మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు తమ అస్తిత్వం కోసం, సినీ గ్లామర్ వైపు పరుగులు పెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిస్తే, సీట్లు ఎక్కవ రావని, పవన్ తో వెళ్తే, సీట్లు ఎక్కువ ఇస్తారని, ఒకటో రెండో గెలవచ్చని, పవన్ గ్లామోర్ ఉపయోగించుకుని, మళ్ళీ ఏపిలో బలం తెచ్చుకోవాలని, ఏవేవో కలలు కంటున్నారు, లోకల్ కమ్యూనిస్ట్ లు. కాని జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకత్వం, చంద్రబాబు వైపు మొగ్గు చూపుతుంది. కమ్యూనిస్ట్ అగ్ర నాయకులు, ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటారు. ప్రస్తుత నేపధ్యంలో, మోడీని గద్దె దించటానికి, విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి. ఇందుకోసం, విపక్షాలు టం ఐక్యతను చాటటానికి ఏ అవకాశం వదులుకోవటం లేదు.

communist 07082018 2

తాజాగా నిన్న జరిగిన, పీఏసీ సభ్యుల నియామకంలో కూడా, పార్లమెంటులో విపక్షాలు మరోసారి ఐక్యతను ప్రదర్శించి విజయం సాధించాయి. ఇక్క ఆంధ్రాలో కమ్యూనిస్ట్ లు చంద్రబాబుని తిడుతుంటే, దేశ స్థాయిలో, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మరీ, తెలుగుదేశం అభ్యర్ధిని గెలిపించారు. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ కు ఒక షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కమ్యూనిస్ట్ లు తనతో ఉన్నారని, కలిసి ఉద్యమాలు చేస్తామని అని చెప్తున్న పవన్ కు, జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, కనీసం పవన్ అనే వాడిని గుర్తించలేక పోవటం, చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో, పవన్ కు రుచించటం లేదు.

communist 07082018 4

పీఏసీ సభ్యుల నియమాకానికి జరిగిన ఎన్నికలో విపక్షం తరఫున టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ విజయం సాధించారు. దీంతో రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో టీడీపీ మరోసారి విజయవంతమైంది. జ్యసభలో టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉండగా సీఎం రమేశ్‌కు 110 ఓట్లు దక్కాయి. కేవలం ఆరుగురు ఎంపీలున్న టీడీపీ నుంచి పీఏసీ సభ్యుడు ఎన్నికవుతారని ఎవరూ భావించలేదు. పీఏసీలో రెండు స్థానాలకు గానూ టీడీపీ తరఫున సీఎం రమేశ్‌, బీజేపీ తరఫున భూపేంద్ర యాదవ్‌, జేడీయూ నుంచి హరివంశ్‌లు పోటీపడ్డారు. మొత్తం ఓట్లలో సీఎం రమేశ్‌కు 110 ఓట్లురాగా భూపేంద్రయాదవ్‌కు 69, హరివంశ్‌కు 26 ఓట్లు పోలయ్యాయి.

communist 07082018 3

రాజ్యసభలో ఎన్డీయేకు 89 మంది సభ్యులుండగా దీంట్లో ఒక్క బీజేపీ పార్టీ సభ్యులే 73 మంది. యూపీఏకు చెందిన 57 మందిలో 50 మంది కాంగ్రెస్ ఎంపీలే. ఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లకు చెరో 13 మంది, బీఎస్పీ, ఎన్సీపీలకు నలుగురు చొప్పున, ఆప్ ముగ్గురు, సీపీఎంకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. పీఏసీలో 15 మందిని లోక్‌సభ నుంచి, ఏడుగురిని రాజ్యసభ నుంచి మొత్తం 22 మందిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జునఖర్గే కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం పీఏసీ ఛైర్మన్ పదవి విపక్షానికి కేటాయిస్తారు.

