రాజ్యసభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఒక ప్రధాని మాట్లాడిన మాటలు రికార్డుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి, మన దేశానికి వచ్చింది. చట్ట సభల్లో సాక్షాత్తు ప్రధాని మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇలా తొలగించటం, ఇదే మొదటిసారని చెప్తున్నారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్‌ నారాయణసింగ్‌ ఎన్నికైన తరువాత గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రతిపక్ష అభ్యర్థి బి.కె. హరిప్రసాద్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను చైర్మన్‌ వెంకయ్యనాయుడు శుక్రవారం రికార్డుల నుండి తొలగించారు. రాజ్యసభ చరిత్రలోనే ఇది అరుదైన అంశం. ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా రూల్‌.నెం. 238 కింద ఈ అంశాన్ని లేవనెత్తారు.

modi 10082018 2

మొద‌టిసారి ప్రధాని మోదీ ఇవాళ రాజ్యసభలో చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మ‌న్‌గా గెలిచిన‌ హరివంశ్‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. త‌న‌పై ప్ర‌ధాని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశార‌ని హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. దీంతో ప్ర‌ధాని మోదీ ప్రసంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. వెంకయ్య తీసుకున్న చర్య పై, అందరూ అభినందించారు. సాక్షాత్తు ప్రధాని తప్పు చేసినా, నిబంధనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో, వెంకయ్యను అభినందించారు.

modi 10082018 3

హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాని స్థాయి వ్యక్తి, చట్ట సభల్లో ఇలా మాట్లాడటం ఎప్పుడూ లేదని, సాక్షాత్తు ప్రధానే ఇలా మాట్లాడి, సభ గౌరవాన్ని తక్కువ చేసరాని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించినట్టు, రాజ్యసభ సెక్రటరీ కూడా దృవీకరించారు. గురువారం జరిగిన రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి, జనతాదళ్‌(యూ) ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ 125 ఓట్లు తెచ్చుకుని విజయం సాధించారు. విపక్ష అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్‌ నాయకుడు బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీలకు అతీతంగా నేతలంతా హరివంశ్‌ను అభినందించారు. వెంకయ్య, మోదీ, గులాంనబీ ఆజాద్‌, జైట్లీ కలిసి హరివంశ్‌ను సభలో ఉపాధ్యక్షుడి కోసం ప్రత్యేకించిన స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

తప్పు చేసిన వాడిని, తప్పు చేస్తున్నావ్ అంటుంటే కూడా మన ప్రతిపక్ష నేతకు పోడుచుకువస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, నా ఇల్లు అమ్మటానికి పర్మిషన్ ఇవ్వండి అని రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా వేడుకున్నారు. కట్ చేస్తే, ముఖ్యమంత్రి అవ్వగానే, లోటస్ పాండ్ లు, బెంగుళూరు ప్యాలెస్ లు, సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్ లు, ఇలా లక్షల కోట్లు వెనకేశాడు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికి 43 వేల కోట్లు నొక్కేసాడని, సిబిఐ కూడా తేల్చింది. 11 సిబిఐ కేసులతో, 5 ఈడీ కేసులతో, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తున్నారు. అయితే, ఈడీ కొత్తగా జగన్ భార్య పై కూడా కొత్త చార్జిషీటు దాఖలు చేసింది.

jaganletter 10082018 2

భారతీని A5గా కొత్త చార్జిషీటు దాఖలు చేసింది. భారతి సిమెంట్స్‌లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరిగిందని ఈడీ తేల్చి, భారతి పై కూడా చార్జిషీటు దాఖలు చేసింది. అయితే, ఇంకా కోర్ట్ ఈ చార్జిషీటు పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకున్న తరువాత, ఆమె కూడా కోర్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే, ఈ వార్త పత్రికల్లో రావటంతో, ఉదయం జగన్ ఒక ట్వీట్ చేసారు. నా భార్య పై కొన్ని పత్రికలు మాత్రమే, కావాలని తప్పుడు వార్తలు రాస్తున్నాయి అంటూ, జగన్ ట్వీట్ చేసారు. అయితే, కొద్ది సేపటికి ఆ వార్త నిజమే అని, అన్ని జాతీయ పత్రికలు కూడా రాసాయి. దీంతో జగన్ మాట మార్చారు.

