కోడి కత్తితో సొంత పార్టీ కార్యకర్త చిన్నగా గుచ్చితే, జగన్ మోహన్ రెడ్డి అండ్ కొ చేసిన హడావిడి చూసాం. ప్రతి రోజు మన ఇంట్లో ఆడవాళ్ళకు అయ్యే కత్తి పీట గాయం కంటే చిన్న దెబ్బ తగిలితే, దానికి జగన్ బ్యాచ్ చేసిన హంగామా, మోడీ సహాయంతో, ఎన్ఐఏ కు కేసు బదలాయించటం, అక్కడ బకరా అవ్వటం, ఇలా అన్నీ మన కళ్ళ ముందే జరిగాయి. అయితే ఏపిలో మాత్రమే జగన్ బకరా అయితే సరిపోదు అనుకున్నాడో ఏమో కాని, ఈ రోజు విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నతో, జగన్ పరువు నేషనల్ లెవెల్ లో పోయింది. దేశమంతా జగన్ పై ఎదో హత్యాయత్నం జరిగిందని అనుకున్నారు. కాని అది కోడి కత్తి గుచ్చుడు అని, డ్రామా అని తెలియదు. ఎందుకంటే వారు మన ఏపి వార్తలు ఫాలో అవ్వరు కదా.

kodi 06022019 1

అయితే, ఈ రోజు విజయసాయి రెడ్డి, వేసిన ప్రశ్నతో, దేశం మొత్తం జగన్ కు ఏమి అవ్వలేదని తెలిసిపోయింది. కోడికత్తి దాడిలో జగన్‌కు చిన్న దెబ్బే తగిలిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ అన్నారు. నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. దీనిపై ఎన్‌ఐఏ కేసును దర్యాప్తు చేస్తోందని.. బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హన్స్‌రాజ్‌ సమాధానంగా చెప్పారు. జగన్ కు చలా మైనర్ ఇంజురీ అయ్యింది అంటూ, కేంద్ర మంత్రి చెప్పటంతో, పాపం మరోసారి జగన్ ఆడిన డ్రామా ప్రజలకు గుర్తు చేసాడు విజయసాయి. అది పెద్ద దెబ్బ, పెద్ద దెబ్బ, పెద్ద దెబ్బ ని జగన్ బ్యాచ్ హడావిడి చేస్తుంటే, కాదు చిన్న దెబ్బ, చిన్న దెబ్బ, చిన్న దెబ్బ అంటూ విజయసాయి ఒకటికి పది సార్లు చెప్పిస్తూ, జగన్ పరువు తీస్తున్నాడు.

kodi 06022019 1

మరో పక్క, జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పలు అంశాలు పేర్కొంది. సిట్‌ రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్‌ఐఏ చెప్పింది. కోడి కత్తితో శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని సెక్షన్‌ 307 ప్రకారం సిట్ అభియోగాలు నమోదు చేసింది. శ్రీనివాసరావు.. జగన్‌ అభిమాని అని తెలిపింది. సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని సిట్ రిపోర్ట్ స్పష్టంచేసింది. సిట్ రిపోర్ట్‌తో ఎన్‌ఐఏ దాదాపుగా ఏకీభవించింది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడాడని తెలిపింది. సర్.. మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని జగన్‌తో శ్రీనివాసరావు చెప్పాడని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో వెల్లడించింది. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది.

రెండు రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డి, నేను పెద్ద స్వాతి ముత్యం, మా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న స్వాతి ముత్యాలు, చంద్రబాబు దుర్మార్గుడు అంటూ, చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో తెలిసిందే. చంద్రబాబు తన కులపు పోలీసు వాళ్ళని పెట్టుకుని, మ్యానేజ్ చేసి, ఎన్నికలకు వెళ్తున్నారు అంటూ హడావిడి చేసిన తరువాత రోజే, వాళ్ళ పార్టీ నేతలే, పోలీసులకు కట్టలు కట్టలు డబ్బుల కవర్లు పంపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. జగన్ చెప్పిన కబురులు, ఇంకా ప్రజల చేవిల్లో తిరుగుతూ ఉండగానే, వాళ్ళ పార్టీ నేతలే పోలీసులకు డబ్బులు ఇస్తూ, దొరికిపోయి, వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు.

