రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం వృద్ధిని ఉదారతను అభినందించిన సీఎం చంద్రబాబు ఆయన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు... అడుగు తీసి అడుగు వేయలేని నిస్సహాయత...తోడు ఒకరుంటేనేగానీ బయటకు రాలేని వృద్ధుడు...వాకర్ స్టాండు లేకుండా నిటారుగా నిలబడలేని నిస్సత్తువ...అయినా గుడివాడ నుంచి రాజధాని వెలగపూడికి యువకుడిని తోడు తీసుకుని వచ్చారు...శాసనసభ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు...రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు...

kutumbraro 18092018 2

గుడివాడ నివాసి, ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ చేసిన టి.వి.ఆర్. కుటుంబరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ఆ మేరకు చెక్కును అందజేశారు...నడవలేనిస్థితిలోనూ దూరాభారం అని లెక్క చేయకుండా వచ్చి రాజధాని నిర్మాణానికి విరాళం అందించి ఉదారతను చాటుకున్న కుటుంబరావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. నవ్యాంధ్ర పౌరుడిగా తనవంతు బాధ్యతగా విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న తపన, కృషిని స్పూర్తిగా తీసుకుని సొంత రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుదామని వచ్చానని వివరించాడు...పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బు నుంచి విరాళమిచ్చిన వృద్ధ, విశ్రాంత ఉపాధ్యాయుడి ఉదారత, సేవాభావానికి మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభివాదం చేశారు.

మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు వారెంట్లపై తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు 15 మందికి జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై టీటీడీపీ నేతలతోనూ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు. ధర్మాబాద్‌కు వెళ్దామా లేదా రీకాల్ పిటిషన్ వేద్దామా అని ఆయన పార్టీ నేతలను ప్రశ్నించారు. గతంలో అనేక వారెంట్లు జారీ చేసినా హాజరుకాలేదన్న ఆరోపణలపై సీఎంఓ అధికారులను పిలిచి ఏ విధమైన వారెంట్లు వచ్చాయో పరిశీలించమని ఆదేశించగా, గతంలో ఎన్నడూ ఇలాంటి కేసుకు సంబంధించి ఎలాంటి వారెంట్లు రాలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం తాజాగా జారీ అయినట్టు చెబుతున్న నాన్‌బెయిలబుల్ వారెంట్ అందినట్టు అధికారులు చంద్రబాబుకు చెప్పారు.

cbn warrant 18092018 2

ఈ అంశంపై టీడీపీ ఎదురుదాడిని తీవ్రతరం చేసినా, వ్యవహారం మాత్రం సాంకేతికంగా కోర్టులో తేల్చుకోవల్సిందేనని చంద్రబాబుకు అధికారులు సూచించినట్టు సమాచారం. న్యాయస్థానం నుండి నోటీసులు వచ్చినపుడు వాటికి లేని పోని ఆరోపణలను ఆపాదించలేమని, అయితే నోటీసులతో సంబంధం లేకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపుపై వేరుగా మాట్లాడాలని న్యాయనిపుణులు చంద్రబాబుకు తెలిపారు. ఈ నెల 23న అమెరికా వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన తరుణంలో వారెంట్లపై టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరకుండా పరిష్కారం కనుగొనాలని టీడీపీ యోచిస్తోంది. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని భావించిన సీఎం వారెంట్ల వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఏపీ మంత్రులు, తెలుగుదేశం ముఖ్య నేతలు, అధికారులతో అమరావతిలో కీలక భేటీ నిర్వహించారు.

cbn warrant 18092018 3

న్యాయవ్యవస్థను గౌరవిస్తూ మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు టీటీడీపీ నేతలతో పేర్కొనగా, ఒకవేళ ఆయన కోర్టుకు హాజరుకావాలని నిర్ణయించినట్టయితే ఆయన వెంట వచ్చేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. మరో మారు ఈ అంశాన్ని చర్చిద్దామని టీటీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించాల్సి ఉండటంతో టీడీపీ నేతలు వారెంట్ల అంశంపై ఆందోళనకు గురవుతున్నారు. వారెంట్ల వ్యవహారాన్ని తెల్చుకోకుండా అమెరికా వెళితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని చంద్రబాబు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. వారెంట్ల రీకాల్‌కు పిటిషన్‌కు వేయాలా? లేదా? కోర్టు ముందు హాజరై అనంతరం బెయిల్ పొందాలా? లేదా? ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి జిల్లా న్యాయమూర్తి ఆదేశాలపై స్టే తెచ్చుకోవాలా? అనే కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి.

వైసీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశల పై అధిష్ఠానం నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. మల్లాది విష్ణుకు సెంట్రల్‌ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె.పార్థసారథి, సామినేని ఉదయభాను, వెలంపల్లి శ్రీనివాస్‌, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.

radha 18092018 1

పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా పలువురు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి వంగవీటి రాధా అండదండలు ఉన్నాయని వెలంపల్లి భావిస్తున్నారు. ఇదే విషయమై అధిష్ఠానానికి కూడా ఆయన గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షాత్తు పెద్దిరెడ్డి రంగంలోకి దిగి పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు సెంట్రల్‌ నియోజకవర్గంలోనూ వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాధాకు చెక్‌ పెట్టేందుకు ఇదే అదనుగా భావించిన వెలంపల్లి సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలను మల్లాది విష్ణుకు దక్కేలా పావులు కదపడం ప్రారంభించారు. వెలంపల్లి వర్గానికి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో ఆయన పని మరింత సులువు అయింది. ఆదివారం నాటి సమావేశంలో సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలు మల్లాదికే అని చెప్పించడంలో వెలంపల్లి వర్గం విజయవంతమైంది.

radha 18092018 1

రాధాను సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని పార్టీ పెద్దలు ఆదివారం సమావేశంలో సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాధా వ్యతిరేకించి, సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపో యారు. సోమవారం నుంచి సెంట్రల్‌ నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీన్ని మల్లాది విష్ణు నాయకత్వంలో చేపట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. దీంతో సెంట్రల్‌ సీటు రాధాకు దక్కడం అనుమానమేనని వెలంపల్లి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ అంతర్గత విభేదాలను పక్కకు పెట్టి వెలంపల్లి నేతృత్వంలో పనిచేయాలని పెద్దిరెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం.

విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రీడకు వేదక కాబోతోంది. బీచ్ వాలీబాల్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది వాలీబాల్ (ఎఫ్‌ఐవీబీ) బీచ్ వాలీబాల్ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచంలోని 56 దేశాల్లో ఈ బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. భారత దేశంలో కూడా జనవరి 17 నుంచి 20 వరకూ బీచ్ వాలీబాల్ టోర్నీని నిర్వహించడానికి జర్మనీ బృందం ప్రతిపాదించింది. భారత దేశంలో మొట్టమొదటి బీచ్ వాలీబాల్ టోర్నీని విశాఖలో నిర్వహించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నట్టు ఎఫ్‌ఐవీబీ గుర్తించింది. ఆ సంస్థ ప్రతినిధులు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్‌ఐ), ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ (ఏపీవీఏ) ఈ క్రీడల నిర్వహణకు కావల్సిన సాంకేతిక, వౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చాయి.

vizag 18092018 2

దీంతో విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో జనవరి 17 నుంచి 20 వరకూ బీచ్ వాలీబాల్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఏపీ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు వివరాలను అందచేశారు.బీచ్ వాలీబాల్ పోటీల్లో ఒక్కో జట్టులో ఇద్దరేసి క్రీడాకారులు మాత్రమే ఉంటారు. ప్రపంచంలోని 56 దేశాల్లో ఈ పోటీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఆయా దేశాల్లో ఛాంపియన్‌లుగా నిలిచిన జట్లు విశాఖలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాయి. ఈ టోర్నీలన్నింటిలో విజేతగా నిలిచిన వారికి ఎనిమిది మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. ఎఫ్‌ఐవీబీ బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్‌కు మన దేశంలో కోల్‌కతాకు చెందిన లీజర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తుందని గణబాబు తెలియచేశారు.

vizag 18092018 3

దీనికి సంబంధించి న్యూ ఈవెంట్స్ బిజినెస్ డైరక్టర్ ఆంగ్లో స్కుయో మాట్లాడుతూ వాలీబాల్ క్రీడకు భారత దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని న్నారు. ఈ క్రీడలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారులు ఈ దేశంలో ఉన్నారన్నారు. పర్యాటక నగరాల్లో బీచ్ వాలీబాల్‌ను నిర్వహించాలని తాము భావిస్తున్నామని, దీనివలన పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్రికెట్, హాకీ మాదిరి బీచ్ వాలీబాల్‌కు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్ననది తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు నిర్వహిస్తున్న బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ ఎఫ్‌ఐవీబీ చరిత్రలోనే ఒక పెద్ద ఈవెంట్‌గా నిలిచిపోతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, లీజర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.దాస్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read