తన పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 108 వాహనాన్ని, ఆవుని పంపిచారంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు ఏపీ మంత్రి నారా లోకేష్... వైఎస్ జగన్‌పై వ్యంగ్యోక్తులు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. జగన్ తొలుత 108 డ్రామా ఆడారు... తర్వాత కోడికత్తి డ్రామా కొనసాగించారు... ఇప్పుడు ఆవు డ్రామా ఆడుతున్నారు... కానీ, జగన్ ఆడిన ఏ డ్రామా కూడా రక్తి కట్టలేదన్న ఆయన... చెత్త నటనకు అవార్డులంటూ ఉంటే జగనే అన్నీ కైవసం చేసుకుని ఉండేవారు... ప్రస్తుత చెత్త నటనకు భాస్కర్ అవార్డుతో సరిపెడదాం అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.

lokesh 22112018 2

జగన్ వివిధ సందర్భాల్లో చేసిన ఆరోపణల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఇది లోకేష్ చేసిన ట్వీట్... First it was the 108 drama, followed by the Kodi Kathi drama. Now Cow Drama. If there were awards for badly-acted, flopped dramas, the Opposition Leader would have swept them all! For the time being, pls make do with “Bhaskar Award for Worst Acting.” Standing ovation to you Sir!! అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా.. విజయనగరం జిల్లా కురుపాంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జగన్ ప్రసంగిస్తుండగా.. ఓ ఆవు జనాల్లోకి దూసుకొచ్చింది. దీనిపై స్పందించిన జగన్.. ఆవుకు దూరంగా జరగమని పార్టీ శ్రేణుల్ని కోరారు. తర్వాత మీటింగ్ జరుగుతుంటే ఆవుల్ని పంపిస్తున్న తెలుగు దేశం వాళ్లు మనుషులేనా అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపైనే లోకేష్ స్పందించారు.

lokesh 22112018 3

అంతక మందు కూడా.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జరిగి బ‌హిరంగ స‌భ స‌మ‌యంలో ఓ మ‌హిళ ప్ర‌స‌వం కోసం ఆటోలో వెళ్తూ స‌భా వ‌ద్ద‌కు వ‌చ్చి దారి ఇవ్వ‌మ‌ని బంధువులు కోరారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఆటో కు దారి ఇవ్వ‌మ‌ని స‌భ‌కు హాజ‌రైన పార్టీ శ్రేణులకు సూచిస్తూనే.. ప్ర‌భుత్వం 108 వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసింద‌ని విమ‌ర్శించారు. తర్వాత మరో సభ జరుగుతుండగా.. 108 అటువైపుగా రావడంతో.. టీడీపీ నేతలు కుట్రలు చేస్తూ.. ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని సభవైపుగా పంపారని ఆరోపించారు. దీనికి మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వాహనంలో ఆస్పత్రికి వెళ్లిన పేషెంట్ ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచారు.

విజయవాడ నేత వంగవీటి రంగా గత కొంత కాలంగా, వైసీపీ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీ మారుతునట్టు వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క గౌతం రెడ్డితో, జగన్ ఆడించిన గేమ్, ఇప్పటికీ రాధాను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. గౌతం రెడ్డి అన్ని మాటలు అన్నా, సస్పెన్షన్ ఎత్తిసి మరీ, జగన్ మళ్ళీ తన పక్కన చేర్చుకోవటంతో, రాధా అవమానం అయినా, భరిస్తూ వచ్చారు. మొన్న విజయవాడలో జగన్ పాదయాత్ర సందర్భంగా, భారీ జనసమీకరణ కూడా చేసారు రాధా. తరువాత విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వటం కుదరదు అని చావు కబురు చల్లగా చెప్పాడు జగన్.

radha 22112018 2

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా.. మల్లాది విష్ణుకు కేటాయించటంతో, రాధా అసంతృప్తికి లోనయ్యారు. అయితే, ఎటూ తేల్చుకోని రాధా, కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పడు తాజగా మరోసారి రాధా తానేంటో జగన్ కు చూపిస్తా అని చెప్పినట్టు తెలుస్తుంది. రాధా బలప్రదర్శన యోచనలో ఉన్నారని తెలుస్తోంది... డిసెంబర్ 26వ తేదీన వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా 'రంగానాడు' పేరిట భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ. గుంటూరు జిల్లా కాజా దగ్గర హైవేపై ఉన్న ప్రాంగణంలో సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

radha 22112018 3

చైతన్య కలయిక, రాధా రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు దక్కక పోవటంతో అలకబూనిన ఆయన... బల ప్రదర్శన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితులతో సమావేశమైన దీనిపై చర్చించిన రాధా... ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రంగా అభిమానులను పిలవటం పై మరోమారు సన్నిహితులతో భేటీ కానున్నారు. రాధాకు సీటివ్వకపోతే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా అనుచరులు చెబుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేం రాధా వెంటే ఉంటామని.. రాధా ఏ పార్టీలో ఉంటే మేం అదే పార్టీలో ఉంటామని రంగా అభిమానులు స్పష్టం చేశారు.

