చాలా రోజుల తరువాత, అసెంబ్లీలో ఈ రోజు చంద్రబాబు నిప్పులు కురిపించారు. కేంద్రం చేస్తున్న మోసం వివరిస్తూ, మధ్యలో బీజేపీ సభ్యలకు చురకలు అంటిస్తూ, ఇది మా ఆంధ్రలు ఆవేదన అంటూ, తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీని ఈ తరాలే కాదు భవిష్యత్తు తరాల ప్రజలు కూడా క్షమించరని అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టం పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, అధికారులను స్వయంగా కలిసి సంప్రదింపులు జరిపినా, వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి ఒత్తిడి పెంచినా కేంద్రం తన తీరును మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడాన్ని శాసనసభ తీవ్రంగా గర్హిస్తున్నదని చంద్రబాబు అన్నారు.

cbn 19092018 2

తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత భాజపా సభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఏదైనా చాలా పర్‌ఫెక్ట్‌గా చెబుతారని, గుండెల్లోకి వెళ్లేలా చెబుతారని అన్నారు. దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. తాను చెప్పినదాంట్లో ఏమాత్రం అసత్యం లేదన్నారు. చట్టంలో పేర్కొన్న వాటిలో 90శాతం చేసేశామని భాజపా నేతలు అనడం దారుణమన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అడ్డంగా మాట్లాడితే మాత్రం ప్రజలు ఊరుకోరు. చాలా కోపంగా ఉన్నారు. కేంద్రం ఏపీ పట్ల చూపుతున్న వివక్ష వైఖరిని నేటి తరాలే కాకుండా భావితరాలు కూడా క్షమించవన్నారు. కేంద్రం వైఖరితో పుట్టబోయే వాళ్లకు కూడా నష్టం జరుగుతుందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.

cbn 19092018 3

కేంద్రం వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచాలని భాజపా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కోరారు. ఈ గడ్డపై పుట్టి ఉంటే కేంద్రం వైఖరిని నిరసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచాలని కోరారు. ఏపీ విభజన హామీల సాధన కోసం తాను చేస్తున్న పోరాటం కేంద్రంపైనేనన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నానని, అంతేతప్ప తన స్వార్థం కోసం కాదన్నారు. తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని, ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ ఈ పోరాటాన్ని స్వాగతించాలలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, నరనరాన ఆ బాధ ఉందని, ఈ తరుణంలో ఏపీలోని భాజపా నేతలు కేంద్రం వైఖరిని నిరసించాలని కోరారు. ఆంధ్రుడనుకొనే ప్రతి వ్యక్తీ కేంద్రం వైఖరిపై బొబ్బిలి పులిలా తిరగబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. ఆయన ఆస్థి రూ.2.28కోట్లు. సొంత కార్ కూడా లేదు. నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం.. మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోదీ చేతిలో ఉన్న డబ్బు రూ. 48,944. ఇక ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.28కోట్లు. ఇందులో రూ. 1.28కోట్లు చరాస్థులు కాగా.. గాంధీనగర్‌లోని మోదీ నివాస స్థలం విలువ రూ. కోటి. గాంధీనగర్‌లో దాదాపు 900 చదరపు అడుగుల నివాస స్థలాన్ని 2002లో మోదీ రూ. లక్షకు కొనుగోలు చేశారు.

modi 19092018 2

ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ. కోటికి పెరిగింది. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ బ్రాంచీలో ప్రధాని మోదీకి ఖాతా ఉంది. మార్చి 31 నాటికి అందులో రూ. 11,29,690 నిల్వ ఉన్నాయి. ఇక ఇదే బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్ డిపాజిట్‌ స్కీమ్‌ల రూపంలో మోదీ పేరుపై రూ. 1.07కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇవి గాక.. రూ. 5.18లక్షల విలువ గల జాతీయ పొదుపు బాండ్‌, రూ. 1.59లక్షల విలువ గల జీవిత బీమా పాలసీ ఉంది. తాజా వివరాల ప్రకారం.. మోదీ పేరుపై కనీసం సొంత కారు కూడా లేదు.

modi 19092018 3

ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన వద్ద రూ. 1.38లక్షల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక.. ప్రధాని ఏ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు కూడా తాజా వివరాల్లో లేదు. క్రితం ఏడాదితో పోల్చితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోడీ స్థిర, చరాస్తులు పెరిగాయి. ఆయన బ్యాంక్‌ ఖాతాలో నగదు నిల్వ అమాంతం 8 రెట్లు పెరిగింది. గాంధీనగర్‌(గుజరాత్‌)లోని ఎస్‌బీఐ పొదుపు ఖాతాలో నగదు నిల్వ రూ.1.33 లక్షల నుంచి రూ.11.2లక్షలకు చేరుకుంది. అలాగే రూ.90లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.కోటీ 7లక్షలకు చేరుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పుస్తకాలపై రాయల్టీ రూపంలో మోడీ రూ.10.23లక్షలు ఆదాయం అందుకున్నారని పేర్కొనగా, ఈసారి (2017-18) సమర్పించిన ఆదాయపన్ను రిటర్న్‌ ఫైల్‌లో దీనిని చూపలేదు. భార్య జశోదాబేన్‌ ఆదాయ, ఆస్తి వివరాలు 'తెలియవని' చూపారు.

