ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి, మోడీ ఫ్రంట్ లో చేరిన కెసిఆర్ పార్టీ, అసలు రంగులు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పై సపోర్ట్ ఇవ్వని టీఆర్ఎస్ పార్టీ, మొన్న మరింత ముందుకెళ్ళింది. కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ తెలిపింది. అయితే, ఈ రోజు ఇంకాస్త ముందుకెళ్ళి, డిప్యూటీ చైర్మెన్ ఎన్నికలో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చింది, తెరాస. అయితే, ఉదయం ఇలా మద్దతు ఇచ్చిందో లేదో, సాయంత్రం, కెసిఆర్ కు షాకింగ్ వార్త వినిపించింది కేంద్రం. వాడుకుని వదిలేయటంలో, మోడీ-షా ఎలాంటి వారో మరోసారి రుజువైంది.

kcr 09082018 2

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అవకాశం లేదని చెప్పింది. కాళేశ్వరం, పాలమూరుకు రెండింట్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలన్న ఎంపీ వినోద్ లేఖకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదని ఆయన తేల్చి చెప్పారు. గడ్కరీ సమాధానం తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని ఎంపీ వినోద్ అన్నారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు కాళేశ్వరానికి రూ. 20 వేల కోట్లు సాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అయితే, ఇవేమీ కేంద్రం పట్టించుకోలేదు.

kcr 09082018 3

అవసరం తీరగానే, కెసిఆర్ కే, తెలంగాణా రాష్ట్రం మొత్తానికి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్ళు మోడీ పై కలిసి పోరాడదాం రమ్మంటే, కెసిఆర్ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికైనా కెసిఆర్ కు నిజంగా, తన రాష్ట్రం పై చిత్తశుద్ధి ఉంటే, అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి వచ్చి,మోడీ పై పోరాటం చెయ్యాలి. లేకపోతే, కెసిఆర్ కూడా, మోడీ - అమిత్ షా లకు లొంగిపోయాడు అని ప్రజలు నమ్ముతారు. కవిత మద్దతు తెలపటంతో, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, "చెల్లెలు కవిత గారికి ధన్యవాదాలు అంటూ" ట్వీట్ కూడా చేసారు. మరి ఇప్పుడు తెరాస చేస్తున్న దాని పై, తెలంగాణలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా, తెలుగువారు అందరూ కలిసి ఉంటే, మోడీ లాంటి బలమైన నేతను ఎదుర్కోవచ్చు. కెసిఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని ఆశిద్దాం...

రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు పోలీస్ శాఖ త‌ర‌ఫున విజ‌య‌వాడ‌లో నూతన సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా విజయవాడలో క్రైమ్ రేటును తగ్గించేందుకు ఇంటర్ సెప్టార్స్ వాహనాలను డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌ర్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు త‌దిత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి మ‌హాత్మాగాంధీ రోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్ ఎదుట జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆవిష్కరించారు.

vij 09082018 2

న‌గ‌ర‌ పరిధిలో 12 ఇంటర్ సెప్టార్ వాహనాలు 24 గంట‌లు పాటూ అందుబాటులో ఉంటాయి. ప్ర‌ధాన కూడ‌ళ్లైన బెంజిస‌ర్కిల్‌, దుర్గ‌గుడి, గొల్ల‌పూడి వై జంక్ష‌న్ త‌దిత‌ర ప్రాంతాల్లో 12 చోట్ల ఈ వాహ‌నాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. ప్రతీ వాహనంలో నలుగురు పోలీసు సిబ్బంది ఉంటారు. వాహనంలో అన్ని రకాల పరికరాలు ఉంటాయి. జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పడు దగ్గరలో ఉన్న ఇంటర్ సెప్టార్ బృందానికి సమాచారం అందిస్తారు. దీంతో నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశముంటుందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్ సెప్టార్ వాహ‌నాల ఇంచార్జ్‌ల‌కు కిట్ల‌ను అందించారు.

