ఎలా అయినా పోలవరం ఆపాలని బీజేపీ, ఎలా అయినా పూర్తి చెయ్యాలని చంద్రబాబు... ఇలా, గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది... ప్రతి సారి చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు... నవయుగకు పనులు అప్పగించటం, కాఫర్ డ్యాం కోసం పర్మిషన్ తేవటం, ఇలా అన్ని విషయల్లో చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు. తాజాగా డీపీఆర్‌-2 విషయంలో కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతుంది. దీని పై కూడా చంద్రబాబు, పట్టు వదలకుండా, అధికారుల చేత ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళకి విసుగు రావాలి కాని, మీరు మాత్రం వెనుకడు వెయ్యద్దు, ఏది కావలి అంటే అది ఇవ్వండి, ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు ఇవ్వండి అని అధికారుల్ని పురమాయిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబం ధించి న డీపీఆర్‌-2పై కేంద్రం లేవనెత్తిన పలు అనుమానాల నేపథ్యంలో సరికొత్త నివేదికలను రూపొం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యుసీ) ఆదేశాలతో రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ఇందుకు సంబంధించిన గణాంకాలపై మదింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

polavaram 06082018 2

ఇటీవల ఢిల్లిలో జలవనరుల శాఖాధికారులతో జరిగిన భేటీలో ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సవరించిన అంచనాలతో రూపొందించిన డీపీఆర్‌ -2ను కేంద్రానికి గతంలోనే సమర్పించగా, దానిపై కేంద్ర జలవనరుల సంఘం అధికారులతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ సైతం అనేక అభ్యంతరాలు లేవనెత్తిన సంగతి విధితమే. డీపీఆర్‌ -2 వాస్తవదూరంగా ఉందని, మళ్లి దీనిని మదించి, క్లారిటీతో తాజా గణాంకాలతో నివేదిక అందజేయాలని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులను కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు మళ్లి డీపీఆర్‌ -2కు సంబంధించిన వివరాలతో పాటు భూసేకరణ, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం, సవరించిన అంచనాలు తదితర వివరాలతో కూడిన నివేదికలను మళ్లి రూపొదిందిస్తున్నట్లు సమాచారం. ఈ నివేదికను సోమవారం లేదా మంగళ వారం కేం ద్రానికి పంపించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

polavaram 06082018 3

గతనెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్బంలో కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పనుల ను స్వయంగా పరిశీలించి, పలు అంశాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే లేవనెత్తారు. రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు కేంద్రం అడిగిన అన్ని అంశాలపై మళ్లి నివేదికలు రూపొందించే పనిలో పడ్డారు. ప్రధానంగా భూసేకరణ, ముంపు గ్రామాలు,పరిహారం,పునరావాసానికి సంబంధించిన నివేదికను ప్రత్యేకించి తయారు చేస్తున్నారు. అన్ని ముంపు గ్రామాలన్నింటి వివరాలతో పాటు ముంపు బాధితుల వివరాలు,వారికి చెల్లించిన పరిహారం వివరాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. మొత్తం మీద మళ్లి డీపీఆర్‌ -2కు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన నివేదికనలను ఒకటి రెండు రోజుల్లో సిద్ధం చేసి, కేంద్రానికి పంపించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇంధన సామర్థ్యానికి సంబంధించి కేంద్ర విద్యుత్‌ శాఖ తొలిసారి విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచీలో ఏపీ అగ్ర పథంలో నిలిచింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు సన్నద్ధతలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1 అని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ), నీతి ఆయోగ్‌ సంయుక్తంగా రూపొందించిన సూచీలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందువరుసలో నిలిచింది. బీఈఈ ఈ సూచీని 63 ప్రామాణికాల ఆధారంగా తీసుకుంది. ఇందులో ముఖ్యంగా భవనాలు, పరిశ్రమలు మునిసిపాలిటీలు, రవాణా వ్యయం, డిస్కంలలో ఇంధన సామర్థ్య ఫలితాలను అంచనా వేసి రూపొందిం చింది. ఇందులో ఏపీ అత్యుత్తమ సామర్థ్యం కనబరిచి అగ్ర భాగాన నిలబడగా కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలు సైతం దేశంలో ముందంజలో నిలిచాయి.

