విశాఖ‌ప‌ట్నం ఏజెన్సీ ప్రాంతంలో జోరుగు సాగుతున్న గంజాయి తోట‌ల సాగుపై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధికారులు క‌ళ్లుగ‌ప్పి ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం మ‌ధ్య‌లో ఎలాంటి అనుమానం రాకుండా వేలాది ఎక‌రాల్లో సాగుతున్న అక్ర‌మ గంజాయి సాగును కూక‌టివేళ్ల‌తో స‌హా పెకలించి వేయ‌డానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. గంజాయి తోట‌లు ఎక్క‌డ సాగు చేస్తున్నా వాటిని ఇట్టే ప‌సిగ‌ట్టి తొల‌గించేలా ప్ర‌భుత్వం డ్రోన్ నిఘా క‌ళ్ల‌తో మ‌న్యం అట‌వీ ప్రాంతాల‌ను జల్లెడ ప‌డుతోంది. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ డ్రోన్లను ఉప‌యోగించి మ‌న్యం ప్రాంతంలో గంజాయి తోట‌ల‌ను గుర్తించే ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. నాలుగు మండలాల్లోని అట‌వీ ప్రాంతంలో గంజాయి తోట‌ల‌ను గుర్తించే ప‌నులు చేప‌ట్టారు.

araku 2112018 2

అందులో భాగంగా పాడేరు, హుకుంపేట‌, పెద‌బ‌య‌లు, మంచిగిప‌ట్టు మండ‌లాల్లో గంజాయి తోట‌లు జోరుగా సాగుతున్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. ఇక్క‌డ అక్ర‌మార్కులు ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో ఎవ‌రికీ అనుమానం రాకుండా వందలాది ఎక‌రాల్లో గంజాయి తోట‌ల‌ను సాగు చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఎవ‌రూ రావ‌డానికి వీలు లేనటువంటి ప్రాంతాల‌ను ఎంచుకుని వీరు ఈ తోట‌ల‌ను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోట‌ల‌ను కూడా డ్రోన్ల సాయంతో గుర్తించి వాటిని ధ్వంసం చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయితోట‌ల వ‌ద్ద‌కు ఇత‌రులు ప్ర‌వేశించ‌గానికి కూడా వీలు లేనంత‌గా స్మ‌గ్ల‌ర్లు గంజాయిను సాగు చేస్తున్నారు. ఇలాంటి తోట‌ల‌ను కూడా ఆర్టీజీఎస్ డ్రోన్ల సాయంతో గుర్తించి అక్క‌డికి వెళ్లి ఆ తోట‌ల‌ను ధ్వంసం చేయ‌డానికి మార్గాలు క‌ల్పిస్తోంది.

araku 2112018 3

ఇకపై నిరంత‌ర నిఘా… ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై ఇక మీదట డ్రోన్ల‌తో నిరంత నిఘా కొన‌సాగించ‌నున్నారు. ఇందుకోసం ఆర్టీజీఎస్‌ సంస్థ ఎక్సైజు, పోలీసుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తోంది. అనుమానిత ప్రాంతాలు, మండ‌లాల్లో డ్రోన్ల‌ను నిరంత‌రంగా ఉప‌యోగించి గంజాయి సాగును ఉక్కుపాదంతో అణ‌చివేస్తున్నారు. ఇప్ప‌టికే గంజాయి తోట‌ల ధ్వంసం ప‌నులు ఏజెన్సీ ప్రాంతంలో చేప‌ట్టారు. స్థానికుల స‌హ‌కారం తీసుకోవ‌డంతో పాటు, నిఘా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ట‌ప‌రచి, డ్రోన్ల స‌ర్వేతో గంజాయి తోట‌ల సాగును గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టిడిపి, వైసీపీ కార్యాలయాల నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది. రానున్న ఎన్నికల నాటికి ఆ రెండూ కొత్త భవనాల నుంచే తమ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. జనసేన కార్యాలయ నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. టిడిపి కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉండగా, వైసీపీ, జనసేన పార్టీల అధ్యక్షుల నివాస, పార్టీ కార్యాలయ భవనాలు ఒకే ప్రాంగణంలో ఉండనున్నాయి. అవి తాత్కాలిక కార్యాలయాలేనని, భవిష్యత్తులో పెద్దవి నిర్మించుకుంటామని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు పార్టీలు విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారికి అత్యంత సమీపంలోనే వీటిని నిర్మిస్తున్నాయి.

