భారత దేశంలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ గా ఉన్న షియోమి మొబైల్ విడి భాగాల తయారీ కంపెనీ హోలీటెక్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. తిరుపతిలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు హోలి టెక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా హోలీ టెక్ 1400 కోట్లు పెట్టుబడి రాష్ట్రంలో పెట్టనుంది. ఇండియాలో మొదటి మొబైల్ విడి భాగాల తయారీ హోలీ టెక్ ప్రారంభించబోతుంది. తిన్ ఫిలిం ట్రాన్సిస్టర్, టచ్ స్క్రీన్ మాడ్యూల్స్,ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు తిరుపతిలో తయారు చేయబోతుంది. 2019 మొదటి క్వార్టర్ లో ఉత్పత్తి ప్రారంభించాలి అని కంపెనీ నిర్ణయం తీసుకుంది. మూడు ఏళ్లలో 1400 కోట్ల పెట్టుబడి,6000 మందికి ఉద్యోగాలు హోలీ టెక్ కల్పించబోతుంది.

holitech 06082018 2

తిరుపతిలో 75 ఎకరాల్లోహోలీ టెక్ ఏర్పాటు కాబోతుంది. ప్రతి నెలా 5 కోట్ల మొబైల్ విడిభాగాలు ఈ కంపెనీ లో తయారు కాబోతున్నాయి. కంపెనీ ఏర్పాటు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో క్లీన్ రూమ్ ఏర్పాటు చేయబోతుంది. పర్యావరణ సమతుల్యత ఉండే విధంగా ఈ క్లీన్ రూమ్ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీ ఏర్పాటుకు పూర్తీ సహకారం అందిస్తుంది. పవర్ సబ్సిడీ,ట్యాక్ తదితర రాయితీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, కల్పిస్తున్న రాయితీలు వలన అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి తరలివస్తున్నాయి. "కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. హోలి టెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కి రావడం చాల సంతోషంగా ఉంది. ఈ కంపెనీ రాకతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో లీడర్ గా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

holitech 06082018 3

ఇండియాలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. షియోమికి హోలీ టెక్ ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ విడిభాగాలను సప్లై చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి హోలీటెక్ రావడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చెయ్యడానికి షియోమి కట్టుబడి ఉంటుంది అని షియోమి వైస్ ప్రెసిడెంట్ మను జైన్ అన్నారు. "షియోమి ఇండియాలో అందుకున్న వేగాన్ని, అభివృద్ధిని చూసి వారి ప్రోత్సాహం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం తో మేము మొదటి సారి ఇండియా లో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రారంభించబోతున్నాం. తిన్ ఫిలిం ట్రాన్సిస్టర్, టచ్ స్క్రీన్ మాడ్యూల్స్,ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు తిరుపతి లో తయారు చేయబోతున్నాం. చంద్రబాబు విజన్‌, స్పష్టత చూసి ముగ్ధులమయ్యామన్నారు. అప్పుడే ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఇండియాలో పెట్టుబడులకు ఏపీనే అనువైన రాష్ట్రమని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. " అని హోలీటెక్ సిఈఓ ఫ్లేమ్ చెన్ అన్నారు.

ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. మొత్తం 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో 122 మంది సభ్యులు ఎవరికి మద్దతు ఇస్తే వారే డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరిస్తారు. పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అయిన డిప్యూటీ చైర్మన్ పదవిని ఎలాగైనా తామే దక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. రాజ్యసభలో 245 అభ్యర్ధులు ఓటింగ్ కు వస్తే, డిప్యూటీ చైర్మెన్ పదవికి 122 ఓట్లు అవసరం. తెలుగుదేశం పార్టీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం 117 మంది ఉన్నారు. అలాగే, బీజేపీ తన మిత్రపక్షాలు, ఏఐడీయంకే కలుపుకిని, 106 మంది ఉన్నారు.

kcr 06082018 2

భారతీయ జనతాపార్టీకి సొంతంగా బలం లేకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వైసిపీ, బీజేడీ, టీఆర్ఎస్ పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి కమలదళం పావులు కదుపుతోంది. అయితే కొన్ని రోజుల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, మేము మద్దతు ఇవ్వం అంటూ ఒక హింట్ ఇచ్చారు. కాని, ఇది బయటకి బిల్డ్ అప్ మాత్రమే అని, ఆ టైంకు మద్దతు ఇస్తారని వైసిపీ వర్గాలే చెప్తున్నాయి. ఈ నేపధ్యంలో బీజేడీ పార్టీకి చెందిన 9 మంది, తెరాసా కు చెందిన 6 గురు, వైసిపీ కి చెందినా 2 మంది, కీలకం కానున్నారు. బీజేడీ మద్ధతు ఇచ్చిన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మద్ధతు బీజేపీకి అవసరమవుతుంది. టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో కయ్యానికి కాలుదువ్వింది కనుక ఆ పార్టీకి మద్ధతిచ్చే అవకాశం లేనే లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు బీజేపీకి అనివార్యం అవుతుంది.

kcr 06082018 3

కథ అంతటితో అయిపోలేదు... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ఎన్నికకు అభ్యర్థిని నిలిపే యోచనలో కొన్ని ప్రాంతీయ శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే... ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ - వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని... కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీ క‌న్నెర్ర‌ - అవునంటే ఏపీ ప్రజలకు ఆగ్ర‌హం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది. సైలెంట్ గా ఓటింగ్ కు దూరంగా ఉంటే, అమిత్ షా తన్ని లోపల వేస్తాడు. అందుకే జగన్ కు తప్పని పరిస్థితి. ఇక కెసిఆర్ ఆడుతున్న ఫెడరల్ ఫ్రంట్ డ్రామా కూడా తెర పడుతుంది. మొత్తానికి, ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికతో, ఈ నెల 9తో, అందరి ముసుగులు తొలగిపోతాయి...

