ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు ఎంతప్రభావం చూపుతున్నాయో తెలియంది కాదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు సోషల్‌ మీడియాకు మించిన అస్త్రం లేదు. అయితే యువతను లక్ష్యంగా చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్‌ నామ స్మరణ చేస్తున్నాయని తాజాగా ఫేస్‌బుక్‌ విడుదల చేసిన డేటాలో రుజువైంది. ఫేస్‌బుక్‌ వేదికగా భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో ప్రకటనలు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ భారీగానే వెచ్చిస్తోంది. అయితే రాజకీయ నేతల్లో అత్యధికంగా ప్రకటనలకు వెచ్చిస్తున్న వ్యక్తి మాత్రం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌. 2019 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు తీసుకున్న వివరాల ప్రకారం ఫేస్‌బుక్‌ ఈ డేటాను విడుదల చేసింది.

bjp 11032019

భారత్‌లో ఫేస్‌బుక్‌కి వస్తున్న రాజకీయ ప్రకటనల్లో భాజపా, ప్రో-మోదీ పేజీలవే ఎక్కువ. ఇవే ప్రకటనలకు ఖర్చు చేస్తున్నాయి. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్‌ మాత్రం లేదు. ఎందుకంటే గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్‌ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. ఫేస్‌బుక్‌ డేటా ప్రకారం... ‘భారత్‌ కే మన్‌ కీ బాత్‌’ పేజీ నుంచి ఫేస్‌బుక్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సంఖ్యలో ఫీడ్ బ్యాక్‌ వెళ్తోంది. ఇందుకుగానూ ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. 24 రోజుల్లో ఈ పేజ్‌ ద్వారా 1,556 ప్రకటనలు ఫేస్‌బుక్‌కు వెళ్లాయి.ఇందుకు గానూ రూ.1.2కోట్లు ఖర్చయ్యింది. అంటే ఒక్కో ప్రకటనకు రూ.7,700 వెచ్చించారన్న మాట. ఇక ప్రో-నరేంద్ర మోదీ పేజీకి సామాజికమాధ్యమాల వేదికగా 3లక్షల మంది ఫాలోవర్లున్నారు.

bjp 11032019

‘నేషన్‌ విత్‌ నమో’ అనే పేజీకి 1.1 మిలియన్‌ మంది ఫాలోవర్లున్నారు. ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వడంలో ఇది రెండో స్థానంలో ఉంది. ఫిబ్రవరి నుంచి ఈ పేజీ 1,074 ప్రకటనలు ఇవ్వగా ఇందుకు గానూ రూ.64 లక్షలు వెచ్చించింది. అంటే ఒక్కో ప్రకటన వెల రూ.6,000. ఇక ఈ జాబితాలో ‘మైగవ్‌ఇండియా’ మూడో స్థానంలో ఉంది. ఇది 123 ప్రకటనలకు గానూ రూ.34లక్షలు వెచ్చింది. ఒక్కో ప్రకటన వెల రూ.27 వేలు. ఈ పేజీకి 3,70,000మంది ఫాలోవర్లున్నారు. నాలుగో స్థానంలో న్యూస్‌ యాప్ అయిన ‘డైలీ హంట్‌’ ఉంది. ఇది ఒక్కో ప్రకటనకు రూ.2లక్షలకు పైగా వెచ్చించి ఇప్పటివరకు 16 యాడ్లకు గానూ రూ.33లక్షలు చెల్లించింది. సగటున ఎంతంటే..? బేబీ చక్ర అనే అన్‌లైన్‌ పేరెంటింగ్‌ యాప్‌ ఒక్కో ప్రకటనకు సగటున రూ.6.2 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. ఇక డైలీ హంట్‌ ఒక్కో యాడ్‌కు రూ.5.4 లక్షల చొప్పున ఖర్చు చేస్తోంది. ఇక ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో నిలిచింది. సగటున భాజపా ఒక్కో యాడ్‌కు రూ.3.3లక్షల చొప్పున ఖర్చు పెడుతోంది.

మిష్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం మామూలు పదం కాదు. అప్పటి దాక మోడీకి ఎదురు లేదు అనుకున్న టైంలో, మొదటి సారి మోడీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగాడు ఆంధ్రుడు. మమ్మల్ని అన్యాయం చేస్తున్నావ్ అని నినదించారు. ప్రజల ఆకాంక్షను, అదే విధంగా తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో వినిపించారు. అయితే, ఇప్పుడు కాలం తీరిపోయిన 16వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీల్లో గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌ అన్ని విభాగాల్లోనూ దుమ్ముదులిపారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. 120 చర్చల్లో పాల్గొనడమే కాకుండా ఆరు ప్రైవేట్‌ మెంబరు బిల్లులు ప్రవేశపెట్టారు. 495 ప్రశ్నలు సంధించారు. సభలో ఆయన హాజరు 85శాతంగా ఉంది. 98 చర్చల్లో పాల్గొని శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు రెండోస్థానంలో నిలిచినట్లు పార్లమెంట్‌ అధ్యయన సంస్థ పీఆర్‌ఎస్‌ పేర్కొంది. 2014 జూన్‌ 1 నుంచి 2019 ఫిబ్రవరి 13వ తేదీ మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా సిద్ధం చేశారు.