kp 06022019

ఎన్నికలకు ముందే మైలవరం నియోజకవర్గంలో లంచాల కలకలం రేగింది. డబ్బులున్న కవర్లతో వైసీపీ నేతలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లారు. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్లకు వైసీపీ నేత మాగంటి వెంకటరామారావు కవర్లతో వెళ్లారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఉండాలని రామారావు డబ్బు కవర్లు ఇవ్వబోయారు. వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. దీంతో సీఐ, ఎస్సైలు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్నపోలీస్‌ అధికారులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.

kp 06022019

కవర్లు తీసుకుని వచ్చిన రామారావుపై పోలీసులు ఐపీసీలోని 448, 109 ఎన్నికల నేరం 171 కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం వరకు కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ సేకరించి వైసీపీ నేతలపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఇది కేవలం ఎన్నికలు మ్యానేజ్ చేయ్యటానికా లేక, కొన్ని నెలల క్రిందట వసంత నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు గురించా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రిందట, "ఆ ఉమా గాడి సంగతి చూడమని జగన్ చెప్పాడు, కడప నుంచి రౌడీలను దించుతాం" అంటూ వైసిపీ నేత, మాజీ హోంమంత్రి ఫోన్ సంభాషణ బయట పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు, ఇవన్నీ చూస్తుంటే, ఎదో పెద్ద కుట్ర పన్నారు అనిపిస్తుంది... పోలీసులు ఎటువంటి ఆక్షన్ తీసుకుంటారో చూద్దాం...

పోలవరం విషయంలో వచ్చే సంవత్సర కాలం, ఎంతో కీలకమైనది... మరో రెండు నెలల్లో గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరో పక్క, పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణం కూడా, ఈ సంవత్సరమే పూర్తి చేసే క్రమంలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్ల, పోయిన ఏడాది మూడు నెలలు అమూల్యమైన సమయం వేస్ట్ అయిపొయింది... చంద్రబాబు ఎలాగోలా సాధించి, నవయుగని తీసుకువచ్చి, కాఫర్ డ్యాంకి పర్మిషన్ లు తీసుకువచ్చి, పనులు ఆగకుండా చేసారు... అయితే, నిధులు విడుదలలో మాత్రం, కేంద్రం తీవ్ర జాప్యం చేస్తుంది... ఇప్పటికే మనం పెట్టిన ఖర్చు, 4 వేల కోట్లు పైన మనకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై, ఈ ప్రభావం చూపే అవకాసం ఉండి.

polavaram 0602219

పోలవరం జాతీయ ప్రాజెక్ట్... కేంద్రం డబ్బులు ఇవ్వాలి అది మన హక్కు... కాని కేంద్రం కావాలని లేట్ చేసిన కొద్దీ, ప్రాజెక్ట్ లేట్ అయిపోతూ ఉంటుంది.. ఎందుకుంటే ఇదే కీలక సమయం.. జూన్ లోపు సాధ్యమైనంత ఎక్కువ పని చెయ్యాలి... వర్షాలు పడటం మొదలైతే, పని సాగదు... అందుకే, ఎటు పోయి, ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో, చంద్రబాబు పోలవరం విషయంలో, మొత్తం కేంద్రం పై ఆధార పడకుండా, ప్రాజెక్ట్ పుర్తవటం కోసం, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించిన నేపథ్యంలో.. దీనికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.9,835.86 కోట్లు కేటాయించారు.