communist 07082018 5

సీఎం రమేశ్ ఎన్నికపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ.. ‘టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్‌ ఎన్నిక ద్వారా ప్రతిపక్షాల ఐక్యత మరోసారి రుజువైంది.. బీజేపీ/ ఎన్డీఏ అభ్యర్థి చాలా దూరంలో నిలిచిపోయాడు.. తమ ఐక్యతతో టీడీపీ ఎంపీ రమేశ్‌కు 110 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 69 ఓట్లు, ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ అభ్యర్థికి 26 ఓట్లు వచ్చాయి’ అని అన్నారు. పీఏసీ సభ్యుడిగా ఏడాది పాటు సీఎం రమేశ్ కొనసాగనున్నారు. ఇలా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీల్లో విపక్షాల నుంచి ఒకరు, అధికార పార్టీ నుంచి ఒకర్ని నియమించాలని చేసిన ప్రతిపాదనను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరస్కరించి ఎన్నికకు పట్టుబట్టారు.. దీంతో ఫలితం ఇలా వచ్చిందని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

పిడి అకౌంట్స్ అంటే ఏమిటో జివిఎల్ కు తెలియదా..? పిడి అకౌంట్స్ లో అవినీతి ఏమిటి..? అసలు అకౌంట్స్ లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది..? ఆ మాత్రం ఆర్ధిక పరిజ్ఞానం కూడా లేకుండా రాజ్యసభలో జివిఎల్ ఏం చర్చలు చేస్తారు..? పిడి అకౌంట్స్ కు 2జి స్కామ్ కు పోలిక ఏమిటి..? 2జి స్కామ్ వ్యాపార కార్యక్రమం(బిజినెస్ యాక్టివిటి). పిడి అకౌంట్స్ అనేది ప్రభుత్వ కార్యక్రమం(గవర్నమెంట్ యాక్టివిటి). ఆర్ధిక శాఖ నియంత్రణలో జరిగే గవర్నమెంట్ యాక్టివిటి. పర్సనల్ డిపాజిట్ (పిడి) అకౌంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్సియల్ కోడ్ చాప్టర్ 9లో పేర్కొన్న సివిల్ డిపాజిట్లలో ఒకటి. ఏపిఎఫ్ సి మార్గదర్శకాల ప్రకారం ఆర్ధిక మరియు ప్రణాళికా శాఖ(డబ్ల్యు,ఎం) 22.04.2000న విడుదల చేసిన జివోఎంఎస్ నెం 43 ప్రకారం వీటిని పిడి అకౌంట్లను ఆయా సంస్థల పేర్లతో ప్రారంభిస్తారు, నిర్వహిస్తారే తప్ప వ్యక్తులపేర్లతో జరగవు(జివో ఎంఎస్ నెం 43 తేది 22.4.2000).

gvl 0702018 3

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72,652 పిడి ఖాతాలు నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తరువాత కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు 43,374 పిడి అకౌంట్లు మరియు తెలంగాణ రాష్ట్రానికి 29,236 పిడి అకౌంట్లు వచ్చాయి( 24.5.2014న జివో ఎంఎస్ నెం 125). ఈ ఖాతాలలో అత్యధికం పంచాయితీలకు మరియు స్థానిక సంస్థలకు చెందినవే. వాటి స్వంత నిధులు మరియు ఆర్ధిక సంఘం నుంచి,స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ల నుంచి వచ్చే నిధులు కలగలసి పోకుండా ఒక్కో గ్రామ పంచాయితీకి, లేదా ఇతర స్థానిక సంస్థకు 3పిడి ఖాతాలు కేటాయిస్తారు.1)వాటి స్వంత నిధులకు,2)ఆర్ధికసంఘ నిధులకు,3)స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకు. ఈ విధంగా అధికశాతం పిడి ఖాతాలు కేవలం స్థానిక సంస్థలవే. రాష్ట్ర విభజన తరువాత 13వ, 14వ ఆర్ధిక సంఘం నిధులను వేరుచేసేందుకు ఏపి ఫ్రభుత్వం 13,199పిడి ఖాతాలను తెరిచింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13వ,14వ ఆర్ధిక సంఘం నిధులను కలిపేసి 13వ ఆర్ధిక సంఘానికి తెరిచిన పిడి ఖాతాల్లోనే వేస్తోంది.

