మా భార్యను అనవసరంగా ఇరికించారు అంటూ, జగన్ మోహన్ రెడ్డి నిన్న రాసిన లేఖకు, సోషల్ మీడియాలో ఘాటు కౌంటర్, వైరల్ అయ్యింది. ఇదే ఆ కౌంటర్ "శ్రీ జగన్మోహన్రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు మీరు రాసిన బహిరంగలేఖ చాలా బాగుంది. ఆ లేఖను అందుకున్న ఆంద్రప్రదేశ్ ప్రజల్లో ఒకడిగా మీరు రాసిన లేఖకు ప్రత్యుత్తరం ఇస్తున్నాను. మీ మీద కాంగ్రెస్, తెదేపా కలిసి కుట్రచేసి కేసులు వేశారు అని మీరు ఆరోపించారు, ఏడేళ్ళ తర్వాత కూడా ఇంకా కక్ష సాధింపు చర్యలు సాగిస్తున్నారు అని., మీ భార్యను కూడా కోర్టుల చుట్టూ తిప్పాలనుకుంటున్నారని…. ఇలా రకరకాల ఆరోపణలు చేశారు, ఈ సందర్బంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు నేరుగా అడుగుతున్నాను
మీరు , మీ నాన్నగారు, మీ అమ్మగారు గతంలో చంద్రబాబు మీద వివిధ సందర్బాలలో కేసులు వేశారు. 1999 లోనే మీ నాన్నగారు శ్రీ వై.యస్ . రాజశేఖరరెడ్డీ గారు చంద్రబాబు మీద హైకోర్టులో కేసు వేశారు. అందులో పసలేదని కోర్ట్ డిస్మిస్ చేయబోయే పరిస్థితుల్లో ఆయన ఆ కేసు ఉపసంహరించుకున్నాడు ? అవి నిజాలే అయితే కేసు మీ నాన్నగారు ఎందుకు ఉపసంహరించుకున్నారు ? అప్పడు కాంగ్రెస్ పార్టీలో అందరూ దాన్ని వ్యతిరేకింఛటంతో తిరిగి పిటీషన్ వేశారు, దాన్ని కూడా హైకోర్ట్ 2000 లో డిస్మిస్ చేసింది, అయినా అదే ఆరోపణలతో మీ నాన్నగారు 2001లో డిల్లీ హైకోర్ట్ లో పిటీషన్ వేశారు, అదీ కూడా కోర్ట్ డిస్మిస్ చేసింది.
మరోసారి మీ నాన్నగారి అప్పటి అనుంగు అనుచరుడు, ఇప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ తో 2003 తో అదే ఆరోపణలతో సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేశారు, అది కూడా పసలేదని సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. అయినా మీరు చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో 2004 ఎన్నికలకు ముందు , మీ నాన్నగారు హై కోర్ట్ లో అవే పాత ఆరోపణలతో మరోసారి హైకోర్ట్ కి వెళ్ళారు, ఈ లోపు ఎలక్షన్స్ వచ్చాయి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా రంగంలోకి వచ్చారు. ఎలక్షన్స్ అయ్యాక ఆ పిటీషన్ కూడా హైకోర్ట్ కొట్టేసింది. కోర్ట్ అన్నిసార్లు కొట్టేసినా పదే పదే అదే ఆరోపణలతో , కేవలం చంద్రబాబును ఇబ్బంది పెడదాం, కోర్ట్ ల చుట్టూ తిప్పుదాం అనే ఏకైక లక్ష్యంతో ఒకటే పిటీషన్ తిప్పి తిప్పి కోర్ట్ లు మార్చి వేస్తూనే ఉన్నారు. కొర్ట్ లు కొట్టేస్తునే ఉన్నాయి.
అయినా మీ కక్ష తీరలేదు, 2004లో మరోసారి లక్ష్మీపార్వతి ద్వారా అవే ఆరోపణలతో ఈ సారి మీ ప్రభుత్వం ఉంది అని ఎసిబి కోర్ట్ లో పిటీషన్ వేయించారు. మీరు పదే పదే స్టే తెచ్చుకున్నాడు అని చేసే ఆరోపణలు ఈ కేసు మీద బాబు తెచ్చుకున్న స్టే కే. అసలు స్టే అని అర్ధం లేని ఆరోపణలు చేస్తారు కానీ, స్టే ఎందుకు తెచ్చుకున్నాడో మీకు తెలుసా ! కేసు విచారణ చేయవద్దు అని కాదు, విచారణకు స్వీకరించే ముందు అయన వాదన కూడా వినమని ఎసిబి కోర్ట్ ని ఆదేశించమనే !
