కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు శ్రీవారి ఆలయన్నే తమ ఆధీనంలోకి తీసుకుందామని అనుకున్నారు. దీనికి బీజం వేస్తూ, తిరుమలను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరు చేసి, కేంద్రానికి ఇవ్వాల్సిందిగా సుప్రీంలో కేసు వేసారుసుభ్రమణ్య స్వామి. ఈ విషయం పై అప్పట్లో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. ఇలా కేసులు వేసి, మన వెంకన్న స్వామిని తన, హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలని, బీజేపీ పన్నాగం పన్నింది. అయితే కేంద్రం కంటే, రాష్ట్రం కంటే, వెంకన్నకు తనని తాను కాపాడుకోవటం బాగా తెలుసు. పావురాల గుట్ట సాక్షిగా అది రుజువైంది కూడా.

tirumala 17092018

ఈ సారి కూడా, వెంకన్న తన పవర్ చూపించారు. టీటీడీ పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టీటీడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయనే స్వయంగా వాదించారు. అయితే కోర్ట్ మాత్రం, ఆయన వాదనతో ఏకీభవించలేదు. స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

tirumala 17092018

అయితే ఈ పరిణామాల పై, రాష్ట్ర ప్రజలు మండి పడుతున్నారు. మా తిరుపతి పై నీ పెత్తనం ఏమిటి మోడి అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాం.. మద్రాసు పోయినా తిరుమల ఉందని సంతోషించాం.హైదరాబాద్ పోయింది.తిరుమల ఉందని ఊపిరి నిలుపుకున్నాము.తిరుమల జోలికి రావద్దు. తిరుమల మాదే, ఏడుకొండలు మావే ! వెంకటేశ్వరుడు మా దేవుడే !! ఇందులో ఎలాంటి డౌటు లేదు. అనవసర ప్రయాసలు మానుకోండి!! అసలే ఆంధ్రులు అసంతృప్తి చూసి వెంకన్న ఆగ్రహంతో ఉన్నాడు. పొరపాటు జరిగిందో ఇక మీకు శంకరిగిరి మాన్యాలే గతి అంటూ సగటు ఆంధ్రుడు, కేంద్రానికి అర్ధమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఇక వారి ఇష్టం... మిగతాది వెంకన్నే చూసుకుంటాడు.

విశాఖ నగరంలోని గాజువాకలో విద్యుదాఘాతంతో రెండు సినిమా థియటర్లు దగ్ధమయ్యాయి. గాజువాక ప్రధాన రహదారిలో ఒకే భవనంలో కింది, పై అంతస్తుల్లో కన్య, శ్రీకన్య థియేటర్లు ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున థియేటర్ల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్వీపర్‌ చిట్టెమ్మ యజమానికి సమాచారం అందించింది. ఆయన ఫైరింజన్లకు సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చేసరికే థియేటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 8 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.

vizag 17092018 1

ఈ ఘటనలో రెండు థియేటర్లలోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.3కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని తెలిపారు. విశాఖ డీసీపీ ఫకీరప్ప సహా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని డీసీపీ పేర్కొన్నారు. విద్యుదాఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లు థియేటర్‌ మేనేజర్‌ రామారావు తెలిపారు.

తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో శనివారం గణేశ్‌ నిమజ్జనం సమయంలో తొలుత వివాదం చెలరేగిన తర్వాత పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు రాత్రి అనంతపురం ఆర్డీవో, తాడిపత్రి ఇన్‌ఛార్జి డీఎస్పీ ఆశ్రమం లోపలికి వెళ్లారు. తొలుత వారిని భక్తులు అడ్డగించగా, లోపల చూడాల్సిందే అని అధికారులు పట్టుబట్టి వెళ్లారు. ఈ సందర్భంగా లోపల పెద్దఎత్తున కర్రలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకున్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలను లోపలికి రప్పించి, వారితో వాటన్నింటినీ బయటకు తెప్పించారు. అయినా సరే ఆదివారం మళ్లీ గొడవ జరిగే సమయానికి ఆశ్రమంలో భక్తులు కర్రలతో బయటకు వచ్చి చుట్టుపక్కల గ్రామస్థులపై దాడులు చేయడం విశేషం. ఇక ఆశ్రమం చుట్టూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చడం, బయట ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అలాగే భక్తులను అప్రమత్తం చేసేందుకు సైరన్‌ కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఆదివారం మధ్యాహ్నం ఆ సైరన్‌ మోగిన తర్వాతే కొందరు భక్తులు కర్రలు, రాడ్లతో బయటకు వచ్చి దాడి చేశారని తెలుస్తోంది.

asramam 17092018 2

ఆదివారం మధ్యాహ్నం గొడవ పెద్దది కావడం, ఆశ్రమ భక్తులు బయటకు వచ్చి కొందరిపై దాడి చేయడం, ఆ తర్వాత అందులో ఒకరు చనిపోవడంతో పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించారు. అదనపు ఎస్పీ మల్యాద్రి, కొందరు డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయతించగా, గేట్లు తెరవకుండా అడ్డుకున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాళ్లు ఆయన్ను కూడా అడ్డుకున్నారు. లోపలకు రానివ్వమని అడ్డుతగిలారు. ఎస్పీ అయినా మాకేంటని వాదించారు. అందరితో మాట్లాడతామని చెబితే కేవలం ఎస్పీ, ఒక్క గన్‌మెన్‌ను మాత్రమే లోపలికి అనుమతించి, వారు లోపలికి వెళ్లగానే బయట ప్రధాన గేటుకు తాళాలు వేసేశారు. అంతా అక్కడి నుంచి సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని భక్తులకు ఎస్పీ నచ్చజెప్పినా, వారెవరూ వినలేదు. తాము ఇక్కడే ఉంటామనీ, తమ జీవితం స్వామికి అంకితమంటూ ఖరాకండిగా చెప్పారు. మరోవైపు వీరికి ఎవరు మద్దతుగా ఉన్నారు? ఈ ఆశ్రమానికి పెద్దఎత్తున నిధులు ఎలా అందుతున్నాయి? వీరు ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రాణాలు అయినా అర్పించుకుంటామని పేర్కొంటున్న వైనం.. తదితరాలన్నీ పోలీసులు, అధికారులకు అంతు చిక్కనివిగా మారాయి.

