గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు అక్టోబర్‌ నుంచి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ చొరవతో ఇండిగో ముందుకొచ్చి సింగపూర్‌కు సర్వీసు నడపబోతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి ఏటా ఈ నాలుగు జిల్లాల నుంచి 25 లక్షల మంది హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నారు. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. వీరందరూ ఇక్కడి నుంచే వెళ్లేందుకు వీలుంటుంది. సింగపూర్‌తో భారతదేశానికి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో నౌకల ద్వారా జరిగే రవాణా చాలావరకు సింగపూర్‌, దుబాయ్‌ మీదుగానే ఇతర దేశాలకు చేరుకుంటాయి.

america 21082018 2

సింగపూర్‌కు ఏటా కోస్తా ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. . రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ ఒక్క విమాన సర్వీసును సింగపూర్‌, దుబాయ్‌కు నడిపితే.. వెసులుబాటు కలుగుతుందని ఎప్పటినుంచో ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ప్రయాణ ఖర్చు, సమయం ఆదా..: సింగపూర్‌కు విమాన టిక్కెట్‌ రూ. 16 నుంచి రూ. 20 వేల వరకూ అవుతోంది. అదే.. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో, రోడ్డు మార్గంలో వెళ్లడం వల్ల ఖర్చు అదనం. అక్కడ వేచి ఉండే సమయంలో ఖర్చు, విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలు సైతం ప్రయాణికులపై పడుతున్నాయి. అమెరికా, లండన్‌, కెనడా ఎక్కడి నుంచి వచ్చేవారినైనా తీసుకొచ్చేందుకు, సాగనంపేందుకు ఇక్కడి నుంచి వారి బంధువులు నిత్యం హైదరాబాద్‌కు వాహనాల్లో వెళ్లి వస్తున్నారు.

america 21082018 2

ఇది మళ్లీ అదనపు ఖర్చు.. ప్రయాస. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాక.. అక్కడ తెల్లవారుజామున 2గంటల తర్వాత నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి రాత్రి 10 గంటలకు అక్కడికి చేరుకున్నా.. కనీసం ఐదారు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. అటునుంచి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే ప్రయాణికులు.. తెల్లవారే వరకూ విమానాశ్రయంలోనే ఉండాల్సి వస్తోంది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఐదారు గంటలు ప్రయాణించి విజయవాడకు చేరాలి. ప్రస్తుతం ప్రవాసాంధ్రులు, విదేశాలకు వెళ్లే యాత్రికుల కోసమే ప్రత్యేకంగా వందల వాహనాలు నడుస్తున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా ఓ ఏసీ సర్వీసు విదేశాల నుంచి వచ్చే వారి కోసం నడుపుతున్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులన్నీ ఇస్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1.15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని చెప్పారు. ప్రజాసమస్యలపై వైసీపీ ఎక్కడా మాట్లాడటం లేదని కిరణ్ మండిపడ్డారు. అధికారంలోకి రావాలన్న ధ్యాస తప్ప ఆ పార్టీ నేతలకు మరో ఆలోచన లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం పతనమవడం ఖాయమని చెప్పారు. దేశ తదుపరి ప్రధాని రాహుల్ గాంధీనే అని జోస్యం చెప్పారు.

agnivesh 18082018 2

విభజన చట్టంలో ఉన్న 11 విద్యాసంస్థలకు రూ. 11,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే... మోదీ ప్రభుత్వం కేవలం రూ. 640 కోట్లు మాత్రమే ఇచ్చిందని కిరణ్ మండిపడ్డారు. ఇలాంటి బీజేపీని నమ్మాలా అనే విషయాన్ని అందరూ ఆలోచించుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఒక్క ఉద్యమం కూడా చేయలేదని మండిపడ్డారు. వారిని కాల్చండి, వారిని ఉరి తీయండి, వారి చొక్కాపట్టుకోండి అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... నాయకులు చెప్పాల్సింది ఇదేనా? అని విమర్శించారు. రాహుల్ ప్రధాని అయితేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు.

agnivesh 18082018 2

మరో పక్క రాహుల్ మాట్లాడుతూ, 2019లో అధికారంలోకి రాగానే ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా అమలుపైనే తన తొలి సంతకం ఉంటుందన్నారు. అయినా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఏపీకి ఇచ్చే కానుకేం కాదన్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో ఒక్కో రఫెల్ యుద్ధ విమానాన్ని 526 కోట్లకు కొంటే.. బీజేపీ హయాంలో ఒక్కో యుద్ధవిమానాన్ని 1600 కోట్లకు కొన్నారని ఆరోపించారు. మోదీ యుద్ధ విమానాల కాంట్రాక్టును తన మిత్రుడు అనిల్‌అంబానీకి ఇచ్చారని విమర్శించారు.