ఆ తర్వాత కూడా మీరు చంద్రబాబును తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టటం ఆపలేదు. అప్పటికే అనేకసార్లు అనేక కోర్టుల్లో డిస్మిస్ అయిన అదే పిటీషన్ ని 2011 నవంబర్ లో మీ అమ్మగారైన విజయమ్మ గారితో హై కోర్ట్ లొ మరోసారి వేశారు, 2012 లో హై కోర్ట్ మరోసారి కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్ట్ కి వెళ్ళారు, అక్కడ కూడా చుక్కెదురు కావటమే కాకుండా, మీ అమ్మగారి మీద సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది, మీది రాజకీయ దురుద్దేశ్యంతో కూడిన అరోపణలు ఎందుకు అనుకోకూడదు అని కూడా ప్రశ్నించింది. ఆ పిటీషన్ పలుమార్లు, పలు కోర్టుల్లో డిస్మిస్ అయిన విషయం ఈ పిటీషన్ లో పేర్కొనకపోవటమే దానికి నిదర్శనం అని కూడా చెప్పింది .
ఇన్ని సార్లు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టటం కోసం కోర్ట్ లో డిస్మిస్ అవుతూ వస్తున్నా, దాన్ని పదే పదే కోర్టుల్లో వేస్తూ కోర్ట్ లను, ప్రజలను పక్కదారి పట్టిస్తూ వచ్చిన మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, ఇప్పుడు సరికొత్తగా మా కుటుంబాన్ని ఇందులోకి లాగుతారా అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కేసులు వేయించి ఇప్పుడు కుటుంబాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మీకు అలా మాట్లాడే నైతిక అర్హత లేదు కాక లేదు. మీ కుటుంబం మొత్తం గత ఇరవై ఏళ్ళుగా ఒకే ఒక వ్యక్తిని పసలేని ఆరోపణలతో టార్గెట్ చేసి ఇప్పుడు మీమీద అయన టార్గెట్ చేశాడు అని చెప్పటం దొంగే .. దొంగా దొంగా అని అరిసినట్లుంది.
మీరు ఇప్పుడు స్నేహం చేస్తుంది బిజెపితో అ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది, ఈ రోజు రాజ్యసభ ఎన్నికల్లో కూడా బిజెపి కి లబ్ది చేకూరేలా ఎన్నికలు బాయ్ కాట్ చేసారు పైగా బిజెపి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి, ఈ రోజు ఎన్డియే అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేసిన తెదేపా బిజెపికి మిత్రుడు అని అరోపిస్తారు, ఇదేరకమైన న్యాయమో అర్ధం కావటం లేదు. ఇక మీమీద ఉన్న 12 కేసుల గురించి వాటి విచారణ గురించి నేను ప్రస్తావించటం అనవసరం, మీరు లేఖ రాసిన ఆంద్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. వాటి మీద విచారణ జరుగుతుంది, వాటిలో ఏకేసుని కోర్ట్ డిస్మిస్ చేయలేదు. ఆయాకేసుల విచారణకు హాజరు కావాల్సిన బాధ్యత మీది.
అందులో చంద్రబాబు ప్రస్తావన ఎందుకు వచ్చిందో, నాకు అర్ధం కాలేదు. కేవలం మీరు చేసిన తప్పులు, అవినీతి కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావటంతో ఆ ఉక్రోషంతో , మీ అవినీతి నుండి ప్రజల దృష్టి మళ్ళించటానికి చంద్రబాబు ను ఇందులోకి లాగుతున్నారు. ఈ పసలేని, అసంబద్దమైన ఆరోపణలు వదిలేసి, మీరు ప్రతి శుక్రవారం కోర్ట్ కి హాజరు కండి. మీరు చేసిన అవినీతికి ఏదో ఒక రోజు మీకు శిక్ష తప్పదు... ఇట్లు ఆంద్రప్రదేశ్ ప్రజలు"