రాష్ట్రానికి నయవంచన చేసిన మోడీ మీద ప్రతి ఆంధ్రుడు రగిలిపోతుంటే, హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం, మోడీని ఒక్క మాట పడనివ్వటం లేదు. మొన్నటికి మొన్న తిత్లీ తుఫాను సాయం అంటూ 229 కోట్లు, మనకు కేటాయించిన విపత్తు నిధులు విడుదల చేసి, అదే మీకు మేమిచ్చే సహయం అని కేంద్రం నిస్సిగ్గుగా చెప్తే, అది నా చొరవే అంటూ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్.. కాని, ఆ డబ్బులు మనకు ప్రతి ఏటా ఇచ్చే విపత్తు నిధులే. ఈ విషయం పై కనీస అవగాహన కూడా పవన్ కు లేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ధర్మపోరాట దీక్షలు పెట్టి, మోడీని ఏకి పడేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ చేసిన మోసాన్ని, రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు.

pk 03112018 2

18 విభజన హామేల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన మోడీ పై, ప్రతి జిల్లాల్లో సభులు పెట్టి మోడీని నిలదీస్తున్నారు. అయితే, ఈ విషయంలో పాపం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో కాని, చాలా బాధపడుతున్నారు. నిన్న ట్రైన్ లో జరిగిన షూటింగ్ గ్యాప్ లో, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు పెట్టి, మోడీని ఓ తిడుతున్నారని, అలా తిట్టకుండా, మోడీతో, ఎంతో సౌమ్యంగా మాట్లాడుకుని, మనకు రావాల్సినవి సాధించుకోవాలని పవన్ అన్నారు. ఇక మరో పక్క, జగన్ కోడి కత్తి ఎపిసోడ్ పై కూడా పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. ఒక పక్క జగన్ ని కోడి కత్తితో గుచ్చినది ఆయన అభిమానే అని అందరికీ తెలిసినా, అది జగన్, మోడీ, అమిత్ షా ప్లాన్ లోని, ఆపరేషన్ గరుడలోని భాగం అని ప్రజలందరికీ తెలిసినా, పవన్ మాత్రం, చంద్రబాబు పై విమర్శలు చేసారు.

pk 031120183

"జగన్‌పై దాడి జరగడం దురదుష్టకరం. ఈ విషయంలో ప్రభుత్వం వెకిలిగా మాట్లాడ్డం సరికాదు. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలి. దాడి కావాలని చేశాడా..? ఎవరైనా చేయించారా? కుట్ర ఉన్నదా అనేది పోలీసులు విచారణలో తేలాలి. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలి. అంతే కాని, కోడి కత్తి అంటూ హేళన చేస్తారెందుకు" అంటూ పవన్ కళ్యాణ్, పాపం చాలా బాధపడ్డారు. మొత్తానికి, తన బాస్ అయిన మోడీ పై చంద్రబాబు చేస్తున్న దేశ వ్యాప్త ఉద్యమంతో, పవన్ కళ్యాణ్ బాగా హార్ట్ అయ్యారు. అందుకే, చంద్రబాబు, మోడీ పై దేశ వ్యాప్త పోరాటం చేస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి తన పార్టనర్ కాబట్టి, రేపు అమిత్ షా ఆదేశాల ప్రకారం చచ్చే చెడు, ఇద్దరూ కలిసి పోటీ చెయ్యాలి కాబట్టి, జగన్ పై హేళనలను కూడా పవన్ తిప్పి కొట్టారు.

గత కొద్ది రోజులుగా, ఏపి పోలీసుల పై, ముఖ్యంగా ఇంటలిజెన్స్ పై కేటీఆర్ ఓ పేలుతున్నాడు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం మర్చిపోయి, తన రాజకీయం కోసం, ఏపి పై పడి ఏడుస్తున్నాడు. చివరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై, విచారణ చేసిన ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు డబ్బులు పంచడానికి వచ్చారని స్థానికులు నిలదీశారని తెరాస నేతలు చేసిన ప్రచారం నిజం కాదన్నారు సీఈఓ రంజిత్ కుమార్. ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ పనిమీదనే ధర్మపురి వచ్చారని వారిదగ్గర డబ్బు కూడా దొరకలేదని చెప్పారు. తమ విచారణలో కూడా ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ పనిమీదే వచ్చారని ఎలాంటి కోడ్ ఉల్లంఘన జరగలేదని తేలిందని చెప్పారు.

ktr 03112018 2

ఈ ఆరోపణల పై ఏపి డీజీపీ కూడా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు మహాకూటమి తరఫున డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఏపీ డీజీపీ తోసిపుచ్చారు. ఆ ముగ్గురు తమ సిబ్బందేనని, వామపక్ష తీవ్రవాదం పై సమాచార సేకరణ కోసమే తెలంగాణకు వెళ్లారని తెలిపారు. ‘ఏపీ నిఘా పోలీసులకు తెలంగాణలో ఏం పని ఉంది’ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన విమర్శలకూ సమాధానం ఇచ్చారు. ‘ఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీ-సీఈవో రజత్‌ కుమార్‌ షైనీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి సమాచారం తెప్పించుకుని తెలంగాణ సీఈవోకు డీజీపీ సమాధానం పంపించారు.

ktr 03112018 3

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఏపీకి చెందిన కీలకమైన ఆస్తులు, వీఐపీల రక్షణకు పలు విభాగాలు పని చేస్తున్నాయి. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాలపై రహస్య సమాచారం తెలుసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మా విభాగాలు విధులు నిర్వహిస్తున్నాయి. అంతర్గత భద్రతపై వివరాలు సేకరించేందుకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది’’ అని డీజీపీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచారనడం అసత్యం, నిరాధారమని తెలిపారు. స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపి... ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించారన్నారు.

దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, భాజపాకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. 40ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయనకు మద్దతిచ్చారు. ఆయనతోపాటు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరి, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ నేతలు ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌లు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించగలిగే శక్తియుక్తులు గల నేత మీరేనని కితాబిచ్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబుతో విడిగా సమావేశమై మద్దతు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రస్తుతం కనిపిస్తున్న పెడపోకడల నుంచి దేశాన్ని రక్షించడానికి భాజపా వ్యతిరేక కూటమిని కూడగట్టాలన్న లక్ష్యంతో దిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి వరకు తీరికలేకుండా గడిపారు.

cbn 2112018 2

ఈ క్రమంలో భాజపాయేతర పక్షాల కూటమి ఏర్పాటుకు చేస్తోన్న ప్రయత్నాలకు మరో పార్టీ మద్దతు పలికింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూటమిని స్వాగతించారు. అవినీతి, నిరంకుశ, విభజన శక్తులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. భాజపాయేతర పక్షాలు ఒకేవేదిక పైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషిచేస్తున్న రాహుల్‌ గాంధీ, చంద్రబాబులను అభినందిస్తున్నానన్నారు. వారు చేసే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.

cbn 2112018 3

భాజపా హయాంలో రాజ్యాంగ, స్వతంత్ర సంస్థలు తీవ్ర సంక్షోభలో కూరుకుపోయాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సేవ్‌ నేషన్‌ పేరిట నిన్న దిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఎన్సీపీ, ఎన్సీ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలందరితోనూ భేటీ అయ్యారు. భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యతకపై ఆయన కీలక మంతనాలు జరిపారు.

ఎంతో సహనంతో రాష్ట్రం కోసం నాలుగేళ్లు ఓపిగ్గా ఎదురుచూశానని, ఢిల్లి చుట్టూ తిరిగినా మోడీ ప్రభుత్వం హామీలు నెరవేర్చ లేదని, అందువల్లే తిరగబడి బయటకు వచ్చానని, ఇప్పుడు విపక్ష పార్టీలను కూడగట్టి మెడలు వంచుతా నని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర అభి వృద్ధితోపాటు తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం మార్టూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం తాను పడుతున్న శ్రమకు అడుగడుగునా అడ్డం పడతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడమే కాకుండా, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఈ సమ యంలో దేశంలోనే ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడిగా తనవంతు బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం ఆసన్న మైనదని భావించానన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తె చ్చి వారికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమయ్యానన్నారు.

cbn 03112018 2

తానేం చేసినా తన స్వార్థం కోసం చేయడం లేదని, దేశం కోసం, భవిష్యత్‌ తరాల కోసం చేస్తున్నానని, దీనికి ప్రజల అండ కావాలని చంద్రబాబు కోరారు. ఏకపక్షంగా తనకు మద్దతు తెలిపి, 25 ఎంపీ సీట్లనూ గెలిపిస్తే ఢిల్లిని శాసిస్తానని, తాను చేయబోతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతు పలకాలని సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. భావితరాల భవిష్యత్తు కోసమే దశాబ్దాల వైరాన్నీ పక్కనబెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపానని చంద్రబాబు అన్నారు. తనకు హస్తినకు వెళ్లే ఆలోచన లేదని, ఇక్కడే ఉండి కష్టపడతానన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు న మ్మక ద్రోహం చేసిందని, ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిందన్నారు. అదేమని అడిగితే దగా చేయడం మొదలెట్టారని, దీంతో తాను ధర్మపోరాటం చేస్తున్నానన్నారు.

cbn 03112018 3

తనను ఏమీ చేయలేక తనను నమ్ముకున్న వారిపై, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై, తెలుగు ప్రజలపై బీజేపీ కక్ష కట్టిందన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ దాడులు చేయించి భయపెట్టే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీకేం చేసిందంటూ ప్రజలను ప్రశ్నించారు. నోట్లు రద్దు చేసి, ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారని, జీఎస్టీ అమలు చేయలేక చతికల పడ్డారని, పెట్రోల్‌, డీజల్‌ ధరలు అడ్డగోలుగా పెంచేశారన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని రూపాయి విలువ పడిపోయిందన్నారు. ప్రజల సంక్షేమం పట్టకపోగా రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్నారు. సీబీఐ, ఆర్‌బీఐ లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఈ దశలో దేశంలోనే ఒక సీనియర్‌ నాయకుడిగా నా బాధ్యతగా ఢిల్లి వెళ్లి అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగువారికి అన్యాయం జరిగితే బొబ్బిలిపులిలా విజృంభించాలని నాడు ఎన్‌టీఆర్‌ పిలుపునిచ్చారని, తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినే సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి వాళ్లను ఎదుర్కోవడమే తనకు తెలిసిన విద్యని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read