gvl 0702018 2

కాబట్టే తెలంగాణలో పిడి ఖాతాల సంఖ్యలో హెచ్చుదల కనిపించలేదు. ఏజి నివేదిక ప్రకారం ఏపికి చెందిన 57,455 పిడి ఖాతాలలో 31.3.2018నాటికి మొత్తం బ్యాలెన్స్ నిధులు రూ.29,909కోట్లు ఉన్నాయి. పిడి ఖాతాలలో నిధుల పారదర్శకత కోసం కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2014లోనే పిడి అకౌంట్ పోర్టల్ ను ప్రారంభించింది. ఇది వర్ట్యువల్ నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ గా పనిచేయడమే కాకుండా అన్ని పిడి ఖాతాల లావాదేవీలను పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా ఉంచుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 12,822పిడి అకౌంట్లు తొలగించారు. కంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజిమెంట్ సిస్టమ్(సిఎఫ్ ఎంఎస్) కింద 13వ ఆర్ధిక సంఘం మరియు స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ ఎఫ్ సి) గ్రాంట్లకు సంబంధించి వీటిని తొలగించారు.

gvl 0702018 3

వాటి పీరియడ్ పూర్తికావడం మరియు వాటిలో నిధులు లేనందున ఆ ఖాతాలను తొలగించడం జరిగింది. నిర్వహణలో ఉన్న పిడి ఖాతాల సంఖ్య ప్రస్తుతం 44,633కు తగ్గాయి. గుజరాత్ తదితర రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో పిడి అకౌంట్లు ఉన్న విషయం ఏజి రిపోర్టును బట్టి తెలుస్తోంది. గుజరాత్ తదితర రాష్ట్రాలలో ట్రెజరీలో కాకుండా బ్యాంకు ఖాతాలలో వేస్తున్నారు. అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నమూనానే అనుసరిస్తున్నాయి. ట్రెజరీలలో కాకుండా బ్యాంకు ఖాతాలలో ఉంచడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతాయి. ఒకవైపు కేంద్రం అన్ని పథకాలకు వేర్వేరు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని ఒత్తిడి చేస్తోంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే, బ్యాంకుల్లో కాకుండా ట్రెజరీలో నిధులను ఉంచుతున్నాం. ట్రెజరీలో మిగిలిన లావాదేవీల తరహాలోనే పిడి అకౌంట్లను కూడా నిర్వహిస్తున్నారు దీనివల్ల నిధుల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం ఏర్పడింది. నిధుల నిర్వహణలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.( 24.07.2018న జివోఎంఎస్ నెం 112).

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అపూర్వ ప్రసంశలు లభించాయి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రను ఆర్థికంగా పునర్నిర్మించడానికి ఆయన బృహత్తర ప్రణాళికను రూపొందించారని అస్ట్రేలియా ప్రభుత్వం కితాబునిచ్చింది. ‘2035 నాటికి భారత్‌తో ఆర్థిక వ్యూహం’ పేరిట ఆ దేశం రూపొందించిన నివేదికలో భారత్‌లోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి వివరించింది. ఆ నివేదికలో చంద్రబాబు పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. ఆయన పేరు మినహా మరే రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అందులో లేకపోవడం గమనార్హం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి విప్లవాత్మకంగా విధానపర సంస్కరణలు చేస్తున్నారని, నూతన ఆవిష్కరణలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని కొనియాడింది.

