మంత్రి పదవులు దాదాపుగా ఖరారైన నేపధ్యంలో, ఎవరు అయితే మంత్రి పదవులు దక్కవు అని అనుకున్నారో వారు తీవ్ర సంతృప్తిలో ఉన్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి, ఇది తలకు మించిన భారం అయ్యింది. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన విడదల రజినీకి మంత్రి పదవి ఇస్తే, తాము అంతా కూడా, పార్టీకి ఎదురు తిరుగుతాం అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలిగారు అని తెలియటంతో, సియం ఆఫీస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ వెళ్ళింది. సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసారు. బుజ్జగించే ప్రయత్నం చేసారు. అయితే ఆ ఫోన్ కాల్ పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్ అని ఫోన్ పెట్టేసారు. వెంటనే ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసారు. దీంతో ప్రభుత్వ అధికారులు, పార్టీ పెద్దలు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయలన్నా దొరకటం లేదు. ఇక మరో పక్క, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా తమ నిరసన వ్యక్తం చేసారు. తీస్తే అందరినీ తీయాలి కానీ, కొందరిని తీసి కొందరిని పెట్టటం పై, ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లాలో తన పరువు ఏమి కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏకంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళారు. బాలినేని బుజ్జగించాలని జగన్ ఆదేశించటంతో, సజ్జల బాలినేని వద్దకు వెళ్లారు. అయితే బాలినేని మాత్రం, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే సజ్జల మాట కూడా బాలినేని వినలేదు. దీంతో బాలినేని ఇంటికి సామినేని ఉదయబాను కూడా వచ్చి బుజ్జగిస్తున్నారు. జగన్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఆలోచించాలని చెప్పగా, జిల్లాలో తన పరువు గురించి కూడా జగన్ ఆలోచించాలి అంటూ, బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక నెల్లూరులో, తన పేరును కనీసం పరిశీలించకపోవడంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాకాణిని వైసీపీలోకి తెచ్చిందే నేనని, అలాంటిది, తనను కనీసం పట్టించుకోక పోవటం పై, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మిగతా చోట్ల కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు. వారి వారి సమావేశాలు ముగిసిన తరువాత, పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తుది జాబితా ప్రకటించిన తరువాత, ఈ అసంతృప్తులు తీవ్ర స్థాయిలో ఉండే అవకాసం ఉంది.