party 2112018 2

తెలుగుదేశం కార్యాలయం.. మంగళగిరికి దగ్గరలో జాతీయ రహదారికి పక్కన నాలుగు ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో కార్యాలయం ప్రారంభించే అవకాశం ఉంది. మూడు భవనాల్ని ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో నిర్మిస్తున్నారు. మూడు భవనాల్లో నిర్మిత ప్రాంతం సుమారు 2.50 లక్షల చ.అడుగులు. ఒకటి, మూడు భవనాలు జీ+3 విధానంలో, రెండో భవనాన్ని జీ+2 విధానంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భవనంలో ఒక అంతస్తులో కొంత భాగం పనులు మిగిలి ఉన్నాయి. మూడో భవనంలో చివరి అంతస్తుకి శ్లాబ్‌ వేయాల్సి ఉంది. రెండో భవన నిర్మాణం గ్రౌండ్‌ లెవల్‌కి వచ్చింది. పార్టీ కార్యాలయం నుంచే వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు వంటివి నిర్వహించేందుకు అవసరమైన వసతులన్నీ ఉంటాయి.

party 2112018 3

వైసీపీ... తాడేపల్లిలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయానికి, పార్టీ అధ్యక్షుడు జగన్‌ నివాసానికి వేర్వేరు భవనాలు నిర్మిస్తున్నారు. జీ+1 విధానంలో నిర్మిస్తున్నారు. ఇది పార్టీ శాశ్వత కార్యాలయం కాదని, భవిష్యత్తులో దీన్ని పార్టీ అధ్యక్షుడు క్యాంప్‌ ఆఫీసుగా వినియోగించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. అంతర్గత పనులు జరుగుతున్నాయి. కార్యాలయ నిర్మాణం చివరి దశలో ఉంది. అన్ని హంగులతో వీటిని సిద్ధం చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుంది. జనసేన కార్యాలయం, ఇల్లు... కాజ గ్రామానికి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయం, పవన్‌ కల్యాణ్‌ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయి. కార్యాలయ పనులు ప్రారంభించాల్సి ఉంది. రెండు ఎకరాల్ని, రెండు భాగాలుగా విభజించి మధ్యలో రోడ్డు వేశారు. రోడ్డుకి పశ్చిమం వైపు ఇంటిని... తూర్పు భాగంలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. జీ+1 విధానంలో నిర్మించనున్నారు. ఇక్కడ నిర్మించబోయేది పార్టీ శాశ్వత రాష్ట్ర కార్యాలయం కాదని, పవన్‌ కల్యాణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌గానే అది ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.

రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి.. పార్లమెంటు ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్ల నియామకాల్లో పార్టీని ఏళ్ల తరబడి నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ నేతల వారసులు, కుమారులకు పదవులు ఇస్తున్నారని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ‘సేవ్‌ ఏపీ బీజేపీ’ అనే నినాదం సోషల్‌ మీడియాలో, ఫోన్లలో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదా ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిన బీజేపీపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వాణి బలంగా వినిపించేందుకు వెంకయ్యనాయుడు లాంటి నాయకుడు లేరు. రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వారు సంస్థాగత వ్యవహారాలపై కొంతకాలంగా మౌనం వహిస్తున్నారు.

kanna 21112018

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు నియమితులైన ఈ 75 మంది నుంచే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారుచేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నియామకాల్లో కొన్నిటిని పార్టీలోని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ ప్రాతిపదికన వీరికి పదవులిచ్చారని కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నారు. ఈ మేరకు కన్నాకు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వేరే పార్టీ నుంచి వచ్చిన రాష్ట్ర నాయకుడు తన సొంత లాభం చూసుకుంటున్నారని వారంతా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.

kanna 21112018

ఎంతో మంది సీనియర్లు, సమర్థులు పార్టీలో ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా హ్యాండిల్‌ చేయలేని తోట సర్వారాయుడిని ఎలా కాకినాడ పార్లమెంటు కన్వీనర్‌గా నియమించారని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉంగరాల వెంకటరమణ (చినబాబు) కన్నాకు రాసిన లేఖలో గట్టిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుడి కుమారుడైనందుకే అర్హుడయ్యారా అని నిలదీశారు. పార్టీకి ఏ మాత్రం సేవచేయని సర్వారాయుడిని తనకన్నా పై స్థానంలో కన్వీనర్‌గా నియమించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తనకు కేవలం పాతికేళ్ల అనుభవమే ఉందని.. ఈ బాధ్యత నిర్వర్తించేంత అనుభవం, సామర్థ్యం తనకు లేవని.. అందుచేత కో-కన్వీనర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాగా.. తాజా నియామకాలపై ఉత్తరాంధ్రలో జిల్లా స్థాయి నాయకుడు రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కోస్తాకు చెందిన మరో నేత ఫిర్యాదులతో ఢిల్లీకి బయల్దేరారు.

దేశంలో లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవి అధికార భాజపాకు పంటి కింద రాయిలా తయారవుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి అధికార పగ్గాలు చేపట్టిన భాజపా... ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కొక్కటిగా స్థానాలు కోల్పోతూ వస్తోంది. గత నాలుగున్నరేళ్లలో 30 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప సమరంలో అధికార పక్షం కేవలం ఆరు సీట్లను నిలబెట్టుకొంది. 9 సొంత సీట్లను ప్రత్యర్థులకు కోల్పోయింది. ఈ మొత్తం క్రతువులో వైరి పక్షానికి చెందిన ఒక్కసీటును కూడా భాజపా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దీంతో గత ఎన్నికల నాటి భాజపా బలం 282 కాస్తా ఇప్పుడు 273కి తగ్గిపోయింది. ఉప ఎన్నికల్లో భాజపా గెలిచిన చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల మెజార్టీ బాగా తగ్గిపోయింది.

bjp 21112018

2014 ఎన్నికలు పూర్తయిన వెంటనే వడోదర స్థానానికి ప్రధానమంత్రి రాజీనామా చేయడం, మహారాష్ట్రలోని బీడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్‌ ముండే ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రెండు స్థానాల్లో భాజపా 70 శాతానికి పైగా ఓట్లు కొల్లగొట్టింది. కాలం గడిచే కొద్దీ సీట్లతో పాటు ఓట్లనూ కోల్పోతూ వస్తోంది. తాజాగా శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి 2014లో యడ్యూరప్ప 3.63 లక్షల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు ఆయన తనయుడు బీఎస్‌ రాఘవేంద్ర మెజార్టీ 47వేలకు తగ్గిపోయింది. 2014లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన ప్రతి స్థానాన్నీ ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు నిలబెట్టుకున్నాయి. భాజపా కోల్పోయిన 9 సీట్లలో అయిదు కాంగ్రెస్‌ పార్టీకి, రెండు ఎస్పీకి, ఒకటి ఎన్సీపీకి, ఒకటి ఆర్‌ఎల్‌డీకి చిక్కాయి.

bjp 21112018

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ స్థానాలను భాజపా కోల్పోవడం సంచలనం రేపింది. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కలిసి పనిచేయడం దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు ప్రాణం పోసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా ఉప ఎన్నిక ఫలితం దీనిని మరింత ముందుకు తీసుకెళ్లింది. జాట్‌ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన సీనియర్‌ నేత హుకుంసింగ్‌ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానం నుంచి ఆయన కూతురు పోటీపడినా మిత్రపక్షాల ఐక్యత ముందు సానుభూతి పవనాలు పని చేయలేదు.

Advertisements

Latest Articles

Most Read