ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు నాందేడ్ ఎస్పీ లేఖ రాశారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖతోపాటు ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కాపీని జత చేయకపోవడాన్ని గమనించిన ఏపీ డీజీపీ కార్యాలయం తిరిగి లేఖ రాస్తూ, ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఏదని ప్రశ్నించింది. కోర్ట్ ఇచ్చిన కాపీ జత చెయ్యకుండా, కేవలం అరెస్ట్ వారెంట్ పంపించటం పై డీజీపీ కార్యాలయం అభ్యంతరం తెలిపింది.

notiece 19092018

మరో పక్క, ఈ విషయం పై నిన్న చంద్రబాబు, సీనియర్ నేతలతో, న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ‘మనం ప్రజల కోసం పోరాడాం. అందులో తప్పేమీ లేదు. అరెస్టు వారెంటు జారీ అయితే వెళ్లి ధర్మాబాద్‌ కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడతాను. న్యాయ వ్యవస్థను గౌరవిద్దాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు మాత్రం స్వయంగా వెళ్లి హాజరు కావలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సీఎం స్వయంగా వెళ్లకుండా.. తన తరపున న్యాయవాదిని పంపి వారెంటు ఉప సంహరణకు పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని, దానికి న్యాయమూర్తి అంగీకరించకపోతే అప్పుడు వెళ్లే విషయం ఆలోచిస్తే బాగుంటుందని వారు చెప్పారు.

notiece 19092018

ఇవిగాకుండా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే ఆలోచించాలనీ సూచించారు. చంద్రబాబు కోర్టుకు హాజరైతే ఉత్తర తెలంగాణ రైతులు సంఘీభావంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ టీడీపీ నేతలు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎనిమిదేళ్ల నాటి కేసులో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆరోపిస్తూ, అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల నాటి ఈ కేసులో ధర్మాబాద్ కోర్టు తాజాగా చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

నోట్లరద్దు సమయంలో కష్టాలు గుర్తున్నాయా ? ఒక్క వెయ్యినోటు...మార్పిడి చేసుకోవటానికి సామాన్య పౌరులు ఎంతో అవస్థ పడ్డారు. నాలుగువేలు మార్చడానికి బ్యాంకులు నానా రకాల నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టాయి. ప్రతి భారతీయుడు ఆ కష్టం పడ్డారు. అప్పట్లో దేశం కోసం కదా అని అందరూ భరించారు కూడా. కాని రాను రాను ఇది ఒక విఫల ప్రయోగం అని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద స్కాంగా కూడా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో వెయ్య నోటు మార్చటానికి సామాన్యుడు ఇబ్బంది పడితే, అదే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విషయానికొచ్చేసరికి వందల కోట్ల రూపాయల పాత నోట్ల మార్పిడికి ఎలాంటి అడ్డంకులు రాలేదు.

amtishah 19092018 2

అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న 'అహ్మదాబాద్‌ డిస్ట్రిక్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌' (ఏడీసీసీబీ) రూ.745.59కోట్ల విలువ చేసే రద్దయిన పాత నోట్లను మార్పిడి చేసిందని, పెద్ద మొత్తంలో పాత నోట్ల మార్పిడి జరిపిన బ్యాంకుల్లో దేశంలోనే 'ఏడీసీసీబీ' ముందుందని తేలింది. అమిత్‌ షా ఒక్కడే కాదు, బీజేపీ, కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌, శివసేనకు చెందిన వివిధ నాయకుల నేతృత్వంలో నడుస్తున్న కో ఆపరేటివ్‌ బ్యాంకులు 'పాత నోట్ల మార్పిడి'లో దేశంలోనే ముందున్నాయని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రిక తాజాగా కథనం వెలువరించింది. 'సమాచార హక్కు' ద్వారా 'నాబార్డ్‌' నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన అంశాలు ఇలా ఉన్నాయి..

