అందరికీ షాకులు ఇచ్చే జగనే షాక్ అయ్యాడు అంట... ఏమి తెలియని అమాయకుడులా జగన్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ చూస్తే, అసలు నోట్లు వేలు పెడితే కొరకటం తెలియని పిల్లలు లాగా, నాకు అవినీతి అంటే ఏంటో తెలియదు అని జగన్ చెప్పినట్టు ఉంటుంది. ఈ రోజు అన్ని తెలుగు పత్రికల్లో, జాతీయ పత్రికల్లో జగన సతీమణి, భారతి పేరు ఈడీ చార్జిషీటులో వచ్చిందని రాసిన సంగతి తెలిసిందే. దీని పై జగన్ ఒక ట్వీట్ చేసారు, కొన్ని పత్రికలు కావాలని పనిగట్టుకుని, నా పై బురద చల్లుతున్నాయని, ఈ వార్తలు విని షాక్ అయ్యాను అని, రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోతున్నాయా అని జగన్ ఆవేదన ట్వీట్ చేసాడు.

jagan 1008200018 2

చివరికి కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. అయితే జగన్ చేసిన ట్వీట్ మాత్రం కామెడీగా ఉంది.. భారతీ సిమెంట్స్ ఎవరిది ? ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయి ? దానికి అధినేత ఎవరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయం దర్యాప్తు సంస్థలు చెప్పాయి. దీనికి జగన్ షాక్ అయ్యేది ఏంటో మరి ?

jagan 1008200018 3

ఈ వార్తల్లో తప్పు ఉంటే కనుక, ఇవి కోర్ట్ వ్యవహారాలు కాబట్టి, జగన్ వీరందరికీ నోటీసులు పంపించవచ్చు. అయినా, దేశంలో అన్ని పత్రికలు ఈ వార్తా రాసాయి. అడ్డంగా దొరికిపోయి, జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై బయట తిరుగుతూ, ఈ స్వాతి ముత్యం కబురులు ఏంటో మరి. ఈ ట్వీట్ ఎక్కడ నుంచి చేసారో తెలుసా ? అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం వెళ్ళే కోర్ట్ గుమ్మం ముందు నుంచి. ఇలాంటి వాళ్ళు కూడా విలువులు, వంకాయ అంటే, ఇంకా ఏమి చెప్తాం... ఈ రోజు ప్రధానంగా ఉన్న రాంకీకి చెందిన చార్జీషీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి.

గన్నవరం ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయ్యి చాలా నెలలు అయ్యింది. అశోక్ గజపతి రాజు కేంద్రం మంత్రిగా ఉండటంతో, పనులు చకచకా జరిగాయి. మరి కొద్ది రోజుల్లో దుబాయ్ కి, సింగపూర్ కి గన్నవరం నుంచి సర్వీస్ లు మొదలవుతాయి అనుకుంటున్న టైంలో, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రావటం, తెలుగుదేశం మంత్రులు రాజీనామా చెయ్యటంతో, గన్నవరం కధ మొదటికి వచ్చింది. ఎంత మంది ప్రైవేటు ప్లేయర్స్ వచ్చి, మేము ఫ్లైట్ నడుపుతాం అన్నా పర్మిషన్ ఇవ్వలేదు. సింగపూర్‌కు ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసు నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది.

gannavaram 10082018 2

దేశీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరిపారు అధికారులు. వెంకయ్య నాయుడుతో కూడా చెప్పించారు, చివరకు చంద్రబాబు కూడా రంగంలోకి దిగటంతో, ఎట్టకేలక అనుమతి లభించింది. చార్టర్డ్‌ ఫ్లైట్‌ కాకుండా, మామూలు ఫ్లైట్ కే అనుమతి వచ్చింది. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్‌కు విమానాన్ని నడపనున్నారు.

gannavaram 10082018 3

లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) పద్ధతిలో సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దేశీయ విమాన సంస్థ ఇండిగో వారానికి రెండు నుంచి మూడు సార్లు సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు ముందుకురావడంతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అనుమతించింది. ఈనెల 27 నుంచి సేవలు ప్రారంభించాలా? అక్టోబరు 2 నుంచి విమానాన్ని నడపాలా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 60 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి రెండు, మూడుసార్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

gannavaram 10082018 4

విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. ఎట్టకేలకు సింగపూర్ ఫ్లైట్ రియాలిటీ అవ్వటంతో, ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఏ విధమైన కొర్రీలు పెట్టకుండా, ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నారు.

వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులు, గత సంవత్సరం నుంచి చాలా నెమ్మదిగా నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల చేతే, సాగుతూ నడుస్తున్నాయి. కేసుల విచారణ అయితే లేట్ చెయ్యవచ్చు కాని, ఏ నాటికైనా శిక్ష తప్పదు అని లాలూ, జయలలిత కేసులు చుస్తే అర్ధమవుతుంది. అయితే, జగన్ కేసులు బాగా నెమ్మదించాయి అని అనుకుంటున్న టైంలో, ఈడీ ఒక అడుగు ముందుకేసింది. సిబిఐ పట్టించుకోకపోయినా, నేను వదలను అంటూ రంగలోకి దిగింది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి వైఎస్‌ భారతి పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ పరిణామంతో అందరూ ఆశ్చర్యపోయారు.

jagan 1082018 2

భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల కొత్త చార్జిషీటు దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీబీఐ మూడు చార్జిషీట్లు వేసింది. ఈ చార్జిషీట్లలో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది. కానీ సీబీఐ ఆ పనిచేయలేదు. సీబీఐ వదిలేసినా... ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు.

