ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘గజ తుపాను’గా ఐఎండీ నామకరణం చేసింది. ప్రస్తుతం ఇది పోర్ట్‌బ్లెయిర్‌కు 400 కి.మీ, చెన్నైకి 900కి.మీ, నెల్లూరుకి 1050కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది తీవ్ర తుపానుగా మారి ఈ నెల 15 నాటికి చెన్నై-నెల్లూరు మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గజ తుపాను ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 11 నాట్ల వేగంతో కదులుతోందని స్పష్టం చేసింది.

gaja 11112018 2

తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 45-55 కి.మీ.ల వేగంగా గాలులు వీస్తున్నాయని.. తుపాను తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి వాటి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. గాలుల ప్రభావంతో సముద్రంలో అలల ఎత్తు పెరుగుతోందని హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.

gaja 11112018 3

సోమవారంలోపు ఇది పశ్చిమ ఆగ్నేయ దిశగా, అనంతరం 72 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ వైపుగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని కారణంగా తమిళనాడు తీరం, దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది దీంతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ సహాయచర్యలపై దృష్టి సారించింది.

దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 2017లో స్తంభింపజేశాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతోందని, దేశ అవసరాలకు ఇది సరిపోదని తెలిపారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చతికిలబడిందని రాజన్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చాలా పెద్ద దెబ్బలని చెప్పారు. వీటివల్ల భారతదేశం వెనుకకు వెళ్ళిందన్నారు. 2012 నుంచి 2016 వరకు భారతదేశం రెండు భారీ దెబ్బలను తట్టుకుని, వేగంగా వృద్ధి చెందిందని వివరించారు.

raghuramarajan 1112018

గత ఏడాదిలో భారత ఆర్థిక వృద్ధి తిరోగమన బాట పట్టడానికి పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు నిర్ణయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. భారత్‌లో మితిమీరిన అధికార కేంద్రీకృతం మరో సమస్య అని రాజన్‌ అన్నారు. ‘‘ఒకే కేంద్రం నుంచి పాలిచడం భారత్‌కు సరిపోదు. అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అధికార కేంద్రీకృతం మితిమీరిన స్థాయిలో ఉంది’’. ప్రతీ నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతోందని, పీఎంవో అనుమతి లేనిదే ఎవరూ కూడా నిర్ణయం తీసుకునే సాహసం చేయలేకపోతున్నారని రాజన్‌ అన్నారు. గతనెల 31న సర్దార్‌ పటేల్‌ 143 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని ఆవిష్కరించారు.

raghuramarajan 1112018

గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం. దాదాపు రూ.3 వేల కోట్ల వ్యయంతో కేవలం 33 నెలల్లో ఈ విగ్రహాన్ని నిర్మించారు. పీఎంఓ అనుమతులు, చొరవ వల్లే అతి తక్కువ కాలంలో అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణం సాధ్యమైందని.. మిగతా అన్ని విషయాల్లోనూ ఇది ఎందుకు కన్పించడం లేదని రాజన్‌ ప్రశ్నించారు. అధికార కేంద్రీకృతానికి తోడు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారులు వ్యాపారపరమైన నిర్ణయాల్లో చొరవ తీసుకోలేకపోతున్నారని అన్నారు. వరుసగా అవినీతి కుంభకోణాలు వెలుగు చూసినప్పటి నుంచి అధికారులు నిర్ణయాల్లో వెనకడుగు వేస్తున్నారని రాజన్‌ పేర్కొన్నారు.

మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రగతిని తిరోగమనంలోకి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సీఎం చంద్రబాబును కలిశారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. మోదీ వ్యతిరేక శక్తులు ఏకమవడం అనివార్యం అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలతో కలిపి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు.

cbn mamatha 10112018 2

దేశం ఇబ్బందుల్లో పడిందని, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగితే ఇబ్బందులకు గురిచేయడం, దాడులకు పాల్పడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తి కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం బ్రహ్మాండమైనదని, ఇక్కడ ఉన్న వనరులు ఎక్కడా లేవన్నారు. యువత ఎక్కువగా ఉన్న పెద్ద మార్కెట్‌ కల్గిన దేశం మనదేనన్నారు. దీంతో ప్రపంచమంతా మనదేశంవైపే చూస్తోందని వ్యాఖ్యానించారు. కానీ, మోదీ ప్రవర్తనతో దేశం అనేక సమస్యలకు గురవుతుందని చెప్పారు.

cbn mamatha 10112018 3

దేశాన్నికాపాడుకోవడమే లక్ష్యంగా భాజపాయేతర కూటమి ఏర్పాటుకు ముందుకొచ్చామన్న ఆయన ఇప్పటికే చాలామందితో మాట్లాడామన్నారు. త్వరలో దిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా తాను కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నన్నారు. అంతేతప్ప తనకెలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు, ఆశలు లేవన్నారు. అన్ని సమస్యలను పక్కనపెట్టి విశాల ప్రాతిపదికన అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నానన్నారు. ఇప్పటికే చాలామంది నేతలు తమతో కలిసి వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. మమతా బెనర్జీతో ఈ నెల 19 లేదా 20 తేదీల్లో సమావేశమవుతానన్నారు. అనంతరం దిల్లీలో భాజపా వ్యతిరేక పార్టీలతో సమావేశమై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. భాజపాను ఓడించే దిశగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తామన్నారు.

పులివెందుల పులి, జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా ఎన్నికల పై తన నిర్ణయం ప్రకటించాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటూ, ఇంత బిజీ పాదయాత్రలో కూడా వారనికి రెండు రోజులు, తెలంగాణాలోనే ఉండే జగన్ బాబు, తెలంగాణా ఎన్నికల్లో వీరోచితంగా కేసీఆర్ తో పోరాటం చేస్తారని, ఆయన అనుచరులు చెప్తూ వచ్చారు. మా వాడు పులివెందుల పులి, ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ కు చుక్కలు చూపిస్తారని చెప్పారు. కాని, పాపం పులివెందుల పులి, 2024 దాకా తెలంగాణాలో రెస్ట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తుంటే, జగన్, పవన్ మాత్రం, గత రెండు నెలలుగా, అదిగో ఇదిగో అంటూ, కాలయాపన చేసారు. చివరకు జగన్ నిన్న తన నిర్ణయం ప్రకటించారు.

jagan 11112018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయడం లేదని, ఈ ఎలక్షన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని నిన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించింది. ‘తెలంగాణలో గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. తర్వాత వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ ఏనాడు, కేసీఆర్ ను ఒక్క మాట కూడా జగన్ అనలేదు.

jagan 11112018

ఇక మరో పోరాట యోధుడు, ఈ ప్రపంచంలో చేగోవీరా తరువాత, నేనే అని, ఈ దేశంలో అందరినీ, నేనే గెలిపించాను అని వీరిచోతింగా డైలాగులు చెప్పే పవర్ స్టార్, ఎలాంటి పవర్ ఫుల్ నిర్ణయం తీసుకుంటారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జన సైనికులు మాత్రం, మా అన్న తెలంగాణాలో పోటీ చేస్తే, కేసీఆర్ అడ్రస్ గల్లంతు అవుతుందని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి పవర్ ఫుల్ నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీళ్ళ కోసం, విభజన హామీలు అమలు కోసం, ఉమ్మడి ఆస్తుల విభజన కోసం, 5 వేల కోట్ల కరెంటు బాకయుల కోసం ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ అంటే, జగన్, పవన్ కి ఎందుకో అంత లవ్వు. ఇక్కడకు వచ్చి మాత్రం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దరించేది మేమే అంటూ డైలాగులు చెప్తున్నారు. అయినా, వీళ్ళు నిర్ణయం తీసుకునేది ఏముందిలే, ఢిల్లీ నుంచి అమిత్ షా, ఏమి చెప్పమంటే అది చెప్పాలి కదా...

Advertisements

Latest Articles

Most Read