ఈ రోజు ఉదయం మీడియాలో వచ్చిన కధనాలు చూసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుగా ఉంటూ, ప్రజలకు రక్షణ కలిపించాల్సింది పోయి, వారినే వంచిస్తున్న సిఐ పై ఫైర్ అయ్యారు. మహిళ పట్ల చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ వేధింపుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సీఐ తేజోమూర్తి పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

cbn 19092018 2

మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడం పై మదనపల్లెకు చెందిన సంయుక్త అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బాధితురాలిపై కన్నేసిన స్టేషన్ సీఐ తేజోమూర్తి తన కోరిక తీర్చాలని వేధించాడు. తిరుమల కొండ పై తాను విధులు నిర్వహిస్తున్నాననీ, వస్తే ఇద్దరం కలసి ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాడు. రెండు రోజుల కిందట ఫోన్ చేసి తిరుమలకు రావాలని చెప్పినట్లు ఆమె చెబుతున్నారు. నందకం రెస్ట్‌హౌస్‌లో గదిని బుక్ చేశానని సీఐ చెప్పినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు.

cbn 19092018 3

నిన్న మహిళా సంఘాలను వెంటబెట్టుకుని తిరుమలకు వచ్చిన బాధితురాలు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో విషయం పసిగట్టిన తేజమూర్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కలిసేందుకు ప్రయత్నించారు. మరోవైపు విషయం తెలుసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్, తేజామూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో మహిళకు ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని తాను ధైర్యంగా ముందుకు వచ్చానని బాధితురాలు చెబుతోంది.

అసెంబ్లీ సమావేశాల్లో మొబైల్ ఫోన్లు లోపలకి తీసుకురాకూడదు అనే నిబంధన ఉంది. ఈ నిబంధనలు అందరూ పాటిస్తారు కూడా. అసెంబ్లీ హాల్ లోకి వచ్చేప్పుడు, మొబైల్ ఫోన్ బయట ఇచ్చి, సమావేశాల్లో పాల్గుంటారు. అయితే నిన్న మాత్రం, పొరపాటు జరిగింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సెల్‌ ఫోన్‌ రింగయింది. ఈ సమయంలో స్పీకర్‌ కొంత అసహనానికి గురయ్యారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఫోన్లు బయటపెట్టి రావాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు శాసనసభ్యులకు సూచించారు.

assembly 19092018 2

ఈ సంఘటన జరిగిన వెంటనే, వెలగపూడి రామకృష్ణబాబులేవనెత్తిన అంశమే చర్చకు రావడంతో ఆయన మాట్లాడేందుకు లేచారు. ఈ సందర్భంగా, స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. పొరపాటున మర్చిపోయి వచ్చేసానని, మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ, సభకు క్షమాపణ చెప్పారు. మరో పక్క విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల భూముల సమస్య పై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. పంచగ్రామాల భూముల సమస్య సత్వర పరిష్కా రానికి త్వరలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించ నున్నట్లు ఉపముఖ్యమంత్రి కె.ఇ కృష్ణమూర్తి తెలిపారు.

assembly 19092018 3

ప్రజాప్రాముఖ్యత గల అంశంగా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం ప్రభుత్వం దృష్టికి తెసుకురావడంతో మంత్రి సమాధానమిస్తూ...ఈ భూములపై సింహాచలం దేవస్థానానికి, స్థానికులకు మధ్య న్యాయస్థానంలో కేసు నడుస్తోందని, తీర్పు వచ్చిన అంనతరం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇళ్లకు సంబంధించిన విషయం న్యాయస్థానంలో ఉందని, వ్యవసాయ భూముల అంశాన్ని రెవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని గతంలో న్యాయస్థానం సూచించినా ఇంత వరకూ పరిష్కారం కాలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. జెసి, ఆర్డీఒల నుంచి సమాచారం తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.శ్రీనివాసరావు, కన్నబాబు స్థానికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

Advertisements

Latest Articles

Most Read