jaganletter 10082018 3

తీవ్ర అసహనంలో ఉన్న జగన్, ద్వంద్వ అర్ధాలు రాస్తూ, నీఛమైన భాషలో, బహిరంగ లేఖ రాసారు. ఉదయం కుట్ర అని చెప్పిన జగన్, ఆ వార్తా నిజం అని తేలటంతో, మాకు తెలియకుండా, మీడియాకు ఎలా తెలిసింది, అంటూ లేఖలో రాసారు. ఈడీలో చంద్రబాబుకు అనుకులంగా ఉన్న అధికారులు ఉన్నారంటూ రాసిన జగన్, చంద్రబాబు పై నీఛమైన భాష వాడారు. చంద్రబాబు, "పగలు, రాత్రి పద్ధతిలో", రెండు పార్టీలను చూసుకుంటున్నాడు అంటూ, అసభ్యకరమైన భాష వాడారు జగన్. ఈ లఖ చూస్తుంటే, జగన్ ఎందుకు ఇంత అసహనంగా ఉంటున్నారో అని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటికి మొన్న పవన్ పై వ్యాఖ్యలు కాని, కాపు రిజర్వేషన్ పై మాటలు మార్చటం కాని, ఈ రోజు ఈ బూతులతో కూడిన లేఖ కాని చూస్తుంటే, జగన్ తీవ్ర అసహనంలో ఉన్నారని అర్ధమవుతుంది.

వాహనాలకు సంభందించిన పత్రాలు మనతో పాటు తీసుకెళ్లడానికి ఎంతో ఇబ్బందిపడుతుంటాం. ట్రాఫిక్ పోలీసులు కూడా మన వాహనాలకు సంభందించిన పత్రాలు అన్నింటిని కూడా మన వెంట ఉంచుకోవాలని తెలిజేస్తుంటారు. కార్లు మరియు బైకుల్లో వీటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి, అయితే వాటిని చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా మరిచిపోతుంటాం.ఇక టూవీలర్లు వినియోగించే వారు అయితే ఎన్నో సార్లు తమ పత్రాలను తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షం వచ్చినపుడు, సర్వీసింగ్ చేయించినపుడు వాహనాలకు సంభందించిన పత్రాలు తడిచిపోతుంటాయి.

driving 10082018 2

ఇలాంటి కారణాల వలన ఎన్నో సార్లు జిరాక్సులు చేయించుకుంటుంటారు. ఇక మీదట బయటకు వెళ్లినప్పుడు మీవెంట తప్పకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇన్యూరెన్స్‌ కాగితాలు తీసుకెళ్లకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే వాటిని డిజిలాకర్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకూ డిజిలాకర్‌లో వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించినా పోలీసులు వాటిని పరిగణించలేదు. కానీ ఇప్పటి నుంచి డిజిలాకర్‌లో చూపించే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు పంపించింది.

driving 10082018 3

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ఏ పత్రాలనైనా డిజిలాకర్‌ యాప్‌ లేదా ఎంపరివాహన్‌ మొబైల్‌ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఒరిజినల్‌ ధ్రువపత్రాల స్థానంలో డిజిలాకర్‌లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది. ఈ నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తుందని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. హార్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో తొలిసారిగా డిజిలాకర్‌లో ఉన్న పత్రాలను లీగల్‌ డాక్యుమెంట్స్‌గా పరిగణించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా డిజిలాకర్‌ లేదా ఎంపరివాహన్‌ యాప్‌లో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్యూరెన్స్‌ కాగితాలు, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలను అధికారికంగా ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ఆదేశించింది.

driving 10082018 4

ఇప్పటికే రైల్వే ప్రయాణికులకు కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్లలో ప్రయాణించే సమయంలో ఐడీ ఫ్రూఫ్‌గా ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు బదులుగా వాటి సాఫ్ట్‌ కాపీలు చూపిస్తే సరిపోతుందని రైల్వే శాఖ అధికారులు గతంలో ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డిజిలాకర్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ఇండియాలో మరో మైలు రాయి ఈ డిజి లాకర్. ఇప్పుడు వాహన రంగానికి చెందిన రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఉద్గార పరీక్షలు, వంటి అనేక పత్రాలను ఇక మీదట తమ వెంట తీసుకెళ్లకుండా డిజి లాకర్‌లోభద్రత పరుచుకోవచ్చు.

రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులు చివరి స్టేజి కు వచ్చాయి. తొలిదశలో 5 వేల క్యూసిక్కుల నీటిని ఎత్తిపోసేందుకు నిర్మాణం పూర్తి చేసారు. రెండో దశలో 7350 క్యూసిక్కుల వరద నీటిని పంపింగ్ చెయ్యటానికి పధకం నిర్మస్తారు. ఆగష్టు 15 నాటికి, ఈ పధకం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు చెక్‌ పెడుతూ దానినే సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ తీసుకుంటున్న చర్యలు చివరి స్టేజికు వచ్చాయి.

kondaveeti 10082018 2

సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది.

kondaveeti 10082018 3

కలెక్షన్‌ పాయింట్‌.. కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఎస్కేప్‌ రెగ్యులేటర్‌.. సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్‌ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు.

kondaveeti 10082018 4

పైౖపులతో అనుసంధానమే కీలకం.. డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్ట రోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేసారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు.. డెలివరీ సిస్టమ్‌... ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.

Advertisements

Latest Articles

Most Read