asramam 17092018 3

మరోవైపు రాత్రివేళ భక్తులను పంపేస్తున్న సమయంలోనే.. అదే ఆశ్రమంలో ఉన్న ప్రబోధానంద కుమారుడు కూడా ఓ కారులో ఎక్కి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ డీఎస్పీ అతడిని గుర్తించి, ఆపేందుకు వెళ్లడంతో.. ఆశ్రమ భక్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్వామీజీ కుమారుడికి రక్షణగా ఏర్పడి, అతడిని క్షేమంగా మళ్లీ ఆశ్రమంలోకి తీసుకెళ్లిపోయినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. మొత్తానికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు భక్తుల తరలింపు, కీలక సభ్యులను అరెస్ట్‌ చేయడంతో.. ఇక ఆదివారం ఎటువంట వివాదాలు ఉండమని పోలీసులు భావించారు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. ఆదివారం మధ్యాహ్నం కొందరు భక్తులు బీభత్సం సృష్టించారు. చివరకు పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయడంతో భయంతో ఆశ్రమంలోకి వెళ్లి గేట్లు వేసుకున్నారు.

asramam 17092018 4

ఆశ్రమ భక్తులు ఆదివారం కర్రలు, ఇనుప గొట్టాలతో బయటకు వచ్చి, బీభత్సం సృష్టించడం.. ఇందులో పలువురికి గాయాలు కావడం, ఒకరు మృతి చెందడం.. ఆశ్రమాన్ని సీజ్‌ చేయాల్సిందే అని ఎంపీ దివాకర్‌రెడ్డి పట్టుబట్టి రోజంతా ధర్నా చేస్తున్న నేపథ్యంలో.. ఆదివారం రాత్రి ఎలాగైనా ఆశ్రమంలో ఉన్న భక్తులందరినీ పంపేయాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మరిన్ని బలగాలను తాడిపత్రికి రప్పించారు. ఆక్టోపస్‌ను బృందాలు కూడా రప్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరినీ బయటకు పంపేస్తామని ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. అయితే ఈ ఆశ్రమ నిర్వాహుకులు కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరారు.

తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామం వద్ద ఉన్న ప్రబోధానంద ఆశ్రమంలో గత రెండు రోజులగా జరుగుతున్న అరాచకం తెలిసిందే. గ్రామస్థుల పై దాడి చేసి, ఒకరిని చంపేశారు, ఆశ్రంలో భక్తుల పేరుతో ఉన్న ఉన్మాదులు. అయితే, ఈ ఆశ్రమ నిర్వాహకులకి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు యోగానంద చౌదరి, ఆయన సోదరుడు జలందర్‌చౌదరి గత సంవత్సరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు మరో 1500 మంది అప్పటి మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే, అప్పటి నుంచే వీళ్ళ అరాచకాలు ఎక్కువయ్యాయి అని గ్రామస్తులు చెప్తున్నారు.

tadipatri 17092018

మాకు కేంద్రం అండ ఉంది అంటూ, తరుచూ గ్రామస్తులని ఇబ్బంది పెడుతూ ఉన్నారని తెలుస్తుంది. అయితే, నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా మరింతగా రెచ్చిపోయారు. ప్రబోధానంద ఆశ్రమ భక్తుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 20మందికి గాయాలయ్యాయి. నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఆశ్రమ భక్తులకు, పెద్దపొలమడ గ్రామస్థులకు మధ్య వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. గ్రామస్థులు పై ఆశ్రమంలో భక్తులు పేరుతో కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమంలోకి వెళ్లి, గ్రామస్థులను రక్షించేందుకు బాష్పవాయువును ప్రయోగించడంతో పాటు గాల్లోకి రెండురౌండ్లు కాల్పులు జరిపారు.

tadipatri 17092018

అయితే ఈ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమంలా ఉందని, పోలీసులు అంటున్నారు. భక్తులంతా ప్రార్థనలు, పూజలు చేస్తారనే చెబుతున్నా.. వారి వ్యవహార శైలి అనేక సందేహాలను కల్పిస్తోందని పోలీసులు, రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఆశ్రమంలోకి ఇతరులు ఎవరినీ అనుమతించరు. ఆశ్రమం చుట్టూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చడం, బయట ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అలాగే భక్తులను అప్రమత్తం చేసేందుకు సైరన్‌ కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఆశ్రమంలోపల పెద్దఎత్తున కర్రలు, రాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రబోధానందకు కుమారుడు ఉన్నట్లు, శనివారం రాత్రి ఓ కారులో ఎక్కి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే భక్తులు వెంటనే స్వామీజీ కుమారుడికి రక్షణగా ఏర్పడి, అతడిని క్షేమంగా మళ్లీ ఆశ్రమంలోకి తీసుకెళ్లారు.

Advertisements

Latest Articles

Most Read