రాష్ట్ర విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీలు, కేంద్రం వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా భాజపా తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీకి ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌పై ఉన్న ప్రేమలో ఏపీపై 5 శాతం ఉన్నా రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర విభజన చట్టంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఏపీపై కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌కు మేలు చేసే ముంబై-ఢిల్లీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు నిధులు గుమ్మరిస్తూ... చెన్నై-విశాఖ కారిడార్‌కు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారన్నారు. తక్కువ వడ్డీకే లభించే జైకా రుణం మొత్తాన్ని ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలుకే కేటాయించారని... అమరావతి నిర్మాణానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

modi gujarat 18092018

‘‘అప్పులో ఉన్న గుజరాత్‌ ఆయిల్‌ కంపెనీని మోదీ ప్రధాని అయ్యాక హెచ్‌పీసీఎల్‌లో విలీనం చేశారు. ఏకంగా రూ.29 వేల కోట్ల సహాయం చేశారు. ఏపీకి సాయం చేయడానికి మాత్రం మనసు రాలేదు. నవ్యాంధ్రలో ఉన్న కేజీ బేసిన్‌లో వచ్చే లాభాలను... గుజరాత్‌లో నష్టాలను పూడ్చేందుకు ఉపయోగిస్తారా? పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇస్తామని ప్రకటించి అమలుచేయడం లేదు. కొత్త కంపెనీలు పన్ను రాయితీ క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇవ్వనే లేదు. విశాఖకు మెట్రో ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు వయొబులిటీ లేదని పక్కనపెడుతున్నారు. రాజధానికి అంతర్జాతీయ విమానాలు నడపమంటే పట్టించుకోవడంలేదు. ఈ నాలుగేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి ఒక్కసారైతే సమావేశం నిర్వహించారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

modi gujarat 18092018

"రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సమస్యల్ని ఎందుకు పరిష్కరించడంలేదు? సోదర రాష్ట్రాలు కలిసుండాలని చెప్పడం మానేసి తగువులు పెట్టాలని చూస్తున్నారు. రాజకీయ సుస్థిరత కోసం అసెంబ్లీ స్థానాలను పెంచమంటే నిర్లక్ష్యం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. 90శాతం పూర్తయ్యాయన్నారు కదా.. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎన్ని అయ్యాయో చెప్పండి. ఎవరి చెవిలో పూలు పెడతారు? నిధులు అడిగితే ఎదురుదాడి చేసి కేసులు పెట్టి బెదిరించేందుకు భాజపా యత్నిస్తోంది. హైకోర్టు నిర్మాణానికి సమయం ఉన్నప్పటికీ.. విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చివరి బడ్జెట్‌వరకు వేచి చూశాను. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదనే విషయాన్ని గమనించే.. ఇక లాభం లేదనుకొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. యూసీలు ఇస్తే ఇవ్వలేదంటున్నారు. రాజధానిలో పనులు ముమ్మరంగా జరుగుతుంటే పనులు మొదలే పెట్టలేదంటారు. అద్భుత రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుతామని మోదీ హామీ ఇవ్వలేరా? జగన్‌కు, కేసీఆర్‌కు పరిణతి ఉందని, నాకు పరిణతి లేదని అంటారా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తొలుత పెదపాడులో దివంగత సీఎం దామోదరం సంజీవయ్య చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాహుల్‌ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై సూటిగా సమాధానం చెప్పారు.

rahul 18092018

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి రాగానే మొదటగా ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తామని స్పష్టంచేశారు. హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని ఇప్పటి ప్రధాని మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరును ప్రశంసించారు. దేశంలోనే మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాలు కల్పిస్తుంటే.. మన దేశంలో 450 మాత్రమే కల్పిస్తున్నారని మండిపడ్డారు.

rahul 18092018

తరువాత బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రధాని మోదీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శిచారు. 2014 ఎన్నికలప్పుడు మోదీ ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మోదీలా తప్పుడు హామీలు ఇవ్వడం తనకు అలవాటు లేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. తొలి సంతకాన్ని ప్రత్యేక హోదా ఫైల్ పైనే చేస్తామని చెప్పారు. ప్రధానిగా కాకుండా దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ... మాట తప్పారని విమర్శించారు. కర్నూలులో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ ప్రసంగిస్తూ ఈమేరకు విమర్శలు గుప్పించారు. ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా మోదీ ఏపీని పూర్తిగా మోసం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రుల కళ్లలోకి చూసే ధైర్యం కూడా మోదీకి లేదని ఎద్దేవా చేశారు.

Advertisements

Latest Articles

Most Read