది." అంటూ చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read