jagan 1082018 3

కోర్ట్ కనుక ఈ చార్జిషీట్ ను కూడా విచారణకు స్వీకరిస్తే, ఇక జగన్ మోహాన్ రెడ్డి సతీసమేతంగా, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్నారు. భారతి సిమెంట్స్‌లో మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది.

jagan 1082018 4

జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫార్మా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేయగా... ఇప్పుడు భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన అక్రమ లావాదేవీలపై అభియోగపత్రం దాఖలు చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.

jagan 1082018 5

ఈడీ తన చార్చిషీటులో జగన్‌, భారతితోపాటు ఆడిటర్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌, జెల్లా జగన్‌మోహన్‌ రెడ్డి (జేజే రెడ్డి), సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యూటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగతవ్‌ సన్నిధి ఎస్టేట్స్‌తోపాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఐబీఎంకు చెందిన వి.ప్రభు షెట్టార్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర నారాయణను నిందితులుగా పేర్కొంది.

jagan 1082018 6

ఇదీ అసలు అభియోగం... ఎవరైనా లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాలి. వాళ్లు కోరిన పత్రాలు చూపించాలి. అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. గ్యారెంటీలు ఇవ్వాలి. ఇలా అనేక లాంఛనాలు పూర్తి చేసి, అంతా ఓకే అనుకుంటే తప్ప లోన్ ఇవ్వరు. కానీ... వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) అధికారులే సీఎం నివాసానికి వెళ్లారు. జగన్‌ను కలిశారు. ఆయన సంతకాలు తీసుకున్నారు. భారతీ సిమెంట్స్‌ కోసం రూ.200 కోట్ల టర్మ్‌ రుణాన్ని మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం అప్పటి ఓబీసీ నామినీ డైరెక్టర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి ఈ రుణం మంజూరులో కీలకపాత్ర పోషించారు.

jagan 1082018 7

రుణం కోసం దరఖాస్తులో తప్పుడు వివరాలు పేర్కొన్నట్లు ఆ తర్వాత తేలింది. భారతీ సిమెంట్స్‌ ద్వారా జగన్‌ అక్రమంగా రూ.5068.05 కోట్లు పొందినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టి ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేసింది. అయితే రాజకీయంగా చూసుకుంటే, ఇది బీజేపీ కొత్త వ్యూహం అని కూడా విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లో జగ్గన్ +బీజేపీ ఒక్కటే అనేది బలంగా వెల్లింది, బీజేపీ కి ఎలాగూ డిపాజిట్లు రావు, వైసీపీ కి ఓట్లు పడాలంటే జగన్ కి బీజేపీ అండలేదు అని నమ్మించటానికే ఈ కొత్త నాటకమని, అదే వైఎస్ భారతి పై ఈడీ కేసు అని అంటున్నారు .

వచ్చే ఎన్నికల్లో పులివెందుల స్థానం గెలుచుకోవాలనే ఉద్దేశంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, దానికి తగ్గట్టుగానే, పాజిటివ్ వేవ్ బిల్డ్ అప్ చేస్తుంది. దశాబ్దాలుగా జరగని అభివృద్ధి చేసి చూపిస్తుంది. రైతులకి నీళ్ళు ఇస్తుంది. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ చెయ్యలేనిది, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పులివెందులకు ఎంతో చేసారు. ఈ ఫలితాలు గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తున్నాయి కూడా. ఇక రాజకీయంగా కూడా, ఇప్పటికే పులివెందుల పై పట్టు సాధించింది టిడిపి. ఎమ్మల్సీ గెలుచుకుని, వైఎస్ జగన్ బాబాయ్ ని ఓడించి, తన పట్టు చాటుకుంది. తాజాగా, నిన్న జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ పులివెందులలో ఓటమి పాలైంది.

jagan 10082018 2

ఈయూతో కూటమి కట్టి ఆర్టీసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల డిపోలో పరాభవం ఎదురైంది. ఎన్‌ఎంయూపై పోటీకి దిగిన వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ 47 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఎంయూకు 237 ఓట్లు రాగా, ఈయూ-వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ కూటమికి 183 ఓట్లు వచ్చాయి. రీజియన్ స్థాయిలో ఎన్ఎంయూకు 234 ఓట్లు, ఈయూ-వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌కు 187 ఓట్లు వచ్చాయి.

jagan 10082018 3

ఏ రీజియన్‌లో ఎవరు గెలిచారంటే... నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌: విశాఖపట్నం, కర్నూలు, పశ్చిమగోదావరి బీ ఎంప్లాయీస్‌ యూనియన్‌: కృష్ణా, అనంతపురం, ఎన్‌ఈసీ, తూర్పుగోదావరి బీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌: నెల్లూరు (ఆపరేషన్‌ అండ్‌ నాన్‌ ఆపరేషన్‌) బీ కార్మిక పరిషత్‌: ప్రకాశం, హెడ్‌ ఆఫీస్‌ బీ మూడు నాన్‌ ఆపరేషన్‌ రీజియన్లను సైతం ఎంప్లాయీస్‌ యూనియన్‌ దక్కించుకుంది. బీ గుంటూరులో ఎవరికీ ఆధిక్యం రాలేదు. రాష్ట్ర స్థాయిలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ గుర్తింపు దక్కించుకోవడంతో స్థానిక గుర్తింపు ఆ సంఘానికే దక్కనుంది. బీ ఈ నెల 13, 14వ తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్లను నిర్వహించాల్సి ఉంది. వాటి లెక్కింపు పూర్తయిన తర్వాత కార్మికశాఖ అధికారిక ఫలితాలను విడుదల చేయనుంది.

Advertisements

Latest Articles

Most Read