apnumberone 06082018 2

ఇంధన పొదుపులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇంధన సామర్థ్యం కార్యక్రమాల అమలు వంటి కీలక అంశాలను పరిశీలించిన అనంతరం బీఈఈ ఏపీకి ఈ ర్యాంకు ఇచ్చింది. బీఈఈ సూచీలో ఐదు ఉత్తమ రాష్ట్రాలను ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అత్యుత్తమ విధానాలు అవలంభిస్తోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలన్నింటికంటే ముందుంది. మునిసిపాలి టీలు, భవనాలు, ఇళ్లు, డిస్కంలు, పరిశ్రమల్లో పీఏటీ (పెర్ఫార్మ్‌, ఎచీవ్‌, ట్రేడ్‌) పథకం ద్వారా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలుచేస్తోంది. రవాణా రంగంలోనూ బీఈఈ కార్యక్రమాలను మెరుగ్గా అమలుచేస్తోందని ఈఈ తన నివేదికలో పేర్కొంది. ఇతర రాష్ట్రాలు తాము (బీఈఈ) రూపొందించిన ఒకటి రెండు కార్యక్రమాల అమలుకే పరిమితవుతుండగా, ఏపీ సహా ముందున్న ఐదు రాష్ట్రాలు మాత్రం ఇంధన సామర్థ్యంలో వాటి సొంత కార్యక్ర మాలను కూడా అమలుచేస్తున్నాయని బీఈఈ ప్రశంసించింది.

apnumberone 06082018 3

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, డిజైన్‌కుగాను ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్లాటినం అవార్డు దక్కిన విషయాన్ని సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇంధన శాఖా మంత్రి కళా వెంకట్రావులకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి కళా వెంకట్రావును, సీఎస్‌ దినేష్‌కుమార్‌ను, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్‌, విద్యుత్‌ శాఖ సలహాదారు కే రంగనాథం, ట్రాన్స్‌కో జేఎండీ దినేష్‌ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎం.ఎం.నాయక్‌, హెచ్‌వై దొర, నెడ్‌ క్యాప్‌ ఎండీ కమలాకర బాబు, ఏపీఎస్పీసీఎల్‌ ఎండీ ఆదిశేషులను అభినందించారు. బీఈఈ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే పనితీరును కొనసాగించాలన్నారు. ఇంధన సామర్థ్య ఫలితాలు సాధారణ వినియోగదారులకు దక్కాలని స్పష్టంచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు భారీ ప్రాజెక్ట్ లు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శ్రమ ఫలించింది. నాలుగు రాష్ట్రాలు పోటీ పడినా మొత్తానికి సాధించారు. ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ సంస్థతో ఈ రోజు ఒప్పందం ఉంటుంది అని చెప్పారు కాని, ఆ కంపెనీ పేరు చెప్పలేదు. అయితే, ఈ రోజు ఒప్పందం చేసుకునే కంపెనీ పేరు, హోలీటెక్‌ సంస్థ అని సమాచారం. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో తన కర్మాగారం నెలకొల్పనుంది. ఫలితంగా ఆరు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఫలించి.. ఎట్టకేలకు ఏపీలో కర్మాగారం ఏర్పాటుకు సదరు కంపెనీ అంగీకరించింది. అయితే ఇతర రాష్ట్రాలు కూడా దీనికోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో దాని పేరు, తమ ప్రయత్నాల వివరాలను రాష్ట్రం బయటకు వెల్లడించలేదు. హోలీటెక్‌ ప్రతినిధులు సోమవారమిక్కడ చంద్రబాబును కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

ap 06082018 2

20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలన్నీ.. అసెంబ్లింగ్‌ చేసేవి మాత్రమే. అంటే విడిభాగాలను తీసుకొచ్చి అమర్చుతున్నాయి. ఇప్పుడు తొలిసారి దేశంలో హోలీటెక్‌ రూపంలో ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ లాంటి ప్రసిద్ధ కంపెనీలు తరలిరాగా.. ఇప్పుడీ జాబితాలో హోలీటెక్‌ కూడా చేరింది. మరో వైపు, ప్రపంచ స్థాయిలోనే 'భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (బెస్ట్) సంస్థ రూపొందించిన తొలి థర్మల్ బ్యాటరీ కంపెనీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఆవిష్కరించనున్నారు. ఇంధన ఉత్పత్తిని పెంచడానికి ఈ బ్యాటరీని తయారు చేసినట్లు బెస్ట్ సంస నిర్వాహకులు తెలిపారు. ఈ టెక్నాలజీ వినియోగంతో కార్బన్ వాయువులను తగ్గించడమే కాక గ్రిడ్లలో సమ తుల్యతను పాటించవచ్చనివారు చెప్పారు.