galla 11032019 1

అరకు ఎంపీ కొత్తపల్లి గీత 93 చర్చల్లో పాల్గొనడమే కాకుండా అత్యధికంగా 599 ప్రశ్నలు సంధించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదు. ఎస్పీవై రెడ్డితోపాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ ఒక్క ప్రశ్నా అడగలేదు. అందరికంటే తక్కువగా నంద్యాల ఎంపీ సభలో హాజరు 13 శాతంగా ఉంది. ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం ఎంపీ పి.అశోక్‌గజపతిరాజు కేంద్రమంత్రిగా పనిచేయడంతో జాబితాలో ఆయన హాజరు 100శాతంగా చూపించారు. ఏపీకి చెందిన ఎంపీల పనితీరు లోక్‌సభలో ఇలా ఉంది.

డేటా చోరీ కేసులో విజయసాయి రెడ్డి 19.02.2019న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ - ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు. ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఇచ్చింది ఫిబ్రవరి 22న. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా పొరపాటున పెట్టి ఇచ్చారు.

vs 11032019

సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి..? ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి..? కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్‌లో అన్నీ రాశారు. ‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం, సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్ కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం.... కొందరు మంత్రులను కూడా టార్గెట్ చేయాలని రాశారు. ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. ఇది విజయసాయి ప్లాన్ అఫ్ ఆక్షన్..

vs 11032019

అయితే ఈ ప్లాన్ అఫ్ ఆక్షన్ లో, కొంత భాగం కేసీఆర్ మొదలు పెట్టగా, ఇప్పుడు ఇందులో మరో పాయింట్ జరిగేలా చూడటానికి బీజేపీ బయలుదేరింది. డేటా చోరీపై సీబీఐ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధరన్‌, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు, ఎమ్మెల్సీ మాధవ్‌ కలిసి వినతి పత్రం అందించారు. ‘‘ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఓటర్ల జాబితా నుంచి అనుకూలంగా లేని వారిని తొలగించి టీడీపీ బోగస్‌ ఓట్లను చేర్చింది. సీనియర్‌ ఉన్నతాధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. సాధికార మిత్ర కోసం నియమించుకున్న 4 లక్షల మందిని బాధ్యతల నుంచి తప్పించాలి. బోగస్‌ ఓట్ల తొలగింపునకు సమయం లేదని కమిషనర్‌ అన్నారు’’ అని తెలిపారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మొరవపల్లెలో పలువురు వైసీపీ నేతలను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నేతల నుంచి ఓటరు లిస్ట్, ఫామ్ 6, 7 పత్రాలను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, తమ ఓట్లను తొలగించేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు.

police 11032019

మరో పక్క, విశాఖలో వేలాది ఓట్లను తొలగించడానికి కుట్ర జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. జాబితాల నుంచి పేర్లను తొలగించాలంటూ భారీగా దరఖాస్తులు రావటం, దీని వెనుక అక్రమాలున్నట్టు ఆరోపణలు రావటంతో పోలీసులు కూపీ లాగారు. ఒక్కొక్కరు పది నుంచి 85 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారని గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటు తొలగించాలని తాము అసలు దరఖాస్తే చేయలేదంటూ వచ్చిన ఫిర్యాదులను తహసిల్దార్లు పోలీసులకు బదిలీ చేశారు. ఈమేరకు నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 14 పోలీసుస్టేషన్లలో మొత్తం 15 కేసులు నమోదయ్యాయి.

police 11032019

వేలాది ఓట్లను తొలగించడానికి సుమారు 419 మంది దరఖాస్తు చేసినట్టు గుర్తించి, వీరిలో సుమారు 200 మందితో పోలీసులు మాట్లాడారు. తామసలు ఆ దరఖాస్తులే చేయలేదని వారంతా స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. తొలగింపు కోసం దరఖాస్తు చేయడానికి ఓటరు జాబితాల్లోని సమాచారాన్నే అక్రమార్కులు ఉపయోగించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక ప్రాంతంలోని ఓట్లను తొలగించడానికి ఆ ప్రాంతవాసుల ద్వారానే ఫారం-7 నింపి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కేసులు వాస్తవమని తేలితే దరఖాస్తుదారులకు ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read