ఉల్లిపాలెం - భవానీపురం వంతెన ప్రారంభంతో దివిసీమ వాసుల కల నెరవేరింది. తూర్పు కృష్ణావాసుల చిరకాల స్వప్నం కూడా నెరవేరబోతోంది. వచ్చే నెలలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం కోడూరు మండలం ఉల్లిపాలెంలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించిన అనంతరం సీఎం ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా బందరు పోర్టును నిర్మిస్తామని, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం చల్లపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించారు.

ullipalem 22112018 2

బందరు పోర్టు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, వలసలు తగ్గుతాయని హితవు పలికారు. పోర్టు నిర్మాణం ద్వారా తీర ప్రాంతాలను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మచిలీపట్నం, దివిసీమ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన వనరులు ఉన్నాయని చెప్పారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే విజయవాడ-మచిలీపట్నం నాలుగు రహదారుల నిర్మాణం పూర్తవుతోందని పేర్కొన్నారు. ఉల్లిపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం వల్ల మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు.

ullipalem 22112018 3

తీరప్రాంతమైన దివిసీమ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోకుండా.. ఉండేందుకు పలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. లింగాలకోడు, ఇరాలి, రత్నకోడు మురుగుకాల్వపై చెక్‌డ్యాంలను మంజూరు చేశారు అలాగే గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏటిమొగ-ఎదురుమొండి గ్రామాల మధ్య వంతెన నిర్మాణంతో పాటు భీమనదిపై ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. దీంతో పాటు.. పెదగుడుమోటు, చినగుడుమోటు గ్రామాల్లోని మైనార్టీల ప్రార్థనా మందిరాల కోసం రూ.14 లక్షలు, నాగాయలంక మండలం టి.కొత్తపాలెం, మోపిదేవి మండలం బోడగుంట గ్రామాల్లోని చర్చిల నిర్మాణాలకోసం ఒక్కోదానికి రూ.కోటి చొప్పున, చల్లపల్లిలో మసీదు రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

బీజేపీ నాయకత్వానికి వెన్నులో చలిపుట్టించే విధంగా ఒక సీనియర్‌ పోలీసు అధికారి బాంబు పేల్చారు. గ్యాంగ్‌స్టర్‌ సొహ్రాబుద్దీన్‌ షేఖ్‌, తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్లలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రధాన కుట్రదారుడని ఈ కేసులో దర్యాప్తు జరిపిన ముఖ్య దర్యాప్తు అధికారి(సీఐవో) సందీప్‌ తమ్‌గడే కోర్టుకు సాక్ష్యమిచ్చారు. షాతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు కూడా ప్రధాన కుట్రదారులని ఆయన పేర్కొన్నారు. సందీప్‌ తమ్‌గడే బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఈ కేసుపై తాను కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆయన చెప్పారు.

amit 22112018 2

‘‘మేము చేసిన దర్యాప్తు ప్రకారం అమిత్‌షా, గుజరాత్‌ మాజీ డీఐజీ డీజీ వంజరా, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రాజ్‌కుమార్‌ పాండ్యన్‌, రాజస్థాన్‌ ఐపీఎస్‌ అధికారి ఎంఎన్‌ దినేశ్‌లు ప్రధాన కుట్రదారులుగా తేలారు’’ అని సందీప్‌ తమ్‌గడే కోర్టుకు తెలిపారు. ఈ నలుగురినీ ట్రయల్‌కోర్టు ఇప్పటికే నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో అమిత్‌షా, ఇతరులపై ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆయన అంగీకరించారు. అప్పట్లో సీబీఐ ఎస్పీగా ఉన్న సందీప్‌... సొహ్రాబుద్దీన్‌ కేసులో అనుబంధ చార్జిషీటును, తులసీరాం కేసులో ప్రధాన చార్జిషీటును తయారు చేశారు. ఈ రెండు కేసులను కలిపి ఇక్కడ సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్‌జే శర్మ విచారిస్తున్నారు. అమిత్‌షా గుజరాత్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఒక బిల్డర్‌ కార్యాలయం వద్ద కాల్పులు జరిపేందుకు సొహ్రాబుద్దీన్‌, ప్రజాపతిలను ఉపయోగించుకున్నట్లుగా తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్లు డిఫెన్సు లాయర్‌ అడిగిన ప్రశ్నకు తమ్‌గడే చెప్పారు.

amit 22112018 3

సోహ్రాబుద్దీన్‌ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన డీజీ వంజారాకు మోదీ సన్నిహితుడుగా పేరుంది. మోదీని తన ఆరాధ్య దైవంగా వంజారా భావించేవారు. అలాంటి వ్యక్తి.. 2013లో రాజీనామా చేస్తూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. నకిలీ ఎన్‌కౌంటర్ల కేసులో తనతో సహా 32 మంది అధికారులను మోసం చేశారని ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాడిన పోలీసు అధికారులను కాపాడటంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది’’ అని విమర్శించారు. ‘‘నరేంద్ర మోదీని నేను దైవంగా భావించేవాడిని. కానీ, అమిత్‌ షా దుష్ప్రభావం ఆయన మీదా పడింది. మా విషయంలో తగిన విధంగా స్పందించలేకపోయారు. ఎన్‌కౌంటర్లకు మోదీ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం ఆచితూచి ఎంచుకున్న విధానాన్నే వివిధ విభాగాల అధికారులు అమలు చేసినట్లు విస్పష్టంగా చెప్పగలను. ప్రభుత్వంలో ఉన్నవారు తీసుకున్న నిర్ణయాలనే క్షేత్రస్థాయి సిబ్బందిగా, అధికారులుగా మేం అమలు చేశాం. మేం చేసింది నకిలీ ఎన్‌కౌంటర్లయితే అప్పట్లో ఉగ్రవాద నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించిన వారినీ అరెస్టు చేయాలి. ఈ ప్రభుత్వం ఉండాల్సింది గాంధీనగర్‌లో కాదు. ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలోనో.. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్‌ జైల్లోనో’’ అని 2013 సెప్టెంబరు 1న గుజరాత్‌ హోం శాఖ కార్యదర్శికి పంపిన 10 పేజీల సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read