ap 06082018 3

అంతేకాక ఈ బ్యాటరీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు టెలీ కమ్యూనికేషన్స్, వాణిజ్య సంస్థలు విద్యుత్ తో నడిచే వాహనాలు నిల్వచేసుకుని అవసరం మేరకు వినియో గించుకొనే వెసులుబాటు ఉందని చెప్పారు. దీనిని కొండప్రాంతాలు, దీవుల్లోనే కాక సుదూర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకుని అవసరం మేరకు ఇంధనాన్ని వాడుకునే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ బెస్ట్ సంస్థ రూ. 660 కోట్ల పెట్టుబడితో 'గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి వచ్చే మూడు సంవత్సరాల్లో మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించింది. ప్రారంభ దశలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ వచ్చే ఆరు, ఏడు సంవత్సరాల కాలంలో 10 గిగావాట్ల ఉత్పత్తి దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకోంటోంది. తొలిదశలో టెలీకమ్యూనికేషన్స్, మైక్రో గ్రిడ్లకు, ఎలక్ట్రిక్ బస్సులకు వినియోగించే బ్యాటరీలను ఉత్పత్తి చేయాలని తలపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో మే 2019లో ఈ ప్లాంట్ వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని బెస్ట్ సంస్థ ప్రముఖులు అంటున్నారు.

దేశం మొత్తం మా ఆధీనంలోనే ఉంది అనే అహంకారం, ప్రతి బీజేపీ నేతకు ఉంది. అందుకే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తున్నాం. లెక్కలేని తనం, హేళన చెయ్యటం, తక్కువుగా చూడటం, ఇవన్నీ వీళ్ళకు మామూలే. అయితే, ఏ మాత్రం పట్టులేని అందప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీళ్ళు ఇలాగే రెచ్చిపోతున్నారు. కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ నేతలు, దేశంలో అధికారం మాదే అనే అహం, మన రాష్ట్రంలో కూడా చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయావాడలో జరిగింది. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు పై, బీజేపీ నేత రెచ్చిపోయాడు. నేను ఎంపీగా పోటీ చేసాను, నా కారే ఆపుతావా అంటూ, కానిస్టేబుల్ పై కారు దూకించే ప్రయత్నం చేసాడు. అతను తప్పుకోవటంతో, కార్ వేగంగా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

bjpleader 06082018 2

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా కారును నిలపటమే కాకుండా కారును తీయాలని కోరిన ట్రాఫిక్‌ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన లాకా వెంగళరావు యాదవ్‌ను సూర్యారావుపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి మహాత్మాగాంధీ రోడ్డులో రెండో పట్టణ ట్రాఫిక్‌ సీఐ సుబ్బరాజు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఒక కారు నిలిపి ఉంది. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉండటంతో దాన్ని అక్కడ నుంచి తీయాలని పోలీసులు కారు యజమాని వెంగళరావు యాదవ్‌ను కోరారు.

bjpleader 06082018 3

పోలీసుల మాటలను లెక్క చేయకపోవటంతో దాన్ని పోలీసు క్రేన్‌ సాయంతో తొలగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వెంగళరావు యాదవ్‌ పోలీసు క్రేన్‌పైకి ఎక్కించి ఆపై అడ్డుకుంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పైకి దురుసుగా కారును పోనిచ్చారు. దీనిపై ట్రాఫిక్‌ సీఐ సుబ్బరాజు సూర్యారావుపేట పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడపటంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు వెంగళరావు యాదవ్‌పై కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. 2009 ఎన్నికల్లో, ఇతను విజయవాడ ఎంపీగా, బీజేపీ తరుపున పోటీ చేసాడు.

Advertisements

Latest Articles

Most Read