వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి, బాల్య స్నేహితుడు, వైఎస్ ఫ్యామిలీ అత్యంత సన్నిహితుడు, అనేక కేసుల్లో క్రిమినల్ గా ఉన్న మంగలి కృష్ణ కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లో ఈ కిడ్నాప్ జరిగింది. ఇటీవల కృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో భూ వివాదంలో ఓ కేసు నమోదైంది. కృష్ణ నాంపల్లి కోర్టుకు గురువారం హాజరయ్యాడు. అయితే ఈ కేసులో అతడికి కోర్టు బయిల్ మంజూరు చేసింది. బెయిల్ తీసుకున్న కృష్ణ అనుచరులతో కలిసి ద్విచక్రవాహనంపై (టీఎస్12 సీపీ 1598) బయలుదేరారు. కృష్ణ వాహనాన్ని వెంబడించిన దుంగడులు అనుచరులను కొట్టి కృష్ణను అపహరించారని అనుచరులు చెబుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణను టాస్క్ ఫోర్సు పోలీసులు తీసుకెళ్లారా? లేక ఇతర క్రిమినల్ ముఠాలు తీసుకెళ్లారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మద్దెలచెరువు సూరి హత్యకేసులో కూడా మంగలి కృష్ణ ఉన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఉన్న సూరి, అతనికి సహకరించిన అనేక మంది, సీరియల్ మర్డర్ లు జరిగిన దరిమిలా, ఈ కిడ్నాప్ కూడా, ఏమన్నా ఆ దిశగా జరిగిందా అనేది కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. మొన్న జగన్ మోహన్ రెడ్డిని కోడి కత్తితో గుచ్చినప్పుడు, జగన్ హైదరాబాద్ లోని హాస్పిటల్ లో జాయిన్ అయిన సందర్భంలో కూడా, కృష్ణ హాస్పిటల్ లో, రోజా, అనిల్ తో పాటు, మిగతా నాయకులతో చలాకీగా గడిపిన వీడియో కూడా అందరూ చూసారు. మొత్తానికి, ఈ సస్పన్స్ వీడే దాకా, పోలీసులు తీసుకువెళ్ళారా లేక, ఎవరన్నా పాత కక్షలతో చేసారా అనే విషయం ఏమిటో తెలియదు.