జగన్ మోహన్ రెడ్డి గారికి దేముడు ఇచ్చిన సోదరుడు, జగన్ పటాలానికి వేల కోట్లు తవ్వి పెట్టిన బీజేపీ 'గాలి' జనార్ధన రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని కర్ణాటక బీజేపీ అధినేత బీ ఎస్ యడ్యూరప్ప సెలవిచ్చారు. వేట కొనసాగుతున్నది బెంగళూరు పోలీస్ కమీషనర్ సునీల్ కుమార్ చెప్పారు. అంబిడెంట్ తరఫున ఈడీ తో బేరం కుదుర్చుకున్న 'గాలి'- ఆంధ్రాలో జగన్ కేసుల్లో కూడా ఈ డీ తో డీల్ కుదిర్చే ఉంటారన్న అనుమానాలు విస్తృత ప్రచారం లో ఉన్నాయి. అందుకే, జగన్ కేసుల్లో ఈడీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

gali 08112018 2

ఇది ఇలా ఉండగా, బళ్ళారి లోని 'గాలి' రాజప్రాసాదాలను అధికారులు గాలించారు. కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు లోని జగన్ రాజప్రాసాదం నేల మాళిగలో గాలివారు దాక్కుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గాలివారు దొరికితే తప్ప, అక్కడా...ఇక్కడా గాలి ఎంత బలంగా వీస్తున్నదనే విషయం బయటపడే అవకాశం లేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వచ్చిన ఆరోపణ నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

gali 08112018 3

ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కనిపించకుండాపోయిన గాలి ఆచూకీ కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. గాలి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాలి జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. దాదాపు రెండు రోజులు గడిచినా గాలి ఎక్కడుంది తెలియకపోవడంతో మాల్యా మాదిరిగా దేశం విడిచి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ వేడుకలకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ఎఫ్‌1హెచ్‌2ఓ(పవర్‌ బోట్‌ రేస్‌) ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం వెలగపూడి సచివాలయంలో సంబంధిత అధికారులు, పోటీల నిర్వాహకుల ప్రతినిధులతో సమావేశమైంది. దీనికి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. సమావేశానికి సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ హాజరుకాలేదు. ఈ పోటీలను తిలకించేందుకు సుమారు లక్ష మందికిపైగా వస్తారు.

vij 08112018 2

దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌, సీటింగ్‌, భద్రత, ఆతిథ్యం తదితరాల ఏర్పాట్లను ఉప సంఘం సమీక్షించింది. ప్రస్తుతానికి 50వేల మందికి సరిపడేలా సీటింగ్‌ ఏర్పాట్లుజరిగాయని, కనీసం మరో 50వేల మందికి సీటింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సమావేశంలో నిర్ణయించారు. వీఐపీ, వీవీఐపీ పాస్‌ల జారీ బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. సమావేశానంతరం హోంమంత్రి చినరాజప్ప, కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రధానంగా పోటీలు జరగనున్న ప్రాంతాన్ని 12విభాగాలుగా విభజించి.. ఒక్కోదాంట్లో ఎవరెవరికి ఏ ఏర్పాట్లుచేయాలనేదీ ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

vij 08112018 3

మరో పక్క, విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు ‘అమరావతి ఎయిర్‌ షో’ నిర్వహించనున్నారు. 25న ప్రదర్శనకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ) సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రదర్శనకు ఆతిథ్యమివ్వనుంది. 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో యూకే బృందం, గ్లోబల్‌ స్టార్స్‌ బృందాలు విన్యాసాలు చేయనున్నాయి.రాష్ట్రంలోని వారసత్వ సంపద, ప్రముఖ పర్యాటక కేంద్రాల మీదుగా ‘టూర్‌ హెరిటేజ్‌’ పేరుతో సుదీర్ఘ సైకిల్‌ యాత్రను ఈ నెల 16న విజయవాడలో ప్రారంభించనున్నారు. అదే విధంగా, ఈ నెల 9న ‘వివిధ రంగాలపై సోషల్ మీడియా ప్రభావం’ అంశంపై విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ, సినీ నటి దివ్య స్పందన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. 10న నిర్వహించే బహుమతుల వేడుకకు బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హాజరవుతారని వెల్లడించింది.

గత రెండు సంవత్సరాలుగా, విశాఖలో భూ-కుంభకోణాలు జరిగిపోయాయని, వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తు చెయ్యాలని హడావిడి చేసారు. అయితే "సూది కోసం సోదికి వెళ్తే పాత రంకు బయటపడింది " అనే సామెత చందన, ఈ భూకుంభకోణం మొత్తం, కాంగ్రెస్ లోనే జరిగినట్టు తేలిపోయి, జగన్ మెడకే చుట్టుకుంది. రెండు రోజుల క్రితం, విశాఖలో భూరికార్డుల ట్యాంపరింగ్‌ పై విచారణ జరిపిన సిట్ కేబినెట్‌కు నివేదిక అందజేసింది. ఆ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉంది. ఈయన గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ధర్మాన కుమారుడి పేరుమీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్నాయి.

jagan 08112018 2

విచారణ జరిపిన సిట్ ఇచ్చిన నివేదికలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్ల పేర్లు ఉన్నాయి. 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. మొత్తంగా 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో సూచించింది. ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని సిట్ నివేదికలో వెల్లడించింది. ఇందులో కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సూచించింది. సిట్ నివేదిక పై తదుపరి చర్యలకు కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది.

jagan 08112018 3

ఈ భూకుంభకోణంలో గత ప్రభుత్వాల భాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూముల కొట్టేసిన బడా బాబులకు షాక్ తగిలింది. అప్పటి ఎన్ఓసీల రద్దుకు కేబినెట్ రంగం సిద్ధం చేస్తోంది. జగన్ ఆరోపించినట్టు, భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా సమర్పించ లేకపోయారని చెప్పింది. సీట్ నివేదికతో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పీకల దాకా మునిగింది. సిట్‌ నివేదికను మంగళవారం ఆమోదించిన మంత్రిమండలి... దానిని పరిశీలించి బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? అక్రమల లావాదేవీల్లో వేరేవారి పరమైన భూముల్ని ఎలా స్వాధీనం చేసుకోవాలన్న అంశంపై సిఫార్సులు చేసేందుకు రెవెన్యూ, సాధారణ పరిపాలన, న్యాయశాఖల కార్యదర్శులతో ఒక కమిటీని నియమించింది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక అందజేయాలని సూచించింది.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై కామెంట్లు చేయడంపై సెటైర్లు వేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... రోజా వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన... రోజా మహాతల్లి... నా మీద ఎందుకు మండి పడుతుందో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహాయంతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు అనుకుంటే ప్రజలు హర్షించరని చెప్పారు. మళ్లీ సీఎం కావడానికి రాహుల్ ను కలవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని అన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీకి ఉన్న బలం చాలని చెప్పారు. పొత్తుల కోసం, ఓట్ల కోసం ఆరాటపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకే కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారని చెప్పారు.

roja 08112018 2

మహాకూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారని అన్నారు. స్వామి ప్రబోధానంద ఓ ఫ్యాక్షనిస్టని, ఆయనతో తనకు రాజీ ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారన్నారు. ఏపీలో గెలుపు కోసం తెదేపా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.

roja 08112018 3

దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి అనివార్యమైందని వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకుని.. ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ..వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ భాజపాకు భంగపాటు తప్పదని జేసీ పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read