vij 09082018 3

అలాగే ప్రజలు త‌మ సమస్యలను పోలీసులకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు నూతన నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సమస్య ఉంటే 7328909090 నంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపాలని ఈ సంద‌ర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఆయా కార్య‌క్ర‌మాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం, పోలీసు ఉన్న‌తాధికారులు ఎ.బి.వెంక‌టేశ్వ‌ర‌రావు, అమిత్‌గార్గ్‌, విజ‌య‌వాడ సంయుక్త పోలీస్ క‌మీష‌న‌ర్ కాంతిరాణా టాటా, ఏసీపీలు, సీఐలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇప్పటికే అనే సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి, అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. ఇదేదో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేది కాదులేండి. మందుబాబులకు సంబంధించినది. రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. ‘హోలోగ్రామ్స్‌’ సంస్థకు ఎక్సైజ్‌ శాఖ బకాయిపడడంతో సాంకేతిక సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా మూడు రోజులుగా డిపోల నుంచి మద్యం నిల్వలు దిగుమతి చేసుకోలేకపోయింది. సరఫరా లేక రిటైల్‌ మద్యంషాపులు చాలావరకు ఖాళీ అయిపోయాయి. ఏడాది క్రితం పాలసీ ప్రవేశపెట్టిన కొత్తలో హెచ్‌పీఎఫ్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించని కారణంగా షాపుల్లో మద్యం కొరత ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులెదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ పరిస్థితి పునరావృతమైంది.

excise 090872018 2

సరఫరా నిలిచిపోయిందిలా..!: రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ చేసింది. డిస్టిలరీలు, మద్యం డిపోలు, షాపులు, ఎక్సైజ్‌ స్టేషన్లు అన్నిటిలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి, అమ్మకాలను, ఉత్పత్తి, దిగుమతులను దానికి అనుసంధానం చేసింది. సీసా తయారైన వెంటనే డిస్టిలరీలో హోలోగ్రామ్‌ స్టిక్కర్‌ వేసి స్కాన్‌ చేస్తారు. అక్కడి నుంచి ఆ సీసా అమ్మే వరకూ ఏ షాపులో, ఎప్పుడు అమ్మారు అనే వివరాలన్నీ ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. గత 17 నెలల నుంచి హోలోగ్రామ్స్‌కు సంబంధించిన సొమ్ము దాదాపు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.

excise 090872018 3

ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా ఎక్సైజ్‌ అధికారులు స్పం దించకపోవడంతో మద్యం డిపోల్లో సేవలు ఆపేసింది. మరో పక్క, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులపై దాడులు నిర్వహించింది. అనధికారంగా మద్యం విక్రయిస్తున్న 187 బెల్టులపై కేసులు నమోదుచేసి, 189 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారి తెలిపారు. 405.28 లీటర్ల లిక్కర్‌, 6.5 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 5 లీటర్ల నాటుసారా, మూడు వాహనాలు సీజ్‌ చేసినట్లు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ వారికి ఇదేమిటో కాని, అధికారంలో ఉన్నా కూడా, ప్రతిపక్షం లాగానే ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు విమర్శలు చేస్తారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు దాడులు చేసి చంపేస్తారు. పక్కనున్న కెసిఆర్ ని చూసి, మా చంద్రబాబు మరీ ఇంత మెతక వైఖరి ఏంటో అని కార్యకర్తలు బాధ పడుతూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి అన్ని హత్యలు చేపిస్తే, ఈయన సియం అయిన తరువాత శాంతి శాంతి అంటారని, బాధపడుతూ ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, ఎక్కడా బ్యాలన్స్ తప్పరు. ఇది పార్టీకి, కార్యకర్తలకి ఇబ్బంది అయినా సరే.. ఇదే అలుసుగా తీసుకుని, అవతల వైసిపీ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు.

guntur 09082018 1

గుంటూరు జిల్లాలోని వినుకొండ పసుపులేరు బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీ కొన్నది.! ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంకు చెందిన గురజాల సోమయ్య (30), వెంకటకృష్ణ (26), మల్లయ్య (28) అని తేలింది. అయితే ఈ ప్రమాదం పై దర్యాప్తు చేయిగా, షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

guntur 09082018 1

ఈ ప్రమాదానికి సంబంధించిన కారణం ఏంటి అంటే, ఎ.కొత్తపాలెంలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ వర్గీయులు బైక్‌లపై బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు మార్గమధ్యలో బైక్‌ను కారుతో ఢీకొట్టారు. అయితే ఆ బైక్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే కన్నుమూశారు.

guntur 09082018 1

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అభయమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో బైక్ పై వెళుతున్న ముగ్గురిని ఒకపక్క కారు..మరోప్రక్క లారితో ఢీ కొట్టి చంపేశారు అని బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పరిస్థితి ఉదృతంగా వుంది.. పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసిపీ నేతలు అధికారంలో లేకపోతేనే ఇంత రచ్చ చేస్తున్నారు అంటే, ఇక అధికారం ఉంటే వీరి చేష్టలు ఊహకు కూడా అందవు...

Advertisements

Latest Articles

Most Read