అసెంబ్లీలో ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కవ్వింపులు చేసినా, తన పేపర్ లో, టీవీలో, ఆయన పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా, సహనం నశించని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఈ రోజు మాత్రం, తీవ్ర ఆగ్రహంతో, సహనం నశించి, జగన్ పై ఆరోపణలు చేసారు. గత వారం పది రోజులుగా, స్పీకర్ పై, వైసీపీ నేతలు అనరాని మాటలు అంటున్నారు. రాజకీయంగా కామెంట్ చెయ్యవచ్చు కాని, అది శ్రుతిమించి, ఆయన్ను రెచ్చగొట్టే విధంగా, పరుష పదజాలంతో, రెచ్చిపోతున్నారు. సాక్షి పేపర్, టీవీలో మరీ ఘోరంగా ఆయన గురించి రాస్తున్నారు. ఈ రోజు రోజా మాట్లాడుతూ,పచ్చ స్పీకర్ గారూ.. మరీ ఇంత ‘పచ్చదనమా’ అంటూ ఎంతో జుబుక్షాకరంగా మాట్లాడింది.
స్పీకర్ స్థానంలో ఉంటాడు, ఇన్నాళ్ళు మనం ఎన్ని ఆటలు ఆడినా, ఆయన ఏమి మాట్లాడడులే అనుకుని, రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. అయితే, ఈ రోజు మాత్రం స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు, సహనం నశించింది. వైసీపీ నేతలు పదే పదే తనను కించపరుస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడం పై, ఆయన తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన కోడెల జగన్ ఒక దుర్మార్గుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దుర్మార్గుడు పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తాను అవినీతి చేశానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. అవినీతిపై ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. లేదా అవినీతిపై మాట్లాడేందుకు నువ్వు రమ్మన్న చోటకు నేనొస్తా అంటూ కోడెల సవాల్ విసిరారు. నువ్వేం చేశావో నేనేం చేశానో ప్రజలకు చెబుదామంటూ వ్యాఖ్యానించారు. నేను ఎవరికీ తలవంచకుండా నిప్పులా బతికానని చెప్పుకొచ్చారు. విశ్వాసంతో పదవులు వచ్చాయని అంతే కానీ ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. రూ. 43 వేల కోట్ల ప్రజల సోమ్మును దోచుకుతిన్నాడని, 16 నెలలు జైలులో ఉన్న వాడా తనపై మాట్లాడేదని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని నీలా కాదు అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. తప్పు చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు.