టీడీపీ సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో మంగళవారం విస్తృత ప్రచారం జరిగింది. సాక్షాత్తు అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ సన్యాసి పాత్రుడు(జమీలు) కుట్ర పన్నినట్టు ఈ ప్రచారం జరిగింది. రాజకీయంగా టీడీపీకి, వ్యక్తిగతంగా అయ్యన్నకు వ్యతిరేకులతో ఆయన సోదరుడు జమీలు చనువుగా ఉన్నట్టుగా ఉన్న ఈ వీడియోను వాట్సప్ ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చారు. వామపక్ష పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులతో అయ్యన్న సోదరుడు జమీలు చనువుగా పలుకరిస్తూ వారిని అనుసరించినట్టుగా వీడియో చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి.

ayyana 28112018 1

ఇటీవల మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్‌కు బాబాయ్ జమీలుకు మధ్య స్వల్పంగా విబేధాలు పొడసూపాయంటూ ప్రచారం జరిగింది. నగరంలో పార్టీ కార్యక్రమాలను విజయ్ ఒంటెత్తు పోకడలతో నిర్వహిస్తున్నాడంటూ అయ్యన్న సోదరుడు జమీలు సాక్షాత్తు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అయ్యన్న కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు పొడసూపినట్టు విస్తృతంగానే ప్రచారం జరిగింది కూడా. ఈ నేపథ్యంలో అయ్యన్న రాజకీయ వ్యతిరేకులతో సోదరుడు జమీలు చనువుగా మెలగుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి అయ్యన్న హత్యకు తాను కుట్ర పన్నుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని సోదరుడు జమీలు ఖండించారు.

ayyana 28112018 1

ఈమేరకు ఆయన తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి కారకులు ఎవరో దర్యాప్తు చేయాలని కోరుతూ జమీలు జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబంలో కలతలు సృష్టించేందుకే ఈవిధంగా కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి జమీలు వివరించారు. ఇటీవల ఒక ముస్లిం కుటుంబంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా సీసీ టీపీ పుటేజీని మార్ఫింగ్ చేసినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చిత్రాల్లో కనిపిస్తున్నట్టు వైసీపీ నేతలు ఎదురైనప్పుడు మర్యాద పూర్వకంగానే పలుకరించిన దృశ్యాలను వక్రీకరించారంటూ అనుమానం వ్యక్తం చేశారు. జరుగుతున్న కుట్రకు బాధ్యులను గుర్తించాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో అయ్యన్న సోదరుడు కోరారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం విస్తృత రాజకీయ చర్చనీయాంశంగా మారడంతో పోలీసు వర్గాలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ప్రజాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో బుధవారం భారీ బహిరంగసభ జరుగుతోంది. ఈ సభకు ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్‌, టీడీపీ రాజకీయ చరిత్రలో రాహుల్‌ గాంధీ, చంద్రబాబు కలిసి తొలిసారి ఒకే వేదికను పంచుకోనుండడంతో సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో పాల్గొంటున్న తొలి బహిరంగ సభ కూడా ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని డీ కొనటానికి, చంద్రబాబు చేసిన మొదటి ప్రయోగం ఇది. ఆంధ్రర్పదేశ్ రాష్ట్రాన్ని మోడీ నమ్మించి మోసం చేసి, చివరకు రాష్ట్రంలో కుట్రలు చేసి, ప్రభుత్వాన్ని అస్తిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉండటంతో, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలని కలిపి, మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేసిన చంద్రబాబు, మొదటి సారి ఆ ఫ్రంట్ తరుపున బహిరంగ సభలో పాల్గున్నారు.

khammam 28112018 1

ఇద్దరు నేతలు ఒకేసారి సభాప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం కలిసే వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు మహాకూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, గద్దర్‌, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితోపాటు టీ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు, ఏఐసీసీ ప్రతినిధులు కుంతియా, సలీం అహ్మద్‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గున్నారు.

khammam 28112018 1

కాంగ్రెస్‌తో కలసి మహాకూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబుపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల ప్రచారానికి బాబు వస్తే ప్రతిఘటించాల్సిందిగా టీఆర్‌ఎస్ కార్యకర్తలకు నిర్దేశించిన నేపథ్యంలో బాబు ఎన్నికల ప్రచారానికి సమాయత్తం కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా కేసీఆర్ నాయకత్వం పట్ల విసుగెత్తిన పలువురు నేతలు ఇప్పటికే అమరావతి వేదికగా టీడీపీలో చేరుతున్నారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహాన్ని ఇప్పటికే చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో దివంగత రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టిక్కెట్టు ఇవ్వటంతో ఆ నియోజకవర్గంలో సానుభూతి వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా పలువురు నేతలు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇక కూటమి పొత్తుతో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అమరావతిలోనే కార్యాచరణ రూపొందించారు.

నిన్న నిజామాబాద్‌లో, మహబూబ్ నగర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అయితే చంద్రబాబు మోడీతో వైరం పెట్టుకున్న తరువాత, ఆయన తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది ఇదే ప్రధమం కావటం, అదీ ఎన్నికల ప్రచారం కావటంతో, అందరూ మోడీ ప్రసంగం పై ఆసక్తి చూపించారు. మోడీ, చంద్రబాబు పై విమర్శలు చేస్తారని, కాంగ్రెస్ తో కలిసినందుకు, ఎన్టీఆర్ సెంటిమెంట్ వాడతరాని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ వేదికగా, చంద్రబాబు చేస్తున్న జాతీయ ఫ్రంట్ పై విమర్శలు గుప్పిస్తారని అందరూ అనుకున్నారు. కాని, మోదీ కాంగ్రెస్ పైనే విమర్శలు చేశారు. ప్రజాకూటమి మాట ఎత్తకుండా మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

modi kcr 28112018 2

టీఆర్‌ఎస్‌ది కుటుంబపాలన అంటూ విమర్శించే హక్కు ఎక్కడిదంటూ .. సోనియా, రాహుల్‌ విమర్శలను మోదీ తప్పుబట్టారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా మోదీ తన ప్రసంగం ముగించారు. యూపీఏ ఉప్పు తిన్న వ్యక్తి.. కేసీఆర్‌ అని, చంద్రబాబు దగ్గర పని చేసారని, మోదీ బహిరంగ సభలో అన్నారు. చంద్రబాబు అనే మాట చెప్పింది ఇక్కడే. అయితే మోడీ ప్రసంగం పై అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే మొన్న అమిత్ షా కూడా, ఎక్కడా చంద్రబాబు ప్రస్తవాన తేలేదు. దీనికి అసలు కారణం ఏంటో విశ్లేషిస్తే, మోడీ జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రభావం అసలు కనపడుకుండా చేస్తున్నారు. తెలంగాణాలో కూటమి గెలుపు తధ్యం అని తెలిసిన తరువాత, కూటమి పై విమర్శలు చేస్తే, రేపు అదే సక్సెస్ ఫార్ములా అని చంద్రబాబు జాతీయ స్థాయిలో చూపిస్తారు. అందుకే అసలు కూటమి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు చెయ్యకూడదు అనేది మోడీ-షా ఎత్తుగడ. చంద్రబాబుని విమర్శ చేస్తే, మోడీ కూటమిని విమర్శించారు అనే ప్రచారం జాతీయ స్థాయిలో వస్తుంది. రేపు కూటమి గెలిస్తే, మోడీ కూటమితో డీ కొని ఓడిపోయారు అనే ఫోకస్ వెళ్తుంది. అందుకే మోడీ, అసలు చంద్రబాబుని పట్టించుకోలేదు.

modi kcr 28112018 3

మరో పక్క కేసీఆర్ మాత్రం, చాలా ఫూలిష్ గా, తెలంగాణా యుద్ధం కాంగ్రెస్ పార్టీతో అని చెప్పకుండా, చంద్రబాబుతో యుద్ధం అన్నట్టు, తెలంగాణా ఎన్నికలని మార్చేసారు. 13 సీట్లలో పోటీ చేసే చంద్రబాబుని కాకుండా, ఉత్తం కుమార్ రెడ్డిని ఫోకస్ చేసుకుంటే, కేసీఆర్ కు ఎన్నికల ప్రచారం ఈజీ అయ్యేది. చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, చంద్రబాబు ఏమి చేసారు, కేసీఆర్ ఏమి చేసారు అనే చర్చ వస్తుంది. చంద్రబాబు హైదరాబాద్ కి ఏమి చేసారో ప్రపంచం మొత్తం తెలుసు. మరో పక్క, కేసీఆర్ ఎంత తిట్టినా, చంద్రబాబు మాత్రం కేసీఆర్ ని ఎక్కడా విమర్శించలేదు. చంద్రబాబు అలా చేస్తే, కేసీఆర్ అనుకున్న పాచిక పారేది. ఆంధ్రోడు మనల్ని తిడుతున్నాడు అంటూ ప్రజల్లో మరింత సెంటిమెంట్ రగిలించే వారు. చంద్రబాబు పై మోడీ విమర్శలు చెయ్యక పోవటం కాని, చంద్రబాబు కేసీఆర్ పై విమర్శలు చెయ్యకపోవటం కాని చూస్తే, సరైన రాజకీయం తెలిసినవాడు చేసే పని ఇది అని అర్ధమవుతుంది. కాని కేసీఆర్ మాత్రం, చంద్రబాబుని తిడుతూ, అసలు అజెండా పక్కన పెట్టేసారు. ప్రజలకి నువ్వేమి చేసావో చెప్పాలి కాని, చంద్రబాబు ఏమి చేసాడో కాదు కదా.

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండే సమయంలో, వెంకయ్య నాయుడు పేద దిక్కుగా రాష్ట్రాన్ని ఆదుకుంటూ, ఆయనకు చేతనైన సాయం చేసే వాళ్ళు. తరువాత పరిణామాలతో, ఆయన్ను ఉప రాష్ట్రపతిగా పంపించేసారు. అప్పటి నుంచి, రాష్ట్రానికి - కేంద్రానికి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఒక్క పని కూడా రాష్ట్రానికి జరగకుండా, ఢిల్లీ పెద్దలు చేసారు. తరువాత ఎన్డీఏలో నుంచి చంద్రబాబు బయటకు వచ్చేయటం, బీజేపీ పై పోరాటం చెయ్యటం, ఏకంగా మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఫ్రంట్ కట్టటం చేస్తున్నారు. మరో పక్క వెంకయ్య కూడా, ఆయన పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, ఏపి సమస్యల పై పెద్దగా స్పందించలేదు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఏ శంకుస్థాపన జరిగినా, వెంకయ్య చంద్రబాబు కలిసి పాల్గునే వారు. కాని, కేంద్రంతో గొడవ మొదలైన దగ్గర నుంచి, వెంకయ్య ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా, చంద్రబాబు ఆ కార్యక్రమాల్లో పాల్గునటం లేదు.

venki 28112018

మొన్నా మధ్య విజయవాడలో ప్రారంభం అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గునకపోవటం, ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ, ముఖ్యమంత్రి పేరు శిలాఫలకం మీద లేకపోవటం పెద్ద దుమారం లేపింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు బీజేపీ పై యుద్ధం ముమ్మరం చేసిన వేళ, వెంకయ్య, చంద్రబాబు ఒకే వేదిక పైకి రానున్నారు. ఏపి రాజధానికి తలమానికమైన విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభోత్సవానికి, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. డిసెంబరు 4న సింగపూర్‌కు ఇండిగో సర్వీసు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ శ్రేణిలో నడుస్తున్న మొట్టమొదటి సర్వీసు కావటంతో ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది.

venki 28112018

మరో పక్క చంద్రబాబు, వెంకయ్య ఏమి మాట్లాడతారో అనే ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ విమానం తీసుకురావటానికి, కేంద్రంతో ఎలా పోరాడాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్తే, దానికి వెంకయ్య ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఇద్దరు వీవీఐపీలు పాల్గొంటున్న నేపథ్యంలో, కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం జిల్లా యంత్రాంగం నేతృత్వంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఎయిర్‌ పోర్టులో క్షేత్రస్థాయి సమీక్ష జరగనుంది. సింగపూర్‌కు సర్వీసుతో అంతర్జాతీయ శ్రేణిలో విజయవాడ విమానాశ్రయం నూతనాధ్యాయాన్ని సృష్టించబోతోంది. పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి 100 మంది ప్రయాణికులలో 46 మంది మన ప్రాంతానికి చెందిన వారే ఉండటం చూస్తే అంతర్జాతీయ యానం విజయవాడ కేంద్రంగా వేళ్ళూనుకునే అవకాశం ఉంది. దేశీయంగా ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు రికార్డులను సృష్టిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read