polavaram 0602219

మొత్తం జలవనరుల శాఖ పద్దు రూ.16,852.27 కోట్లు కాగా.. అందులో పెద్ద ఖాతా పోలవరానిదే కావడం గమనార్హం. అంటే, ఒక వేళ కేంద్రం సరైన సమయంలో స్పందించకపోయినా, రాష్ట్రం ముందు ఖర్చు చేసి, తరువాత మన హక్కుగా రావల్సిన డబ్బులు తీసుకుంటుంది... భూపరిహారం, ఎలాగూ 33 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి... అందుకే ముందుగా ప్రాజెక్ట్ అయినా పూర్తి చెయ్యాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు... ఇప్పుడు కనుక ట్రాక్ తప్పితే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో చెప్పలేము.. అందుకే, చంద్రబాబు కేంద్రంతో వైరం వచ్చినా, ముందు ప్రాజెక్ట్ ఆగిపోకుండా, ఇబ్బంది లేకుండా ఉండటానికి, ముందు చూపుతో ఆలోచించి, రాష్ట్ర బడ్జెట్ లోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 9 వేల కోట్లు కేటాయిస్తున్నారు...

బందరు పోర్టు కల త్వరలోనే సాకారం కానుంది. రేపు మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి. . అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు రూపుదిద్దుకోనుంది. చెన్నై- విశాఖ పట్నం పోర్టులను మించేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ పోర్టుల నిర్మాణ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బ్రేక్‌వాటర్‌ విధానంలో ఈ పోర్టును నిర్మించనున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పలు మధ్య భారత రాష్ట్రాలకు కూడా అతి దగ్గరి ఓడరేవు కావటంతో ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో ఈ పోర్టు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారు. రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో కాకుండానే రూ.11,924కోట్లను ఈ బందరు పోర్టు కోసం ఖర్చుచేయనుండగా.. తొలి దశలో రూ. 6,778 కోట్లను వెచ్చించనున్నారు. నిర్మాణ రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న నవయుగ సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సూచనల మేరకు బందరు పోర్టును నిర్మించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతోంది.

port 06022019

ఎనభై శాతానికిపైగా భూ సేకరణ పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ప్రకారం 5,300 ఎకరాలు అవసరం. ప్రతిపాదిత గ్రామాల పరిధిలో 3వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. భూ సమీకరణ పథకం (ఎల్‌పీఎస్‌), భూ కొనుగోలు పథకం (ఎల్‌పీఎస్‌) కింద 1,700 నుంచి 1,800 ఎకరాలను మచిలీపట్నం నగరాభివృద్ధి సంస్థ (ముడా) రైతుల నుంచి సేకరించింది. మిగతా భూమిని కూడా సమీకరిస్తోంది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇప్పటికే రూ.200 కోట్ల ఆర్థిక సాయాన్ని ముడాకు అందించింది. మరో 1,350 కోట్లను ప్రభుత్వ హామీపై ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పోర్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ సిద్ధమైంది. డ్రెడ్జింగ్‌ యంత్రాలు కూడా చేరుకున్నాయి. గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

port 06022019

రూ. 11,924 కోట్లతో నిర్మాణం... మచిలీపట్నం పోర్టును రెండు దశల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ రెండు ఫేజ్‌లకు కలిపి మొత్తం రూ.11,924 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. మొదటి దశలో రూ.6,778 కోట్లు కాగా, రెండవ దశలో రూ.5146 కోట్లను వెచ్చించనున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు ప్రిలిమ్‌నరీస్‌ అండ్‌ సైట్‌కు రూ.57 కోట్లు, డ్రెడ్జింగ్‌కు రూ. 1564కోట్లు, బ్రేక్‌వాటర్‌కు రూ.817 కోట్లు, బెర్తులకు రూ.1674 కోట్లు, స్టాక్‌యార్డ్‌ అభివృద్ధికి రూ.275 కోట్లు, యంత్ర పరికరాలకు రూ.151 కోట్లు, విద్యుదీకరణకు, పరికరాలకు రూ.87 కోట్లు, అంతర్గత రహదారులు, రైల్వే లైన్లకు రూ.172 కోట్లు, బాహ్య రైల్వే లైన్‌కు రూ.30 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.237కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ (5.60శాతం)కు రూ.354 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

Advertisements

Latest Articles

Most Read