amtishah 19092018 3

నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున పాత నోట్ల మార్పిడి జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకుల ద్వారా జరిగింది. టాప్‌-10 బ్యాంకుల్లో నాలుగు గుజరాత్‌, నాలుగు మహారాష్ట్రలో ఉండటం గమనార్హం. ఒకటి హిమాచల్‌ ప్రదేశ్‌, ఒకటి కర్నాటకలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 370 డీసీసీబీలలో రూ.22,270కోట్ల పాత నోట్ల మార్పిడి జరిగింది. ఇందులో 19 శాతం, అంటే రూ.4,191 కోట్ల పాత నోట్ల మార్పిడి కేవలం 10 డీసీసీబీ బ్యాంకుల్లో చోటుచేసుకుంది. ఈ టాప్‌-10 డీసీసీబీ బ్యాంకుల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న 'అహ్మదాబాద్‌ డిస్ట్రిక్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌' మొదటి స్థానంలో (రూ.745కోట్లు) ఉంది. తర్వాత స్థానంలో రాజ్‌కోట్‌లోని డీసీసీబీ (రూ.693కోట్లు) ఉంది. ఈ బ్యాంకుకు ఛైర్మెన్‌గా జయేష్‌భారు విఠల్‌భారు రాడాడియా(గుజరాత్‌ రాష్ట్ర మంత్రి) ఉన్నారు. మరి ప్రధానమంత్రి గారు, ఈ విషయం పై స్పందిస్తారా ? మాటల్లో చెప్పే నిజాయితీ, చేతల్లో చూపిస్తారా ?

స్వాతంత్ర్య సమరయోధులు అంటే సమాజంలో వారికి ఎంతో గౌరవం ఉంటుంది. మన దేశ స్వాతంత్రం కోసం, ఎన్నో త్యాగాలు చేసారు వారు. ఆ తరం వారు, వయసు పైబడి, ఇప్పుడు చాలా కొద్ది మంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు కూడా ఎన్నో కార్యక్రమాలతో వారికి చేయుతనిస్తూ వస్తున్నాయి. దేశం కోసం ఇలాంటి త్యాగం చేసిన కుటుంబం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. 92 ఏళ్ళ అడుసుమిల్లి వెణుగోపాలరావు గారు, ఆయన సతీమణి హనుమతరత్నం, ఇక్కడ నివాసం ఉంటున్నారు. వృద్ధాప్యంలో వెణుగోపాలరావు గారి సతీమణికి ఆరోగ్యం దెబ్బతింది.

bonda 19092018 2

హనుమతరత్నం గారు ఎంతో కాలంగా మంచంలోనే వుంటున్నారు., శస్త్రచికిత్సతో నయమవుతుందిని వైద్యులు చెప్పట్టంతో, దాచుకున్న డబ్బులతో 3లక్షల రూపాయలతో వైద్యం చెయించారు. ఉన్న డబ్బులు అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ప్రధానమంత్రి గారి లేఖ రాసారు. మేము స్వాతంత్రం కోసం పోరాడాము, ఇప్పుడున్న పరిస్థితిలో మాకు అనుకోని ఇబ్బంది వచ్చింది, మా సతీమణి ఆపరేషన్ కి, మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, జీవిత చరమాంకంలో ఉన్న మమ్మల్ని, ఆదుకోండి అంటూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసారు.

bonda 19092018 3

ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. కాని, కొన్ని నిబంధనలు అడ్డువస్తున్నాయి, మేము సహాయం చెయ్యలేము అని చెప్పింది. వెణుగోపాలరావు గారు, మళ్ళీ ప్రధాని కార్యాలయానికి ఉత్తరం రాస్తూ ఆ ఇబ్బంది ఏంటో అడిగారు. అక్కడ నుంచి వచ్చిన సమాధానం, మీ సతీమానికి ఆధర్ కార్డు లేని కారణంగా మేము సహాయం చెయ్యలేము అని. స్వతంత్రం కోసం పోరాడిన వారికి, ఆధర్ కార్డు లేదని, సహాయం చెయ్యలేము అని చెప్పింది ప్రధాని కార్యాలయం. ఇది ఇలా ఉండగానే, స్థానిక ఎమ్మల్యే బొండా ఉమా, తన దినచర్యలలో భాగంగా, నియోజకవర్గంలో ఇంటి ఇంటికి తిరగే కార్యక్రమంలో, వెణుగోపాలరావు గారు ఇంటికి చేరుకున్నారు.