పార్టీలో చెరక ముందే, ఆనం రామనారాయణరెడ్డికి జగన్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నా, దాదాపు వైసిపీలో, ఆనం రామనారాయణరెడ్డి చేరిపోతరనే ప్రచారం జరిగింది. అయితే, ఆనం మాత్రం వెంకటగిరి టికెట్ పై ఆశలు పెట్టుకున్నాడు. అదే విషయం పలుమార్లు జగన్ ను కలిసి మరీ చెప్పాడు. అలా అయితేనే వస్తాను అన్నారు ఆనం. చివరకు జగన్ ఒప్పుకున్నారని, త్వరలోనే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, ఆనం రామనారాయణరెడ్డికి షాక్ ఇచ్చాడు జగన్. అనూహ్యంగా మరో నేత తెర పైకి రావటంతో, అతినికే టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

jagan 06082018 2

బీజేపీ నాయకుడు నేదురు మల్లి రామ్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రయాణంపై గందరగోళం నెలకొంది. ఆయన్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన 9గంటల వ్యవధిలోనే రామ్‌కుమార్‌ జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరడానికి లైన్‌ క్లియర్‌ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేదురుమల్లి రామ్‌కుమార్‌ పార్టీ మారుతారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనను నిలుపుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నం విఫలం కాగా, పార్టీ మారడం ఖాయం అనే విషయం తేటతెల్లమైంది. రామ్‌కుమార్‌ను పార్టీలో నిలుపుకొనే క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది. అయితే ఆ పార్టీలో కొనసాగడం ఇష్టంలేని రామ్‌కుమార్‌ ఆ నియామకాన్ని పట్టించుకోకుండా నేరుగా జగన్‌ శిబిరంలో చేరారు.

jagan 06082018 3

శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శిబిరంలో రామ్‌కుమార్‌రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. తను ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఇక త్వరలో తేదీలు ప్రకటించి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతానని నేదురుమల్లి, జగన్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ కలయికతో నేదురుమల్లి బీజేపీని వీడనున్నట్లు స్పష్టం అవుతోంది. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చేరిక క్రమంలో వెంకటగిరి వైసీపీ అభ్యర్థుల జాబితా పెరిగింది. ఆయన జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఇతనే వెంకటగిరి వైసీపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. నేదురుమల్లి అనుచరులు సైతం అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆనం రామనారాయణరెడ్డిని మళ్ళీ డైలమాలో పడేసాడు జగన్.

మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. కేంద్రం ఏమి సమాధానం చెప్పలేక పోవటంతో, కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

parliament 06082018 2

ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలని, 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిదంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు.

parliament 06082018 3

రెండు రోజుల క్రితం, ఈ విషయం పై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఇచ్చిన సమాధానం కూడా అసంతృప్తిగానే ఉంది. ‘‘విభజన చట్టంలోని సెక్షన్‌ 46(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాం. అందులో ఒక్కో జిల్లాకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు మూడు వాయిదాల్లో రూ.1,050 కోట్లు విడుదల చేశాం. విభజన చట్టం కింద కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం తరఫున చేయాల్సిన సాయంపై 2015 డిసెంబర్‌ 1న నీతి ఆయోగ్‌ ఏడు వెనుకబడిన జిల్లాలకు ఒక్కో దానికి రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల మొత్తాన్ని సిఫార్సు చేసింది. అందులోనే అంతకుముందు రెండేళ్లలో విడుదల చేసిన రూ.700 కోట్లు కూడా ఇమిడి ఉంది. వినియోగ పత్రాలను(యూసీ) నీతి ఆయోగ్‌ తనిఖీచేసిన తర్వాత, సంబంధిత అధికార యంత్రాంగం ఆమోదముద్ర వేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తూ వస్తున్నాం. తాజా అంశంలో అవసరమైన అన్ని రకాల అనుమతులు లభించలేదు. అందువల్లే అనుకోకుండా రూ.350 కోట్లు విడుదల చేసి వెనక్కు తీసుకున్నాం. ఇంకా ఆ నిధుల విడుదల జరగ లేదు’’ అని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఎవరు ఆ అనుమతులు ఇవ్వలేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే, ఇప్పటికీ నీతి ఆయోగ్, దీనికి సంబంధించిన అన్ని రకాల యుసీలు ఆమోదించింది. మరి, ఎవరి అనుమతి ఇవ్వలేదు అనే విషయం మాత్రం స్పష్టం లేదు.

Advertisements

Latest Articles

Most Read