cbn 07082018 1

‘1994-2004 మధ్య హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబు... అదే ఉత్సాహం, అంకితభావంతో రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కీర్తించింది. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న విశాఖపట్టణాన్ని ఫిన్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపింది. నూతన రాజధాని నిర్మాణం పెద్దపెద్ద విదేశీ పెట్టుబడిదారులను సైతం ఆకర్షించిందని, ఆస్ట్రేలియన్‌ మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి సంస్థలకు అవకాశాలు కల్పించిందని పేర్కొంది. ఏపీ వనరులు, విద్యుత్‌ రంగం... ఆస్ట్రేలియా మైనింగ్‌, ఎంటీఈఎస్‌, పునరుత్పాదక శక్తి సాంకేతికతతో సరితూగుతాయని స్పష్టం చేసింది.

cbn 07082018 1

సులభతర వాణిజ్యం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)లో ఏపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, గత మూడేళ్లలో రాష్ట్ర జీఎస్డీపీ ఏటా 11శాతానికిపైగా వృద్ధి చెందుతోందని వివరించింది. కాగా, ఏపీతో పాటు దేశంలోని మరో తొమ్మిది రాష్ట్రాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. మైనింగ్‌, మైనింగ్‌ సేవలు, విద్య, డ్రై లాండ్‌, వ్యవసాయం, విద్యుదుత్పత్తి- పంపిణీ, నీరు, రోడ్డు భద్రత, మెడికల్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో సిస్టర్‌ స్టేట్‌ సంబంధాన్ని ఏర్పర్చుకుంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థల్లో బలమైన పోటీ నెలకొంది. పూర్తి నివేదిక ఇక్కడ చూడవచ్చు http://dfat.gov.au/geo/india/ies/pdf/dfat-an-india-economic-strategy-to-2035.pdf#page76

దేశీయ ఎఫ్‌ఎంసిజి సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్‌.. మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న డెయిరీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదిత ప్లాంటుకు ఆర్థిక ప్రోత్సాహకాలిచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటోందని సోమవారం జరిగిన వాటాదారుల వార్షిక సమావేశం(ఎజిఎం)లో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ నుస్లీ వాడియా తెలిపారు. దాంతో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రూ.300 కోట్లతో భారీ డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది సంస్థ.

britania 07082018 1

రూ.2 ముఖ విలువ కలిగిన కంపెనీ షేర్లను రూపాయి ముఖ విలువతో రెండు షేర్లుగా విభజించాలని ప్రతిపాదించినట్లు వాడియా వెల్లడించారు. షేర్ల విభజనపై ఈనెల 23న బోర్డు సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.60 విలువ చేసే నాన్‌ కన్వర్టిబుల్‌ బోనస్‌ డిబెంచర్‌ను జారీ చేయనున్నట్లు, వాటిపై 8 శాతం వడ్డీ ఆఫర్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ డిబెంచర్లను సంస్థ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయనుంది. ఈ తరహా డిబెంచర్లను జారీ చేయడం సంస్థకు ఇది రెండోసారి. మొత్తం 12,01,59,147 బోనస్‌ డిబెంచర్ల జారీ కోసం రూ.720 కోట్ల మేర వ్యయంకానుందని వాడియా తెలిపారు.

britania 07082018 1

వచ్చే ఏడాదికాలంలో కంపెనీ రూ.400-500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడంతోపాటు డెయిరీ, కేక్స్‌, రస్క్‌ బిస్కెట్‌ వ్యాపారాలపై దృష్టిసారించనుందన్నా రు. ఈ ఏడాదిలో 50కి పైగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇతర సంస్థల కొనుగోళ్లకు, ఇతర దేశాల్లోకి విస్తరించేందుకు సైతం సంస్థ సిద్ధంగా ఉందన్నారు. సంస్థ ఎగమతులకు ఊతమిచ్చేందుకు ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి బిస్కెట్ల విక్రయాల్లో 33 శాతం మార్కెట్‌ వాటా ఉంది. వందో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించింది.

 

Advertisements

Latest Articles

Most Read