bonda 19092018 4

ఈ సందర్భంలో, వెణుగోపాలరావు గారు ఆయన సతీమణి, వారికి వచ్చిన కష్టం చెప్పారు. దేశం కోసం పోరాడిన మాకు, ఆధర్ కార్డు లేదని, ప్రధాని కార్యాలయమే మాకు సహాయం చెయ్యలేము అని చెప్పిందని, ఇంకా మా బాధలు ఎవరు వింటారని, ఎమ్మల్యే బొండా ఉమా దగ్గర బాధ పడ్డారు. బొండా ఉమా, వెంటనే జరిగిన విషయం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పారు. కేవలం ఆధార్ కార్డు లేదని, ఈ వయసులో వారిని కేంద్రం పట్టించులేదని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వారి స్థితి విని చలించిపోయారు. దేశం కోసం పోరాడిన వారికి, కేవలం ఆధార్ లేదని వదిలేస్తామా అంటూ, బొండా ఉమా తీసుకున్న చొవరకి అభినందించి, వెంటనే వెణుగోపాలరావు గారికి, 3 లక్షల సహాయం చెయ్యమని సియఓ అధికారలుని ఆదేశించారు. నిన్న ఆ చెక్ అందటంతో, స్వయంగా ఎమ్మల్యే బొండా ఉమా వారి ఇంటికి వెళ్లి, ఆ చెక్ అందచేసి, దేశ స్వతంత్రం కోసం పోరాడిన మీకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వృద్ధ దంపతులు మాట్లాడుతూ ఎప్పుడో స్వతంత్రం వచ్చిన మా కాలంలో ప్రజానాయకులను వుండే వారు, ఇప్పుడు మరలా చంద్రబాబు గారు మిమ్మల్ని చూసాను అంటూ బొండా ఉమా గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, కేంద్రంలో బీజేపీ పెద్దలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అడుగుతున్నందుకు, ఇప్పటికే అనేక విధాలుగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటమే కాకుండా, వ్యక్తిగతంగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేసారు. గత ఆరు నెలల నుంచి, మీకు చుక్కలు చూపిస్తాం అంటాడు ఒకడు, మిమ్మల్ని జైల్లో పెడతాం అంటాడు ఒకడు, మీ పై సిబిఐ, ఈడీని పంపిస్తున్నాం అంటాడు మరొకడు. ఆ జీవీఎల్ అయితే, వారానికి ఒకసారి ఢిల్లీ నుంచి వచ్చి, ఎదో చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఏది దొరకక, ఎప్పుడో ఎనిమిది ఏళ్ళ నాటి కేసు పై నోటీసులు ఇచ్చారు.

gvl 19092018 2

ఇన్ని విధాలుగా చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, చివరకు ఎప్పుడో మూసేసిన కేసులో, చంద్రబాబుకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. దీని వెనుక ఎవరు ఉన్నారో, అందరికీ తెలిసిందే. ఈ కేసు పై చంద్రబాబు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై మాట్లాడుతూ, చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా, లీగల్ తీసుకుని, మళ్ళీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహారాష్ట్ర న్యాయస్థానంలో ‘కోర్టు ధిక్కార’ పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా సీఎం వ్యాఖ్యానించారని జీవీఎల్‌ ఆరోపించారు.

gvl 19092018 3

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్‌ సిద్ధమవుతోందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కోర్టులపై చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించామన్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో సీఎం పై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని జీవీఎల్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. ఇటు హక్కుల తీర్మానం అటు కోర్టు ధిక్కార పిటిషన్‌తో చంద్రబాబును ఇరుకున పెడతామన్నారు. కాగా, ముంబై హైకోర్టులో సీఎం చంద్రబాబుపై పిల్‌ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read